
రోడ్డుపైన లీకేజ్ నీటిని పట్టుకుంటున్న దృశ్యం
వీరబల్లి: మండలంలోని మట్లి వడ్డేపల్లిలో తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నామని ఆ గ్రామప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి రోళ్లమడుగు నీరు రాకపోవడంతో పంచాయతీలోని వాటర్‌స్కీంతోనే కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పైప్‌లైన్ పగిలిపోవడంతో అక్కడే పట్టుకోవాల్సి వస్తోందన్నారు. మరికొందరు చేతిపంపులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. సుమారు వంద ఇళ్లవరకు జీవనం సాగిస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవతీసుకుని తమ ఇళ్లవద్ద కుళాయిలు వేయించి మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment