iiit students
-
అనారోగ్యం బారిన పడిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
బాసర ట్రిపుల్ ఐటీలో వేధింపుల కలకలం
-
బాసర ట్రిపుల్ ఐటిని పరిశీలించిన గవర్నర్ తమిళిసై
-
రాత్రంతా మెస్‌లోనే విద్యార్థుల జాగారం.. ఉద్యమం ఉధృతం!
బాసర: బాసర ఆర్జీయూకేటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టటంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు.. నేడు ట్రిపుల్ ఐటీ సందర్శించనున్నారు ఎంపీ సోయం బాపూరావు. ఇదీ చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి -
మరోసారి ఆందోళన బాటలో బాసర IIIT విద్యార్థులు
-
ప్రతిభావంతులు.. పల్లెటూరి పిల్లలు
నూజివీడు: పల్లెటూరి పేద పిల్లలు.. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వారికి తీసిపోని రీతిలో ప్రతిభ కనబరుస్తున్నారు. బడా కంపెనీలకు ఎంపికవుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ ఇది. పల్లెటూళ్లలో పేద కుటుంబాల్లో పుట్టిన వీరంతా పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. సన్నకారు రైతులు, కూలీలు, గుమాస్తాలు వంటి చిరుద్యోగుల పిల్లలైన వీరు పదో తరగతిలో ప్రతిభ కనబరిచి, ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. తామేమిటో నిరూపించుకుని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2016–22 బ్యాచ్ విద్యార్థులు 699 మంది ఇలా పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు ఎంపికయ్యారు. గ్రామీణ పేద వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల ఆశయాన్ని నెరవేర్చారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో క్యాంపస్ సెలక్షన్స్ విద్యార్థులకు ప్లేస్మెంట్లు కల్పించేందుకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కెరీర్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రత్యేక కృషి చేస్తోంది. విద్యార్థులకు నిరంతరం మాక్ టెస్ట్‌లు, ఇంటర్వూ లు నిర్వహిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడి ప్లేస్మెంట్లు నిర్వహిస్తోంది. ఈ ఏడాది 61 ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్లేస్మెంట్లు నిర్వహించాయి. ఏడాదికి కనిష్టంగా రూ.3.60 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ప్యాకేజీతో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. బెంగళూరుకు చెందిన జస్పే టెక్నాలజీస్ రూ.27 లక్షలు, డిమాండ్ వర్క్ టెక్నాలజీస్ రూ.24 లక్షలు, అన్‌లాగ్ డివైసెస్ రూ.20 లక్షలు, అమెజాన్ రూ.18 లక్షలు, ముంబైకి చెందిన గప్‌చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన థాట్ వర్క్స్ రూ.11.10 లక్షలు, శాన్ డిస్క్ రూ.9.10 లక్షల వేతనాలతో పలువురు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. అత్యధికంగా విప్రోకు 192 మంది, క్యాప్ జెమినీకి 109 మంది, ఇన్ఫోసిస్‌కు 78 మంది, టీసీఎస్‌కు 76 మంది, టెక్ మహీంద్రాకు 49 మంది ఎంపికయ్యారు. 243 మందికి ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్ 243 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్‌కు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఇంటర్న్‌షిప్‌లో స్టైఫండ్ రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు అందుకోనున్నారు. ఇంటర్న్‌షిప్ ముగియగానే అదే కంపెనీలో ఉద్యోగంలో చేరతారు. బ్రాంచిల ప్లేస్‌మెంట్స్ శాతాలు ఈసీఈలో 95.10 శాతం, సీఎస్ఈలో 90.7 శాతం, కెమికల్ ఇంజినీరింగ్‌లో 61 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 57.5 శాతం విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించారు. కెమికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కోర్ గ్రూపునకు సంబంధించి ఉన్నత చదువులు చదివేందుకు ప్రాధాన్యతనివ్వడంతో ఆ గ్రూపుల్లో ప్లేస్మెంట్లు తక్కువగా ఉన్నాయి. అమ్మ, నాన్న కష్టపడకుండా చూసుకుంటా మాది అమలాపురం. ఇద్దరు అక్కలున్నారు. నాన్న సాయి ప్రసాద్ షాపు షాపునకు తిరిగి అగర్బత్తీలు అమ్ముతారు. అమ్మ రామలక్ష్మి టైలరింగ్ చేస్తుంది. తొలి ప్రయత్నంలోనే ఏడాదికి రూ.27 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాన్న కష్టపడకుండా చూసుకుంటా. ట్రిపుల్ ఐటీ నాలాంటి వందలాది మంది జీవితంలో వెలుగులు నింపింది. – కూనపరెడ్డి అజయ్‌శంకర్, అమలాపురం, కోనసీమ జిల్లా అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందిస్తున్నాం ట్రిపుల్ ఐటీలో చేరే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాం. ఇక్కడ ఉన్న ల్యాబ్‌లు దేశంలో ఏ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలోనూ లేవు. ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహిస్తూ ప్లేస్మెంట్లకు సిద్ధం చేస్తాం. ప్రముఖ కంపెనీలన్నీ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేలా చూస్తున్నాం. – ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, నూజివీడు ట్రిపుల్ ఐటీ -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు సఫలం
-
మంత్రి సబిత హామీతో ఆగిన ఆందోళన
నిర్మల్/ బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. అర్ధరాత్రి దాకా చర్చలు.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువీడకుండా ఆందోళన చేస్తుండటంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి వెళ్లారు. ఇప్పటికే నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు రెండుసార్లు విద్యార్థులతో చర్చించి విఫలమయ్యారు. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బాసర చేరుకున్నారు. ఆమెతోపాటు ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ రాహుల్ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆర్జీయూకేటీ కొత్త డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ తదితరులు క్యాంపస్‌కు వచ్చారు. తొలుత దాదాపు యాభై మంది విద్యార్థులతో అధికారులు చర్చించాక.. రాత్రి 10.25 గంటల సమయంలో మంత్రి సబిత వారితో మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా నెలరోజుల్లో డిమాండ్లన్నింటినీ తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా.. ‘సంబంధిత మంత్రిని స్వయంగా చెప్తున్నా.. ఇంకా ఎలాంటి హామీ కావాలి’ అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళన విరమించాలా, కొనసాగించాలా అన్నదానిపై చర్చించుకున్న విద్యార్థులు.. అనంతరం క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పరిష్కరిస్తారని మంత్రిపై, అధికారులపై నమ్మకం ఉందని.. ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. పట్టుదలగా ఆందోళన.. ఆర్జీయూకేటీ విద్యార్థులు ఏడు రోజులుగా పట్టుదలతో ఆందోళన కొనసాగించారు. ఆదివారం రోజంతా ఎండలో, రాత్రంతా చలిలో ఆరు బయటే నిద్రించి నిరసన తెలిపారు. సోమవారం వేకువజామునే మేల్కొని అంతా కలిసి యోగా చేశారు. తర్వాత ఆర్జీయూకేటీ ప్రాంగణంలోనే రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ట్విట్టర్, యూట్యూబ్‌లే.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారు సమస్యలను చెప్పుకుందామంటే పోలీసులు మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించలేదు. కనీసం ప్రధాన ద్వారం దరిదాపుల్లోకీ రానివ్వలేదు. విద్యార్థుల్లో నుంచి ఒకరిద్దరు తమకు తెలిసిన పాత్రికేయులకు సమాచారమిస్తేనే తప్ప.. క్యాంపస్‌లో లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ట్రిపుల్ఐటీ విద్యార్థులు.. ట్విట్టర్, యూట్యూబ్‌లను అనుసంధానకర్తలుగా మార్చుకున్నారు. వాటి ద్వారానే క్యాంపస్‌లో జరుగుతున్న పోరును ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. క్యాంపస్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఓ విద్యార్థి గీసిన చిత్రం, మరికొందరు విద్యార్థులు తయారు చేసిన పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. క్యాంపస్‌లోకి వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం ట్రిపుల్ ఐటీ ప్రధానద్వారం వద్ద పోలీసులు అడ్డుకుంటుండటంతో.. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, బీజేవైఎం నాయకులు సోమవారం వేకువజామున నాలుగు గంటలకు వెనుక భాగంలో గోడదూకి క్యాంపస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. కాగా.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ప్రభుత్వం, మంత్రులు విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల డిమాండ్లివీ.. ఆర్జీయూకేటీ విద్యార్థి పాలక మండలి సభ్యులు సోమవారం తమ డిమాండ్లపై యూట్యూబ్ లైవ్ ద్వారా స్పష్టత ఇచ్చారు. ► ప్రభుత్వం వెంటనే చాన్సలర్‌ను నియమించాలని, సెర్చ్ కమిటీ వేసి వైస్ చాన్సలర్‌నూ ఎంపిక చేయాలని, ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియమించాలని కోరారు. ► విద్యార్థుల అవసరాల కోసం కేటాయించే 312 గ్రాంట్లు 2019 నుంచీ రావడం లేదని.. వీటిని ఇవ్వడంతోపాటు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కోరారు. బడ్జెట్ లేనందునే తమకు ల్యాప్‌టాప్, యూనిఫాం, స్పోర్ట్స్‌వేర్, బెడ్లు ఇవ్వడం లేదని చెప్పారు. ► ఎనిమిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులు 17 మందేనని.. మిగతా 170 మంది కాంట్రాక్టు వాళ్లు ఉన్నారని, వెంటనే సరిపడా అధ్యాపకులను నియమించాలన్నారు. ► క్యాంపస్‌లో కేవలం ఇద్దరు మాత్రమే పీఈటీలు ఉన్నారని, విద్యార్థినులకు ప్రత్యేకంగా మహిళ పీఈటీని నియమించాలని కోరారు. ► 24 గంటల పాటు లైబ్రరీ, షాపింగ్ కాంప్లెక్స్లతోపాటు మంచి క్యాంటిన్ కావాలని కోరారు. ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ తదితర సమస్యలు, హాస్టల్ గదుల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో చర్చలు విఫలం
-
బాసరలో జాగ‘రణం’
నిర్మల్/బాసర: ఎండా వాన, పగలూరాత్రి.. అనే తేడా లేకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆరో రోజైన ఆదివారం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద 24 గంటలపాటు రాత్రీపగలూ బైఠాయింపు చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ రాత్రి 11 గంటల తర్వాత క్యాంపస్‌కు వచ్చారు. కొత్త డైరెక్టర్ సతీశ్‌కుమార్‌తో కలిసి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లకు ఒప్పుకుంటుందని, ఏమేం అవసరమో పైనుంచి అడిగారని వివరించారు. సోమవారం తరగతులకు హాజరుకావాలని, హామీలు అమలు చేసేలా మంగళవారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి తొలుత విద్యార్థులు నో చెప్పినా.. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత కూడా ఇదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాగా.. ఆదివారం ఉదయం హైదరాబాద్, నిజామాబాద్‌లకు చెందిన ఏబీవీపీ నాయకులు వర్సిటీవైపు దూసుకురాగా, పోలీసులు అడ్డుకుని లాక్కెళ్లారు. వివిధ జిల్లాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనలు చేపట్టారు. ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థులు 24 గంటల దీక్షకు సిద్ధమయ్యారు. శాంతియుత పద్ధతుల్లో రోజుకో తీరులో నిరసనలు చేపడుతున్నారు. యోగా వారోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం కాసేపు యోగా, ధ్యానం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వినాలంటూ.. ‘సారూ.. దిగిరారె.. చూడరె మా ఆవేదనలను..’అంటూ ఓ పాటను రూపొందించి ట్విట్టర్లో పెట్టారు. పోలీసులు మీడియాను అనుమతించకపోవడంతో విద్యార్థులు ట్విట్టర్, యూట్యూబ్‌ల ద్వారా తమ ఆందోళన వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ఆర్జీయూకేటీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పంపించేస్తున్నారని.. ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు తాము నిరవధిక ఆందోళన చేస్తుంటే.. అధికారులు మాత్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు. కొంతమంది పీయూసీ–1, 2(ఇంటర్ తరహా) విద్యార్థులను అవుట్‌పాసులు లేకున్నా, వారి తల్లిదండ్రులు రాకున్నా పంపించేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు తమ పోరును ఆపలేవని స్పష్టం చేశారు. ఆందోళనలో యథాతథంగా బీ–1, 2, 3, 4 విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. దూసుకొచ్చిన ఏబీవీపీ విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ఒక్కసారిగా వర్సిటీ వైపు దూసుకువచ్చారు. ముందస్తుగానే ఏబీవీపీ వర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో పరిషత్ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనూహ్యంగా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు ఒక్కసారిగా ప్రధాన ద్వారం వైపు చొచ్చుకువచ్చారు. ఈ పరిణామంతో పోలీసులు వారిని అడ్డుకొని వాహనాల్లో తరలించారు. -
ఆరో రోజుకు చేరిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన
-
బాసర ట్రిపుల్ ఐటీలో ౩వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన
-
బాసర IIIT వద్ద హై టెన్షన్
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
-
ట్రిపుల్ ఐటీ భవితకు దివిటీ
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఇంటర్మీడియెట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఉచిత విద్యనందించే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కళాశాలలను ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తిచేసుకుని బయటికి వచ్చిన విద్యార్థులు మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు అందుకుంటున్నారు. పలువురు విదేశాల్లో చదువులు, కొలువులకు సైతం వెళ్తుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి స్థిరపడినవారూ ఉన్నారు. – నూజివీడు ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఉన్నత సాంకేతిక విద్యను అందిస్తూ నూజివీడు ట్రిపుల్ఐటీ పేద విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది. ఆరేళ్లపాటు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చదువుకుంటున్న విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్స్‌లో సత్తాచాతున్నారు. ఏటా 350 నుంచి 500 మందికి పైగా వి ద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏడాదికి రూ.7.60 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ప్యాకేజీలకు ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ కొలువులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు, విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇస్రోలో సైంటిస్టులుగా, రైల్వేలో ఉన్నతోద్యోగులుగా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శా ఖల్లో ఇంజినీర్లుగా, బ్యాంకు, సచివాలయ ఉద్యోగులుగా ట్రిపుల్ఐటీ విద్యార్థులు పనిచేస్తున్నారు. సీడీపీసీ ప్రముఖ పాత్ర : విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంలో కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, కంపెనీల అవ సరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను అన్నిరకాలు గా తీర్చిదిద్దేలా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. కంపెనీల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతూ వారిని ప్లేస్మెంట్లకు వచ్చేలా చేస్తున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, టెక్‌మహీంద్ర, క్యాప్‌జెమినీ, ఎఫ్ట్రానిక్స్, ఫ్రెష్‌డెస్క్, థాట్‌వర్క్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, ఐబీఎం, సినోప్సిస్, ఇంటెల్ తదితర 80 కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి. 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు ట్రిపుల్‌ఐటీలో ఇప్పటివరకూ 8 బ్యాచ్‌లు కోర్సును పూర్తిచేసుకుని వెళ్లగా వీరిలో 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చాయి. మరికొందరు గేట్లో ర్యాంకులు సాధించి ఎంటెక్ చదువుతున్నారు. ఈ ఏ డాదిలో ఇప్పటివరకూ 768 మందికి ఉద్యోగాలు రాగా అన్‌లాగ్ డివైస్ కంపెనీ ఏడాదికి రూ.20 లక్షల జీతంతో నలుగురిని, గప్‌చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షల వేతనంతో ఇద్దరిని, జస్పే సంస్థ రూ.27 లక్ష ల వేతనంతో ఒక విద్యార్థిని ఎంపిక చేసుకున్నాయి. వైఎస్సార్ వెలుగులు నింపారు ట్రిపుల్ఐటీ స్థాపించి దివంగత వైఎస్సార్ నా జీవితంలో వెలుగులు నింపారు. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ బ్రాంచితో ఇంజినీరింగ్ పూర్తిచేశా. తర్వాత మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదివా. ఏడాదిన్నర పాటు దక్షిణ మధ్య రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశా. ప్రస్తుతం ఇస్రో ప్రధాన కార్యాలయం (బెంగళూరు)లో సైంటిస్టు–సీగా పనిచేస్తున్నా. –గుత్తా వెంకట శేషారావు, ఇస్రో సైంటిస్ట్ -
ఈజీగా క్యారీ చేసి... ఎక్కడికైన తీసుకెళ్లి నడిపేయగల సరికొత్త సైకిల్
సాక్షి, హైదరాబాద్: సైకిల్ సవారీ అంటే ఎంత ఇష్టమున్నా... అన్ని చోట్లకూ తీసుకువెళ్లలేక దాన్ని వినియోగించలేకపోతున్నవారికి ఫోల్డబుల్ సైకిల్ పేరిట సృజనాత్మక పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. కచ్బో డిజైన్ సంస్థకు చెందిన ఇరువురు ఐఐటీ పూర్వ విద్యార్థులు ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించారు. బంజారాహిల్స్‌లోని లెమన్ ట్రీ హోటల్లో ఆదివారం ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ హార్న్ బ్యాక్ బైస్కిల్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఐఐటీ పూర్వ విద్యార్థులు నిషిత్ పారిఖ్, రాజ్‌కుమార్ కేవత్ మాట్లాడుతూ.. సైకిల్ని నడపడంతో పాటు దాన్ని చేతులతో క్యారీ చేయడానికి కూడా వీలుగా రూపొందిందన్నారు. ఒక్కసారి చార్జి చేస్తే 30 కి.మీ దాకా మైలేజ్ ఇస్తుందన్నారు. (చదవండి: ‘మానాల’ మళ్లీ పురుడు?) -
ట్రిపుల్ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నూజివీడు: స్థానిక ట్రిపుల్ఐటీ విద్యార్థిని మరడపు హారిక (19) ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్న హారిక స్వస్థలం తూర్పుగోదా వరి జిల్లా రాజమండ్రి నగరంలోని కొత్తపేట. వేకువజామున 5.45 గంటల ప్రాంతంలో తాను ఉంటున్న కే–3 హాస్టల్ భవనంపై భాగంలోకి వెళ్లి అక్కడే బ్లేడ్‌తో రెండు చేతులకు మణికట్టు వద్ద, మెడవద్ద కోసుకొని ఆ తరువాత నాలుగంతస్తు పై నుంచి కిందకు దూకింది. విద్యార్థిని కిందకు దూకడంతో భారీగా శబ్దం రావడంతో పాల వ్యాను డ్రైవర్ చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వచ్చి క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే నైట్ డ్యూటీ వైద్యురాలు ఆస్పత్రిలో లేకపోవడంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. రెండు కాళ్లకు, వెన్నుపూస వద్ద తీవ్ర గాయాలయ్యాయి. బ్లేడ్‌తో కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. క్షతగాత్రురాలికి రక్తం ఎక్కించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని స్పృహలోనే ఉండి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలోని సెమిస్టర్–1 ఫలితాల్లో బ్యాక్‌లాగ్స్ ఉండటంతో భయంవేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పిందని ట్రిపుల్ఐటీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని నూజివీడు సీఐ ఆర్.అంకబాబు, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొవిడ్ మరణాలను ముందే గుర్తించే టెక్నిక్
సాక్షి, రాయదుర్గం: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి, చాలా మంది రోగులు ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆస్పత్రిలో ఉన్నా, ఇళ్లలో ఉన్నా కొన్నిసార్లు శ్వాస సమస్య మొదలయ్యే వరకు రోగి పరిస్థితి సీరియస్ అవుతోందన్న విషయం గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మెషీన్ లెర్నింగ్ నమూనాల ఆధారంగా.. కోవిడ్ మరణాలు సంభవించే అవకాశాన్ని ముందే గుర్తించే సాంకేతికతను రూపొందించినట్టు గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ పరిశోధకులు మంగళవారం ప్రకటించారు. ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ దేవప్రియకుమార్, పరిశోధక విద్యార్థులు షన్ముఖ్ అల్లె, అక్షయ కార్తికేయన్, అక్షిత్ గార్గ్‌ల బృందం ఈ పరిశోధన చేసిందని వారు వెల్లడించారు. కోవిడ్ వైరస్ ఉధృతిని బట్టి శరీరంలో జరిగే మార్పులు, హార్మోన్లు వంటి బయోమార్కర్ల సాయంతో మరణించే అవకాశాలను ముందే గుర్తించవచ్చని తెలిపారు. రక్తంలోని న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, లాక్టేట్ డీహైడ్రోజెనేస్ (ఎల్డీహెచ్), హైసెన్సివిటీ డీ–రియాక్టివ్ ప్రోటీన్ వంటి వాటి స్థాయిల ఆధారంగా.. 96 శాతం కచ్చితత్వంతో 16 రోజుల ముందుగానే మరణాలను అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. ఈ డేటా ఆధారంగా కోవిడ్ పేషెంట్లకు అందించే చికిత్సను మెరుగుపర్చి, ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. చదవండి: శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు! -
కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసిన విద్యార్థులు
సాక్షి, ఆదిలాబాద్: బాసర రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ నుంచి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూకేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్ (NPTEL) పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు బాసర ట్రిపుల్ ఐటీ నుంచి 106మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కబోయి.. పొరపాటున పర్భని పాసింజర్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా... అది తాము ఎక్కాల్సిన రైలు కాదని తెలిసి దూకేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్‌గా తెలుస్తోంది. -
భరతమాతకు ట్రిపుల్ సెల్యూట్
ఈ ముగ్గురి నేపథ్యం.. అతి సాధారణం. కష్టాలకు ఎదురొడ్డుతూనే ‘పది’లో సత్తా చాటారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించి తమ కలల సాకారం వైపు కదిలారు. ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యం చూపి కొలువులను తమ వద్దకు రప్పించారు. అయితే దేశ రక్షణ కంటే తమ కుటుంబం, ఉద్యోగం ఏవీ ఎక్కువ కాదని భావించి, నెలకు లక్షలు తెచ్చిపెట్టే కొలువులను తృణపాయంగా త్యజించి, భరతమాత సేవలో పునీతులవుతున్నారు.. సాక్షి, నూజివీడు : ముగ్గురూ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. చదువులో ప్రతిభ చాటి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. భారీ వేతనాలతో కూడిన ఉన్నత ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చినా కాదనుకున్నారు. దేశ రక్షణలో తాము భాగస్వాములు కావాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కెప్టెన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ముగ్గురు వీరులు.. మహాధీరులై భరత మాత సేవలో పునీతులవుతున్నారు. ఆర్మీలో కెప్టెన్లుగా సేవలందిస్తున్న వారి నేపథ్యాన్ని ఓసారి పరికిస్తే.. కూలీ కొడుకు.. ఆర్మీ కెప్టెన్ బర్నాన యాదగిరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని శేఖరపురం. తండ్రి గురవయ్య హైదరాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీ కాగా, తల్లి తులసమ్మ పోలియో వల్ల ఇంటివద్దే ఉంటోంది. యాదగిరి పదో తరగతిలో 94.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడై, 2008 ఫస్ట్బ్యాచ్లో ట్రిపుల్ ఐటీలో చేరాడు. 83.4 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం టెక్ మహేంద్ర సంస్థలో ఉద్యోగంలో చేరినా.. సంతృప్తి చెందక మాతృభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో 2015లో యూపీఎస్సీ నిర్వహించిన సీడీఎస్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ లను పూర్తిచేశాడు. మరోవైపు క్యాట్ పరీక్షలో 93.4 శాతంతో ప్రతిభను చాటి ఐఐఎం ఇండోర్‌లో ప్రవేశం పొంది, దేశ భద్రతా రంగం వైపు అడుగు వేశాడు. 2016 జూలై 8న ఇండియన్ మిలటరీ అకాడమీ శిక్షణలో రాణించి ‘టెక్నికల్ గ్రాడ్యుయేషన్’ కోర్సులో టాపర్‌గా నిలిచి కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. శివారు ప్రాంతం నుంచి కెప్టెన్‌గా.. చిరుమామిళ్ల సీతారామకృష్ణతేజ స్వగ్రామం విజయనగరం జిల్లా శృంగవరపుకోట. తండ్రి వైన్‌షాపులో గుమస్తా కాగా.. తల్లి నాగమణి మృతి చెందారు. 2008 తొలి బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీలో చేరిన సీతారామకృష్ణతేజ మెకానికల్ ఇంజినీరింగ్‌లో 8.4 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. 17వ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో 2015 జూన్ 23 నాటికి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని మోడిఫైడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ ర్యాంక్‌లో పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబాల్లో నుంచి వచ్చి ట్రిపుల్ ఐటీలో ఉత్తమ ప్రతిభతో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసి.. సైన్యంలో కెప్టెన్లుగా పనిచేస్తున్న యాదగిరి, సురేంద్రనాథ్, కృష్ణతేజలు నేటి విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతలు.. ఉన్నతోద్యోగం వదిలి..దేశసేవకు నడుం బిగించి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నాదెళ్ల సురేంద్రనాథ్ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేంద్రనాథ్ తండ్రి వెంకట్రావు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి సాధారణ గృహిణి. 2009–15బ్యాచ్‌కు చెందిన సురేంద్రనాథ్ టీసీఎస్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ కన్సల్టెంట్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో ఉద్యోగాలను వదిలేసి ఆర్మీవైపే అడుగులు వేశాడు. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ పూర్తిచేసి శిక్షణ పొంది భారత సైన్యంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం అసోంలో కౌంటర్ (తిరుగుబాటు) ఆపరేషన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యాయామ అధ్యాపకుడు నవీన్ అందించిన ప్రోత్సాహంతోనే తాను ఆర్మీలోకి అడుగుపెట్టానని పేర్కొంటున్నాడు. -
చెప్పినట్టు వింటారా.. నూజివీడు వెళ్తారా...
సాక్షి ప్రతినిధి కడప : ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆశలపై పిడుగుపడింది. అంచనాలు తలకిందులవుతున్నాయి. అధికారుల హఠాత్పరిణామానికి బిత్తరపోవాల్సిన దుస్థితి నెలకొంది. సమయం లేదు.. చెప్పినట్లు విని బ్రాంచ్ మారుతారా.. నూజివీడు వెళ్తారా...మీరే తేల్చుకోండని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు అల్టిమేటం జారీ చేశారు. రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ నిర్ణయంతో విద్యార్థులు మదనపడుతున్న వైనమిది. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో విజయవంతంగా నడుస్తున్న కెమికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఉన్న ఫళంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్రాంచ్‌లోని విద్యార్థులను నూజివీడుకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడికి వెళ్లలేని పక్షంలో బ్రాంచ్ మారాలని సూచించారు. ఇదేమి విడ్డూరం..రెండేళ్ల పాటు ఇంటర్ విద్యను పూర్తి చేసుకొని కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరిన తమకు ఇప్పుడు అర్ధాంతర రద్దు ఏమిటని విద్యార్థులు వాపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నూజివీడులో విద్యను అభ్యసించేందుకు వెళ్లలేని వారు చదువు పూర్తయ్యాక విదేశాల్లో ఎలా ఉద్యోగాలు చేస్తారంటూ వ్యంగ్యం వ్యక్తం చేస్తున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఆర్టికల్ 371–డి ప్రకారం ఇక్కడే అర్హులు.. ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థ కొనసాగుతోంది. ట్రిపుల్ఐటీ యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాయలసీమ విద్యార్థులు కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. 10ఏళ్లుగా ఈ విభాగం ఆర్కే వ్యాలీలో విజయవంతంగా నడుస్తోంది. 2018–19 ఏడాదికి కూడా 15 మంది కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరిపోయారు. కాగా ఆర్కే వ్యాలీలో ఉన్న కెమికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని రద్దు చేస్తున్నాం, మీరు బ్రాంచ్ మారుతారా...లేదంటే నూజీవీడు వెళ్తారా... అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచారు. ఇక్కడున్న ఈ విభాగాన్ని రద్దు చేస్తే జోనల్ వ్యవస్థ కారణంగా భవిష్యత్‌లో నూజీవీడులో సీటు లభించడం గగనం అవుతుందని పరిశీలకులు వాపోతున్నారు. పైగా ఆర్కే వ్యాలీ లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి రూ.1.8కోట్ల తో 6 ల్యాబ్‌లు, రూ.50లక్షలతో డిపార్టుమెంటు బిల్డింగ్, రూ.30 లక్షలతో రీసెర్చి ల్యాబ్ ఉన్నాయి. ఇంతటి వసతులున్న ఈ ప్రాంతాన్ని వదిలేసి నూజీవీడు వెళ్లండనీ ఒత్తిడి పెంచడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.రాయలసీమలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అందుబాటులో లేకుండా చేయడంపై రాజ్యాంగ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇవేవీ పట్టించుకోకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా రెండేళ్ల పాటు ఇంటర్ విద్యను పూర్తిచేసిన ఆర్కే వ్యాలీ విద్యార్థులను నూజీవీడు వెళ్లండనీ హుకుం ప్రదర్శించడం ఏమాత్రం సహేతుకం కాదని అంటున్నారు. ఇదే విషయమై వేంపల్లె ట్రీపుల్‌ఐటీ విద్యార్ధులు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆర్జీయూకెటీ నిర్ణయం కారణంగా తాము నష్టపోతున్నామని వాపోయారు. ఈవిషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆర్కే వ్యాలీ ట్రీపుల్‌ఐటీ అధికారులు అందుబాటులో లేరు. -
ట్రిపుల్‌ఐటీలో నీటి పాట్లు
నూజివీడు : పట్టణంలోని ట్రిపుల్‌ఐటీలో నీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరాలకు నీళ్లు సరి పడా రాకపోవడంతో తరగతులకు సై తం ఆలస్యంగా వెళ్లాల్సివస్తోంది. నూజి వీడు ట్రిపుల్‌ఐటీలో ఉన్న నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన విద్యార్థులు 8500 మంది ఉన్నారు. వీరితో పాటు మరో వెయ్యి మంది వరకు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులున్నారు. విద్యార్థులకు వండి పెట్టడానికి 8 మెస్‌లు ఉన్నాయి. నీటి సమస్య కారణంగా ముఖ్యంగా విద్యార్థులకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీవ్ర జాప్యం కలుగుతోంది. ఉదయం 8.30 గంటల కల్లా తరగతులకు వెళ్లాల్సి ఉండటం, ఆలస్యంగా వెళ్లితే తరగతులకు రానివ్వని నేపథ్యంలో హాస్టల్ గదులకే పరిమితం కావాల్సి వస్తోంది. కృష్ణా జలాల అరకొర సరఫరానే కారణమా..? ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉంటున్న విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉన్న 9,500 మందికి ప్రతి రోజూ దాదాపు 10 నుంచి 12 లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. అయి తే క్యాంపస్‌లో 22 బోర్లు ఉన్నప్పటికీ చాలినన్ని నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ట్రిపుల్ఐటీ అధికారులు నూజివీడు మున్సిపాలిటీతో కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి రెండేళ్ల క్రితమే ఒప్పందం కుదుర్చుకున్నారు. వెయ్యి లీటర్లకు రూ.36 చెల్లించేలా, రోజుకు 15 లక్షల లీటర్లు సరఫరా చేయాలని ఒప్పందంలో పేర్కొనడంతో పాటు అడ్వాన్స్‌గా ట్రిపుల్ ఐటీ నూజివీడు మున్సిపాలిటీకి రూ.98 లక్షలను సైతం ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలను సరఫరా చేసినందుకు గాను ప్రతి నెలా దాదాపు రూ.8 లక్షలు చెల్లిస్తోంది. గత నెల రోజులుగా రోజుకు 15 లక్షల లీటర్లకు గాను, కేవలం 3 నుంచి 4 లక్షల లీటర్ల నీళ్లు మాత్రమే వస్తుండటంతో నీటి సమస్య ఉత్పన్నమైంది. కృష్ణా జలాల పథకానికి సంబంధించి విజయవాడ నుంచి నూజివీడుకు వచ్చే ప్రధాన పైప్‌లైన్ వెంబడి దాదాపు 10 నుంచి 12 చోట్ల లీకేజీలు ఏర్పడి కృష్ణా జలాలు వృథాగా పోతున్నాయి. దీంతో ఇటు పట్టణానికి, అటు ట్రిపుల్ ఐటీకి సరిపడా రావడం లేదు. దీంతో ట్రిపుల్ ఐటీకి సరఫరా చేయాల్సిన నీటిని తగ్గించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏర్పడిన నీటి కొరతను అధిగమించడానికి గాను ట్రిపుల్ ఐటీ అధికారులు రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసి బోర్లలోని నీటిని ట్యాంకర్లలో నింపి తీసుకెళ్లి సం పులను నింపుతున్నారు. ఇలా రాత్రి, పగలు కలపి రోజుకు 30 ట్యాంకర్లు వరకు సరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు కొద్దిగా మాత్రమే తగ్గాయి. ప్రస్తుతం మార్చి నెలలో పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని ట్రిపుల్ఐటీ విద్యార్థులు, సిబ్బంది ఆం దోళన చెందుతున్నారు. ఇప్పటికే భూ గర్భ జలాలు పడిపోయిన నేపథ్యంలో ఉన్న బోర్లు ఎంతకాలం ఆడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ క్యాంపస్‌లోని బోర్లలో నీళ్లు అడుగంటిపోతే సమీపంలోని మామిడి తోటల్లో ఉన్న బోర్ల నుంచైనా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, ఇటీవల సేకరించిన భూమిలో ఉన్న నాలుగు బోర్లను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించాలని వీసీ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు ఇంజినీరింగ్ అధికారులకు తెలిపారు. -
సరస్వతి సాక్షిగా...
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం బాసర ఐఐఐటీలోని ఏపీ విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపకార వేతనాల చెల్లింపులో ప్రభుత్వ వైఫల్యం వల్ల 2,000 మంది పేద విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2014లో రాష్ట్ర విభజనతో బాసర ఐఐఐటీ తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు ఇడుపులపాయ, నూజివీడు, బాసర ఐఐఐటీ క్యాంపస్‌ల్లో చేరుతున్నారు. బాసర క్యాంపస్‌లో దాదాపు 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు 2,000 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఏ రాష్ట్రం విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఉపకార వేతనాలు చెల్లించాలి. ఉపకార వేతనాలు రాని విద్యార్థులు మొదటి రెండేళ్లు రూ.36,000 చొప్పున, తరువాత నాలుగేళ్లు రూ.40,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ ఐఐఐటీల్లోని తెలంగాణ విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. కానీ, బాసర ఐఐఐటీలోని తమ రాష్ట్ర విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం 2016 నుంచి ఉపకార వేతనాలు చెల్లించడం లేదు. 2016–17, 2017–18 విద్యా సంవత్సరాలకు ఉపకార వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి సగటున రూ.1.50 లక్షల దాకా బకాయి ఉంది. దాదాపు సగం మంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు. ఉపకార వేతన బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కోర్సు పూర్తయినప్పటికీ వారికి సర్టిఫికెట్లను బాసర ఐఐఐటీ అధికారులు ఇవ్వడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే సెమిస్టర్–2కు అనుమతిస్తాం ఉపకార వేతనాలను ఏపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో బాసర ఐఐఐటీ అధికారులు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేయాల ని నిర్ణయించారు. ఉపకార వేతనాలు రాని విద్యార్థులు ఒక్కొక్కరు ఏడాదికి రూ.36,000 చొప్పున రెండేళ్లకు రూ.72,000 చెల్లించాలని స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించని విద్యార్థులను సెమిస్టర్–2కు అనుమతించబోమని నోటీసు బోర్డులో పేర్కొన్నారు. దీంతో ఏపీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ప్రతినిధులు రెండు రోజులుగా అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ సీఎంవో అధికారులు అనుమతించలేదు. సెమిస్టర్–2కు అనుమతించకపోతే తాము చదువుకు అర్ధంతరంగా స్వస్తి చెప్పాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల వేదన అరణ్య రోదన బాసర ఐఐఐటీలో ఏపీ విద్యార్థులు తమ ఉపకార వేతనాల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. విద్యార్థుల ప్రతినిధులు సెప్టెంబర్‌లో అమరావతికి వచ్చి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం(సీఎంవో) అధికారులను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. అయినా ఉపకార వేతనాలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. తమ క్యాంపస్‌లోని ఏపీ విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే మంజూరు చేయాలని బాసర ఐఐఐటీ డైరెక్టర్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు సెప్టెంబర్ 23న ఓ లేఖ, నవంబర్ 22న మరో లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చెల్లుచీటీ సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కావడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014–15 సంవత్సరానికి మాత్రమే ప్రభుత్వం ఫీజులు చెల్లించింది. ఆ తర్వాత పూర్తిగా నిలిపివేసింది. ఏపీ విద్యార్థులు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకపోవడంతో చదువులు ఆగిపోతున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పటికీ విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు తెలంగాణలో చదువుకునే అర్హులైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటోంది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడుస్తోంది. తెలంగాణలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు 20,000 మంది ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. సగటున ఒక్కో విద్యార్థికి రూ.30,000 చొప్పున చెల్లించాల్సి వచ్చినా ఏడాదికి రూ.60 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరు మరో గత్యంతరం లేక సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. -
మెరిట్‌పైనా ఒత్తిడి
ఒత్తిడి.. ఒత్తిడి.. ప్రస్తుతం విద్యార్థులను వెంటాడుతోంది. కెరీర్ లక్ష్యంగా సాగుతున్న చదువులు.. బిజీబిజీగా మారుతున్న లైఫ్‌స్టైల్స్‌తో మానసిక ఎదుగులపై ప్రభావం.. బోధనలో సరియైన విధానం లేకపోవడం.. వంటి సమస్యలతో ట్రిపుల్ఐటీ విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. నూజివీడు: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యనందించడమే ట్రిపుల్‌ఐటీల లక్ష్యం. కాని లక్ష్యానికి దూరంగా సాగుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి నెలకొంది. అందుకు విద్యార్థిని రమాదేవి మృతే సాక్షి. సిలబస్ రూపకలప్పనలోనూ.. పీయూసీ ప్రథమ ఏడాదికి సంబంధించిన సిలబస్ రూపకల్పన, బోధన పద్ధతుల్లో లోపాలు బహిర్గతమయ్యాయి. బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీవోఎస్) రూపొందించిన సిలబస్ అమలు లేదు. ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చాలా కఠినంగా ఉన్నాయి. తరగతి గది వైపు ఆకర్షణ ఏది..? ట్రిపుల్‌ఐటీలో చేరే వారిలో 80 శాతం మంది గ్రామీణ పాంతాలకు చెందిన తెలుగు మీడియం విద్యార్థులే అధికం. వీరిని తరగతిగదిలో ఆకర్షించే విధంగా బోధన సాగాలి. కాని తరగతికి వచ్చామా.. వెళ్లామా.. అని తప్పితే బోధన సాగడం లేదనే వాదన వినిపిస్తోంది. కొంతమంది మెంటార్లు అయితే ఆలస్యంగా క్లాసు రావడం, ముందుగా వెళ్లడం చేస్తుండడంతో విద్యార్థులకు పాఠాలు అర్థంకాక టెన్షన్‌కు గురవుతున్నారు. రెండు మీడియాల్లో బోధన లేదు. తెలుగు మీడియం నుంచి 80శాతం మంది విద్యార్థులు వచ్చిన వారు కాబట్టి మొదటి సెమిస్టర్ పూర్తయ్యే వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో బోధన చేయాలి. ట్రిపుల్ఐటీ ప్రారంభం నుంచి అధికారులు బోధన సిబ్బందికి చెబుతున్నారు. అయితే కొందరు మెంటార్లు ఇంగ్లిష్‌లో మాత్రమే బోధిస్తుండటంతో తెలుగు మీడియం విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంగ్లిష్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అర్థంకావడం లేదని లబోదిబోమంటున్నారు. సిలబస్ పూర్తవుతున్న కొద్దీ వారిపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. పరీక్షలకు సమయం లేదు.. ప్రతినెలా చివరిలో మిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయమే ఇవ్వడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నా ఈ రోజు వరకు సిలబస్ బోధిస్తూనే ఉంటారు. దీంతో తాము రాత్రి పూట రెండు గంటల వరకు చదువుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సందేహాల నివృత్తి శూన్యం.. విద్యార్థులకు సందేహాలను నివృత్తి అనేది కూడా అసలు లేదు. మెంటార్లు పట్టించుకోవడం లేదు. గతంలో రాత్రిపూట స్టడీ తరగతులు నిర్వహించేవారు. ఆ తరగతులలో హోంరూమ్ ట్యూటర్స్ (హెచ్ఆర్టీ)లు విద్యార్థుల సందేహాలను కొంత మేరకు నివృత్తి చేసేవారు. ప్రస్తుతం ఇంకా స్టడీ తరగతులను నిర్వహించకపోగా, హెచ్‌ఆర్‌టీలను గతంలోనే ఐటీ మెంటార్స్‌గా మార్చేశారు. కఠినంగా ఇంగ్లిష్ సబ్జెక్టు... బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశమై సిలబస్‌ను నిర్ణయించారు. అందుకు భిన్నంగా చాన్సలర్ చెప్పారంటూ కొత్త విధానం అమలు చేస్తున్నారు. అమెరికా నుంచి ఆన్లైన్లో వచ్చే సిలబస్ బోధిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఇంగ్లిష్ క్లాసులో అమెరికాలోని ప్రముఖ పత్రికలైన న్యూయార్స్ టైమ్స్, లండన్ టైమ్స్ పత్రికల్లో వచ్చిన వ్యాసాలను ఆన్లైన్లో పంపి వాటిని చదివిన తరువాత ఆ వ్యాసంలోని అంశాలపై ఇచ్చే ప్రశ్నలకు జవాబులు రాయిస్తున్నారు. ఆ తరువాత బీబీసీ, సీఎన్ఎన్, ఐబీఎన్, ఏఎక్స్‌ఎన్ చానళ్లలో చదివి న్యూస్ క్లిప్పింగ్‌లను విద్యార్థులు విని వాటికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. విద్యార్థులకు అక్కడి పరిస్థితులు తెలియక, అమెరికన్ లాంగ్వేజ్ అర్థంకాక పరీక్షలో సరిగా రాయకపోతే మార్కులు రావేమోనని చాలా ఒత్తిడికి గురవుతున్నారు. సైకాలజిస్టులు లేక.. సంస్థలో కనీసం ఒకరిద్దరు సైకాలజిస్టులు ఉండి వారికి నిత్యం మోటివేషన్ తరగతులు నిర్వహించినట్లయితే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఆ దిశగా యాజమాన్యం ఆలోచన చేస్తున్న దాఖలాలే లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మూల కారణాలను తెలుసుకుని వాటిని సరిచేసుకుంటే ట్రిపుల్‌ఐటీలకు పేరుప్రతిష్టలు పెరుగుతాయనేది సర్వత్రా అభిప్రాయ పడుతున్నారు. -
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ర్యాగింగ్ కలకలం
-
సరదా తెచ్చిన తంటా
వేంపల్లె(ఇడుపులపాయ) : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి సరదాగా రైలింగ్ (మెట్ల వద్ద రక్షణగా వేసిన స్టీల్ పైపులు)పై జారుతుండగా.. ప్రమాదవశాత్తు నాల్గవ అంతస్తు నుంచి జారిపడి ప్రాణం మీదకు తెచ్చుకొన్నాడు. తలకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో తిరుపతి రమాదేవి ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇడుపులపాయ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కోనఅనంతపురం సుగాలి తాండాకు చెందిన రామయ్య నాయక్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పీ–2 (ఇంటర్‌సెకండియర్) పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పాత క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్‌లో ఈ విద్యార్థులకు గదులు కేటాయించారు. బ్లాక్–1లో ఉన్న భవనంలో రామయ్య నాయక్ రెండవ అంతస్తులో తోటి విద్యార్థులతో ఉన్నాడు. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాల్గవ అంతస్తులో ఉన్న స్నేహితులను కలిసేందుకు అక్కడికి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో సరదాగా మెట్లకు రక్షణగా వేసిన స్టీల్ పైపులపై(రైలింగ్) జారుతూ గదికి చేరుకోవాలనుకున్నాడు. పైపులపై జారే ప్రయత్నంలో చేతిలో పుస్తకాలు ఉన్నందువల్ల అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అధికారులు స్థానిక ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చేర్చుకొనేందుకు నిరాకరించడంతో తిరుపతిలోని రమాదేవి ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. -
అడవిలో ప్రేమ జంట..ఆచూకీ లభ్యం
వేంపల్లె: పరారైన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అటవీప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుకునే సౌందర్య, నవీన్‌లు శేషాచలం అడవుల్లో తప్పిపోయిన విషయం తెలిసిందే. కళాశాలలో పీయూసీ రెండో సంవత్సరం చదువుకుంటున్న ఇద్దరు విద్యార్ధులు శనివారం నుంచి కనిపించకుండా పోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన సౌందర్య, చిత్తూరు జిల్లాకు చెందిన నవీన్ సోమవారం కళాశాలకు రాకపోవడంతో వీరి అదృశ్యం విషయాన్ని ట్రిపుల్ ఐటీ నిర్వాహకులు కుటుంబసభ్యులకు తెలిపారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, శేషాచలం అడవుల్లో చిక్కుకున్నామని, దారి తెలియక ఇబ్బందులు పడుతున్నామంటూ వారు సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారమిచ్చారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి సెల్ సిగ్నల్స్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
అడవిలో దారి తప్పిన ప్రేమజంట
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుకునే విద్యార్థి, విద్యార్థిని శేషాచలం అడవుల్లో తప్పిపోయారు. కళాశాలలో పీయూసీ రెండో సంవత్సరం చదువుకుంటున్న ఇద్దరు విద్యార్ధులు శనివారం నుంచి కనిపించకుండా పోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి, చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్ధిని సోమవారం కళాశాలకు రాకపోవడంతో వీరి అదృశ్యం విషయాన్ని ట్రిపుల్ ఐటీ నిర్వాహకులు కుటుంబసభ్యులకు తెలిపారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, శేషాచలం అడవుల్లో చిక్కుకున్నామని, దారి తెలియక ఇబ్బందులు పడుతున్నామంటూ వారు సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారమిచ్చారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు మూడు బృందాలుగా విడిపోయిన సెల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చేపట్టారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై తేనెటీగల దాడి
వైఎస్సార్ జిల్లా(వేంపల్లె): అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై తేనెటీగలు దాడిచేసిన ఘటన ఆదివారం రాత్రి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో చోటుచేసుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆట స్థలంలో ఆడుకునేందుకు వచ్చారు. వీరందరూ కలిసి పక్కనే ఉన్న శేషాచలం అడవుల్లోకి వెళ్లి ఫొటోలు తీసుకోవాలనుకున్నారు. 15 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రదేశం నుంచి దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న శేషాచలం అడవుల్లోకి వెళ్లారు. అడవిలో వీరికి కనిపించిన తేనె తుట్టెను సెల్‌ఫోన్‌తో ఫొటో తీస్తుండగా ప్లాష్ వెలుతురుకు తేనెటీగలు (పెద్ద ఈగలు) ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. దీంతో విద్యార్థులు చెల్లాచెదురుగా విడిపోయి పరుగులు తీశారు. వీరిలో 14 మంది ట్రిపుల్ ఐటీకి చేరుకోగా గంగాధర నాయక్ అనే విద్యార్థి రాలేదు. గంగాధర నాయక్ అడవిలో తప్పిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పోలీసులు, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది శేషాచలం అడవుల్లో గంగాధర నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 1.30 గంటల వరకు వెతికినప్పటికి కనిపించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో మళ్లీ ఉదయం వెతికేందుకు వెళుతుండగా రాత్రంతా అడవిలోనే గడిపిన ఆ విద్యార్థి తిరిగి వ స్తూ పోలీసులకు తారసపడ్డాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలతో ఉన్న అతన్ని అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. వినీత్ అనే విద్యార్థికి కూడా కడప రిమ్స్‌లో చికిత్స అందించి ట్రిపుల్ ఐటీకి పంపించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. -
ఆగని ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
వైఎస్ఆర్ జిల్లా : వేంపల్లె ట్రిపుల్ ఐటీలో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారని, తాత్కాలికంగా సస్పెండ్ చేసి వారి అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం ఎదుట డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారని, కానీ అందుకు భిన్నంగా అధికారులు అవినీతికి పాల్పడి తమకు సక్రమంగా అందాల్సిన సాంకేతిక విద్యను అందించకుండా ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం రెండు రోజులుగా వీరన్నగట్టుపల్లె వద్ద ధర్నా చేస్తున్నారు. సోమవారం ట్రిపుల్ ఐటీ అధికారుల చర్చలు సఫలం కాకపోవడంతో మంగళవారం కూడా ఆందోళన యథావిధిగా కొనసాగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం ఇక్కడికి చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విషయాలను ఆయన దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారని, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని వాపోయారు. ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటుచేసేవరకు క్యాంటీన్ నుంచి 50% కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. దీంతో అధిక రేట్లకు ఇక్కడ తమకు వస్తువులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఐడెంటిటీ కార్డులు, ఇతర అవసరాల కోసం ఒక్కొక్క విద్యార్థి వద్ద నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇతర యూనివర్సిటీలకు రూ.50 కోట్ల నిధులు వస్తే, తమ ట్రిపుల్ ఐటీలకు వందల కోట్లు నిధులు మంజూరవుతున్నా.. ఇక్కడ ఉన్న అధికారులు స్వాహా చేస్తున్నారని, విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రెండురోజుల నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, కె.ఎల్.ఎన్.రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఇక్కడికి వచ్చి సమస్య అడిగిన పాపాన పోలేదని వాపోయారు. ఈ సమస్యలు విన్న తర్వాత ఆర్డీవో వినాయకం విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేశారు. అయితే వెంటనే అధికారులను సస్పెండ్ చేయాలని, వారి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని... అంతవరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు తెగేసి చెప్పారు. వీసీ సత్యనారాయణ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి గంటా కాగా విద్యార్థుల ధర్నా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మంగళవారం ఉదయం ఫోన్లో మాట్లాడారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి జోక్యం చేసుకొని మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని.. ఈనెల 15వ తేదీన తాను ట్రిపుల్ ఐటీకి వస్తున్నానని, నెలలోపు సీఎం చంద్రబాబు కూడా ట్రిపుల్ ఐటీకి రానున్నారని తెలిపారు. అయినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరిస్తే గానీ ఆందోళన విరమించేదిలేదని తేల్చి చెప్పారు. మళ్లీ రోడ్డుపై బైఠాయించారు. -
కొలువుల జాతరలో ఐఐఐటీ విద్యార్ధులు
-
చదువుకునేందుకు వచ్చాం.. చచ్చేందుకు కాదు
భైంసా/ముథోల్, న్యూస్‌లైన్ : ‘సార్ మేమంతా ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాం. చచ్చిపోవటానికి కాదు. ప్లీజ్ సార్.. మా మాట వినండి.. ఆడ పిల్లల ఇబ్బందులు తెలుసుకోండి సార్..’ అంటూ ఏడుస్తూ బాసర ట్రిపుల్ ఐటీ పిల్లలు తమ బాధలను రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి ఆఫ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీకే) వైస్‌చాన్స్‌లర్ రాజ్‌కుమార్‌కు మొరపెట్టుకున్నారు. సమస్యలపై సమాధానం చెప్పాలంటూ విద్యార్థులు పట్టుబట్టి వీసీని ఘెరావ్ చేశారు. ఒకింత అసహనానికిలోనై పోలీసులతో కార్యాలయానికి చేరుకున్న వీసీ రాజ్‌కుమార్ వెనకాలే పిల్లలంతా వెళ్లారు. కార్యాలయం ముందే కూర్చుని వీసీ కోసం ఎదురుచూశారు. తదుపరి వచ్చిన వీసీ రాజ్‌కుమార్‌కు ఇబ్బందులను, వేధింపులను విద్యార్థులు తేటతెల్లం చేశారు. వెలువెత్తిన సమస్యలు.. బాసర ట్రిపుల్‌ఐటీలో సమస్యల పరిష్కారం కోరుతూ ఎనిమది రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో వేల మంది విద్యార్థులతో వీసీ రాజ్‌కుమార్, ప్రొఫెసర్ల బృందం చర్చలకు దిగింది. వీసీ రాజ్‌కుమార్ సమస్యలపై ట్రిపుల్ఐటీ విద్యార్థుల లక్ష్యంపై ప్రసంగంలో పలు సూచనలు చేశా రు. వేల మంది విద్యార్థులతో ఉన్న కళాశాలలో ఇబ్బం దులు ఉంటాయని, వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలిపారు. శనివారం విద్యార్థులు మాట్లాడిన తీరు తనను బాధించిందన్నారు. దీంతో అక్కడే ఉన్న ఓ వి ద్యార్థి వీసీ కాళ్లు పట్టుకుని తండ్రిలా క్షమించాలని వేడుకున్నాడు. అనంతరం విద్యార్థులు సమస్యలపై ప్రశ్నిం చారు. తీసుకునే చర్యలను ఇప్పుడే వివరించాలని విద్యార్థులు పట్టుబట్టడంతో వీసీ అసహనంతో వెళ్లిపోయారు. విద్యార్థినులంతా తమ సమస్యలు వినాలంటూ మానవహారంగా ఏర్పడి వీసీని చుట్టుముట్టారు. మళ్లీ వచ్చి చర్చలు ప్రారంభించినా ఏ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చర్చలు సఫలం కాకుండానే ఎలా వెళ్లిపోతారని విద్యార్థులు వేడుకున్నా వీసీ పోలీసులతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. వెనకాలే వెళ్లిన విద్యార్థులు చాలాసేపు అక్కడే నిరీక్షించారు. తదుపరి ఆయన వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. బాసర ట్రిపుల్‌ఐటీలో వీసీగా మీరు కష్టపడితే.. ఇక్కడ పనిచేసే వారు మా భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, తాము కోరే విధంగా ఆ ఐదుగురిని శాశ్వతంగా తప్పిస్తే యూనివర్సిటీకి మంచి పేరు వస్తుందన్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే తమ బతుకులు ఇలా నాశనమవుతున్నాయంటూ విద్యార్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎనిమిది రోజులుగా నిద్రహారాలు మాని నిరసనలు చేపట్టామని ఆవేదన చెందారు. కమిటీ వేశాం.. సమస్యల పరిష్కారానికి ప్రొఫెసర్ల కమిటీ వేశామని, త్వరలోనే విద్యార్థులు సూచించిన విషయాలపై తమ నిర్ణయం వెల్లడిస్తామని వీసీ రాజ్‌కుమార్ చెప్పుకొచ్చారు. ఇక్కడే నిర్ణయం వెల్లడించాలని కోరడం సరికాదన్నారు. మెస్ నిర్వహణ విషయంలోనూ సభ్యులతో మాట్లాడుతానని, విద్యార్థులు తరగతులకు వెళ్లాలని వీసీ రాజ్‌కుమార్ సూచించారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీసీతో ఆవరణలో వేలాది మంది విద్యార్థులు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి 10 మంది విద్యార్థుల బృందాలను ఏర్పాటు చేసి మాట్లాడేందుకు వీసీ అవకాశం ఇచ్చారు. ఇలా బృందాలను కార్యాలయంలోకి పిలిపించుకుని జరిగిన విషయాలను తెలుసుకున్నారు. మీ వెంటే నేను... ఇదిలా ఉంటే.. ట్రిపుల్ఐటీకి చేరుకున్న ఎమ్మెల్యే వేణుగోపాలాచారి వీసీతో చర్చించాక విద్యార్థులతో మాట్లాడారు. ‘మీతోపాటే నేను’ ఉంటానని, ‘మీ సమస్యలు వీసీ దృష్టికి తీసుకెళ్లానని’ చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాంరెడ్డిని పిలిపించి మార్చి 20వరకు నీటి సమస్య తీరే లా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆ అధికారితో చెప్పించారు. తాత్కాలికంగా భైంసా మున్సిపాలిటీ నుం చి ట్రిపుల్ఐటీకి ట్యాంకర్లను పంపిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం భైంసా ఏరియా ఆస్పత్రి లో చర్చించినట్లు వెల్లడించారు. కాగా.. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల చర్చలు రాత్రి కూడా వీసీతో కొనసాగాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు.