
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించడం విజయవాడలో కలకలం రేపింది. నగర శివార్లలోని నున్నలో కొందరు యువకులు ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు మహిళలతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 290,294 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment