భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి బన్నీ మంగళవారం మహారాష్ట్రలో దొరికాడు. గురువారం వర్సిటీ నుంచి ఔట్ పాసు తీసుకుని వెళ్లిన బన్నీ ఇంటికి వెళ్లలేదు. స్నేహితులకు కూడా చెప్పకుండా సెల్ స్విచాఫ్ చేయడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు బాసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న బాసర ఎస్‌ఐ మహేశ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ పుటేజీలు పరిశీలించగా గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర వైపు వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. బన్నీ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో మహారాష్ట్ర వెళ్లిన పోలీసులు.. పర్బనీ జిల్లా పూర్ణ ప్రాంతంలో అతడు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లి బన్నీని అక్కడే వారికి అప్పగించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బాసర పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment