![Young Women Protest in front of Boyfriend Home East Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/14/boy.jpg.webp?itok=yEjxK0id)
ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న దడాల వసంత
కత్తిపూడి (శంఖవరం): నమ్మించి గర్భవతి చేసిన వ్యక్తితోనే మనువు జరిపించాలని కోరుతూ ఓ యువతి పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆపై ముఖం చాటేశాడు. దిక్కు తోచని ఆ యువతి పోలీసులను ఆశ్రయించినా కనికరం చూపలేదు. న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందే మంగళవారం ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ రెండో రోజూ బుధవారం కూడా ఆందోళన కొనసాగించింది.
మండలంలోని కత్తిపూడి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. బాధితురాలు దడాల వసంత కథనం ప్రకారం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దడాల వసంత అదే గ్రామానికి చెందిన మిరియాల రాజేష్ గత కొంత కాలంగా ప్రేమించమంటూ వెంట తిరిగాడు. తన సామాజిక వర్గీయుడే కావడం, వివాహం చేసుకుంటానని చెప్పడంతో అతడిని నమ్మింది. అయితే తాను గర్భవతిని కావడంతో మోహం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రోత్సాహించడంతో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని తెలిపింది. ప్రేమించిన రాజేష్‌తో వివాహం జరిపించాలని అంతవరకు ఆందోళన విరమించేది లేదని ఆమె భీష్మించింది. ఆమె ఆందోళనకు బుధవారం మహిళా సంఘాల సభ్యులు మద్ధతు తెలిపారు. ఈ విషయంపై అన్నవరం పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment