చంచల్గూడ జైలు వద్ద మహిళల నిరసన | Women protest at Chanchalguda Prison | Sakshi
Sakshi News home page

చంచల్గూడ జైలు వద్ద మహిళల నిరసన

Published Wed, Aug 21 2013 11:27 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

చంచల్గూడ జైలు వద్ద మహిళల నిరసన - Sakshi

చంచల్గూడ జైలు వద్ద మహిళల నిరసన

హైదరాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి  రాఖీ కట్టేందుకు చంచల్‌గూడ జైలు వద్ద  మహిళలు బారులు తీరారు. పోలీసులు  అనుమతించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు. తమకు అనుమతి ఇచ్చేవరకు కదిలేదిలేదని అక్కడే భీష్కించుకు కూర్చున్నారు.  కనీసం తమలో ఒక్కరికైనా అనుమతి ఇవ్వాలంటూ వాళ్లు ప్రాధేయపడ్డారు. ఫలితంలేదు. దాంతో వారు జైలు ముందు ధర్నా చేస్తున్నారు.

జగనన్నకు రాఖీ కడతామని తాము రెండు రోజుల ముందే జైలు అధికారులకు చెప్పినట్లు వారు తెలిపారు. తమని అడ్డుకుంటున్న పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు జైలు గేటు ఎదురుగా జగన్‌ ఫోటోకు రాఖీ కట్టారు. మరికొందరు
మహిళలు  జగన్ను కలవడానికి వచ్చిన ఆయన సతీమణి భారతి చేతికి, సోదరి షర్మిల చేతికి రాఖీలు కట్టారు. జగనన్నకే రాఖీ కట్టినట్లు సంబరపడిపోయారు. పోలీసుల వైఖరి మారాలంటూ, వారికి కూడా రాఖీలు కట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement