బాసర/నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాథోడ్ సురేశ్ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో మరోమారు ఆందోళనలకు పిలుపునిచ్చారు విద్యార్థులు. తరగతులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. మేయిన్ గేట్ ముందు బైఠాయించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సురేశ్ రాథోడ్ కుటుంబానికి కోటి రుపాయలు పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే.. బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసు బలగాల మోహరింపు తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఆత్మశాంతి కోసం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment