Basara triple IT
-
బాసర ట్రిపుల్ ఐటీలో 1,404 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్/బాసర/భైంసా: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 1,404 సీట్లు కేటాయించారు. టెన్త్‌లో ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సీట్లు ఇస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను, సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ వెంకటరమణ, జాయింట్ కనీ్వనర్ పావని, దత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీట్లు పొందిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. టెన్త్ మార్కుల్లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఠీఠీఠీ.టజuజ్టు. ్చఛి.జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ ఈనెల 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ వెంకటరమణ తెలిపారు. వరుస క్రమంలో 8వ తేదీన 1 నుంచి 500 వరకు, 9న 501 నుంచి 1000 వరకు, 10న 1,001 నుంచి 1,404 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు, స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులను ఈనెల 4న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి 976 మంది బాలికలు (69 శాతం), 428 మంది బాలురు (31 శాతం) ఎంపిక చేశారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 95 శాతం మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. ఈ విద్యాసంవత్సరంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 330 సీట్లు రాగా ట్రిపుల్ఐటీ ఉన్న నిర్మల్ జిల్లా విద్యార్థులు 72 సీట్లు దక్కించుకున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ–2 చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో మంగళవా రం ఉరివేసుకున్నాడు. సిద్ది పేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఇటీవలే ఇంటికి వెళ్లి ఈ నెల 12న క్యాంపస్‌కు తిరిగివచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అరవింద్‌ను అధికారులు పరీక్షకు అనుమతించలేదని సమాచారం. దీంతో మన స్తాపం చెందిన అరవింద్..తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. మృతికి కళాశాల యాజమాన్యమే కారణం తొగుట(దుబ్బాక): తమ కుమారుడు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని అరవింద్ తల్లిదండ్రులు ఆరోపించారు. అరవింద్‌కు నాలుగు నెలల క్రితం డెంగీ సోకిందని, చికిత్స చేయించుకొని తిరిగి కళాశాలకు వెళ్లాడని వారు చెప్పారు. అయితే హాజరుశాతం తక్కువగా ఉందని, పరీక్షలకు అనుమతించమని చెప్పారని, దీంతో ఫీజు కట్టడానికి తాను డబ్బులు పంపామన్నారు. అయినా తమ కుమారుడిని పరీక్షలకు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఐదు నెలల్లో ముగ్గురు ♦ బాసర ఆర్జీయూకేటీలో గడిచిన ఐదునెలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2023, నవంబర్ 25న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ∙2024, ఫిబ్రవరి 22న రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.శిరీష ఆత్మహత్య చేసుకుంది. ♦ తాజాగా అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ 2023–24 విద్యాసంవత్సరంలో ఆర్జీయూకేటీలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాసరలోనే ఎక్కువ మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్యాంపస్‌లో ఉండే అధికారులు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. 9 వేల మంది విద్యార్థులు చదివే క్యాంపస్‌లో విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
Basara IIIT: వాడు లేని జీవితం నాకొద్దు!
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రాణంగా ప్రేమించిన బావ మృతిని తట్టుకోలేకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు లేఖ రాసింది. వర్సిటీ అధికారుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన తెనుగు శిరీష(17) గురువారం తన ఇంటి నుంచి వర్సిటీకి వచ్చింది. గంగా హాస్టల్లోని తన 117 గదిలోనే సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది క్యాంపస్ హెల్త్‌సెంటర్‌కి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. శిరీష మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులకు ఆమె రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె బావ ఈ మధ్యే మృతి చెందగా.. అది తట్టుకోలేకే శిరీష బలన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శిరీష మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నేటి 'సీఎం'ను ఆనాడు రానివ్వనేలేదు!
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.. ఇక్కడ చదివే పిల్లల ఇబ్బందులు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్ఐటీ ఎప్పుడు వార్తల్లో నిలిచేది. బాసరలో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడి విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రహస్య క్యాంపస్‌గా మారింది. మీడియాకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మేధావులకు ఎవరైనా సరే లోపలికి అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు చదివే ఈ విశ్వవిద్యాలయంలో ఏమి జరుగుతుందోనని తెలియక పోషకులు ఆందోళనకు గురవుతున్నారు. మీడియాకు నో ఎంట్రీ 2022 ఆగస్టు 7న బాసర ట్రిపుల్ఐటీకి గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన తమిళిసై పర్యటన కవరేజీకి వెళ్లిన మీడియాను అధికారులు అనుమతించ లేదు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉంచారు. మీడియాతో పాటు ఉదయం వేళ ట్రిపుల్‌ఐటీలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించ లేదు. గవర్నర్ బాసర ట్రిపుల్ఐటీ నుంచి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే మీడియాతో గవర్నర్ తమిళసై మాట్లాడారు. ఇప్పటికై నా మారేనా? నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరిని అనుమతించలేదు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజాభవన్‌గా మార్చి అక్కడే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం నేటికి పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తీరిక లేక.. విద్యార్థులకు ప్రతీరోజు క్రీడలు ఆడుకునేలా షెడ్యూల్ ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తి అవుతుంది. క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైన చెవులకు ఇంపైనా సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. అవేవి ఇక్కడ జరగడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను చర్చించాలి. ఇకనైనా విద్యార్థులపై శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు. నేటి సీఎంకు అప్పట్లో నో ఎంట్రీ.. నేటి సీఎం రేవంత్‌రెడ్డికే అప్పట్లో బాసర ట్రిపుల్‌ఐటీలో అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోడ దూకివచ్చిన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ గేటుద్వారా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇవి చదవండి: పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు -
బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా, నారాయణఖేడ్: బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ–1 చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన బబ్లూ గతనెల 31న బాసర ట్రిపుల్‌ఐటీలో చేరాడు. నాలుగు రోజులుగా నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సోమవారం నుంచే విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. పీయూసీ–1లో అడ్మిషన్ పొందిన జాదవ్ బబ్లూ తరగతులకు హాజరైన రెండోరోజే హాస్టల్ బ్లాక్‌లో ఉరేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత సమస్యలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. కాగా ట్రిపుల్‌ఐటీలో రెండు నెలల క్రితం జూన్ 14న సిద్దిపేట జిల్లాకు చెందిన బోర లిఖిత అనే విద్యారి్థని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగిన కొద్దిసేపటికే ‘‘నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగాడు.. కొద్ది సేపటికే మీ బిడ్డ చనిపోయాడని కళాశాల నుంచి పిడుగులాంటి వార్త విని గుండె పగిలినంత పని అయింది’అని జాదవ్ బబ్లూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నా బిడ్డ చక్కగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగుతాడనుకుంటే గర్భశోకం మిగిల్చాడని భోరుమని విలపించారు. ఇలా ఎందుకు చేశాడో తెలియదని విలపించారు. కాంగ్రెస్ ఆందోళన.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నిర్మల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లేందుకు యతి్నంచారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పటికే బాసరలో 20మంది విద్యార్థులు చనిపోయారనీ, ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే పాలకులు స్పందిస్తారని కాంగ్రెస్ నియోజకవర్గ నేత కూచాడి శ్రీహరిరావు ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే సీఎం కేసీఆర్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాగా ట్రిపుల్ ఐటీ అధికారులు బబ్లూ మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలని నినదించారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Basara IIIT: మరో బలవన్మరణం
సాక్షి, నిర్మల్: భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం.. విద్యార్థుల్ని బలిగొంటోందా?. ఫుడ్ పాయిజన్లు, విద్యార్థుల సమస్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరో అఘాయిత్యం జరిగింది. మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా ప్రకటించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆ క్యాంపస్‌లోనే చదువుతున్న తన సోదరుడితో మాట్లాడాడు కూడా. ఈ క్రమంలో గదిలో అచేతనంగా వేలాడుతూ కనిపించిన జాదవ్‌ను హుటాహుటిన భైంసా ఆస్పత్రికి తరలించింది ట్రిపుల్ ఐటీ సిబ్బంది. అయితే అప్పటికే జాదవ్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఉద్రిక్తత జాదవ్ క్యాంపస్‌లో చేరి నెల కూడా కాలేదు. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డానని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బబ్లూ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాల్సిన నేపథ్యంలో భైంసా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉండడంతో.. భారీగా పోలీసులు మోహరించారు. వీసీ విచారం నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ మానసిక సమస్యలతో చనిపోయాడు. మధ్యాహ్నాం ఉరివేసుకోని అత్మహత్యచేసుకున్నాడు. ఇది విచారకరమైన ఘటన. కిందటి నెల 31వ తేదీన అడ్మిషన్ తీసుకున్నాడు. అతని అన్న కూడా ట్రిపుల్ ఐటీలోనే చదువుతున్నాడు. మధ్యాహ్నాం అతనితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న సమస్యను బబ్లూ సోదరుడితో కూడా చెప్పుకోలేదు. ఆత్మహత్యకు పాల్పపడటం బాధాకరం. ::: వీసీ వెంకటరమణ నాలుగో ఘటన ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సర కాలంలో నలుగురు మృత్యువాత చెందారు. డిసెంబర్లో ఒకరు, ఈ ఏడాది జూన్‌లో ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు జాదవ్ మృతితో ఆ సంఖ్య నాలుగుకి చేరింది. దీంతో అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. విద్యార్థుల బలవన్మరణాలపై క్యాంపస్ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. అయితే.. ప్రాణం తీసుకునేంత ఒత్తిడికి విద్యార్థులు ఎందుకు చేరుకుంటున్నారు? అసలు వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు విద్యారంగ నిపుణులు. -
మహారాష్ట్రలో దొరికిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి బన్నీ మంగళవారం మహారాష్ట్రలో దొరికాడు. గురువారం వర్సిటీ నుంచి ఔట్ పాసు తీసుకుని వెళ్లిన బన్నీ ఇంటికి వెళ్లలేదు. స్నేహితులకు కూడా చెప్పకుండా సెల్ స్విచాఫ్ చేయడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు బాసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాసర ఎస్ఐ మహేశ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ పుటేజీలు పరిశీలించగా గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర వైపు వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. బన్నీ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో మహారాష్ట్ర వెళ్లిన పోలీసులు.. పర్బనీ జిల్లా పూర్ణ ప్రాంతంలో అతడు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లి బన్నీని అక్కడే వారికి అప్పగించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బాసర పోలీసులు తెలిపారు. -
సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల నోటిఫికేషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తు గడు వు పెంచినా ఈ ఏడాది ఆన్లైన్లో ఎక్కువగా దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఏడాది 1,404 జనరల్ సీట్లు, 96 ప్రత్యేక సీట్లు, 105 గ్లోబల్ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 1,605 సీట్లకుగాను కేవలం 13,538 దరఖాస్తులు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ తెలిపారు. జూలై 3న మెరిట్జాబితాను విడుదలచేసి ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తగ్గిన దరఖాస్తులు: నాలుగేళ్లుగా 20 వేలకుపైగానే ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తులు రాగా, ఈ ఏడాది సగానికి తగ్గిపోయాయి. బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం వేలాదిమంది పోటీపడేవారు. ప్రారంభం నుంచే ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండేది. ఈ ఏడాది అనుకోని విధంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. వరుస ఘటనలే కారణమా.. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ దర ఖాస్తుల నోటిఫికేషన్ వెలు వడిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇక్కడ చదివించేందుకు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. నిబంధనలపేరిట ట్రిపుల్‌ఐటీని రహస్య క్యాంపస్‌గా తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలన వేగవంతం బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల చదువు కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతంచేసేందుకు 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తికానుంది. – ప్రొఫెసర్ వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
నిర్మల్: చదువుల తల్లులుగా నిలవాల్సిన వాళ్ల చావుల వెనుక కారణాలేంటి.? ఆత్మహత్యలు చేసుకునేంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? మొన్న దీపిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లిఖిత చనిపోవడం వెనుక సరైన కారణమేంటి..? భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం ఇలా విద్యార్థుల బతుకులను ఎందుకు బలి తీసుకుంటోంది..? అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? ఇవీ..సాధారణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు. ఈనెల 13న బలవన్మరణానికి పాల్పడిన సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక (17) మృతిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అదేరోజు నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా ఇప్పటికీ కారణాలు బయటపెట్టకపోవడం సందేహాలకు, క్యాంపస్ వాతావరణంపై అనుమానాలకు తావిస్తోంది. ఇక బుధవారం అర్ధరాత్రి తర్వాత గంగాబ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయిన లిఖిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబసభ్యులు, వర్సిటీ వర్గాలు చెబుతున్నా.. ఏదో మిస్టరీ ఉందన్న వాదనలూ బలంగా ఉన్నాయి. రాత్రి 2.30 గంటల సమయంలో లిఖిత బయటకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె మరణంపై గురువారం ఉదయం సెక్యూరిటీ గార్డులు, అధికారులు చెప్పిన వివరణలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. ఎన్నో ప్రశ్నలు..మరెన్నో అనుమానాలు ♦ విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పార్టీ లు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. పలు ప్రశ్నలూ సంధిస్తున్నాయి. ♦ పరీక్షలు రాస్తున్న సమయంలో కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ప్రాణం తీసుకునేదాకా ఎందుకు తీసుకువచ్చారు? ♦ తన మానసిక పరిస్థితిని అంచనా వేయకుండా ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు..? ♦ వర్సిటీలో విద్యార్థుల కోసం ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉండగా, వారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ♦ విద్యార్థులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో ఎవరూ, ఎందుకు లోతుగా పరిశీలించడం లేదు? ♦ స్థానికంగా ఉంటానని ఇన్చార్జిగా వచ్ఛిన వీసీ వెంకటరమణ గెస్ట్‌గానే ఎందుకు వ్యవహరిస్తున్నారు? ♦ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వర్సిటీలో వాతావరణాన్ని, అక్కడి అధ్యాపకులు, ఇన్చార్జీల తీరును నిలదీస్తున్నాయి. దీనిపై సర్కారు సీరియస్‌గా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం
-
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో మృత్యు ఘోష ఆగడం లేదు. మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత.. హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్ ఆసుప్రతికి తరలించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం నాలుగో అంతస్తు నుండి దూకడంతో భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదం అని వీసీ వెంకటరమణ అంటున్నారు.. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. ఆత్మహత్యను ఖండిస్తున్నానని, అబద్ధపు ప్రచారాన్ని నమ్మద్దని కోరుతున్నానని వీసీ అన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పరీక్ష మధ్యలో వెళ్లి ఉరేసుకుని..
సాక్షి, హైదరాబాద్/నిర్మల్ చైన్‌గేట్/భైంసా: పరీక్షలు రాస్తున్న విద్యార్థిని.. ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళ్లిపోయింది.. అలాగని హాస్టల్ గదికి కాకుండా బాత్రూంలోకి వెళ్లింది.. అందులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ఐటీలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పరీక్షల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే పరీక్ష హాల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ పలువురు విద్యార్థులను పరీక్ష సిబ్బంది, చీఫ్ వార్డెన్ మందలించారని.. దీనితో ఆందోళనకు లోనైన దీపిక బలవన్మరణానికి పాల్పడిందని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన వడ్ల దీపిక.. బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ–1 చదువుతోంది. మంగళవారం ట్రిపుల్‌ఐటీలో జరిగిన పరీక్షకు హాజరైంది. అయితే మధ్యలోనే ఆమె పరీక్ష హాల్ నుంచి బయటికి వెళ్లిపోయింది. హాస్టల్ గదికి వెళ్లాల్సిన ఆమె.. పరీక్ష హాల్ సమీపంలో ఉన్న బాత్రూంలోకి వెళ్లింది. చాలాసేపైనా ఆమె బయటికి రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో అక్కడివారు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. దీపిక బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌కు.. అక్కడి నుంచి భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్‌కు తరలించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అయితే విద్యార్థిని దీపిక ఆత్మహత్య విషయం చాలాసేపు బయటికి రాకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులను మోహరించారు. లోనికి ఎవరినీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీపిక ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షల ఒత్తిడి అంటున్న అధికారులు పరీక్షల ఒత్తిడి కారణంగానే దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ చెప్పారు. ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు సభ్యులతో కౌన్సెలింగ్ డిపార్ట్మెంట్ ఉందని, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా మని తెలిపారు. అయినా ఈ ఘటన చోటుచేసుకో వడం బాధాకరమన్నారు. దీపిక ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తేల్చేందుకు నలుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. నా బిడ్డను వేధించారు ట్రిపుల్ఐటీ సిబ్బంది, అధికారులు తన బిడ్డను వేధించారని, లేనిపోని విషయాలు చెప్పి భయభ్రాంతులకు గురిచేశారని దీపిక తండ్రి వడ్ల వీరన్న ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు కొన్ని రోజుల క్రితం తనను పిలిపించి ఆమె వాట్సాప్‌లో చాటింగ్‌లు చేస్తోందని ఆరోపించారని వివరించారు. తన బిడ్డను అడిగితే.. ట్రిపుల్‌ఐటీలో కొందరు తనపై కక్షగట్టి ఇలా చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఈ విషయాన్ని వార్డెన్‌కు, ఉన్నతాధికారులకు వివరించేందుకు తాను ప్రయత్నించినా.. పట్టించుకోలేదన్నారు. తన బిడ్డకు కౌన్సెలింగ్ చేసి దారిలో పెడతానని రాసివ్వాలని ఒత్తిడి చేశారని.. లేకుంటే సీటు రద్దు చేసి ఇంటికి పంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు దీపిక తమకు ఫోన్ చేసి సిబ్బంది అనేక రకాలుగా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. పత్తాలేని ట్రిపుల్ఐటీ అధికారులు దీపిక చనిపోయి కొన్ని గంటలు గడిచినా, రెండు ఆస్పత్రులకు మృతదేహాన్ని తరలించినా.. ట్రిపుల్ఐటీ అధికారులు, అధ్యాపకులెవరూ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసరకు సమీపంలోనే మెరుౖగెన వైద్యసేవలు అందే నిజామాబాద్ పట్టణం ఉండగా.. ఆమెను భైంసాకు ఎందుకు తరలించారని దీపిక బంధువులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమె మృతికి వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమగ్ర విచారణ జరపాల్సిందే.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాగా దీపిక ఆత్మహత్యకు ట్రిపుల్ ఐటీ అధికారులు కారణం చెప్పేంత వరకు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించేది లేదని తండ్రి వీరన్న తేల్చి చెప్పారు. ఏడాదిలో ముగ్గురు ఆర్జీయూకేటీలో సమస్యలను పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగి మంగళవారం నేటికి ఏడాది అవుతోంది. రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపకుల సంఖ్యను పెంచాలని, ఇతర వర్సిటీలతో అనుసంధానం చేయాలని, కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ ఎండనకా, వాననకా వారం పాటు ఉద్యమించారు. విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నాటి నుంచి ఇప్పటివరకు ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. బిడ్డ మార్చురీలో.. తండ్రి ఐసీయూలో.. దీపిక మృతిపై ట్రిపుల్ఐటీ అధికారులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ఆమె తండ్రి వీరన్న.. మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక నిర్మల్ జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే పలువురు బంధువులు, బీజేపీ నేతలు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు తండ్రిని తప్ప మరెవరినీ ఆస్పత్రిలోకి వెళ్లనివ్వలేదు. దీనితో బంధువులు, బీజేపీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఆస్పత్రిలో బిడ్డ మృతదేహాన్ని ఉంచిన మార్చురీవైపు వెళ్తుండగానే వీరన్న ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనితో వెంటనే ఆయనను ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వైపు మార్చురీలో బిడ్డ మృతదేహం ఉండగా.. అదే ఆస్పత్రి ఐసీయూలో తండ్రికి చికిత్స జరుగుతుండటం అందరినీ కన్నీరు పెట్టించింది. ఘటనపై కమిటీ వేశాం ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఈ ఘటన షాక్‌కు గురిచేసింది. ఇంజనీరింగ్ ఫలితాల విడుదల నేపథ్యంలోనే నేను హైదరాబాద్‌లో ఉన్నాను. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో అంతర్గత నిజ నిర్ధారణ కమిటీ వేశాం. త్వరలోనే ఘటనకు కారణాలు తెలుస్తాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ, ఆర్జీయూకేటీ -
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్‌ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్‌ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
విద్యార్థి సూసైడ్: బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన
బాసర/నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాథోడ్ సురేశ్ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో మరోమారు ఆందోళనలకు పిలుపునిచ్చారు విద్యార్థులు. తరగతులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. మేయిన్ గేట్ ముందు బైఠాయించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సురేశ్ రాథోడ్ కుటుంబానికి కోటి రుపాయలు పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే.. బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసు బలగాల మోహరింపు తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఆత్మశాంతి కోసం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదీ చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర/నిర్మల్/డిచ్పల్లి: వరుస ఘటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం మరో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ–1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్పాస్ట్ చేశాడు. అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్ మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్‌కు వచ్చిన సహచరులకు సురేశ్ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సురేశ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి చికిత్స చేశారు... గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్ గో బ్యాక్’అంటూ నినదించారు. పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సురేశ్ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు. తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్‌కు ట్విట్టర్లో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఆçస్పత్రిలో సురేశ్ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గంజాయితో సంబంధం లేదంటూ ఆవేదన రాథోడ్ సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండా. రాథోడ్ గంగారాం, సరోజ దంపతులకు సురేశ్‌తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో సురేశ్ సైతం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో గంజాయి తాగుతున్నారంటూ సురేశ్‌తోపాటు కొందరు విద్యార్థులను వారం క్రితం పిలిపించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వేధింపులతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (డ్యామిట్ కథ అడ్డంతిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి) -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, నిర్మల్/ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి యాభై మందికి పైగా విద్యార్థులు బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. వాళ్లకు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్ అంటూ వచ్చిన కథనాలను బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు తోసిపుచ్చారు. అవి సీజనల్ రోగాలని ప్రకటించారు. అస్వస్థతతో ఆరుగురే ఆస్పత్రిలో చేరారని, వాళ్లకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని ట్రిపుల్ ఐటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత పేర్కొన్నారు. చదవండి: ప్లీజ్.. తప్పించండి: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ! -
బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై గవర్నర్ ఆవేదన
-
రాత్రంతా మెస్‌లోనే విద్యార్థుల జాగారం.. ఉద్యమం ఉధృతం!
బాసర: బాసర ఆర్జీయూకేటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టటంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు.. నేడు ట్రిపుల్ ఐటీ సందర్శించనున్నారు ఎంపీ సోయం బాపూరావు. ఇదీ చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి
బాసర/సంగెం: అనారోగ్యం కారణంగా సుమారు నెల కిందట ఇంటికి వెళ్లిన బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరంగల్ జిల్లాలో ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన శాబోతు సంజయ్ కిరణ్ (18) కొంతకాలంగా కాలేయ, జీర్ణవ్యవస్థ (ప్యాంక్రియాటైటిస్) సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. జూన్ 20న కడుపునొప్పి వస్తోందని.. అన్నం తింటే వాంతులు అవుతున్నాయని చెప్పి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని తల్లిదండ్రులు వరంగల్, హనుమకొండల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈ నెల 16న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. సంజయ్ వైద్యం కోసం సుమారు రూ.16 లక్షలు వెచ్చించారు. అయినా పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంజయ్ మృతిచెందాడు. అయితే తమ కుమారుడి అనారోగ్యానికి బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనే కారణమని మృతుడి తల్లిదండ్రులు శ్రీలత, శ్రీధర్ ఆరోపించారు. ఈ ఆరోపణను వర్సిటీ అధికారులు ఖండించారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు విద్యార్థి తమ కళాశాలలోనే లేడని పేర్కొన్నారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
భారీ వర్షంలోనూ తగ్గేదే లే అంటున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత
-
జాగరణకు సిద్దమవుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు