అగ్రిగోల్డ్ బాధితులు రాస్తారోకో: అరెస్ట్ | agrigold victims protests at bypass road in ongole | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ బాధితులు రాస్తారోకో: అరెస్ట్

Published Sat, Oct 8 2016 11:39 AM | Last Updated on Mon, May 28 2018 3:04 PM

agrigold victims protests at bypass road in ongole

ఒంగోలు : అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఆ సంస్థ బాధితులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ... అగ్రిగోల్డ్ బాధితులు శనివారం ప్రకాశం జిల్లా సౌత్ బైపాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. బాధితులకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

ఈ రాస్తారోకోలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, సింగరాజు వెంకట్రావ్, వెంకటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలతోపాటు అగ్రిగోల్డ్ బాధితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి... ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.  

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement