అయ్యో!.. అదుపుతప్పి నడిరోడ్డుపై పడిపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు | adilabad District BJP President Rama Devi Fell Down On Road | Sakshi
Sakshi News home page

అయ్యో!.. నడిరోడ్డుపై కిందపడిపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

Published Sun, Jul 31 2022 4:39 PM | Last Updated on Sun, Jul 31 2022 5:50 PM

adilabad District BJP President Rama Devi Fell Down On Road - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మరోసారి నిరసనల బాటపట్టారు. ఫుడ్‌ పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ట్రిపుల్‌ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

కాగా ఆందోళన చేపట్టిన విద్యార్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సంఘీభావం ప్రకటించారు. అయితే బైంసాలో పోలీసులు అడ్డుకుంటారని భావించిన రమాదేవి వారికి చిక్కకుండా ఉండేందుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో హడావుడిగా వెళ్తుండగా నడిరోడ్డుపై ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఆమెను పైకి లేపగా.. పెద్దగా గాయాలేవి తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
చదవండి: బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement