Bypass road
-
నల్లగొండ బైపాస్ నిర్మాణానికి రూ.516 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ సెక్షన్ వరకు ఉన్న జాతీయ రహదారి 565లో 14 కి.మీ పొడవైన నాలుగు లేన్ల నల్లగొండ పట్టణ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.516 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ‘ఎక్స్’వేదికగా ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ తగ్గడమే కాకుండా నకిరేకల్ – నాగార్జునసాగర్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని, రహదారి భద్రత కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 200.06 కి.మీ మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సీఆర్ఐఎఫ్ సేతు బంధన్ పథకంలో భాగంగా, గుంటూరు జిల్లాలోని గుంటూరు–నల్లపాడు రైల్వే సెక్షన్లో నాలుగు లేన్ల శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి గాను రూ.98 కోట్ల విడుదలకు కూడా ఆమోదం తెలిపినట్లు గడ్కరీ వివరించారు. -
కృష్ణా తీరాన.. అభివృద్ధి పతాక
ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి ప్రతినిధి, విజయవాడ విజయవాడ.. ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటోంది. ఓ వైపు ఫ్లైఓవర్లు.. మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వాణిజ్యపరంగా పేరెన్నికగన్న ఈ నగరంలో కేవలం నాలుగేళ్లలోనే ఊహించని అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం కృష్ణానది వరదనీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధ పడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తి స్థాయి ఉపశమనం లభించింది. వరద వస్తే చాలు.. తట్టా బుట్టా చేత పట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి తప్పింది. నగర నడిబొడ్డున ఠీవీగా నిలిచిన అంబేడ్కర్ విగ్రహం.. అభివృద్ధి అంటే ఇదీ.. అన్నట్లు మనందరికీ చూపిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపు రేఖలు మారిపోయాయి. బెజవాడకు మణిహారం ఫ్లైఓవర్లు.... నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా కొత్తగా నిర్మించిన జంట ఫ్లైఓవర్లు బెజవాడకు మణిహారంగా నిలుస్తున్నాయి. జెంజి సర్కిల్–1 ఫ్లైఓవర్ 48 స్పాన్లతో 1.470 మీటర్ల వెడల్పుతో(అప్రోచ్‌రోడ్డు సహా) 2.27 కిలోమీటర్ల పొడవుతో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించారు. ► రెండోఫ్లైఓవర్ ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది టార్గెట్. కానీ ఏడాదిలోనే అది అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 1.703 కిమీలు, స్పాన్లు 55, వెడల్పు 12.5 మీటర్లు. నిర్మాణానికి అయిన ఖర్చు రూ.96 కోట్లు. ► దీంతో పాటు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు పనులకు అడ్డంకిగా నిలిచిన భూసేకరణ సమస్య పరిష్కారమైంది. పశ్చిమం వైపు 2.47 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సర్వీస్‌రోడ్డుకు రూ. 25కోట్లు ఖర్చు చేస్తున్నారు. తూర్పువైపు పెండింగ్‌లో ఉన్న 860మీటర్ల సర్వీస్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ► బెంజి సర్కిల్‌నుంచి పోరంకి వరకు 6 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనులు రూ. 15కోట్లతో చేపడుతున్నారు. ఇంకా గుణదల ఫ్లైఓవర్, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ పనులకు మార్గం సుగమం అవుతోంది. ► గన్నవరం విమానాశ్రయం వద్ద హాఫ్ ఫ్లైఓవర్‌ను రూ. 23.77 కోట్లతో నిర్మించారు. హైదరాబాద్ హైవే నిర్మాణానికి అవరోధంగా నిలిచిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, అసంపూర్తి పనులను రూ17కోట్లతో చేపట్టారు. ► గ్రీన్ ఫీల్డ్ హైవే(విజయవాడ–ఖమ్మం)కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను ఈ మధ్యనే ప్రారంభించారు. బైపాస్‌లతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ నగరానికి వచ్చే వాహనాలకు ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వెస్ట్, ఈస్ట్ బైపాస్ నిర్మాణాలు ఉపకరించనున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల రహదారి(చిన్న అవుటపల్లి నుంచి– గొల్లపూడి)ని రూ1148 కోట్లతో 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. ► గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88కి.మీ పొడవున రహదారి పనులు, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. విజయవాడ తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డుకు దాదాపు పూర్తి కావచ్చింది. ► కృష్ణా జిల్లా పొట్టి పాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 49.3 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కృష్ణానదిపైన 3.750 కిలోమీటర్ల పొడవుతో ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీనికోసం రూ4607.80కోట్లు వెచ్చించనున్నారు. ముంపు నుంచి ఉపశమనం నగరంలోని కృష్ణానదీతీరవాసులు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యనుంచి ఉపశమనం కలిగించారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్Š వరకూ రక్షణగోడ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారధినుంచి పద్మావతి ఘాట్ నుంచి రక్షణ గోడ పనులు సాగుతున్నాయి. మొదటి దశలో రూ.93,22 కోట్లు, రెండో దశలో రూ. 180.24 కోట్లు, మూడో దశలో రూ. 120.81 కోట్లు కలిపి మొత్తమ్మీద రూ394.27 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ వెంబడి రెండు దశల్లో రూ.33.39కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరగనున్నాయి. గ్రీనరీ, పార్కులు, వాకింగ్, సైకిల్ ట్రాక్‌తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాలువలపై రూ. 31కోట్లతో ఏడు వంతెనలు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిమస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. అందాల వాడగా తీర్చిదిద్దాం బెజవాడను అందాల వాడగా తీర్చిదిద్దాం. నగరంలో జలకాలుష్యం తగ్గించేందుకు మూడు ప్ర«ధాన కాలువలను శుభ్రం చేశాం. కెనాల్ బండ్స్‌ను సుందరీకరించాం, ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చేశాం. విజయవాడలో రోడ్లు, గ్రీనరీ, పార్కులను అభివృధ్ది చేశాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించాం నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేలా ఫ్లైఓవర్లు నిర్మించాం. జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. నగరంలో రోడ్లు, పచ్చదనం చేపట్టాం. కృష్ణానది వెంబడి రక్షణ గోడ నిర్మించాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. – ఎస్.ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా నగరాభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర విజయవాడ నగర అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పేదలకు జేఎన్యూఆర్ఎం కింద గృహాలు నిర్మించి అందజేశారు. నగర శివారులో వైఎస్సార్ కాలనీ నిర్మించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చనమోలు వెంకట్రావు పేరుతో మిల్క్ ప్రాజెక్టు వద్ద ఫ్లై ఓవర్ నిర్మించారు. రైల్వే స్టేషన్ రోడ్డు, గుణదల పడవల రేవును కలుపుతూ 6 కిలో మీటర్ల మేర బీఆర్టీఎస్ రోడ్డు నిర్మించారు. అజిత్‌సింగ్ నగర్ బుడమేరు వరద నివారణకు కట్ట నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్లు పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడతలో 1.07లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 14,995 ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు చేశారు. కాల్వ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో , రోడ్ల పక్కన ఆవాసం ఉంటున్న వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయించారు. పటేల్ నగర్ ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, నేతాజీ కాలనీ, రాధానగర్, రాజీవ్‌నగర్, వడ్డెర కాలనీ, నందా వారి కండ్రిక ప్రాంతాల్లో గతంలో కార్పొరేషన్ 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు. టీడీపీలో గ్రాఫిక్స్‌తోనే సరి... టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిపై శీత కన్నేసింది. అమరావతి రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌తోనే ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసింది. విజయవాడకు సంబంధించి ప్రధాన ఫ్లై ఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ హయాంలో ప్రారంభమైప కనకదుర్గ ఫ్లై ఓవర్ç పూర్తి చేయకుండా కాలం వెళ్లదీసింది. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేయాలనిగానీ, నగరానికి నలువైపుల నుంచి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రోడ్లను జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయలేదు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో ప్రజల కళ్లకు గంతలు కట్టారు. ఈవెంట్లతో పబ్బం గడుపుకున్నారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో మాయ చేసిన వైనాన్ని, ఈ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, వెస్ట్, ఈస్ట్ బైపాస్, నగరంలో రోడ్లు, కాల్వల ప్రక్షాళన, పచ్చదనం వంటి పనులు చేపట్టిన తీరు చూసి నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చర్చించుకుంటున్నారు. సరికొత్తగా ఇంద్రకీలాద్రి ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రారం¿ోత్సవాలు, కొత్తవాటికి శంకుస్థాపన చేశారు. కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ. 216.05 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ. 23.145కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆధ్యాత్మిక విహారం కృష్ణా నదిలో జల విహారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని అలయాలు, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజంకు రూపకల్పన చేశారు. కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలవిహారం చేస్తూ 82 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయటం ద్వారా ఎనిమిది ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ సంస్థ చర్యలు తీసుకొంటోంది. ఇందుకోసం దుర్గఘాట్‌నుంచి అమరావతి వరకు ఐదు ప్రదేశాలను కలుపుతూ ఓ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ముక్త్యాల నుంచి అమరావతికి నాలుగు ప్రదేశాలను కలుపుతూ ఇంకో సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. పిల్లలకోసం ఆట పరికరాలు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్‌గేమ్స్, ఎడ్వంచర్ గేమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపాదనలు ఇలా... రెండు యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు : రూ.22 కోట్లు ఏడు ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకోసం : రూ. 24 కోట్లు రూఫ్ టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల కోసం: రూ.4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ .50 కోట్లు -
ప్రజల భద్రత గాలికి వదిలిన ‘నితిన్ సాయి’ కంపెనీ
ముదిగుబ్బ బైపాస్ రోడ్డు పనుల్లో నాణ్యత నగుబాటుగా మారింది. పనులు దక్కించుకున్న నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిబంధనలకు పాతరేస్తూ పైపై పూతలతో పనులు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా వేసిన బ్రిడ్జి పిల్లర్లు అప్పుడే బీటలు వారగా, కాంక్రీట్ వాల్ ఉబ్బిపోయింది. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు కళ్లుమూసుకుని బిల్లులపై సంతకాలు చేసేస్తున్నారు. ధర్మవరం: ప్రజలకు మెరుగైన రహదారులు కల్పించి సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి మరీ ముదిగుబ్బకు బైపాస్ రహదారిని మంజూరు చేయించారు. అందులో భాగంగా 2021 డిసెంబర్లో రూ.116.81 కోట్ల వ్యయంతో ముదిగుబ్బ నుంచి 7.749 కిలోమీటర్ల పొడవున ఎన్‌హెచ్–42 బైపాస్ రోడ్డును నిర్మించేలా టెండరు పిలిచారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఈ పనులు దక్కించుకుంది. నిబంధనలకు పాతరేస్తూ బైపాస్ రోడ్డు పనుల్లో అంతులేని అక్రజుమాలకు పాల్పడుతోంది. నాణ్యత గాలికి.. బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ఇటీవల నిర్మించిన బ్రిడ్జి పనులను చూస్తే నాణ్యత తేటతెల్లమవుతోంది. బ్రిడ్జి నిర్మాణంలో నిలువు కాంక్రీట్ వాల్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. నాసిరకం కాంక్రీట్ మిశ్రమం వాడటం వల్లే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలానే బ్రిడ్జి ఉపరితలంలో మట్టికట్ట పనులు లేయర్ల వారీగా సరిగా చేయక పోవడంతో ఇరువైపులా ఉన్న ప్రీకాస్టెడ్ కాంక్రీట్ వాల్ బయటకు ఉబ్బింది. దీంతో నాసిరకం పనులు ఎక్కడ బయటపడతాయోనని కన్స్ట్రక్షన్స్ కంపెనీ సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి మేకప్ చేసింది. పట్టించుకోని అధికారులు.. ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి నాసిరకంగా జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పనుల నాణ్యతను పరిశీలించకుండానే విడతల వారీగా సదరు కంపెనీకి బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల సైతం నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీతో లాలూచీ పడటంతోనే అవినీతి పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ విజిలెన్స్‌కు ఎంపీ మాధవ్ ఫిర్యాదు ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సెంట్రల్ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. పనుల్లో అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. బైపాస్ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరారు. ‘విజిలెన్స్’పై కంపెనీ ప్రతినిధుల దౌర్జన్యం బైపాస్‌రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలను విచారించేందుకు వెళ్లిన విజిలెన్స్ అధికారులపై గతంలో నితిన్‌సాయి కనస్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు దౌర్జన్యం చేశారు. విజిలెన్స్ అధికారుల ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లడంతో పాటు పనులు పరిశీలించకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి పనులు నాణ్యత జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై నేషనల్ హైవే ఈఈ మధుసూదన్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
పుళల్ బైపాస్కు కొత్త శోభ
సాక్షి, చైన్నె: చైన్నె పెరుంగళత్తూరు – పుళల్ బైపాస్ రోడ్డుకు కొత్త శోభను సంతరించుకోనుంది. విద్యుత్ వెలుగుల కోసం రూ. 15 కోట్లతో ఒప్పందాలను రహదారుల శాఖ ఖరారు చేసింది. వివరాలు.. చైన్నె నగరంలో రద్దీ నియంత్రణ కోసం కొన్నేళ్ల క్రితం దక్షిణం వైపుగా ఉన్న పెరుంగళత్తూరు నుంచి ఉత్తరం వైపు గా ఉన్న పుళల్ వరకు 32 కి.మీ దూరం జాతీయ రహదారిగా బైపాస్ రోడ్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ మార్గం పోరూర్, మదురవాయిల్, అంబత్తూరును కలుపుతూ రూపుదిద్దుకుని ఉంది. కోయంబేడు నుంచి దక్షిణ తమిళనాడులోని జిల్లాలు, నగరాలకు జాతీయ రహదారి వైపుగా వెళ్లే వాహనాలు మదుర వాయిల్ వద్ద ఈ బైపాస్‌లో కలుస్తాయి. ఈ మార్గంలో పోరూర్, పుళల్ వద్ద రెండు టోల్గేట్లు సైతం ఉన్నాయి. టోల్ గేట్ల వద్ద మాత్రమే విద్యుత్ దీపాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. ఫలితంగా రాత్రులలో ఈమార్గంలో ద్విచక్ర వాహన దారులు వెళ్లాలంటే భయాందోళన చెందుతుంటారు. ఈ బైపాస్‌లో పోరూర్, మదుర వాయిల్, అంబత్తూరు వద్ద మాత్రమే వాహనాలు ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. చిమ్మ చీకటితో నిండిన ఈ బైపాస్ మార్గంలో రాత్రుళ్లలో ప్రమాదాలు, అసాంఘిక కార్యక్రమాలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్పందించిన రహదారుల శాఖ వాహనదారుల విజ్ఞప్తులకు రహదారుల శాఖ స్పందించింది. పెరుంగళత్తూరు సమీపంలోని వండలూరు నుంచి మీంజూరు వరకు రూపుదిద్దుకున్న ఔటర్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఉన్నట్టుగానే ఈ బైపాస్ రోడ్డులోనూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పెరుంగళత్తూరు నుంచి – పుళల్ వరకు రూ. 14.82 కోట్లతో 2,133 చోట్ల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 10 మీటర్ల ఎత్తుతో కూడిన 1,033 స్తంభాలను ఇరు వైపులా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా అమర్చనున్నారు. అలాగే 9 మీటర్ల ఎత్తులో 341 విద్యుత్ స్తంభాలను ప్రధాన ప్రాంతాల్లో అమర్చనున్నారు. ఐదు నెలల్లో ఈ పనులు ముగించే విధంగా ఒప్పందాలను రహదారుల శాఖ ఖరారు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
AP: శరవేగంగా ‘గొల్లపూడి-చినఅవుటపల్లి’ బైపాస్ నిర్మాణ పనులు
గన్నవరం(కృష్ణా జిల్లా): విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు చేపట్టిన 16వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతమాల ప్రాజెక్ట్‌లో భాగంగా చిన అవుటపల్లి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు 48 కిలోమీటర్ల పొడవునా రెండు ప్యాకేజీలుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. ప్యాకేజీ–3లో భాగంగా చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేపట్టిన మెగా ఇంజినీరింగ్ సంస్థ ఇప్పటికే 80 శాతం పనులను పూర్తిచేసింది. మరో మూడు నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేసే దిశగా పనుల్లో వేగం పెంచింది. ప్యాకేజీ–4లో చేపట్టిన గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 18 కిలోమీటర్ల బైపాస్ పనులు కూడా పూర్తయితే విజయవాడపై పూర్తిగా ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఏలూరు వైపు నుంచి హైదరాబాద్, గుంటూరు వైపు రాకపోకలు సాగించే వాహనాలు గొల్లపూడి మీదుగా బైపాస్ రోడ్డులో వెళ్లనున్నాయి. మర్లపాలెం రైల్వేట్రాక్ వద్ద నిర్మిస్తున్న వంతెన రూ.1,148 కోట్లతో నిర్మాణం ప్యాకేజీ–3లో భాగంగా రూ.1,148 కోట్లతో చేపట్టిన బైపాస్ నిర్మాణ పనులు చినఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సమీపంలో జీరో పాయింట్ నుంచి ప్రారంభమై గొల్లపూడిలో 30వ కిలోమీటర్ వద్ద ముగుస్తుంది. ఈ మార్గంలో రెండు రైల్వే ఫ్లై ఓవర్లు మినహా 36 మైనర్ వంతెనలు, 17 వెహికల్ అండర్ పాస్‌లు, రెండు బాక్స్ కల్వర్ట్లు, మరో 44 పైపు కల్వర్టులు, గ్రామాల వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. మర్లపాలెం, గొల్లపూడి వద్ద రైల్వేట్రాక్‌లకు ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఫ్లైఓవర్ కోసం గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చినఅవుటపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి మర్లపాలెం నుంచి అంబాపురం వరకు ఆరులైన్ల రహదారి నిర్మాణం పూర్తికాగా, చినఅవుటపల్లి, మర్లపాలెం, బీబీ గూడెం వద్ద వంతెనలు, అండర్ పాస్‌లకు రహదారిని అనుసంధానించే పనులు వేగంగా జరుగుతున్నాయి. సూరంపల్లి–నున్న మధ్యలో టోల్‌ప్లాజా నిర్మాణం కూడా జరుగుతోంది. వాహనదారుల సౌకర్యార్ధం పలుచోట్ల బైపాస్ రోడ్లకు ఇరువైపులా టాయిలెట్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. నున్న వద్ద హైటెన్షన్ వైర్లు ఎత్తు పెంచకపోవడంతో నిర్మాణ పనులకు కొంత ఆటంకంగా మారింది. ఈ అవరోధాలను అధిగమించేందుకు ఎన్హెచ్ఏ అధికారులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన నిర్మాణ పనులను కూడా మార్చిలోపు పూర్తిచేసే దిశగా మెగా ఇంజినీరింగ్ సంస్థ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. చదవండి: పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
రూ. 930 కోట్లతో ఆరు బైపాస్ రహదారులు .. కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను జిల్లా ప్రధాన రహదారులను అనుసంధానించే కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు రాష్ట్రంలో ఆరు బైపాస్ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఒకేసారి ఆరు బైపాస్‌ల నిర్మాణానికి ఆమోదించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 930 కోట్లతో మొత్తం 64.20 కి.మీ. మేర ఈ ఆరు బైపాస్ రహదారులను నిర్మించనున్నారు. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరు పట్టణాలను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ బైపాస్‌ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. వాటిలో రాయలసీమలోని తాడిపత్రి, వి.కోట, బైరెడ్డిపల్లి, ఆదోని, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఉన్నాయి. సరుకు రవాణా వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా ఈ ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు పంపింది. వీటిని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. ఎన్హెచ్ఏఐ నిర్మించనున్న ఆరు బైపాస్ రహదారుల ప్రణాళిక ఇలా.. ► బెంగళూరు–చెన్నై రహదారిని అనుసంధానిస్తూ చిత్తూరు జిల్లా వి.కోట వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 120 కోట్లు కేటాయించారు. ► కర్నూలు జిల్లా బైరెడ్డిపల్లి వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని ఆరు కి.మీ. నిర్మిస్తారు. రూ. 70 కోట్లతో నిర్మాణానికి ఆమోదించారు. ► తాడిపత్రిలో పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారిని రూ. 95 కోట్లతో నిర్మించడానికి ఆమోదం తెలిపారు. ► ఆదోనిలో పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 7 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 80 కోట్లు కేటాయించారు. ► నరసాపురం వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు. 23.20 కి.మీ. ఈ రహదారిని రూ. 490 కోట్లతో నిర్మించడానికి ఆమోదించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు వద్ద పేవ్డ్ షోల్డర్స్‌గా బైపాస్ రహదారి నిర్మిస్తారు. 8 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 75 కోట్లు కేటాయించారు. -
బావిలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, మహబూబాబాద్/కేసముద్రం/ఇల్లెందు: వాళ్లంతా గిరిజనులు.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నారు. చదువుకున్న కొడుకుకు ఉపాధి కల్పించేందుకు కొత్త లారీ కొన్నారు. తనతోపాటు తన బంధువు కూడా లారీ కొనడంతో ఆ సంబురంలో బంధువులతో కలసి దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. డ్రైవర్, తల్లి, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు లచ్చీరాం తండా సమీపంలో చోటుచేసుకుంది. కారు అదుపుతప్పడంతో...: మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోత్ భద్రునాయక్ (39) తన దూరపు బంధువు జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి తండాకు చెందిన మధు కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా వద్ద పండుగ చేశారు. పండుగకు భద్రునాయక్, భార్య హచ్చాలి (35), కుమార్తె సుమలతతోపాటు 18 నెలల మనవడు దీక్షిత్‌తో కలసి టేకులపల్లికి చెందిన తన బావమరిది గుగులోత్ బిక్కి నాయక్ కారులో వెళ్లారు. అన్నారం షరీఫ్ దర్గాలో బంధువులతో కలసి దర్శనం చేసుకున్నారు. భోజనాలు చేశారు. తిరిగి టేకులపల్లికి వస్తుండగా అదే పండుగకు వచ్చిన మహబూబాబాద్ పట్టణం భవానీ నగర్ తండాకు చెందిన గుగులోత్ లలిత (45), ఆమె కుమారుడు సురేష్ (15) లిఫ్ట్ అడిగి కారులో ఎక్కారు. అయితే కారు కేసముద్రం మండల కేంద్రం లచ్చీరాం తండా సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో భద్రునాయక్, అతని భార్య హచ్చాలి, లలిత, ఆమె కుమారుడు సురేష్ నీటిలో మునిగి మరణించారు. ముందు సీట్లో ఉన్న డ్రైవర్ బిక్కు, భద్రునాయక్ కుమార్తె సుమలత, ఆమె 18 నెలల కుమారుడు దీక్షిత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద వార్త తెలియగానే మహబూబాబాద్ డీఎస్పీ సైదయ్య ఆధ్వర్యంలో పోలీసులు, గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకొని రెండు గంటలపాటు శ్రమించి క్రేన్ సాయంతో బావిలోంచి కారును బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బావిలో పడిన కారును బయటకు తీస్తున్న దృశ్యం నీటిలో అరగంట తేలుతూ.. కేసముద్రం బైపాస్ రోడ్డును కొత్తగా వేస్తున్నారు. కంకర పోసి ఉండటంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే నిండు కుండలా ఉన్న వ్యవసాయ బావిలో పడింది. అయితే కారు అద్దాలు మూసి ఉండటంతో దాదాపు అరగంటపాటు బావిలో కారు తేలుతూ ఉంది. క్రమంగా లోపలకు నీరు చేరుతుండటంతో కారులో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కారు బావిలో పడిన శబ్ధం రావడంతో అటువైపు మూత్ర విసర్జనకు వెళ్తున్న ఎస్వీవీ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు బుర్రి రంజిత్, నూనావత్ సిద్దూలు ప్రాణాలకు తెగించి బావిలోకి దూకారు. కారు అద్దాన్ని పగలగొట్టి సుమలత, ఆమె కుమారుడు దీక్షిత్‌ను, డ్రైవర్ బిక్కును కాపాడారు. అప్పటికే కారులోకి నీరు ప్రవేశించి కారు మునిగిపోతుండగా హచ్చాలిని, భధ్రులను స్థానికుల సాయంతో బయటకు తీశారు. కానీ అప్పుటికే భద్రు మృతి చెందగా కొనఊపిరితో ఉన్న హచ్చాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. వెనుక సీట్లో ఉన్న లలిత, ఆమె కుమారుడు సురేష్‌లు కారులోనే మృతిచెందారు. -
విజయవాడకు తూర్పు మణిహారం
సాక్షి, అమరావతి: విజయవాడకు తూర్పు మణిహారంగా జాతీయ రహదారికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. భూసేకరణ వ్యయానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను కూడా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సూత్రప్రాయంగా ఆమోదించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాదాపు రూ.2 వేల కోట్లతో 40 కిలోమీటర్ల మేర విజయవాడ తూర్పు బైపాస్ మార్గం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ తుదిదశకు చేరుకుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. హైవేపై ట్రాఫిక్ కష్టాలకు తక్షణ పరిష్కారం చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) విజయవాడ నగరంలో నుంచి వెళుతుండటంతో దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలు జఠిలమవుతూ వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం గురించి యోచించకుండా గ్రాఫిక్కులతో కనికట్టు చేసిన అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రతిపాదించింది. 30 ఏళ్ల తరువాత ఆ ప్రాంతంలో పెరిగే ట్రాఫిక్ కోసమని ఇప్పుడు పశ్చిమ బైపాస్ నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు తక్షణ పరిష్కారం గురించి యోచించింది. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే పోర్టు నుంచి రాకపోకలు సాగించే భారీ వాహనాలతో విజయవాడ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమవుతాయని గుర్తించింది. ఈ సమస్యకు పరిష్కారంగా విజయవాడకు తూర్పు వైపున బైపాస్ రహదారి నిర్మించాలని ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడంతో తూర్పు బైపాస్ నిర్మాణం దిశగా ఎన్హెచ్ఏఐ కార్యాచరణ చేపట్టింది. కాజ నుంచి చిన అవుటపల్లి వరకు.. జాతీయ రహదారిపై గుంటూరు జిల్లాలోని కాజ నుంచి కృష్ణాజిల్లాలోని కంకిపాడు మీదుగా చిన అవుటపల్లి వరకు నాలుగు లేన్ల బైపాస్ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 40 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ బైపాస్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవున వంతెన నిర్మిస్తారు. దాదాపు రూ.2 వేలకోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈ బైపాస్ నిర్మాణంతో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా ప్రయాణిస్తాయి. బందరు పోర్టుకు వెళ్లే, వచ్చే వాహనాలు కూడా విజయవాడ నగరంలోకి రాకుండానే జాతీయ రహదారిపై బైపాస్ మీదుగా అటు చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ల వైపు వెళ్లవచ్చు. మల్టీమోడల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి 100 ఎకరాలు బైపాస్ రహదారి నిర్మాణానికి అయ్యే రూ.2 వేలకోట్లలో దాదాపు రూ.525 కోట్లు భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రహదారి, వంతెన నిర్మాణాలకు ఎన్హెచ్ఏఐ నిధులు సమకూరుస్తుంది. భూసేకరణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు ప్రతిపాదనలు సమర్పించింది. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మినహాయించుకుంటామని ప్రతిపాదించింది. అందుకు సమ్మతించిన కేంద్రం భూసేకరణ వ్యయంలో 50 శాతం భరించాలని చెప్పింది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అదే సమయంలో ఎన్హెచ్ఏఐ రాష్ట్రంలో జాతీయ రహదారుల పక్కన మల్టీమోడల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం 100 ఎకరాలను కేటాయిస్తామని ప్రతిపాదించింది. దీనికి బదులుగా విజయవాడ తూర్పు బైపాస్ కోసం భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరిం చాలని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టుబట్టడంతో కేంద్రం ఆమోదించింది. భూసేకరణ వ్యయంతోసహా విజయవాడ తూర్పు బైసాస్ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా భ రించేందుకు సూత్రప్రాయంగా సమ్మతించింది. -
రూ.930 కోట్లతో ఆరు బైపాస్ రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను అనుసంధానిస్తూ కొత్తగా ఆరు బైపాస్ రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూనే బైపాస్ రహదారులు ఉండేవి. కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాలు విస్తరిస్తుండటం, సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి స్థిరపడటంతో జనాభా పెరుగుదల తదితర కారణాలతో ఆ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరుగుతోంది. సమీపంలోని జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పట్టణాలగుండా చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా మొదటి దశలో ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని నిర్ణయించింది. జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఇటీవల ఖరారు చేసిన 2022–23 వార్షిక ప్రణాళికలో ఆ ఆరు బైపాస్‌లకు చోటు కల్పించారు. మొత్తం 64.20 కిలోమీటర్ల మేర రూ.930 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఖరారు చేసి అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. డబుల్ లేన్ విత్ పావ్డ్ షోల్డర్స్‌గా 12 మీటర్ల వెడల్పుతో బైపాస్ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలితం.. దశాబ్దాల కల సాకారం
సాక్షి, పుంగనూరు: పలమనేరు–పుంగనూరు బైపాస్ రోడ్డు కోసం సుమారు ముప్పై ఏళ్లుగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. పూర్తిగా సిద్ధమైన ఈ రహదారిని 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కీలకపాత్ర పోషించిన ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 2017లోనే పుంగనూరు–పలమనేరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి నడుంబిగించారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో పలుమార్లు చర్చించి రోడ్డు నిర్మాణానికి రూ.309 కోట్లు విడుదల చేయించారు. అనంతరం 55 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మామూళ్ల కోసం కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెట్టి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి త్వరితగతిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులను పరుగులు పెట్టించి మరీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ క్రమంలో దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చదవండి: (చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు) ఇదీ మార్గం పలమనేరు రోడ్డులోని అరబిక్ కాలేజీ నుంచి పుంగనూరు బైపాస్ ప్రారంభమవుతుంది. చదళ్ల సమీపంలోని తిరుపతి రోడ్డు మీదుగా ఎంబీటీ రహదారిలోని భీమగానిపల్లె వద్ద కలుస్తుంది. పెంచుపల్లె, బండ్లపల్లె, బాలగురప్పపల్లె, మేలుపట్ల, భగత్‌సింగ్‌కాలనీ, రాగానిపల్లె, రాంపల్లె, దండుపాళ్యం మీదుగా రోడ్డు సాగుతుంది. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరకు రెక్కలు రావడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. పుంగనూరుకు తలమానికం ఎంపీ మిథున్‌రెడ్డి అవిరళ కృషితోనే బైపాస్ నిర్మాణం పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు పనులు ముందుకు సాగకుండా ఏళ్ల తరబడి అడ్డుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రహదారి ప్రజలకు ఎంతో ఉపయోగకరం. – ఎస్.ఫకృద్ధీన్ షరీఫ్, పుంగనూరు -
బాబోయ్ చీకటి పడితే.. ఆ రోడ్డంటే భయం భయం
సాక్షి,సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని కలెక్టరేట్ బైపాస్‌రోడ్డుపై సాయంత్రం వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వీధిలైట్లు వెలుగక ఎటూ చూసిన కారుచీకట్లే ఉండడం అఘంతకులకు కలిసొస్తుంది. ఆ రహదారిపై సాయంత్రం వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉంటుండడంతో దుండగులకు అవకాశంగా మారింది. ఇటీవల తరచూ దా రిదోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఓ ద్విచక్రవాహనదారున్ని బెదిరించిన తీరు.. తాజాగా రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి బంగారం ఉంగరం ఎత్తకెళ్లడంతో స్థానికులు భయపడుతున్నారు. దారిపొడువున చీకటి సిరిసిల్ల బైపాస్ రోడ్డు మొత్తం అంధకారం అలుముకుంటుంది. సాయంత్రం వేళ ఆ రోడ్డుపై వాహనాల రద్దీ దాదాపు తగ్గిపోతుంది. కలెక్టరేట్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అదే దారిలో ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. విధులు ముగిసిన అనంతరం సాయంత్రం కాలినడకన వెళ్దామంటే వీధిదీపాలు లేక చీకటిగా ఉంటుంది. ఇదే ఆసరాగా చేసుకుని కొందరు పోకిరీలు వెకిలి చేష్టలు చేస్తుండగా, మరికొందరు దారికాచి దొంగతనాలు చేస్తున్నారు. వాహనాలపై వెంబడించి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. పోలీసులమని బెదిరింపులు జిల్లాలో పోలీసుల పేరు చెప్పి బెదిరించే సంస్కృతి ఊపందుకుంటోంది. రగుడు ఎల్లమ్మరోడ్డు నుంచి బైపాస్‌రోడ్డులో పలు సంఘటనలు జరిగాయి. జిల్లా ఆవిర్భవించిన ఏడాదికి భార్యభర్తలు బైక్‌పై వె ళ్తుంటే పోలీసులమని చెప్పి వాహనాన్ని తనిఖీ చేసి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు నెలల క్రితం వ్యాపారులను కొందరు బెదిరించి పెద్ద ఎత్తున నగదు లాక్కున్నట్లు తెలిసింది. మళ్లీ ఇప్పుడు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిని పోలీసులమని బెదిరించి బంగారు ఉంగరాన్ని లాక్కెళ్లారు. దీంతో సదరు ఉద్యోగి తనకు జ రిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించాడు. బైపాస్‌రోడ్డులో పోలీసుల గస్తీ పెంచాలని, వీధి దీపాలు బిగించాలని స్థానికులు కోరుతున్నారు. ఉంగరం లాక్కున్నారు భూమి పనిమీద సిరిసిల్లలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వెళ్లిన. బైపాస్‌రోడ్డులో ఇద్దరు అడ్డగించి, నా జేబులు చెక్ చేశారు. రూ.200 మాత్రమే ఉండడంతో చేతికి ఉన్న బంగారు ఉంగారాన్ని లాక్కున్నారు. – ఎం.సిద్ధేశ్వర్‌రావు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి, బొప్పాపూర్ చర్యలు తీసుకుంటాం పోలీసులమని చెప్పి తనిఖీలు చేసి.. చేతికున్న ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకున్నట్లు ఒక వృద్ధుడు పోలీస్‌స్టేషన్‌లో తెలిపిన మాట వాస్తవమే. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో నాకు ఆలస్యంగా తెలిసింది. తగు చర్యలు తీసుకుంటాం – అనిల్‌కుమార్, సీఐ, సిరిసిల్ల చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
Chilakaluripet: నెక్లెస్ ఆకారంలో రోడ్డు నిర్మాణం
యడ్లపాడు(చిలకలూరిపేట): పుష్కరకాలంగా నిలిచిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక చొరవ చూపారు. పెద్దమనసుతో కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు నష్టపరిహారం కోసం నిధులు మంజూరు చేశారు. ఫలితంగా పనులు వేగవంతమయ్యాయి. ఆది నుంచీ వివాదాలు 16వ నంబర్ జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణ పనులను 2009లో హైవే అథారిటీ సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా చిలకలూరిపేట వద్ద నెక్లెస్ ఆకారంలో బైపాస్ వేయాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దీనివల్ల తాము నష్టపోతామని రైతులు వ్యతిరేకించారు. దీంతో ఈ వివాదం 2010లో కోర్టుకు చేరింది. ఫలితంగా విజయవాడ టోల్‌ప్లాజా నుంచి చిలకలూరిపేట మండలం తాతాపూడి వరకు 84.5 కిలోమీటర్ల మేర జరగాల్సిన రహదారిలో చిలకలూరిపేట పరిధిలోని 16 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం 2016లో బైపాస్ నిర్మాణానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల నష్టపోయే రైతులకు పరిహారం అందించేందుకు 2018లోనే అవార్డు పాస్‌చేసినా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన పరిహారం వాటా నిధులు మంజూరు కాలేదు. అప్పటి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండి కూడా రైతులకు న్యాయం చేయలేకపోయారు. ఎమ్మెల్యే రజినీ కృషితో కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే విడదల రజిని హైవే అథారిటీ సంస్థతో సంప్రదింపులు జరిపారు. సమస్యను తెలుసుకుని సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.57 కోట్లను తక్షణం మంజూరు చేశారు. 2019లోనే రైతులకు నష్టపరిహారం అందించారు. స్వరూపం ఇలా.. ► చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, మండలాలను కలుపుతూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ బైపాస్‌ను నిర్మిస్తోంది. ► యడ్లపాడు మండలం తిమ్మాపురం చేపల చెరువు హైవే నుంచి చీలి చిలకలూరిపేట మండలంలోని రామచంద్రాపురం అడ్డరోడ్డు వరకు 16.384 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం కానుంది. ► ఈ మార్గంలో మూడుచోట్ల ఫ్లైఓవర్లు, ఐదుచోట్ల వంతెనలు, ఆరుచోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ చివరన ప్రారంభమైన ఈ పనులు 2023 మార్చికి పూర్తికానున్నాయి. సీఎం పెద్దమనసు చూపారు గత ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులకు నష్టపరిహారం నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా బైపాస్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో నేను హైవే అథారిటీ ప్రతినిధులతో పలుమార్లు మాట్లాడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూ.57కోట్లు కేటాయించారు. వెంటనే రైతులకు పరిహారం అందింది. బైపాస్ పనులు మొదలయ్యాయి. – విడదల రజిని, ఎమ్మెల్యే పిల్లర్ల పనులు చేస్తున్నాం బీఎస్ఈపీఎల్ కంపెనీ బైపాస్ నిర్మాణ పనులు చేపట్టింది. సర్వే పనులు పూర్తయ్యాయి. హద్దురాళ్ల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్సు పనులూ గతంలోనే ముగిశాయి. ప్రస్తుతం రామచంద్రాపురం వద్ద ఫ్లైఓవర్, బొప్పూడి వద్ద అండర్‌పాస్, ఓగేరు, కుప్పగంజి వాగుల వద్ద వంతెనల నిర్మాణానికి పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. వరుస వర్షాల వల్ల కొంత ఆటంకం కలుగుతోంది. అయినా గడువులోపు పనులు పూర్తిచేస్తాం. – అబ్దుల్ ఖాదర్, పీడీ బైపాస్ నిర్మాణ సంస్థ -
కృష్ణానదిపై మరో వంతెనకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నగరంపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనపై ఎన్హెచ్ఏఐ సానుకూలంగా స్పందించింది. కృష్ణానదిపై కొత్త వంతెనతో కలిపి 40 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.1,675 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జీఎస్టీ, భూసేకరణ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకున్న అనంతరం దీనిపై కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది. ఎన్‌హెచ్–16 మీద గన్నవరం ముందు నుంచే గుంటూరుకు నేరుగా చేరేందుకు విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. ప్రస్తుతం కోల్‌కతా– చెన్నై మార్గంలో వాహనాలన్నీ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారంగా తూర్పు బైపాస్ రహదారిని ప్రతిపాదించారు. తద్వారా ఎన్‌హెచ్–16 మీద వాహనాలు మరింత తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్హెచ్ఏఐ ఐదు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో డిజైన్లు రూపొందించి పరిశీలించింది. వాటిలోఒకదాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. దీని ప్రకారం గన్నవరం విమానాశ్రయానికన్నా ముందునుంచే విజయవాడకు తూర్పు దిశగా కంకిపాడు మీదుగా గుంటూరు జిల్లాలోని కాజ వరకు నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు వేస్తారు. దీన్లో భాగంగా కృష్ణానది మీద వంతెన నిర్మిస్తారు. 445 ఎకరాల సేకరణకు రూ.515 కోట్లు అవసరం విజయవాడ తూర్పు బైపాస్ రహదారి కోసం మొత్తం రూ.1,675 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల మేరకు.. 40 కి.మీ. పొడవున 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.728 కోట్లు, కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి రూ.432 కోట్లు, 445 ఎకరాల భూసేకరణకు రూ.515 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జీఎస్టీ, మైనింగ్ సెస్ కింద వచ్చే రూ.95 కోట్ల రాబడిని వదలుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. భూసేకరణ వ్యయాన్ని ఎన్హెచ్ఏఐ భరించాలని చెప్పింది. ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోందని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు తెలిపారు. -
హైవేల విస్తరణకు నిధులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల విస్తరణకు వార్షిక ప్రణాళికలో భాగంగా రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నేషనల్ హైవే–25లో భాగమైన నాతవలస–విజయనగరం–రాయ్‌పూర్ రోడ్డును 42 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇందుకు రూ.125 కోట్లు వెచ్చించనుంది. విజయనగరం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డు (5.8 కి.మీ.) నిర్మాణానికి రూ.48 కోట్లు కేటాయించింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డును 20 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఇందుకు రూ.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. జీలుగుమిల్లి–కొవ్వూరు మధ్య 26 కిలోమీటర్లను రూ.15 కోట్లతో విస్తరించనున్నారు. రాజమండ్రి–మధురపూడి (విమానాశ్రయం) ఎన్‌హెచ్–516 రోడ్డును రూ.35 కోట్లతో 34 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. విజయనగరం జిల్లా మానాపురం రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) అప్రోచ్ రోడ్డుకు రూ.42 కోట్లు వెచ్చి స్తారు. ప్రకాశం జిల్లా వాడరేవు–నారాయణపురం–పిడుగురాళ్ల రోడ్డును 43 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీనికి రూ.34 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే కృష్ణా జిల్లా పామర్రు–దిగమర్రు రహదారి (ఎన్‌హెచ్–165)ని రూ.12 కోట్లతో 17 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు–అమరావతి రోడ్డును 9 కిలోమీటర్లమేర రూ.18 కోట్లతో బలోపేతం చేస్తారు. వార్షిక ప్రణాళికలో రూపొందించిన వీటికి పరిపాలనా ఆమోదం కోసం పంపించామని జాతీయ రహదారుల విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ రాఘవేంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జాతీయ రహదారులకు ప్యాచ్ వర్కులు చేస్తున్నామని తెలిపారు. -
‘కోడెల’ కోసం రూటు మారిన బైపాస్!
సత్తెనపల్లి : పచ్చని పంట పొలాల మీదుగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి గుంటూరు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికి మూడు సర్వేలు చేపట్టిన అధికారులు సత్తెనపల్లి మండలం కంకణాపల్లి పంచాయతీ శివారు గ్రామమైన వెన్నాదేవి వద్ద స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత అంగరక్షకుని పేరుతో ఉన్న భూమిని బైపాస్ నుంచి తప్పించేందుకే ఇళ్లు, పచ్చని పంట పొలాల మీదుగా బైపాస్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సత్తెనపల్లి మండలం కంకణాపల్లి పంచాయతీ శివారు గ్రామమైన వెన్నాదేవిలో గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారి పక్కన షేడ్నెట్లు ఏర్పాటుచేసుకుని ఆకు కూరలు, కాయగూరలు, వివిధ రకాల పంటలు పండిస్తూ పలువురు రైతులు జీవిస్తున్నారు. బైపాస్ పేరుతో విలువైన మూడు పంటలు పండే సుమారు 30 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కొలతలు వేసి పుల్లలు పాతారు. బైపాస్‌లో తమ భూములు పోతున్నాయని తెలుసుకున్న రైతులంతా శుక్రవారం తమ పంట భూముల వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరం రూ.2 కోట్ల విలువైన భూముల మీదుగా బైపాస్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడం దారుణమన్నారు. 60 మీటర్ల పొడవునా 200 మీటర్ల విలువైన పంట భూమి తీసుకుంటే ఇక మిగిలేది ఏమిటంటూ ఆవేదన చెందారు. ఈ భూమికి కొద్ది దూరంలో ప్రభుత్వ డొంక ఉందని, ఆ భూమిని సేకరించకుండా రాజకీయ కుట్ర చేస్తూ కేవలం కోడెల శివప్రసాదరావు భూములకు నష్టం జరగకుండా చూసేందుకు రైతులను ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. సాగర్ కాలువపై ఆధారపడకుండా బోరు బావుల ద్వారానే ఏడాదిలో మూడు పంటలను పండించుకుంటూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. భూ యజమానులమైన తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా సర్వేచేసి ఉన్న పళంగా పుల్లలు పాతారని, ఇలాంటి దారుణం మరెక్కడా ఉండదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకుని ప్రభుత్వ భూమిని సేకరించాలని.. లేకుంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సి ఉంటుందని భూయజమానులు, నివాస గృహాల యజమానులు హెచ్చరించారు. భూసేకరణ చేపట్టని ప్రభుత్వ డొంక రాజకీయ కుట్రతోనే భూసేకరణ నాకు ఇక్కడ ఐదెకరాల భూమి ఉంది. బైపాస్ కోసం చేపట్టిన భూసేకరణలో రెండెకరాలు కోల్పోతా. మాకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఏడాది పొడవునా పంటలు పండే భూముల మీదుగా రోడ్లు వేయడం రాజకీయ కుట్రే. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – గొడుగుల సుబ్బారావు, రైతు, వెన్నాదేవి సాగర్ జలాలతో పనిలేకుండా పంటలు సాగర్ కాలువల నీటితో పనిలేకుండా బావుల్లో నీటిని వినియోగించుకుని ఏడాది పొడవునా పంటలు పండించుకుంటున్నాం. కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం. బైపాస్ పేరుతో మాపై కక్ష సాధింపు చర్యలకు దిగడం తక్షణమే మానుకోవాలి. – శ్రీకాంత్, రైతు, వెన్నాదేవి డొంకను తీసుకుంటే ఖర్చు తగ్గుతుంది 3 పంటలు పండే భూములను బైపాస్ కింద తీసుకుంటే ఆధారం కోల్పోతాం. మా భూమిని కౌలుకిస్తే ఏడాదికి రూ.50వేలు ఇస్తారు. అంతటి విలువైన భూములను రోడ్డు పేరుతో తీసుకోవటం దారుణం. వృథాగా ఉన్న ప్రభుత్వ డొంకను తీసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుంది. – సాంబశివరావు, రైతు, వెన్నాదేవి జీవనాధారం కోల్పోతాం షేడ్‌నెట్‌లో మిరప మొక్కల పెంపకం చేపడతాను. నాకు 4.70 ఎకరాల భూమి ఉంది. దీనిలో 0.70 ఎకరాలు బైపాస్ పేరుతో కొలతలు వేసి పుల్లలు పాతారు. ఈ భూమిని రోడ్డు కింద తీసుకుంటే జీవనాధారం కోల్పోతాం. ప్రభుత్వ భూమి వినియోగించుకుని మాకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – తోటకూర అనిల్‌కుమార్, రైతు, వెన్నాదేవి -
హెరిటేజ్ ఎఫెక్ట్ రైతుల భూములకు ఎసరు
-
‘హెరిటేజ్’ కోసమే బైపాస్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే అథారిటీ(ఎన్హెచ్ఏఐ) చేపట్టిన తిరుపతి–చిత్తూరు రహదారి విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. ఈ మార్గంలో ఉన్న హెరిటేజ్ డెయిరీ భూములను భూసేకరణ నుంచి తప్పించేందుకు తమ భూములకు ఎసరు పెడుతున్నారని రైతులు మండి పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం తమను బలి చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములు కోల్పోతే ఇక ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. హెరిటేజ్‌కు మేలు చేసేందుకు రోడ్డు అలైన్మెంట్ మార్చేశారని, ఆ సంస్థ భూములను కాపాడడంతో పాటు వాటి విలువను భారీగా పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని విమర్శిస్తున్నారు. అసలేం జరిగింది? నాయుడుపేట నుంచి చిత్తూరు వరకూ ఉన్న రెండు వరుసల రహదారిని(ఎన్‌హెచ్–140) ఆరు లేన్ల రోడ్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో చిత్తూరు–తిరుపతి మధ్యనున్న 61 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీలో తిరుపతి–నాయుడుపేట మధ్యనున్న 55 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చింది. ఒక్కో ప్యాకేజీకి రూ.1,200 కోట్లు కేటాయించింది. భూసేకరణ, పరిహారం చెల్లింపుల కోసం మరో రూ.300 కోట్లు కేటాయించింది. మొదటి ప్యాకేజీలో రెండు చోట్ల బైపాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. ముంగిలిపట్టు నుంచి పనబాకం వరకూ (7.5 కిలోమీటర్లు) ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు విషయంలో అధికారులు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ భూములకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పడ్డారు. డెయిరీ ఆ భూముల విలువ రెట్టింపయ్యేలా అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. హెరిటేజ్‌కు రెండు వైపులా రోడ్లే ప్రస్తుతం హెరిటేజ్ డెయిరీ ప్రధాన గేటుకు ముందుగా తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి వెళ్తోంది. ఈ ప్రాంతంలో (కాశిపెంట్ల) రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించాలంటే కుడి వైపున రైల్వే లైన్, ఎడమ వైపున హెరిటేజ్ డెయిరీ సరిహద్దులు ఉన్నాయి. రైల్వే లైన్ వైపు విస్తరణకు అవకాశం లేదు కాబట్టి ఎడమ వైపునే ఎక్కువ భూమిని సేకరించాలి. అదే జరిగితే హెరిటేజ్ స్థలం చాలావరకు భూసేకరణ కింద పోవడం ఖాయం. దీంతో అధికారులు ఇక్కడ బైపాస్ అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం ఏడున్నర కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో బైపాస్ రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి నుంచి ముంగిలిపట్టు దగ్గర చీలే బైపాస్ రోడ్డు హెరిటేజ్ డెయిరీ వెనుకగా వెళ్లి పనబాకం రైల్వేస్టేషన్‌కు ముందు మళ్లీ పాత రోడ్డులో కలుస్తుంది. ఈ బైపాస్ నిర్మాణం పూర్తయితే హెరిటేజ్ డెయిరీకి ముందు రెండు వరసలు, వెనుక ఆరు వరసల రహదార్లు ఉంటాయి. 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెరిటేజ్ భూముల ధర భారీగా పెరుగుతుంది. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికే అధికారులు బైపాస్‌ను తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ బైపాస్ నిర్మాణానికి 300 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనివల్ల 60 మందికి పైగా రైతులు తమ సాగు భూములను కోల్పోనున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను పోగొట్టుకుని ఎలా బతకాలని బాధిత రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బైపాస్ నిర్మాణానికి భూములిచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న రైతులు న్యాయం కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు యథాతథ స్థితి(స్టేటస్ కో) ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కొన్నాళ్లపాటు భూముల సర్వే నిలచిపోయింది. అయితే, వారం రోజులుగా చంద్రగిరి, పాకాల మండలాల రెవెన్యూ అధికారులు బైపాస్ రోడ్డు పనుల కోసం రైతుల భూములను సర్వే చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సర్వే చేయడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రత్యామ్నాయం ‘బోనిత్తుల రోడ్డే.. బైపాస్ నిర్మాణం అనివార్యమని అధికారులు చెబుతుండగా, ఎప్పటి నుంచో వాడకలో ఉన్న బోనిత్తుల రోడ్డు ఇందుకు ఉపయోగించుకోవచ్చని రైతులు అంటున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూములే ఉన్నాయని, దీన్ని ఆరు లేన్లుగా విస్తరిస్తే ఎవరికీ నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు. పొలం, ఇల్లు పోతున్నాయి ‘‘నేను రిటైర్డ్ ఉద్యోగిని. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ సొంతింట్లో ఉంటున్నా. బైపాస్ కోసం భూసేకరణలో నా పొలం, ఇల్లు పోతున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. పనబాకంలో 30కి పైగా ఇళ్లు పోయే ప్రమాదం ఉంది’’ – డాక్టర్ జె.బాపూజీ, పనబాకం గ్రామం పొలమంతా పోతుంది ‘‘బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ జరిపితే నాకున్న 2.50 ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం పోతుంది. ఆ భూమే నాకు జీవనాధారం. అది లేకుండా పోతే ఎలా బతకాలో తెలియడం లేదు. పెద్దలు భూములను కాపాడడానికి మాలాంటి పేదల భూములు లాక్కోవడం అన్యాయం’’ – ఎస్.జనార్దన్, రైతు, కొత్తిఇండ్లు గ్రామం -
మా నోట్లో మట్టి కొట్టొద్దు
అన్నదాతకు పంట పొలమే జీవనాధారం.. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాం.. బైపాస్ రోడ్‌తో మా నోట్లో మట్టికొట్టొదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల రైతులు బుధవారం పట్టణంలోని నాలుగు కిలోమీటర్లు పాదయాత్రతో ప్రదర్శన నిర్వహించారు. సత్తుపల్లి : జాతీయ రహదారి విస్తరణలో విలువైన పంట భూములు కోల్పోతున్నామని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతు పేర్కొంటున్నారు. ఇప్పటికే సింగరేణి ఓపెన్ కాస్టు, లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ నిర్మాణాలతో వేలాది ఎకరాల పంట భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసినప్పుడు పంట భూముల విలువ నాకు తెలుసు.. సాధ్యమైనంత వరకు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్ర తరహాలో ఆందోళన.. ఎకరం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలున్న వ్యవసాయ భూములు దొరికే పరిస్థితి లేదు. వ్యవసాయం తప్పా ఇతర వృత్తులు తెలియవు. ఉన్న కొద్దిపాటి భూములను లాక్కొంటే మేమెట్లా బతకాలని ప్రశ్నిస్తున్నారు. వంద మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారి విస్తరణలో భూములు తీసుకుంటున్నారు. వచ్చే రెండేళ్లల్లో గోదావరి జలాలు వస్తాయి.. పంట భూముల్లో సిరులు పండించుకుందామనుకుంటే మా భూములను స్వాధీనం చేసుకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మరో రెండు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే కొంత మేరకైనా నష్ట నివారణ జరగవచ్చని.. 32 కిలోమీటర్ల దూరం బైపాస్ నిర్మాణం చేయటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవల అన్నదాతలు చేసిన ఆందోళన తరహాలో చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని రైతులు తెలిపారు. రైతుల భూములు లాక్కోవద్దు.. జాతీయ రహదారి బైపాస్‌రోడ్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి. ఇప్పటికే చౌడవరంలో లంకాసాగర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయాం. జాతీయ రహదారి విస్తరణలో 67 ఎకరాలు పోతుంది. దీంట్లో నా భూమి మూడు ఎకరాలు ఉంది. -చల్లా రామనర్సింహారెడ్డి,రైతు, చౌడవరం, వేంసూరు మండలం అది ఉంటేనే బువ్వ.. నాకున్న ముప్పాతిక వ్యవసాయ భూమి జాతీయ రహదారికి పోతుంది. భూమి పోతే కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పటికి మూడు నాలుగు ప్లాన్లు చెప్పి.. మా భూముల్లోనే రోడ్డుకు తీసుకుంటే ఎలా? అది ఉంటేనే మాకు బువ్వ. -లింగారెడ్డి సత్యనారాయణ,రైతు, సిద్ధారం, సత్తుపల్లి మండలం -
నందిగామ బైపాస్‌లో కారు దగ్ధం
-
నిండు బతుకులు బైపాస్కు బలి
‘పండుగ పూట మా ఇంటి దీపం ఆరిపోయింది. నాకు, పిల్లలకు దిక్కెవరు. ఈ రోడ్డుపై ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో తెలియడం లేదు. అందుకే ప్రమాదం జరిగింది. నా భార్య లారీ కింద నలిగిపోయింది’... ఈ నెల 14న భోగి రోజున పినగాడి కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన త్రివేణి మృతదేహం వద్ద భర్త ఎరకన్నపాత్రుడు విలపించిన తీరు. ‘పండుగకు పుట్టింటికి వచ్చిన నా కూతురికి అరగంట క్రితమే సామాగ్రి మూట కట్టి సాగనంపాను. మరికొన్ని నిమిషాల్లో నా బిడ్డ మెట్టినింటికి వెళ్లిపోయేది. కానీ ఈ రోడ్డు నా గౌరమ్మను మింగేసింది’... ఈ నెల 17న బొర్రమ్మగెడ్డ వద్ద ప్రమాదంలో మరణించిన గౌరి తల్లి గుండె రంపపు కోతతో రోదన ఇది. ‘నా కొడుక్కి పోలీస్ ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డాం. ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. త్వరలో ఓ ఇంటివాడిని చేద్దామని ఆలోచిస్తున్నాం. ఇంతలో నా కొడుకు డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడనుకుంటే... రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్నాడు. ఇదెక్కడి ఖర్మ మాకు’... సోమవారం రాత్రి శివగణేష్ మరణవార్త విని తల్లిదండ్రుల ఆక్రందన. వారే కాదు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారి వందలాది కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. ఎంతో మంది గుండెలను ముక్కలు చేసింది. ఎందరో తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. అయినప్పటికీ అధికారులు, పాలకుల అలసత్వం వల్ల ఆ బైపాస్ రహదారి రక్తదాహాం తీరడం లేదు. విశాఖపట్నం, పెందుర్తి: ఆనందపురం – అనకాపల్లి బైపాస్ రహదారిని విస్తరించకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దాదాపు 15 ప్రమాదాల్లో పది మంది మృత్యువాత పడగా తాజాగా వారం రోజుల వ్యవధిలో ఐదు ప్రమాదాల్లో నలుగురు రోడ్డుకు బలయ్యారు. రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నియంత్రణకు సంబంధిత అధికారులు, పాలకులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రహదారి విస్తరణ అంటూ ప్రభుత్వం మూడేళ్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నా ఇంకా ఆ ప్రక్రియ నత్తనడకనే సాగుతోంది. రహదారిని విస్తరించే క్రమంలో ఇంకా పూర్తిస్థాయి భూసేకరణ ప్రక్రియే పూర్తి కాలేదు. మలుపులే మృత్యు ద్వారాలు ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారి(బైపాస్) దాదాపు 38 కిలో మీటర్లు మేర విస్తరించి ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారి అత్యంత ప్రమాదకరమైంది. ఈ రహదారికి వెడల్పు చాలా చోట్ల కేవలం 20 అడుగులు మాత్రమే. కిలోమీటర్ల మేర రోడ్డు అంచులు కోరుకుపోయాయి. ఈ రహదారిపై ప్రమాదాలకు కారణం అత్యంత ప్రమాదకరమైన మలుపులే. దారి పొడవునా పదుల సంఖ్యలో మలుపులు ఉన్నాయి. ♦ ఆనందపురం దాటాక శొంఠ్యాం, పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం, సబ్బవరం సమీపంలోని బొర్రమ్మగెడ్డ, సబ్బవరం పాతరోడ్డు, అసకపల్లి కూడలి, మర్రిపాలెం, అనకాపల్లి సమీపంలోని గ్యాస్ గొడౌన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ♦ కూడళ్ల వద్ద కూడా తగిన రక్షణ చర్యలు లేవు. కూడళ్లు, మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ♦ రహదారిపై ఎక్కడా విద్యుత్ దీపాల సౌకర్యం లేదు. ♦ రోడ్డుపై గోతులు పడినా నెలల తరబడి మరమ్మతులు చేపట్టడం లేదు. ♦ ముఖ్యంగా మలుపులు, వంతెనల వద్ద ఎక్కడా హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయలేదు. హైవే పెట్రోలింగ్ కూడా ఈ రహదారిపై లేదు. ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు ♦ గత ఏడాది ఏడాది మార్చి 18న సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో లక్ష్మి అనే వివాహిత, ఆరు నెలల వయసున్న ఆమె కుమార్తె మృత్యువాతపడ్డారు. ♦ అదే ఏడాది ఏప్రిల్‌లో సబ్బవరం బొర్రమ్మగెడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. అదే నెలలో సబ్బవరంలో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. ఆ నెలలోనే పెందుర్తి వంతెనపై జరిగిన ప్రమాదంలో అప్పారావు అనే వ్యక్తి మరణించాడు. ♦ గత ఏడాది మే నెల 18న పినగాడి వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీను, గణేష్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ♦ తాజాగా ఈ నెల 14న పినగాడి వద్ద త్రివేణి అనే వివాహిత, 17న బొర్రమ్మగెడ్డ వద్ద గౌరి అనే గృహిణి, సోమవారం రాత్రి సాధూమఠం వద్ద కానిస్టేబుల్ శివగణేష్ రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. నివేదికలు వస్తే పరిహారం ప్రకటిస్తాం.. భూ సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రోడ్డు విస్తరించే క్రమంలో అటవీ, ఉద్యానవన శాఖ, ఆర్ అండ్ బీ అధికారుల నుంచి వారి ఆస్తులకు సంబంధించిన నివేదికలు రావాలి. అవి వచ్చాక ఉన్నతాధికారులు భూ యజమానులతోపాటు అన్ని వర్గాలకు పరిహారాన్ని ప్రకటిస్తారు. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే టెండర్ల ప్రక్రియ మా పరిధిలోనిది కాదు. సాధ్యమైనంత త్వరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. – సుబ్బరాజు, రహదారి విస్తరణ భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ -
జనపథం - చిలకలూరి పేట బైపాస్ రోడ్
-
అగ్రిగోల్డ్ బాధితులు రాస్తారోకో: అరెస్ట్
-
అగ్రిగోల్డ్ బాధితులు రాస్తారోకో: అరెస్ట్
ఒంగోలు : అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఆ సంస్థ బాధితులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ... అగ్రిగోల్డ్ బాధితులు శనివారం ప్రకాశం జిల్లా సౌత్ బైపాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. బాధితులకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ రాస్తారోకోలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, సింగరాజు వెంకట్రావ్, వెంకటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలతోపాటు అగ్రిగోల్డ్ బాధితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి... ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
మా శవాలపై రోడ్డు వేయండి
నున్న(విజయవాడరూరల్)ః ‘పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో చట్టబద్ధంగా ఈస్థలాలుకొని ఇళ్లు, ప్లాట్లు వేసుకున్నాం. రోడ్డు కోసమని ఇళ్లను కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేస్తారా?, నమ్మి ఓటేసినందుకు చేసే ఉపకారం ఇదా?‘అని ప్రభుత్వ అరాచక చర్యలను నిరసిస్తూ మహిళలు దుమ్మెత్తి పోశారు. శనివారం నున్న లోకల్ బైపాస్ రోడ్డు నిర్మాణం పనుల కోసమని ఆర్అండ్బీ అధికారులు పోలీసును వెంటేసుకుని ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా ఇళ్ల తొలగింపు చేపట్టడంతో బాధితులు భగ్గుమన్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో నున్న రూరల్ పోలీసులు, అజిత్సింగ్నగర పోలీసులు రంగప్రవేశం చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇళ్ళు నిర్మించుకొని జీవిస్తున్న సాతులూరి వెంకటేశ్వరమ్మ,అతని కుమారులు నలుగురిని ఇళ్ళు వదిలివెళ్ళాలని పోలీసులు భయపెట్టారు. 2008 లో హైకోర్టు స్టేటస్కో ఇచ్చిందని రోడ్డు నిర్మాణానికి మా ఇళ్ళను తొలగించబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఖాళీచేయమని చెప్పడం ఏమిటని వెంకటేశ్వరమ్మ కుమారులు అధికారులను కలిసి కోర్టు ఉత్తర్వులను అందచేశారు. ఆ కుటుంబసభ్యులతో పాటు సమీపంలో ఫ్లాట్లుకొన్నవారు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవిన్యూఅధికారులు, సర్వేయర్ సుబ్బారావులు రోడ్డు ఎలైన్మెంటు ప్రకారం ఆర్అండ్బి అధికారులకు మార్కింగ్ చేసి అప్పగించడంతో వారు రోడ్డు పనులను జేసిబి మిషనుతో ప్రారంభించారు. ఆ సందర్భంలో స్ధలాలున్న మహిళలు మిషనుకు అడ్డుగా కూర్చువడంతో పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వ్యానులోకి ఎక్కించారు. లక్షలాది రూపాయలను అప్పుచేసి స్థలాలను కొనుగోలు చేశామని, ఇంకా అప్పుతీరలేదని మహిళలు బోరున విలపించారు. నష్టపరిహారం చెల్లించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మమ్మల్ని చంపి శవాలపై రోడ్డు నిర్మించుకోండని మహిళలు శాపనార్థాలు పెట్టారు. నిరసన తెలిపిన నిమ్మగడ్డ కుమారి, సునీత, లలితకుమారి, సాంబశివరావు, షేక్ ఖాశీంబి, శంకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుతలను పోలీసుస్టేçÙన్కు తరలించాక ఆర్అండ్బి అధికారులు రోడ్డు పనులను మార్కింగ్ చేసి ప్రారంభించారు. నున్న రూరల్ సీఐ సాహేరాబేగం, అజిత్ సింగ్‌నగర్ సీఐ ప్రసాదరావుల ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాౖటెంది. రోడ్డుౖ అలెన్మెంటులో సర్వే నెంబర్ 751/2 లో రెండెకరాల 36 సెంట్లు, 751/1బిలో 90 సెంట్ల భూమి అర్బన్‌ల్యాండ్ సీలింగ్ భూమని సర్వేయర్ సుబ్బారావు చెప్పారు. ఆర్అండ్బి రోడ్డు నుంచి 430 మీటర్ల ను మార్కింగ్ చేసి భూమిని అప్పగించినట్టు ఆయన చెప్పారు. పుష్కరాలకు రోడ్డు పూర్తి చేస్తాం నున్న లోకల్ బైపాస్‌రోడ్డు నిర్మాణం పనులను పుష్కరాలకు పూర్తిచేస్తామని ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సత్యనారాయణ చెప్పారు. వంద అడుగుల వెడల్పు,430 మీటర్ల పొడవునా రోడ్డును నిర్మించాల్సివుందన్నారు. – ఆర్అండ్బి ఇఈ -
‘బైపాస్’ పేరుతో రైతుల పొట్టకొట్టొద్దు
తుర్కపల్లి : బైపాస్‌రోడ్డు పేరుతో రైతుల పొట్టకొట్టొద్దని జాతీయ కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు వెంటనే నాలుగు లేన్ల రోడ్డు విస్తరించాలని తెలంగాణ పరిరక్షణ సమితి ఆధ్యర్యంలో మంగళవారం మండలంలోని జేఎం ఫంక్షన్‌హాలులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్న ప్రభుత్వం ఉన్న భూములు ఆక్రమించుకున్న ప్రజాప్రతినిధులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతుందన్నారు. యాదాద్రి నుంచి కీసర వరకు ప్రభుత్వం తలపెట్టిన బైపాస్ రోడ్డులో 350 ఎకరాల వరకు రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు అన్నింటికి అనువుగా ఉండి, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు రైతులు భూములు ఆక్రమించుకొని రోడ్డు వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి సరాసరి యాదాద్రికి వెళ్లడానికే రోడ్డు వేసుకొని ఇటు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి జరుగుతున్న ప్రయత్నమేనన్నారు. 2013 చట్టం ప్రకారం రైతులకు మార్కెట్ రేట్‌కు నాలుగింతల పరి హారం అందజేయాలన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా అమాయక రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెండాలు పక్కన పెట్టి భూనిర్వాసితుల ఎజెండానే ముందుకు తీసుకొని పోరాటం చేయాలని అన్నారు. అనంతరం భూనిర్వాసితులు కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా కొక్కొండ లింగయ్య, గౌరవసలహాదారుగా కల్లూరి రామచంద్రారెడ్డి, బబ్బూరి రవీంధ్రనాథ్‌గౌడ్ , 20 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముల్కలపల్లి రాములు, కొండమడుగు నర్సింహ, బండ శ్రీశైలం, మటూరి బాల్‌రాజు, మాటూరి బాల్‌రాజు, మంగ నర్సింహులు, నాయకులు రంగ శంకరయ్య, బబ్బూరి పోశెట్టి, ఎలుగల రాజయ్య, పిడుగు అయిలయ్య, దుర్గయ్య, నర్సింహులు పాల్గొన్నారు. -
బైపాస్ రోడ్డు నిర్మించొద్దు
తుర్కపల్లి : బైపాస్‌రోడ్డు పేరుతో రైతుల పొట్టకొట్టొద్దని జాతీయ కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బైపాస్ వద్ద ఉన్న రోడ్డు వెంటనే నాలుగు లైన్ల రోడ్డు విస్తరించాలని తెలంగాణపరిరక్షణ సమితి ఆధ్యర్యంలో మంగళవారం మండలంలోని జేఎం ఫంక్షన్‌హాలులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్న ప్రభుత్వం ఉన్న భూములు ఆక్రమించుకున్న ప్రజాప్రతినిధులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతుందన్నారు. యాదాద్రి నుంచి కీసర వరకు ప్రభుత్వం తలపెట్టిన బైపాస్ రోడ్డులో 350 ఎకరాల వరకు రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు అన్నింటికి అనువుగా ఉండి, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు రైతులు భూములు ఆక్రమించుకొని రోడ్డు వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి సరాసరి యాదాద్రికి వెళ్లడానికే రోడ్డు వేసుకొని ఇటు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి జరుగుతున్న ప్రయత్నమేనన్నారు. 2013 చట్టం ప్రకారం భూముల కోల్పోతున్న రైతులు ఉన్న మార్కెట్ రేట్‌కు నాలుగింతల పరిహారం అందజేయాలని అన్నారు. ఇప్పటి వరకు బైపాస్ రోడ్డు విషయంలో ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా అమాయక రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. వెంటనే బైపాస్ రోడ్డు విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెండాలు పక్కన పెట్టి భూనిర్వాసితుల ఎజెండానే ముందుకు తీసుకొని పోరాటం చేయాలని అన్నారు. అనంతరం భూనిర్వాసితులు కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా కొక్కొండ లింగయ్య, గౌరవసలహాదారుగా కల్లూరి రామచంద్రారెడ్డి, బబ్బూరి రవీంధ్రనాథ్‌గౌyŠ , 20 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి రాములు, కొండమడుగు నర్సింహ, బండ శ్రీశైలం, మటూరి బాల్‌రాజు, మాటూరి బాల్‌రాజు, మంగ నర్సింహులు, నాయకులు రంగ శంకరయ్య, బబ్బూరి పోశెట్టి, ఎలుగల రాజయ్య, పిడుగు అయిలయ్య, సిల్ల్వేరు దుర్గయ్య, కొక్కొండ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా బైపాస్
♦ తాండూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్ ♦ భూసేకరణకు రెవెన్యూ అధికారుల సర్వే ♦ రోడ్డు హద్దులు ఏర్పాటు చేసిన అధికారులు ♦ డీపీఆర్ సమర్పించిన ఆర్అండ్బీ శాఖ ♦ బైపాస్ రహదారి పొడవు 13 కి.మీ. ♦ రూ.78 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం తాండూరు: తాండూరు పట్టణవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. పట్టణం మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు.. ఇక తాండూరులోకి రాకుండానే గమ్యస్థానాలకు చేరుకుంటాయి. తాండూరు- చించొళి మార్గంలోని బెంగళూరు లింక్ ైహైవేలో రూ.78 కోట్లతో నిర్మించనున్న బైపాస్ రోడ్డుతో ఇది సాధ్యంకానుంది. ఇప్పటికే ఆర్ అండ్ బీ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. బైపాస్ రోడ్డు కోసం 13 కి.మీ. మేర సుమారు వంద ఎకరాల వరకు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణపై యాలాల రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే పూర్తికావొచ్చింది. తాండూరు ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావులు కూడా బైపాస్ రోడ్డు పనులు మొదలుపెట్టేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచారు. బెంగళూరుకు చెందిన హెచ్‌బీఎస్ కన్సల్టెన్సీ సంస్థ ఈ రోడ్డు వెళ్లే ప్రాంతాలపై తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు నివేదికను అందజేసింది. స్వల్ప మార్పులతో ఆ నివేదికను ఉన్నతాధికారులు ఆమోదించారు. స్థానిక ఆర్అండ్బీ అధికారులు కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుమారు 13 కి.మీ. పొడువు నిర్మించనున్న బైపాస్ రోడ్డు హద్దులను గుర్తించారు. ఇక రెవెన్యూ అధికారులు రోడ్డు నిర్మించే ప్రతిపాదిత ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పట్టాభూములు ఏ మేరకు ఉన్నాయో గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయమై రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే తుది దశలో ఉంది. రెవెన్యూ అధికారుల నివేదిక అందిన తరువాత భూనిర్వాసితులు ఉంటే వారికి పరిహారం చెల్లింపు, టెండర్ల ప్రక్రియ అనంతరం ఈ పనులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. బైపాస్‌తో తీరనున్న సమస్యలు.. బైపాస్ రోడ్డుతో తాండూరులో తీవ్ర రూపం దాల్చిన వాయు కాలుష్యం తగ్గుతుంది. పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలకు ఆస్కారం ఉండదు. తద్వారా తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి తాండూరుకు, తాండూరు నుంచి ఇతర రాష్ట్రాలకు వివిధ ఉత్పత్తుల రవాణా చేసే భారీ వాహనాల రాకపోకల ప్రక్రియ పట్టణ శివారు నుంచి కొనసాగుతుంది. ఫలితంగా పట్టణంలో ట్రాఫిక్ చిక్కులు తీరుతాయి. బైపాస్ రోడ్డు ఇలా.. కోడంగల్ వైపు నుంచి కాగ్నా వంతెన దాటిన తరువాత శ్రీనివాస్ వేబ్రిడ్జి సమీపంలో ఎడమ వైపు నుంచి ఈ బైపాస్ రోడ్డు ప్రారంభమవుతోంది. ఇక్కడి నుంచి గౌతమీ స్కూల్ వెనుక నుంచి కోకట్ ప్రభుత్వ పాఠశాల పక్కగా, రైల్వే ట్రాక్ మీదుగా వెళుతుంది. అక్కడి నుంచి రాజీవ్ స్వగృహ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వెనుక నుంచి హైదరాబాద్ రోడ్డు మీదుగా బీసీ వసతి గృహం ప్రహరీగోడ పక్క నుంచి బైపాస్ రోడ్డు వెళుతుంది. బాబుమియా తండా సమీంలోని గుట్ట మీదుగా అంతారం చెరువు ప్రారంభం పాయింట్ నుంచి భూకైలాస్ దేవాలయం బయటి నుంచి చెంగోల్ చెరువు ప్రారంభ పాయింట్ పక్కగా తాండూరు రూరల్ సీఐ కార్యాలయం వెనుక నుంచి చించొళ్లి రోడ్డుకు ఈ రోడ్డు కలుస్తుంది. బైపాస్‌లో 34 వంతెనలు, ఒక ఆర్ఓబీ సుమారు 13 కి.మీ.పొడవుతో బైపాస్ రోడ్డు (బీటీ) నిర్మించనున్నాం. ఇది డబుల్ బైపాస్ రోడ్డు వెళ్లే మార్గాల్లో 34 చోట్ల వంతెనలు, కోకట్ వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తుంది. ఈ రోడ్డు వెడల్పు 7 మీటర్లు. ఈ రోడ్డుకు వంద ఎకరాలు అవసరం. రెవెన్యూ అధికారులు భూసేకరణ చేసి, అప్పగించాల్సి ఉంది. ఈ ప్రక్రియ తరువాత టెండర్లు నిర్వహిస్తాం. - శ్రీనివాస్, ఆర్అండ్బీ, డీఈఈ, తాండూరు -
నంబర్ వన్ తెలంగాణే లక్ష్యం
♦ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ♦ పటాన్చెరు నుంచి సంగారెడ్డికి ♦ బైపాస్ రోడ్డు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు నియోజకవర్గంలో శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంబర్ వన్ తెలంగాణే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పటాన్చెరు టౌన్ : తాను గురువారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటగా మొదక్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. పటాన్చెరు పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు పట్టణంలోని చిన్న వాగు వద్ద బ్రిడ్జి, పెద్ద వాగు, రామేశ్వరం బండ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావుకు, మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. అనంతరం మంత్రి తుమ్మల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మొత్తంలో 1627 కిలో మీటర్ల మేర ఇప్పటి వరకు రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు.రోడ్డులు, బ్రిడ్జల నిర్మాణ పనులను నాణ్యత పాటిస్తూ చేపట్టాలని ఆదేశించారు. నాణ్యత పాటిస్తే నిర్మాణాలు పదికాలాల పాటు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలతో ముందుకెళితే మరో మూడు సంవత్సరాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అవుతుందన్నారు. పటాన్చెరు నుంచి సంగారెడ్డికి బైపాస్ రోడ్డు : హరీశ్ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు బైపాస్ రోడ్డు నిర్మించడం వల్ల ట్రాఫిక్ కంట్రోలవుతుందన్నారు. ఇందుకు మంత్రి తుమ్మల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి నుంచి ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేను సంగారెడ్డి వరకు నిర్మించాలన్నారు. దీనివల్ల ట్రాఫిక్ తగుతుంది ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అంతే కాకుండా మండలంలో డబుల్ రోడ్లు, జిల్లాలో ఫోర్‌లేన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. గత పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంజూరు కాని నిధులు సీఎం కేసీఆర్ పాలనలో మంజూరయ్యాయని, ఒక్క మొదక్ జిల్లాకే ఈ సంవత్సరం రూ. 1460 కోట్లు నిధులు మంజూరయ్యానన్నారు. బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ ద్వారా రోడ్లు, నీటి శాఖ మంత్రులు శాఖలు కలసి పని చేస్తాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియెజికవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు అంజయ్య యాదవ్,ఆదర్శ్‌రెడ్డి, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ బండల కింద పడి ఐదుగురి మృతి
మృతుల్లో నలుగురు కూలీలు.. ప్రకాశం జిల్లా వాసులు వెంకటాచలం: గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు లారీలో ఎక్కి.. అందులోని గ్రానైట్ బండల కింద పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుల్లో నలుగురు ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. బాధితుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం చిన్న డేగర్లమూడికి చెందిన 11 మంది పొగాకు గ్రేడింగ్ పనిచేసే కూలీలు. వీరు మైసూరులోని ఫ్యాక్టరీలో పనికి వెళ్లి తిరిగి తమ గ్రామానికి వెళ్లేందుకు రేణిగుంట వరకు రైల్లో వచ్చారు. అక్కడ నుంచి బైపాస్ రోడ్డుకు చేరుకొని ఆ మార్గంలో వస్తున్న గ్రానైట్ బండల లోడు లారీ ఎక్కారు. క్యాబిన్లో ఐదుగురు, ట్రక్కులో క్యాబిన్‌కు బండలకు మధ్య ఖాళీలో ఆరుగురు కూర్చున్నారు. తరువాత నాయుడుపేట వద్ద ఓజిలి మండలం కురుగొండకు చెందిన ముగ్గురు నెల్లూరులో ఓ వివాహానికి వెళ్లేందుకు అదే లారీ ఎక్కి క్యాబిన్‌కు, బండలకు మధ్య కూర్చున్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపానికి చేరుకునే సరికి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో లారీ కుదుపునకు గురై గ్రానైట్ బండలు ముందుకు పడిపోయాయి. దీంతో క్యాబిన్‌కు, రాళ్లకు మధ్య కూర్చుని ఉన్న తొమ్మిదిమందిలో డేగర్లమూడికి చెందిన రమాదేవి (45), వీరలక్ష్మి (30), సుబ్బాయమ్మ (30), నాగేంద్రమ్మ (47) దుర్మరణం చెందారు. ఓజిలి మండలం కురుగొండకు చెందిన పుల్లయ్య (47) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మిగిలిన వారు గాయపడ్డారు. బాధితుల్ని 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కురుగొండకు చెందిన రమణయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
హైదరాబాద్ శివారులో ఘటన.. మృతుల్లో నలుగురిది ఒకే కుటుంబం హైదరాబాద్: శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. నగరంలోని కాటేదాన్ గణేష్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్ స్థానికంగా కాంగ్రెస్‌పార్టీలో క్రియాశీల నాయకుడు. ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తన సాగుభూమిలో జరుగనున్న ఓ పూజా కార్యక్రమానికి బంధువులతో కలసి కారులో బయలుదేరారు. షాద్‌నగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తోన్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న శ్రీనివాస్‌గౌడ్ కుమారులు చంద్రప్రతాప్ గౌడ్(22), సూర్యప్రణయ్ గౌడ్(20), కారు డ్రైవర్ రామాంజనేయులు (22), తమ్ముడి కుమారుడు మేహ ష్ గౌడ్(19), అక్క కుమారుడు సాయితేజ గౌడ్(12)లు మృతి చెందారు. చిన్న కుమారుడు మేఘప్రతాప్ గౌడ్(16)కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గణేశ్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులను పోగొట్టుకోవడంతో శ్రీనివాస్‌గౌడ్ రోదనకు అంతులేకుండా పోయింది. -
నాణ్యత ‘బైపాస్’
పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పుష్కర పనులకు అప్పుడే తూట్లు పడుతున్నాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో ఈ దుస్థితి దాపురించింది. పాలకొల్లులో బ్రాడీపేట మీదుగా నిర్మించిన బైపాస్ రోడ్డు అధికారుల తీరును వెక్కిరిస్తోంది. పుష్కరాల నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో రూ.70 కోట్ల వ్యయంతో పంచాయతీరాజ్, మునిసిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే బ్రాడీపేటలోని ఒకటిన్నర కిలోమీటర్ల బైపాస్ రోడ్డును వెడల్పుచేసి, సెంట్రల్ డివైడర్ నిర్మించారు. ఇందుకోసం రూ.2.50 కోట్లు వెచ్చించారు. దీనిని ఈనెల 10న రవాణా, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అట్టహాసంగా ప్రారంభించారు. మూడు రోజులు గడవకుండానే ఆ రోడ్డు దిగబడిపోయింది. శుక్రవారం ఆ రహదారి మీదుగా బియ్యం లోడుతో వెళుతున్న లారీ వెనుక చక్రాలు రోడ్డుపై దిగబడిపోయాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో రహదారులను అధ్వానంగా తయారు చేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లను పటిష్టంగా నిర్మిస్తున్నామని ఈ రహదారిని ప్రారంభించిన సందర్భంలో మంత్రి శిద్ధా రాఘవరావు గొప్పగా చెప్పారు. ఆయన మాట్లాడి వెళ్లిన కొద్దిగంటల్లోనే దిగబడిన రహదారి ఈ పనుల్లో డొల్లతనాన్ని బయటపెట్టింది. క్వాలిటీ కంట్రోల్ దృష్టి సారించాలి బైపాస్ రోడ్డులో లారీ దిగబడిన ప్రాంతాన్ని పరిశీలించిన పాలకొల్లు మునిసిపల్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు యడ్ల తాతాజీ విలేకరులతో మాట్లాడుతూ.. తూతూమంత్రంగా పనులు చేయడం వల్లే రోడ్డు దిగబడిపోయే దుస్థితి దాపురించిందన్నారు. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన పుష్కర పనుల్లో నాణ్యత కొరవడిందని ఎప్పటినుంచో చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి పనులపై క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రత్యేక దృష్టి సారించాలని, పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
సీఐ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
విశాఖపట్నం: అనకాపల్లి మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద సీఐ వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సీఐకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. (అనకాపల్లి) -
సిరిసిల్లలో ఇల్లు కట్టుకుంటా: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఇంటి నిర్మాణానికి 26 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. శుక్రవారం ఆయన స్వయంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వీవీ.నాయుడు, జిల్లా రిజిస్ట్రార్ కె.రమణారావు, సబ్ రిజిస్ట్రార్ డి.అశోక్ మంత్రితో డాక్యుమెంట్లపై సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇందుకోసం రూ.24,024 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. సిరిసిల్లలో కేటీఆర్ తొలిసారి 2009లో పోటీ చేసినపుడు స్థానికంగానే నివాసం ఉంటానని హామీ ఇచ్చారు. కానీ 2014 ఎన్నికల తర్వాత తన హామీని నెరవేర్చుకుంటున్నారు. -
డేంజర్ లైన్
నక్కపల్లి : హైవేపై ప్రయాణం క్షణక్షణం భయం భయంగా ఉంటుంది. ముఖ్యంగా వేంపాడు నుంచి పాయకరావుపేట బైపాస్‌రోడ్డు వరకు నాలుగులైన్ల జాతీయరహదారి పేరు చెబితే దడపుడుతుంది. వాహన చోదకులు బెంబేలెత్తిపోతారు. పదిహేను కిలోమీటర్ల ఈ రహదారిపై నిత్యం ఎక్కడో ఒక చోట రక్తసిక్తమవుతోంది.ముఖ్యంగా వేంపాడనుంచి గొడిచర్ల వరకు ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో వేంపాడు, ఉద్దండపురం, గొడిచర్ల,నామవరం, సీతారాంపురం, పాయకరావుపేట,తదితరప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదాల్లో సుమారు 30 మంది చనిపోయారు. 80 మంది వరకు క్షతగాత్రులయ్యారు. రెండేళ్లక్రితం నామవరం పెట్రోలు బంక్‌సమీపంలో ఆగిఉన్న లారీని ఐషర్‌వ్యాన్ ఢీకొని తూర్పుగోదావరి జిల్లాకు చెంది 10మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నెల రోజుల్లో ఇదే పెట్రోలు బంక్‌వద్ద లారీ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. గుంటపల్లి నుంచి నామవరం జాతీయరహదారి పైకి వచ్చేటప్పుడు కూడా పలుమార్లు ప్రమాదాలు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. ఏడాదిక్రితం ఉద్దండపురం వద్ద ట్రాక్టర్‌ను ఢీకొట్టి మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మరణించారు. గతేడాది గొడిచర్ల వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఒకరు, టూవీలర్‌పై వెళ్తున్న ఒకరు లారీలు ఢీకొట్టి మరణించారు. అక్కడే గతేడాది లారీ బోల్తాపడి ఒకరు చనిపోగా ఇద్దరు గాయాలపాలయ్యారు. ఒడ్డిమెట్ట సమీపంలో వ్యాన్బోల్తాపడి ఒకరు మరణించగా ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఇదేప్రాంతంలో టాటాఏసీ వ్యాన్ బోల్తాపడి పలువురు గాయాలయ్యాయి. ఉద్దండపురంలోనే ఒక చిన్నారి బస్సుఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది.తాజాగా శనివారం గొడిచర్ల సమీపంలో ఆగిఉన్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. ఇలా చెప్పుకుంటూపోతే గొడిచర్ల, ఉద్దండపురం, నామవరం ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలుకోల్పోయిన వారే అధికం. ఇక ఆటోలు బోల్తాపడటం, ఆగిన ఆటోను లారీ ఢీకొట్టడం వంటి సంఘటనలయితే చెప్పక్కర్లేదు. గొడిచర్ల, ఉద్దండపురం నూకాలమ్మ గుడిప్రాంతం, వేంపాడు,ఉద్దండపురం మధ్య, చర్చివద్ద మలుపులు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణించేవారు, మద్యం సేవించి వాహనాలునడిపేవారి వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయరహదారి పక్కనే ఉన్న డాబాలు, కాఫీ హోటళ్ల వద్ద, ఎక్కడి పడితే అక్కడ రాత్రిళ్లు ఇష్టాను సారం లారీలను నిలిపివేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేసినప్పటకీ ప్రయోజనం లేకుండాపోతోంది. వాహనాలను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన ప్రమాదానికి పొగమంచుతోపాటు, డ్రైవింగ్‌చేస్తున్న వ్యక్తి మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే కారణంగా తెలుస్తోంది. రోడ్డుప్రమాదాల నివారణకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్పోలీసులు తరచూ గస్తీ ఏర్పాటుచేసి మితిమీరిన వేగంతోప్రయాణించే వాహనాలను గుర్తించి తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఎప్పటికవునో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ బైపాస్ రోడ్డుకు గ్రహణం వీడ టం లేదు. 30 మాసాలలో పూర్తి కావాల్సిన ఈ పను లు ఆరేళ్లు కావస్తున్నా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మిగిలిపోయాయి. నిజామాబాద్ ప్ర జల వినతి మేరకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బైపాస్ రోడ్డు నిర్మాణాని కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.11 కి లోమీటర్ల పొడవున రెండు వరసల రహదారితోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మా ణం కోసం రూ.80 కోట్లు మంజూరు చేసారు. మొద టి విడతగా రూ.50 కోట్లు కూడా విడుదలయ్యాయి. అయితే, అన్ని అర్హతలతో ఈ టెండరును పొందిన కాంట్రాక్టర్‌పై రాజకీయంగా ఒత్తిడి తెచ్చిన నిజామాబాద్‌కు చెందిన ఉప గుత్తేదారు పనులను దక్కిం చు కున్నట్లు చెబుతున్నారు. ఆయన పనులు చేపట్టి ఆరే ళ్లు పూర్తయ్యాయి. అధికారులు మూడు విడతలుగా గడువును పొడిగించారు. పనులు మాత్రం పూర్తి కాలేదు. ఇదీ అసలు సంగతి నిజామాబాద్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజ లకు సౌకర్యంగా ఉండేందుకు బైపాస్ రహదారిని ని ర్మించాలని భావించారు. వెనువెంటనే స్థానిక అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతి రాగానే టెండర్లు నిర్వహించి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. మొ త్తం రూ. 80 కోట్ల పనులను 30 నెలలలోగా పూర్తి చే యాలని ఆదేశించారు. దీని ప్రకారం 2011 ఆగస్టు 18లోగా ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. కాం ట్రాక్టు పొందిన సంస్థ అయితే ఇప్పటికే ఈ పనులు పూర్తయ్యేవనీ, రాజకీయ ఒత్తిళ్లతో పనులు పొందిన ఉప గుత్తేదారు నిర్లక్ష్యం, ఆర్అండ్బీ అధికారుల ఉ దాసీనతతో ‘పుష్కర’కాలం పట్టే పరిస్థితి దాపురిం చిందని పలువురు ఆరోపిస్తున్నారు. చేసేది లేక ప్రభుత్వం నిర్మాణ గడువును 31ఆగస్టు 2013 నాటికి, రెండోసారి 31మార్చి 2014 నాటికి పెంచింది. అయి నా ఫలితం లేకపోవడంతో ముచ్చటగా మూడోసారి 30 సెప్టెంబర్ 2014కు పెంచింది. ఈ నెలాఖరు వర కు కూడా పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. భూసేకరణ పూర్తి అయినా! 2013 ఆగస్టు వరకు భూసేకరణను సాకుగా చూపిన ఉప గుత్తేదారు, ఆ అడ్డంకులు తొలగినా నిర్మాణ ప నులపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. రూ.80 కోట్లలో దాదాపు రూ.34 కోట్లు భూసేకరణకే కేటాయించారు. అధికారుల సమాచారం మేరకు 2013 అక్టోబర్ నాటికి ఇందులో రూ.25.05 కోట్లు చెల్లించారు. 2014 జూన్ వరకు రూ.17.33 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. రెండోసారి గడువు పెంచిన తర్వాత నామమాత్రంగా పనులు చేసిన ఉప గుత్తేదారు ఆ తర్వాత వదిలేశారు. తాజాగా పెరిగిన పనుల విలువ ప్రకారం అంచనా రూ.66.30 కోట్లు కావడం, ఈ నెల 30తో మూడోసారి గడువు కూడ ముగియనుండటంతో పనుల వేగం పెంచినట్లుగా చెప్తున్నారు. నాలుగోసారి కూడ గడువు కోరే ప్రయత్నంలో ఉప గుత్తేదారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా బైపాస్ నిర్మాణం పనుల వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
శ్రీకాళహస్తిలో వ్యక్తిని హత్య చేసిన దుండగులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో గోపీ అనే వ్యక్తిని కొందరు దుండగులు హత్య చేశారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గోపీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మృతుడు శ్రీకాళహస్తి పట్టణంలో ఆప్టికల్ షాపు నిర్వహిస్తున్నాడని తెలిపారు. మృతుడికి సంబంధించి వివరాల కోసం కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
కోలాహలంగా ఏడు గంగల జాతర
=ఆకట్టుకున్న గంగమ్మ అలంకరణలు =ప్రత్యేక ప్రభలలో ఊరేగింపులు =అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు =భారీ పోలీసు బందోబస్తు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం ఏడు గంగల జాతర కోలాహలంగా జరిగింది. విద్యుత్ దీపాలంకరణ లు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలో ఒకేరోజు ఏడు గంగమ్మలతో జాతర జరగడం విశేషం. జాతర కమిటీ సభ్యులు అలంకరించిన చప్పరాలు మంగళవారం రాత్రి ముత్యాలమ్మ గుడివీధిలో ఉన్న గంగమ్మ ఆల యానికి చేరుకున్నాయి. పూజారులు అమ్మవారికి కుంభం వేసి అభిషేకాలు చేశారు. ఆ తర్వాత గంగమ్మలు బయలుదేరాయి. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. మా మూలుగా సూర్యోదయానికి ముందే గంగమ్మలు రావాల్సి ఉంది. అయితే బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో నిర్దేశించిన ప్రాంతాలకు చేరుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఉదయం నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి గంగమ్మలను దర్శించుకున్నారు. నిర్వాహకులు పోటీలు పడి గంగమ్మలను అలంకరించారు. కులమతాలకు అతీతంగా ప్రజ లు గంగమ్మలను దర్శించుకోవడం విశేషం. సాయంత్రం వరకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోకి భారీ వాహనాలు, బస్సులు రాకుండా బైపాస్‌రోడ్డు ద్వారా మళ్లించారు. అయితే భక్తులు బైపాస్‌రోడ్డు నుంచి ఆలయానికి చేరుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డారు. వివిధ రూపాల్లో అలంకరణలు ఏడు గంగమ్మలను వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని పెండ్లిమండపం వద్ద పొన్నాల మ్మకు (పెద్దక్క) అభయవైష్టవిదేవి అలంకరణ, ఊరేగింపునకు పద్మవైకుంఠప్రభ (చప్పరం)తయారు చేశారు. అలాగే బేరివారిమండపం వద్ద ముత్యాలమ్మకు ధనలక్ష్మి అలంకరణ, శ్రీకృష్ణ జగన్నాథ ప్రభ, పూసలవీధి కావమ్మకు భవానీదేవి అలంకరణ, పుష్పప్రభ, సన్నిధివీధిలోని అంకాళమ్మకు గౌరీభవాని అలంకరణ, శివనాగదేవత పంచప్రభ, తేరువీధిలో నల్లగంగమ్మకు అంబికాదేవి అలంకరణ, సూర్యదేవత మణిమండప ప్రభ, గాంధీవీధి అంకమ్మకు గాయత్రిదేవి అలంకరణ, సప్తశక్తి విశ్వరూపప్రభ, కొత్తపేటలోని భువనేశ్వరి అమ్మవారికి రేణుకాంబదేవి అలంకరణ, ఆదిశేష ప్రభను తయారుచేశారు. అమ్మవారి ఊరేగింపు ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో పట్టణమంతా కోలాహలంగా కనింపించింది. -
శుభకార్యానికి వెళ్తూ... అనంత లోకాలకు
కోదాడటౌన్, న్యూస్‌లైన్: వారు అరగంటలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేవారు.. ఇంతలోనే విధి వక్రీకరించింది.. మృత్యువు లారీ రూపంలో ఎదురుపడి ఇద్దరి ప్రాణాలను బలిగొంది.. ఈ ఘటన కోదాడ బైపాస్‌రోడ్డులో గుడిబండ ఫైఓవర్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పోలీ సులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని బ్రాడిపేటకు చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు (28), పునుగుపాటి వెంకటేశ్వరరావు (29)లు కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేటలోని తమ బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నారు. కోదాడ బైపాస్‌రోడ్డు వద్దకు రాగానే ముందున్న లారీడ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వీరికారు వేగంగా వెళ్లి లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వడ్లమూడి వెంకటేశ్వర్లు, పునుగుపాటి వెంకటేశ్వరరావులు అక్కడికక్కడే మృతిచెందగా వడ్లమూడి వెంకటేశ్వర్లు భార్య విజయకుమారికి తీవ్రగాయాలయ్యాయి. ఈమెను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా కోదాడ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మృతదేహాలకు కోదాడ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. వడ్లమూడి వెంకటేశ్వర్లు తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి .. చిలుకూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన చిలుకూరులోని హరిజనాడలో శనివారం వెలుగులోకి వచ్చింది. చిలుకూరుకు చెందిన ముదిగొండ కాశయ్య ఆలియాస్ యర్రయ్య (39) శుక్రవా రం హుజుర్నగర్లో నివాసముంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత లారీలో తిరుగుప్రయాణమై హరిజనవాడలో దిగాడు. నడుచుకుంటూ వస్తుండగా హుజుర్నగర్ వైపు నుంచి వస్తున్న లారీ కాశయ్యను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. మృతదేహానికి కోదాడ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిం చారు. మృతుడి భార్య రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. నాలుగేళ్ల క్రితం కొడుకు.. కాశయ్య కుమారుడు వీరబాబు కూడా నాలుగేళ్ల క్రితం చిలుకూరు బస్టాండ్ వద్ద లారీ దిగుతుండగా వెనక నుం చి వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. అదే తరహాలో కాశయ్య కూడా మృతిచెందడంతో కుటుం బ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాశయ్య మృతదేహానికి పెద్ద కుమార్తె నాగమణి దహన సంస్కారాలు నిర్వహించింది.