
నూతన మద్యంపాలసీకి వ్యతిరేకంగా నిరసన
అనంతపురం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా అనంతపురం జిల్లా కేంద్రంలో మహిళలు సోమవారం నిరసనకు దిగారు. ఐద్వా ఆధ్వర్యంలో పలువురు మహిళలు మద్యం టెండర్ల కేంద్రాల ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.