IT Student
-
మహారాష్ట్రలో దొరికిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి బన్నీ మంగళవారం మహారాష్ట్రలో దొరికాడు. గురువారం వర్సిటీ నుంచి ఔట్ పాసు తీసుకుని వెళ్లిన బన్నీ ఇంటికి వెళ్లలేదు. స్నేహితులకు కూడా చెప్పకుండా సెల్ స్విచాఫ్ చేయడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు బాసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాసర ఎస్ఐ మహేశ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ పుటేజీలు పరిశీలించగా గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర వైపు వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. బన్నీ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో మహారాష్ట్ర వెళ్లిన పోలీసులు.. పర్బనీ జిల్లా పూర్ణ ప్రాంతంలో అతడు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లి బన్నీని అక్కడే వారికి అప్పగించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బాసర పోలీసులు తెలిపారు. -
భళారే చార్కోల్ చిత్రాలు
అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేదీ కళకు అనర్హం అన్న మహాకవి శ్రీశ్రీ మాటలను నిజం చేస్తూ ఓ విద్యార్థి బొగ్గు(చార్ కోల్)తో అందమైన చిత్రాలను వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. చిన్నతనంలో చాలామంది కర్రబొగ్గుకనిపిస్తే బండలు, గోడలపై వివిధ చిత్రాలను గీస్తూ టైంపాస్ చేసేవారు. కానీ ఆ విద్యార్థి గీస్తున్న చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి. నిజంగాబొగ్గుతో ఇంత అందంగా బొమ్మలు వేయవచ్చా..? అనే ఆలోచన కలిగిస్తున్నాయి. బొగ్గుతో రాశికన్నా చిత్రాన్ని గీసి సోషల్ మీడియాలో పెడితే..ఏకంగా నటి రాశికన్నా మెచ్చుకుంది. నటీనటుల చిత్రాలతో పాటు ప్రకృతి, కరోనా కారణంగా ఎదురవుతున్న కష్టాలను చిత్రాల ద్వారా తెలియజేశాడు. లాక్డౌన్ సమయాన్ని వృథా చేసుకోకుండా బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు.. ఇప్పుడు అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు. లక్డీకాపూల్: నగరానికి చెందిన బి.పవన్ విష్ణుసాయి జైపూర్‌లోని మణిపూర్ విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.అతడి తండ్రి బి.రాము ఎక్స్ సర్వీస్‌మెన్. సీఆర్పీఎఫ్లో సేవలందించారు. తల్లి బి.రాజేశ్వరీ నగరంలోని బిట్స్‌పిలానిలో బ్యూటీషియన్. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా పవన్ నగరానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. అందుకు చార్కోల్, మైక్రోఆర్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ రంగంలో అనుభవం లేనప్పటికీ.. చిన్నతనంలో ఛాయచిత్రాలు గీసిన అనుభవానికి మెరుగులు దిద్దాడు. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడుకావడంతో పరిణితి చెందిన చిత్రకారుడి తరహాలో పవన్ ప్రకృతి అందాలకు రూపం ఇస్తూ.. పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం చార్కోల్తో ఛాయచిత్రాలు గీయడమే కాకుండా యూట్యూబ్ ద్వారా చార్కోల్, మైక్రోఆర్ట్‌పై పాఠాలు చెప్పే స్థాయికి చేరాడు. ఒకవిధంగా చెప్పాలంటే లాక్డౌన్ తనకు కెరీర్లో మార్గనిర్దేశం చేసిందని అతడు పేర్కొంటున్నాడు. టెన్త్‌లో బొమ్మలు వేసిన అనుభవానికి మరింతగా మెరుగులు దిద్దుకునేందుకు లాక్డౌన్ దోహదపడిందని చెబుతున్నారు. తన చిత్రాలకు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రసంశలు కూడా అందుతున్నాయని వివరించారు. ప్రముఖ సినీ నటి రాశిఖన్నా చార్కోల్తో గీసిన ఆమె చిత్రాన్ని మెచ్చుకుంది. ఆమె సందేశం తనకు మరింత ఊతమిచ్చిందని అతడు చెప్పారు. ఐటీ రంగంలో రాణిస్తూనే.. చార్కోల్ మైక్రోఆర్ట్ రంగంలో తన ప్రతిభ చాటుకుంటూ ఓ మంచి ఛాయచిత్రకారుడిగా నిలవాలన్నదే తన లక్ష్యమని పవన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సందేశాత్మక చిత్రాలతో సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య!
కోల్ కతా: క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆశించిన ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జాదవ్ పూర్ యూనివర్సిటీలో మంగళవారం చోటు చేసుకుంది. మనీష్ టాండన్ అనే విద్యార్ధి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాలేదని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మనీష్ తెలివైన విద్యార్ధి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందని ఆశపెట్టుకున్నాడు. కాని దురదృష్టం వెంటాడింది. రెండు కంపెనీల్లోనూ ఉద్యోగం లభించలేదు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు అని ఐటీ హెడ్ సమిరాన్ చటర్జీ తెలిపారు. మనీష్ మరణవార్తతో జాదవ్ పూర్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. -
ప్రత్యేక చట్టాలపై మహిళలు అవగాహన కల్పించుకోవాలి
మూడేళ్ల క్రితం డిసెంబర్లో... మెడిసిన్ చదివే ఓ అమ్మాయికి ఒక ఐటీ స్టూడెంట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. ఆ క్రమంలో వీరిద్దరూ నిరుడు డిసెంబరులో ఒకరోజు కలుసుకున్నారు. ఎప్పటిలా భవిష్యత్తు గురించి ఊసులాడుకున్నారు. ఆ వేళకు వీడ్కోలు తెలుపుకున్నారు. కాసేపయితే ఎవరి నివాసాలకు వాళ్లు చేరిపోయేవారే. కానీ అంతలోనే అనుకోని ఘోరం జరిగింది. గమ్యస్థానాలు చేరేందుకు వారు ఎక్కిన బస్సే వారి పాలిట శాపమయ్యింది. అందులో ఉన్న కొందరు దుర్మార్గుల చేతుల్లో ఆ అమ్మాయి గ్యాంగ్‌రేప్‌కి గురయ్యింది. తర్వాత కొన్ని రోజులకు ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. కానీ వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఆమె అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించింది. ‘ఈ సమాజంలో ఆడపిల్ల పరిస్థితి ఏమిటి?’ అనే ప్రశ్నను సంధించిపోయింది. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, మహిళా సంక్షేమం వంటి మాటలన్నిటినీ సమాధి చేసింది ఆమె మరణం. ప్రజాగ్రహం పెల్లుబికింది. మా రక్షణ కోసం మీరేం చేస్తున్నారంటూ మహిళాలోకం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫలితంగా నిర్భయ చట్టం పుట్టుకొచ్చింది. ఆ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులు చేసి, స్త్రీల మానప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మహిళల చుట్టూ ఎన్నో రక్షణ రేఖలు గీసింది. కానీ ఆ రేఖలు ఎవరినీ ఆపలేదు. ఆ సంఘటన తర్వాత కూడా ఎన్నో గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. భారతదేశంలో ప్రతి ఇరవై నిమిషాలకొక అత్యాచారం జరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. కానీ వీటిని అరికట్టడం మాత్రం అసాధ్యంగా ఉంది. మహిళలకూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాచార భూతం ఆ స్వేచ్ఛను హరించేస్తోంది. ఉన్న చట్టాలను మార్చినా, కొత్తచట్టాలను చేర్చినా అవి ఆగకపోవడానికి కారణం... వాటి పట్ల ప్రజలకు సరయిన అవగాహన లేకపోవడం, వాటి అమలులో ప్రభుత్వం, అధికారులు విఫలమవడం. కాబట్టి మొదట చేయాల్సింది నిర్భయ అయితేనేమి, ఇతర ఏ చట్టాలయితేనేమి... వాటి గురించి పూర్తి అవగాహన కల్పించాలి. దానివల్ల భయం అనేది కలుగుతుంది. తప్పు చేశారని తేలగానే జాప్యం లేకుండా శిక్షను అమలుపర్చాలి. దానివల్ల తప్పు చేయడానికి జంకే పరిస్థితి వస్తుంది. అవి చేయనంతవరకూ ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు. వాటివల్ల మహిళలకు ఒరిగేదీ ఉండదు. - అమర్త్యసేన్