మా శవాలపై రోడ్డు వేయండి
మా శవాలపై రోడ్డు వేయండి
Published Sat, Jul 30 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
నున్న(విజయవాడరూరల్)ః
‘పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో చట్టబద్ధంగా ఈస్థలాలుకొని ఇళ్లు, ప్లాట్లు వేసుకున్నాం. రోడ్డు కోసమని ఇళ్లను కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేస్తారా?, నమ్మి ఓటేసినందుకు చేసే ఉపకారం ఇదా?‘అని ప్రభుత్వ అరాచక చర్యలను నిరసిస్తూ మహిళలు దుమ్మెత్తి పోశారు. శనివారం నున్న లోకల్ బైపాస్ రోడ్డు నిర్మాణం పనుల కోసమని ఆర్‌అండ్‌బీ అధికారులు పోలీసును వెంటేసుకుని ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా ఇళ్ల తొలగింపు చేపట్టడంతో బాధితులు భగ్గుమన్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో నున్న రూరల్ పోలీసులు, అజిత్‌సింగ్‌నగర పోలీసులు రంగప్రవేశం చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇళ్ళు నిర్మించుకొని జీవిస్తున్న సాతులూరి వెంకటేశ్వరమ్మ,అతని కుమారులు నలుగురిని ఇళ్ళు వదిలివెళ్ళాలని పోలీసులు భయపెట్టారు. 2008 లో హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చిందని రోడ్డు నిర్మాణానికి మా ఇళ్ళను తొలగించబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఖాళీచేయమని చెప్పడం ఏమిటని వెంకటేశ్వరమ్మ కుమారులు అధికారులను కలిసి కోర్టు ఉత్తర్వులను అందచేశారు. ఆ కుటుంబసభ్యులతో పాటు సమీపంలో ఫ్లాట్లుకొన్నవారు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవిన్యూఅధికారులు, సర్వేయర్ సుబ్బారావులు రోడ్డు ఎలైన్‌మెంటు ప్రకారం ఆర్‌అండ్‌బి అధికారులకు మార్కింగ్ చేసి అప్పగించడంతో వారు రోడ్డు పనులను జేసిబి మిషనుతో ప్రారంభించారు. ఆ సందర్భంలో స్ధలాలున్న మహిళలు మిషనుకు అడ్డుగా కూర్చువడంతో పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వ్యానులోకి ఎక్కించారు. లక్షలాది రూపాయలను అప్పుచేసి స్థలాలను కొనుగోలు చేశామని, ఇంకా అప్పుతీరలేదని మహిళలు బోరున విలపించారు. నష్టపరిహారం చెల్లించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మమ్మల్ని చంపి శవాలపై రోడ్డు నిర్మించుకోండని మహిళలు శాపనార్థాలు పెట్టారు. నిరసన తెలిపిన నిమ్మగడ్డ కుమారి, సునీత, లలితకుమారి, సాంబశివరావు, షేక్ ఖాశీంబి, శంకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుతలను పోలీసుస్టేçÙన్‌కు తరలించాక ఆర్‌అండ్‌బి అధికారులు రోడ్డు పనులను మార్కింగ్ చేసి ప్రారంభించారు. నున్న రూరల్ సీఐ సాహేరాబేగం, అజిత్ సింగ్‌నగర్ సీఐ ప్రసాదరావుల ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాౖటెంది.
రోడ్డుౖ అలెన్‌మెంటులో సర్వే నెంబర్ 751/2 లో రెండెకరాల 36 సెంట్లు, 751/1బిలో 90 సెంట్ల భూమి అర్బన్‌ల్యాండ్ సీలింగ్ భూమని సర్వేయర్ సుబ్బారావు చెప్పారు. ఆర్‌అండ్‌బి రోడ్డు నుంచి 430 మీటర్ల ను మార్కింగ్ చేసి భూమిని అప్పగించినట్టు ఆయన చెప్పారు.
పుష్కరాలకు రోడ్డు పూర్తి చేస్తాం
నున్న లోకల్ బైపాస్‌రోడ్డు నిర్మాణం పనులను పుష్కరాలకు పూర్తిచేస్తామని ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సత్యనారాయణ చెప్పారు. వంద అడుగుల వెడల్పు,430 మీటర్ల పొడవునా రోడ్డును నిర్మించాల్సివుందన్నారు.
– ఆర్‌అండ్‌బి ఇఈ
Advertisement
Advertisement