సాక్షి, హైదరాబాద్: సైకిల్ సవారీ అంటే ఎంత ఇష్టమున్నా... అన్ని చోట్లకూ తీసుకువెళ్లలేక దాన్ని వినియోగించలేకపోతున్నవారికి ఫోల్డబుల్ సైకిల్ పేరిట సృజనాత్మక పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. కచ్‌బో డిజైన్ సంస్థకు చెందిన ఇరువురు ఐఐటీ పూర్వ విద్యార్థులు ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించారు.
బంజారాహిల్స్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో ఆదివారం ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ హార్న్ బ్యాక్ బైస్కిల్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఐఐటీ పూర్వ విద్యార్థులు నిషిత్ పారిఖ్, రాజ్‌కుమార్ కేవత్ మాట్లాడుతూ.. సైకిల్‌ని నడపడంతో పాటు దాన్ని చేతులతో క్యారీ చేయడానికి కూడా వీలుగా రూపొందిందన్నారు. ఒక్కసారి చార్జి చేస్తే 30 కి.మీ దాకా మైలేజ్ ఇస్తుందన్నారు.
(చదవండి: ‘మానాల’ మళ్లీ పురుడు?)
Comments
Please login to add a commentAdd a comment