ఈనెల 8 నుంచి 10వరకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్/బాసర/భైంసా: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 1,404 సీట్లు కేటాయించారు. టెన్త్‌లో ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సీట్లు ఇస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్‌లో ఎంపికైన విద్యార్థుల జాబితాను, సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్ వెంకటరమణ, జాయింట్ కనీ్వనర్ పావని, దత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీట్లు పొందిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. టెన్త్ మార్కుల్లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఠీఠీఠీ.టజuజ్టు. ్చఛి.జీn వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్
ఈనెల 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ వెంకటరమణ తెలిపారు. వరుస క్రమంలో 8వ తేదీన 1 నుంచి 500 వరకు, 9న 501 నుంచి 1000 వరకు, 10న 1,001 నుంచి 1,404 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు, స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులను ఈనెల 4న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి 976 మంది బాలికలు (69 శాతం), 428 మంది బాలురు (31 శాతం) ఎంపిక చేశారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 95 శాతం మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. ఈ విద్యాసంవత్సరంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 330 సీట్లు రాగా ట్రిపుల్‌ఐటీ ఉన్న నిర్మల్ జిల్లా విద్యార్థులు 72 సీట్లు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment