విజయవాడ: అయ్యో.. తల్లీ ఎంతపని చేశావు! | Mother 2 Children Deceased Consuming Pesticide Nunna Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ: పురుగుల మందు తాగి తల్లీపిల్లలు మృతి

Published Mon, Apr 12 2021 6:15 PM | Last Updated on Mon, Apr 12 2021 7:52 PM

Mother 2 Children Deceased Consuming Pesticide Nunna Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిందో తల్లి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురూ మృత్యువాతపడ్డారు. వివరాలు.. సురేంద్ర అనే వ్యక్తి కోటగట్టు సెంటర్‌లో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. పగలు చిల్లరకొట్టు వ్యాపారం చేస్తూ, రాత్రి సమయంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా కుటుంబం నిరాశలో కూరుకుపోయింది. 

ఈ క్రమంలో తెల్లవారుజామున సురేంద్ర ఇంటికి వచ్చే సమయానికి భార్య, ఇద్దరు పిల్లలు పురుగుల మందు సేవించి, నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడటం గమనించాడు. వెంటనే వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ముగ్గురూ మరణించారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది. ఈ ఘటనపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారని పేర్కొన్నారు. 

చదవండి: హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్‌
4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement