Basara IIIT Students Hunger Protest In Campus Mess - Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ ఆందోళన.. రాత్రంతా విద్యార్థుల జాగారం

Published Sun, Jul 31 2022 9:37 AM | Last Updated on Sun, Jul 31 2022 1:17 PM

Basara IIIT Students Hunger Protest In Campus Mess - Sakshi

బాసర: బాసర ఆర్జీయూకేటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఫుడ్‌ పాయిజన్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టటంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ‍్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు..  నేడు ట్రిపుల్‌ ఐటీ సందర్శించనున్నారు ఎంపీ సోయం బాపూరావు.

ఇదీ చదవండి: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement