nunna
-
నున్నలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
ఈ ఎంబీఏ కోడిపుంజు రూ.3 లక్షలు
సాక్షి, అమరావతి: ఎంబీఏ చేశాడు... కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. నెలకు రూ.లక్ష జీతం.. వారానికి ఐదు రోజులే ఉద్యోగం.. ఇంతకు మించి ఎవరైనా ఈ రోజుల్లో కోరుకునేది ఏముంటుంది?. కానీ, అతను అలా అనుకోలేదు. వీకెండ్లో నాటుకోళ్ల వ్యాపారం షురూ చేశాడు. తర్వాత ఏకంగా ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం పైనే దృష్టి పెట్టాడు. అది ఇప్పుడు రూ.2 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదగడమే కాదు.. పలువురికి ఉపాధి కల్పిస్తోంది. నాటుకోళ్ల పెంపకంలో గుర్తింపు పొందిన ఈ యువకుడి పేరు ప్రదీప్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నున్న గ్రామవాసి. ఎంబీఏ చేసిన ప్రదీప్.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేసేవాడు. వీకెండ్లో కోళ్ల పెంపకంలో గడిపేవాడు. ఆసక్తి పెరగడంతో ఉద్యోగాన్ని వదిలి గుంటకోడూరులో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మార్కెటింగ్ ఇబ్బందులతో మొదట ఆదాయం తక్కువగా ఉండేది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు. వ్యాపారం పెరగడంతో నున్నలో ప్రదీప్ ఫామ్స్ అండ్ హేచరీస్‌తో పాటు చికెన్ వరల్డ్ కంపెనీని ప్రారంభించాడు. నాటుకోళ్లు, కడక్‌నాథ్ కోళ్లు, సిల్కీ, బీవీ 380, ఆర్ఐఆర్ జాతులతో పాటు టర్కీ, గిన్నికోళ్లు బాతుల పెంపకాన్ని షురూ చేశాడు. ప్రస్తుతం ఈ ఫామ్‌లో వేయికి పైగా కడక్‌నాథ్ కోళ్లు, 2వేలకు పైగా ఇతర జాతులున్నాయి. కోళ్ల పెంపకం చేస్తున్న ప్రదీప్ కొత్తగా పందెం కోళ్ల ఫ్యాక్టరీ... తాజాగా ప్రదీప్ పందెం కోళ్ల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఫిలిప్పీన్స్ పెరువియన్ జాతి కోళ్లను దిగుమతి చేసుకోవడమే కాదు.. దేశీయ పందెం కోళ్లతో క్రాసింగ్ చేయించి పెరు కోళ్లను అభివృద్ధి చేస్తున్నాడు. వీటికి బలం, వాయువేగం ఎక్కువ. వీటి గుడ్డును రూ.3 వేలకు విక్రయిస్తుండగా, రసంగి, గేరువా, సీతువా, వైట్నాట్, బ్లాక్‌నైట్ వంటి పెరువియన్ జాతి కోడిపుంజుల ధర అయితే రూ.3 లక్షల పైమాటే. ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 వేలకు పైగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే పందెం కోళ్లున్నాయి. కోళ్ల పెంపకానికి ముందుకొచ్చే యువతకు 30 శాతం సబ్సిడీతో కోళ్లను ఇవ్వనున్నట్లు చెప్పాడు. విదేశాలకు రవాణా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలకు డెలివరీ చేస్తున్నారు. ఇటీవలే పాకిస్తాన్, నేపాల్ దేశాలకూ 500 కడక్‌నాథ్ కోడి పిల్లలను ఎగుమతి చేశారు. కోళ్లతో పాటు అంతరించిపోతున్న దేశీయ కుక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జర్మన్ షిపర్డ్, లేబర్, ముథోల్, డాబర్‌మెన్ వంటి జాతులతో పాటు అంతరించిపోతున్న జాతులకు చెందిన రాజపాలయం, జోనంగి జాతి కుక్కలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా 50 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ప్రదీప్ ఫామ్స్ పరోక్షంగా మరో వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారి కోసం ప్రతీ మంగళవారం అవగాహన కల్పిస్తున్నారు. ప్రదీప్‌కు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చింది. -
విజయవాడ: అయ్యో.. తల్లీ ఎంతపని చేశావు!
సాక్షి, విజయవాడ: నున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిందో తల్లి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురూ మృత్యువాతపడ్డారు. వివరాలు.. సురేంద్ర అనే వ్యక్తి కోటగట్టు సెంటర్లో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. పగలు చిల్లరకొట్టు వ్యాపారం చేస్తూ, రాత్రి సమయంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా కుటుంబం నిరాశలో కూరుకుపోయింది. ఈ క్రమంలో తెల్లవారుజామున సురేంద్ర ఇంటికి వచ్చే సమయానికి భార్య, ఇద్దరు పిల్లలు పురుగుల మందు సేవించి, నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడటం గమనించాడు. వెంటనే వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ముగ్గురూ మరణించారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది. ఈ ఘటనపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారని పేర్కొన్నారు. చదవండి: హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్ 4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం -
వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, విజయవాడ: వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించడం విజయవాడలో కలకలం రేపింది. నగర శివార్లలోని నున్నలో కొందరు యువకులు ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు మహిళలతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 290,294 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
నున్న (గన్నవరం) : నున్న సమీపంలో ఉన్న వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆంధ్ర చీఫ్ భరత్‌జీ దేశ సంస్కృతి, రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్ధాంతాల గురించి వివరించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతం, నాయకత్వ నిర్మాణం, సుశిక్షుతులైన నాయకులను తయారు చేయడంపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఆర్ రవీంద్రరాజు వివరించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు యుగంధర్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
మా శవాలపై రోడ్డు వేయండి
నున్న(విజయవాడరూరల్)ః ‘పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో చట్టబద్ధంగా ఈస్థలాలుకొని ఇళ్లు, ప్లాట్లు వేసుకున్నాం. రోడ్డు కోసమని ఇళ్లను కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేస్తారా?, నమ్మి ఓటేసినందుకు చేసే ఉపకారం ఇదా?‘అని ప్రభుత్వ అరాచక చర్యలను నిరసిస్తూ మహిళలు దుమ్మెత్తి పోశారు. శనివారం నున్న లోకల్ బైపాస్ రోడ్డు నిర్మాణం పనుల కోసమని ఆర్అండ్బీ అధికారులు పోలీసును వెంటేసుకుని ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా ఇళ్ల తొలగింపు చేపట్టడంతో బాధితులు భగ్గుమన్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో నున్న రూరల్ పోలీసులు, అజిత్సింగ్నగర పోలీసులు రంగప్రవేశం చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇళ్ళు నిర్మించుకొని జీవిస్తున్న సాతులూరి వెంకటేశ్వరమ్మ,అతని కుమారులు నలుగురిని ఇళ్ళు వదిలివెళ్ళాలని పోలీసులు భయపెట్టారు. 2008 లో హైకోర్టు స్టేటస్కో ఇచ్చిందని రోడ్డు నిర్మాణానికి మా ఇళ్ళను తొలగించబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఖాళీచేయమని చెప్పడం ఏమిటని వెంకటేశ్వరమ్మ కుమారులు అధికారులను కలిసి కోర్టు ఉత్తర్వులను అందచేశారు. ఆ కుటుంబసభ్యులతో పాటు సమీపంలో ఫ్లాట్లుకొన్నవారు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవిన్యూఅధికారులు, సర్వేయర్ సుబ్బారావులు రోడ్డు ఎలైన్మెంటు ప్రకారం ఆర్అండ్బి అధికారులకు మార్కింగ్ చేసి అప్పగించడంతో వారు రోడ్డు పనులను జేసిబి మిషనుతో ప్రారంభించారు. ఆ సందర్భంలో స్ధలాలున్న మహిళలు మిషనుకు అడ్డుగా కూర్చువడంతో పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వ్యానులోకి ఎక్కించారు. లక్షలాది రూపాయలను అప్పుచేసి స్థలాలను కొనుగోలు చేశామని, ఇంకా అప్పుతీరలేదని మహిళలు బోరున విలపించారు. నష్టపరిహారం చెల్లించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మమ్మల్ని చంపి శవాలపై రోడ్డు నిర్మించుకోండని మహిళలు శాపనార్థాలు పెట్టారు. నిరసన తెలిపిన నిమ్మగడ్డ కుమారి, సునీత, లలితకుమారి, సాంబశివరావు, షేక్ ఖాశీంబి, శంకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుతలను పోలీసుస్టేçÙన్కు తరలించాక ఆర్అండ్బి అధికారులు రోడ్డు పనులను మార్కింగ్ చేసి ప్రారంభించారు. నున్న రూరల్ సీఐ సాహేరాబేగం, అజిత్ సింగ్‌నగర్ సీఐ ప్రసాదరావుల ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాౖటెంది. రోడ్డుౖ అలెన్మెంటులో సర్వే నెంబర్ 751/2 లో రెండెకరాల 36 సెంట్లు, 751/1బిలో 90 సెంట్ల భూమి అర్బన్‌ల్యాండ్ సీలింగ్ భూమని సర్వేయర్ సుబ్బారావు చెప్పారు. ఆర్అండ్బి రోడ్డు నుంచి 430 మీటర్ల ను మార్కింగ్ చేసి భూమిని అప్పగించినట్టు ఆయన చెప్పారు. పుష్కరాలకు రోడ్డు పూర్తి చేస్తాం నున్న లోకల్ బైపాస్‌రోడ్డు నిర్మాణం పనులను పుష్కరాలకు పూర్తిచేస్తామని ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సత్యనారాయణ చెప్పారు. వంద అడుగుల వెడల్పు,430 మీటర్ల పొడవునా రోడ్డును నిర్మించాల్సివుందన్నారు. – ఆర్అండ్బి ఇఈ -
నున్నలో వ్యక్తి ఆత్మహత్య
నున్న (విజయవాడ రూరల్) : నున్న గ్రామంలో ఓ వ్యక్తి బుధవారం తాను ఉంటున్న గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన మాంజీ ఉపేంద్ర (35) నున్న గ్రామంలోని చెప్పుల కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈయనకు భార్య మధుమాలతి, రెండేళ్ల కుమార్తె, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. ఉపేంద్ర గ్రామానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డి ఇంటిలో మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంటిలోనే మరో పోర్షన్లో కోల్‌కతాకు చెందిన రంజిత్రాణా కూడా ఉంటున్నారు. ఉపేంద్ర రోజూ మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండేవాడు. మంగళవారం ఉదయం చెప్పల కంపెనీకి పనికని వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాలేదు. రాత్రికి కంపెనీలో ఓటీ చేస్తున్నాడేమోనని భావించిన భార్య పిల్లలతో కలిసి భోజనం చేసి పడుకుంది. ఉదయం సుమారు 6.30 గంటలకు లేచి చూడగా ఉపేంద్ర చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె పక్కనే ఉంటున్న రంజిత్రాణాకు విషయం చెప్పగా ఆయన ఇంటి యజమానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఉరి వేసుకున్న గదిలోపల గడియ పెట్టి ఉండడంతో గ్రామ పెద్దలతో కలిసి పోలీసులు తలుపులు పగులగొట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నున్న రూరల్ పోలీసు స్టేషన్ సీఐ సహేరాబేగం ఆధ్వర్యంలో ట్రెయినింగ్ ఎస్ఐ శ్రీనివాస్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.