Basara iiit Student Suicide
-
లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు . మొన్న దీపిక అత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యార్థినిది అత్మహత్య అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా..ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మరణం ప్రమాదమే: వీసీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని తెలిపారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదమని తెలిపారు. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని తెలిపారు. నిర్మల్ ఆసుపత్రికి లిఖిత తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రెడ్డి .వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. కూతురు మరణంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.లిఖిత ఎందుకు చనిపోయిదో కారణం చెప్పడంలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతకుముందు అసుపత్రికి వచ్చిన వీసి వెంకటరమణను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చదవండి: పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయం హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అయితే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లిఖిత అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. వారం రోజుల క్రితమే హాస్టల్‌కు వెళ్లిన తమ కూతురు.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి..
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ 2 చదువుతున్న బాను ప్రసాద్ సూసైట్ నోట్ రాసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్ల తెలుస్తోంది. అయితే అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి మృతి నేపథ్యంలో అధికారులు బాసర ట్రిపుల్ ఐటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను.. -
విద్యార్థి సూసైడ్: బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన
బాసర/నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాథోడ్ సురేశ్ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో మరోమారు ఆందోళనలకు పిలుపునిచ్చారు విద్యార్థులు. తరగతులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. మేయిన్ గేట్ ముందు బైఠాయించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సురేశ్ రాథోడ్ కుటుంబానికి కోటి రుపాయలు పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే.. బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసు బలగాల మోహరింపు తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఆత్మశాంతి కోసం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదీ చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య -
ట్రిపుల్ ఐటీ ఎదుట టీడీపీ ఎంపీ ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల నష్ట పరిహారం అందజేయాలని స్థానిక ఎంపీ రమేష్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ట్రిపుల్ ఐటీ భవనం ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. నాగరాజు ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలోని పలు ట్రిపుల్ ఐటీలలో ఇటీవల విద్యార్థులు తరచుగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రమేష్ రాథోడ్ చేపట్టిన ఆందోళనలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులు వెంటనే స్పందించి కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే నాగరాజును ఆసుపత్రికి తరలించేందుకు కళాశాల యాజమాన్యం ఆలసత్వం వహించింది. దాంతో నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.