ఆరు రోజులుగా తాగునీరు బంద్‌ | Drinking water shutdown | Sakshi
Sakshi News home page

ఆరు రోజులుగా తాగునీరు బంద్‌

Published Mon, Jul 18 2016 6:14 PM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

బోరు వద్ద నీళ్ల కోసం క్యూ - Sakshi

బోరు వద్ద నీళ్ల కోసం క్యూ

కె.కొత్తపల్లి గ్రామంలో ఆరు రోజుల నుంచి తాగునీటి సరఫరా బంద్‌ అయ్యింది. ఆలూరు శివారులో ఉన్న సంప్‌ నుంచి ఈ గ్రామానికి తాగునీటి సరఫరా కావాల్సి ఉంది. సంప్‌ వద్ద తాత్కాలికంగా పని చేస్తున్న వర్కర్‌ ఇటీవల విధుల నుంచి తప్పుకొన్నాడు.


అతని స్థానంలో మరొకరిని నియమించే విషయంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు పొలాలకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement