రాస్తారోకో చేస్తున్న భగత్‌సింగ్ కాలనీవాసులు
రెబ్బెన (కుమురం భీం): గత వారం రోజులుగా గోలేటి పరిధిలోని భగత్‌సింగ్ నగర్ కాలనీలకు నీటి సరాఫరా నిలిచిపోవటంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. సింగరేణి రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి వా హనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజు లుగా కాలనీలకు తాగునీటి సరాఫరా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలన్నా స్నానాలు చేసేందుకు బిందెడు నీళ్లు లేకుండా పోయాయన్నారు. దూరంగా ఉన్న చేతిపంపుల నుంచి తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చుకుంటున్న రోజు వారి అవసరాలకు నీళ్లు దొ రకటం లేదన్నారు. పంచాయతీ సిబ్బంది సమ్మె పేరుతో కాలనీలకు నీటి సరాఫరా పూర్తిగా నిలిచిపోయిన అధికారులెవరు పట్టించుకోవటం లేద న్నారు.
వారం రోజులుగా ప్రజలందరూ నీళ్ల కో సం అవస్థలు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పంచాయతీ సి బ్బంది సమ్మె చేపడితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలం అ య్యారని అన్నారు. సుమారు ఆరగంటకు పైగా వాహనాలను అడ్డుకోవటంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీం తో సమాచారం అందుకున్న సీఐ రమణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో చే యటం సరికాదని పోలీస్ యాక్ట్ అమలులో ఉ న్నందుకు ధర్నాలు, రాస్తారోకోలు చేయటం సరికాదన్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూ స్తామని హామీ ఇవ్వటంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment