తీరనున్న గ్రేటర్ వరంగల్ ప్రజల దాహార్తి
ఏటూరునాగారం: మంచినీళ్ల కోసం గ్రేటర్ వరంగల్ వాసులు పడుతున్న ఇబ్బందులు అతి త్వరలో తీరనున్నాయి. ఏటూరునాగారం మండలంలోని దేవాదుల నుంచి మంగళవారం నీటి పంపింగ్ ప్రారంభంకానుంది. ఇందుకు వీలుగా అధికారులు గోదావరి ఒడ్డున 16 మోటార్లను ఏర్పాటు చేశారు.
గోదావరి నీటిని ఫోర్‌బేలకు మళ్లించి అక్కడి నుంచి భీంఘన్‌పూర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి పులకుర్తి, ధర్మసాగర్‌కు నీరు చేరుతుంది. అక్కడి నుంచి గ్రేటర్ వరంగల్ ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. గురువారం నాటికి వరంగల్ ప్రజలకు తాగు నీరు అందనుంది. దీంతో నీటి కష్టాలు తీరనున్నాయి.