సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ వద్ద విద్యార్థుల నిరసనలలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం విద్యార్థులకు మద్ధతు ప్రకటించడానికి బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన సీపీఐ నేత నారాయణను, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా సీపీఐ నాయకులు నినాదాలు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలోకి ఎస్ ఎఫ్‌ఐ నేతలు దూసుకెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సమస్యలు పరిష్కరించాల్సిన సర్కారు అణచివేస్తుండడంపై విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విద్యార్థుల నిరసనలకు సంబంధించి విరుద్ధ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఒకవైపు ఐటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్‌ను నియమించింది ప్రభుత్వం. మరోవైపు విద్యార్థులతో చర్చలు ఫలించాయని కలెక్టర్ ప్రకటించారు. అయితే విద్యార్థులు మాత్రం కలెక్టర్‌తో చర్చలు విఫలం అయ్యాయనే అంటున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద వరుసగా మూడో రోజుల విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని విద్యార్థులు అంటున్నారు. సీఎం కేసీఆర్ వస్తే తప్పా.. ఆందోళన విరమించమని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పన్నెండు ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ బాసర ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ మూడు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర విద్యాశాఖ, మరోవైపు స్థానిక అధికార యంత్రాంగం కల్పించుకుంటున్న చర్చలు ఓ కొలిక్కిరావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment