ఉన్నత చదువులు చదివినా.. ఉత్తమ స్థానంలో ఉన్నా.. నిండా స్వార్థం పెంచుకున్నారు. పక్కవాడికంటే ఎక్కువ సంపాదించాలన్న కక్కుర్తితో వక్రమార్గం పట్టారు. ఈ క్రమంలో తమ పిల్లల్లా చూసుకోవాల్సిన అమాయక విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని బెదిరింపులకూ పాల్పడ్డారు. వారి జీవితాలతోనూ ఆడుకునేందుకు సిద్ధమయ్యారు. చివరకు వారి బండారం బట్టబయలైంది. ‘సార్..’ అని గౌరవంగా పిలిపించుకోవాల్సిన వాళ్లు.. సమాజం ముందు దోషులుగా నిలబడ్డారు. ఇదంతా నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీ(ఆర్జీయూకేటీ)లో ఇటీవల పట్టుబడ్డ అధ్యాపకులు, ఉద్యోగులకు సంబంధించిన తతంగం. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చదువులక్షేత్రానికి దశదిశ చూపాల్సిన సర్కారు పట్టింపులేనితనం.. ఉన్నాలేనట్లు సాగే ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ పాలనతో బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిసారి ట్రబుల్‌ఐటీగా మారుతూనే ఉంది. – నిర్మల్
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008లో నిర్మల్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ప్రారంభమైంది. పేదింటి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతోముందుచూపుతో వైఎస్సార్ ప్రారంభించిన ఓ ప్రత్యేక విద్యాక్షేత్రమిది. చదువులమ్మ కొలువైన బాసరలో నెలకొల్పిన ట్రిపుల్ ఐటీ ఉత్తర తెలంగాణ విద్యార్థుల కలల చదువు.. కల్పతరువుగా విరాజిల్లుతోంది. మొత్తం 272 ఎకరాల విశాల వాతావరణంలో నెలకొల్పారు. ప్రస్తుతం ఇక్కడ ఏడువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు వందల్లో విద్యార్థులను వారి ఆశలు, ఆశయాలకు తగినట్లు ఉన్నత స్థానాలకు చేర్చింది. ఇలాంటి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)పై రాష్ట్ర సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లుగా ఈ ప్రత్యేక యూనివర్సిటీని ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ పాలనతోనే నెట్టుకొస్తోంది.
ఇప్పటికీ ఇన్‌చార్జి పాలనలోనే..
సర్కారు బడుల నుంచి, పేద కుటుంబాల్లో నుంచి వచ్చే ఆణిముత్యాలకు ట్రిపుల్‌ఐటీ ఉత్తమ విద్యనందించి, ఉన్నత స్థానాలకు చేరుస్తోంది. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో మిగిలిన ఏకైక ట్రిపుల్‌ఐటీ బాసర ఆర్జీయూకేటీ. రాష్ట్రంలో ఉన్న ఈ ఒక్క చదువుల క్షేత్రంపైనా ఏళ్లుగా వివక్ష కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదున్నరేళ్లుగా ఇన్‌చార్జి వీసీలతోనే ఇంతటి విద్యాక్షేత్రాన్ని నెట్టుకొస్తుండటమే సర్కారు తీరుకు అద్దం పడుతోంది. ట్రిపుల్ ఐటీకి సంబంధించిన చట్టాలు, నిబంధనల్లో లోపాలు ఉంటే పరిష్కరించాలని, చాన్స్‌లర్‌తో పాటు శాశ్వత వీసీని నియమించాలన్న డిమాండ్ ఏళ్లుగా వస్తూనే ఉంది. ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ ఐటీకి రెగ్యులర్ వీసీ.. అది కూడా స్థానికంగా ఉండాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నా కనీసం పట్టింపు లేదు. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను మూడేళ్లపాటు ఇన్‌చార్జీగా నియమించారు. రెండున్నరేళ్ల కిందట ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్‌కు ఇన్‌చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
కనీస భయం లేకుండా..
ఉన్నత ఆశయాలతో క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే స్థాయికి ఉన్నత చదువులు చదివిన అధ్యాపకులు దిగజారుతున్నారంటే వారిలో కనీసం భయం లేదన్న విషయం వెల్లడవుతోంది. ఇటీవల బయటపడిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. మొన్నటివరకు కెమిస్ట్రీ విభాగాధిపతిగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి వరాల తోటి అధ్యాపకుల కంటే ఎక్కువ సంపాదించాలన్న దుర్బుద్ధి, తనలోని పశుత్వాన్ని ప్రవర్తించిన తీరు గురువులను తలదించుకునేలా చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థినుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. తాను అడిగినంత డబ్బు ఇస్తే.. చెప్పినట్లు చేస్తే పాస్ చేయిస్తానని చెబుతూ వారిని బ్లాక్‌మెయిల్ చేశాడు. డబ్బులకు ఆశపడి క్యాంపస్ పరీక్ష కేంద్రం ఇన్‌చార్జి విశ్వనాథ్, ఐటీ అధ్యాపకుడు సుధాకర్, రవి వరాలతో జత కలిశారు. ముగ్గురూ కలిసి నాలుగో వ్యక్తికి తెలియకుండా ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయించే పని మొదలుపెట్టారు. దీనికి తోడు రవి వరాల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం..
వారి బలహీనతలతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఇదేక్రమంలో ఇటీవల ఓ విద్యార్థినితో తన ఇంట్లో పరీక్ష రాయించేందుకు సిద్ధమయ్యాడు. తన సెల్‌ఫోన్‌కు అసభ్యంగా మెసెజ్‌లను పంపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. రవి వరాల నిర్వాకం కేవలం అసభ్య ప్రవర్తనకే పరిమితమని మొదట అందరూ భావించారు. కానీ రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి క్యాంపస్‌కు వచ్చి పరిశీలించి, ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని చెప్పడంతో నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రవి వరాల వ్యవహారంతో తీగ లాగితే డొంక కదిలినట్లు ఫెయిలైన విద్యార్థులతో మళ్లీ పరీక్ష రాయిస్తామంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్న ముగ్గురి తతంగమంతా బయటపడింది.
దృష్టి పెట్టాల్సిన అవసరం..
గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నారు. పదో తరగతిలో జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్‌ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హా జరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల స మీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పే దింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇకముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. దృష్టి పెట్టాల్సిన అవసరం..
గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నారు. పదో తరగతిలో జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్‌ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హా జరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల స మీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పే దింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇకముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది.
పర్యవేక్షణ కొరవడటంతో..
ఏడువేల మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీకి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా రెగ్యులర్ వీసీని నియమించకపోవడంతో ఆ ప్రభావం తరచూ కనిపిస్తోంది. ఏళ్లుగా ఇన్‌చార్జి పాలనే కొనసాగుతుండటంతో ఇక్కడి వ్యవస్థలన్నీ ఇష్టారాజ్యంగా మారిపోతున్నాయి. ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ అశోక్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల తరచూ వివాదాల్లో ఇంటర్‌బోర్డు కూరుకుపోతుండటంతో ఆయన మరింతగా సంబంధిత శాఖపైనే దృష్టిపెడుతున్నట్లు సమాచారం. దీంతో బాసర క్యాంపస్‌పై పర్యవేక్షణ కొరవడుతోంది. ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్ప ఇన్‌చార్జి వీసీ క్యాంపస్‌కు రావడం లేదు. ఏఓ, రిజిస్ట్రార్‌ల పరిధిలోనే వర్సిటీ పాలన కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment