సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో మృత్యు ఘోష ఆగడం లేదు. మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత.. హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్ ఆసుప్రతికి తరలించారు.
అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం నాలుగో అంతస్తు నుండి దూకడంతో భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు.
లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ
లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదం అని వీసీ వెంకటరమణ అంటున్నారు.. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. ఆత్మహత్యను ఖండిస్తున్నానని, అబద్ధపు ప్రచారాన్ని నమ్మద్దని కోరుతున్నానని వీసీ అన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment