basara iiit
-
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్ ఐటీలో వాకథాన్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్‌లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మిస్సింగ్ కలకలం.. బన్నీకి ఏమైంది?
సాక్షి, బాసర: నిజామాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో మరో కలకలం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సదరు విద్యార్థి మూడు రోజులుగా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విద్యార్థి పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. దీంతో, తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వివరాల ప్రకారం.. బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ(18) ఏళ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి స్వస్థలం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి. ఈ నెల 6న తాను ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఔట్‌పాస్ తీసుకున్నాడు. వర్సిటీ నిబంధనల మేరకు సిబ్బంది అతడికి ఔట్‌పాస్ జారీ చేశారు. అయితే, బన్నీ మాత్రం ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం.. తాము ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్‌కు వచ్చి ఆరాతీశారు. కాగా, బన్నీ ఇంటికి వెళ్తుతున్నానని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా యాజమాన్యం తెలిపింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని యాజమాన్యాన్ని నిలదీశారు. బన్నీ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఇంటికి వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం -
బాసర ట్రిపుల్ ఐటీ: బాలిక ఆత్మహత్యలపై తమిళిసై ఆవేదన
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో బాలికల ఆత్మహత్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విద్యార్ధుల ఆత్మహత్యలపై వర్సిటీ తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ నివేదిక కోరారు. ఈ క్రమంలో 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై జోక్యం చేసుకోవాలని వీసీకి సూచించారు. విపరీత చర్యలకు పాల్పడవద్దని విద్యార్థులకు తమిళిసై విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం
-
బాసర: దీపిక కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్ వ్యవహారంలో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది. ఇవాళ్టి పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు ధృవీకరించకపోగా.. దీపిక మృతిపై పారదర్శకంగా విచారణ జరపాలని పోలీసులను విద్యార్థులకు కోరుతున్నారు. ఆర్జీయూకేటీ పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక.. A3 బ్లాక్‌లోని బాత్రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న దీపికను భైంసా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. అంతకు ముందు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ముగ్గురు మాస్ కాపీయింగ్‌కు పాల్పడగా.. అందులో దీపిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిబార్ భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్. వార్షిక పరీక్షల అనంతరం బాత్రూంకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్ధలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం బైంసా ఏరియాసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇదీ చదవండి: శిరీష కేసుపై నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఆదేశాలు -
అమ్మా.. నన్ను క్షమించు.. అక్కను బాగా చూసుకో..
బాసర(ముథోల్): ‘అమ్మా నన్ను క్షమించు.. అక్కను బాగాచూసుకో.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా మానసిక సమస్యలే నా చావుకు కారణం’అని బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ–2 విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఆదివారం మధ్యాహ్నం భానుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం బహిర్గతమైన ఈ సూసైడ్ నోట్లో తాను ఓసీడీ(అనవసరపు భయాందోళన)తో తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు వెల్లడించాడు. గతంలో ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నానని, చదువుపై «శ్రద్ధ పెట్టలేకపోతున్నానని, పరీక్షల్లో మార్కులు సరిగా రావడం లేదని వివరించాడు. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం, రహస్యంగా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడంపై ఆదివారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేశారు. అడ్మిని్రస్టేటివ్ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. సూసైడ్‌నోట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నోట్ బహిర్గతం చేయడంతో ఆందోళన విరమించారు. కాగా, వర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం విద్యార్థి సంఘాలతోపాటు, బీజేపీ, ఆప్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టడంతో ట్రిపుల్ ఐటీ, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు వర్సిటీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ నోట్ విడుదల
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు అందిస్తామన్నారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. క్యాంపస్‌కు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో ఉన్న చెరువును సుందరీకరణ చేస్తామని తెలిపారు. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం 10 పడకలతో కూడిన ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రపంచంతో పోటీపడే సత్తా ఉందని కొనియాడారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ తెలిపారు. అనేక స్టార్టప్‌లకు తెలంగాణ వేదికగా మారుతోందని, ప్రఖ్యాత సంస్థలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయని పేర్కొన్నారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకైనా పోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహా అనేక కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఈ కోర్సులను అర్జీయూకేటి నుంచి ప్రారంభించాలని వీసీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులను వేధించిన ఘటనలో బుధవారం ఇద్దరు కళాశాల ఉద్యోగులపై అధికారులు వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ శాఖలోని అటెండర్ విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేయగా.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడినట్టు తెలుస్తోంది. ఆ విద్యార్థిని ఇచ్చిన ఆధారాల ప్రకారం ఉద్యోగుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం. తనకు దగ్గరి బంధువులు కావడంతో పలకరించేవాడినని సదరు ఉద్యోగి చెప్పగా, అతని భార్యను కళాశాల లోని భవనంలో అధికారులు రహస్యంగా విచారించినట్టు తెలిసింది. సదరు విద్యార్థినులతో తమకు బంధుత్వం లేదని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు వివరించిన కళాశాల అధికారులు ఓ కమిటీ వేసి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, మరో ఉద్యోగికి సైతం ఈ వ్యవహారంతో సంబంధం ఉండగా.. తను విధులు నిర్వర్తించే సెక్షన్లో అవకతవకలకు పాల్పడినందుకు వేటు వేసినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై కళాశాల డైరెక్టర్ సతీ‹Ùను సంప్రదించగా.. కొందరు కళాశాల నియమాలను అతిక్రమించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏ అంశంపై కమిటీని ఏర్పాటు చేశారని ప్రశ్నించగా జవాబు దాటవేశారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్ రయ్! -
ట్రిపుల్ ఐటీలో ఇంటర్ తరహా పరీక్షలు
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారన్నారు. డిసెంబర్లో స్నాతకోత్సవం బాసర ట్రిపుల్ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్లో నిర్వహిస్తామని ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్సైట్లో వీసీ డాష్ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్ పోర్టల్‌ను ప్రారంభించారు. -
TS: ట్రిపుల్ ఐటీలో టీ-హబ్
భైంసా (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో సమస్య లన్నింటినీ పరిష్కరిస్తామని.. విద్యార్థులు ఆవిష్కర ణలపై దృష్టిపెట్టేలా టీ–హబ్‌ను ఏర్పాటు చేస్తా మని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు. ‘తక్కువ జనాభా ఉన్న అమెరికా ఉత్పత్తులు చేస్తుంటే ఎక్కువ జనం ఉన్న మనం ఇంకా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనలోనే ఉంటు న్నాం. విద్యార్థులు ఆవిష్కరణల కోసం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. త్వరలోనే 1,000 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. సోమవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్ర కరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను ఎంతమంది చూశారని కేటీఆర్ విద్యా ర్థులను ప్రశ్నించారు. అలా బాసర ట్రిపుల్‌ఐటీలోనే టీ–హబ్ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మామూలుగా ఉద్యోగాలు చేయడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఉద్యోగాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా.. కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల ఏర్పాటు ఆలోచనలు చేయాలని సూచించారు. అలాంటి ఆలోచనలున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. హాస్టల్ కష్టాలు నాకూ తెలుసు తాను చదువుకున్నప్పుడు 70శాతం జీవితం హాస్టల్లోనే గడిచిందని, హాస్టల్ కష్టాలు తనకూ తెలుసని మంత్రి కేటీఆర్ చెప్పారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో ఔట్‌డోర్ మినీ స్టేడియాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామని.. 50 అదనపు మోడల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవంబర్‌లో విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ ఇక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని విద్యార్థులకు సూచించారు. ట్రిపుల్ ఐటీ న్యూమెస్‌లో తాను వెళ్లిన బాత్రూం తలుపులు సరిగా పడలేదని.. ఇలాంటి ఇబ్బందులన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. రెండు నెలల తర్వాత విద్యా మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మళ్లీ వస్తానన్నారు. క్యాంపస్‌ను కాపాడుకోవాలి 10 వేల మంది ఉండే ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మించడం, ప్రారంభించడం సులువైన పని అని.. కానీ వాటి నిర్వహణే ప్రధాన సమస్య అని, వీటిని పద్దతిగా ఉంచే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పరిశుభ్రతకు జపాన్, సింగపూర్లలో ఇచ్చే ప్రాధాన్యతపై తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నెలలో ఒకరోజైనా శ్రమదానం చేసి.. 272 ఎకరాల్లో ఉన్న క్యాంపస్ పరిసరాలను శుభ్రంగా, చెత్తా చెదారం లేకుండా చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి నచ్చింది ట్రిపుల్ ఐటీలో విద్యార్థులంతా శాంతియుతంగా చేసిన ఉద్యమ స్ఫూర్తి తనకు బాగా నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీజీ సత్యాగ్రహం తరహాలో.. తమ సమస్యల పరిష్కారం కోసం ఎండావానలకు వెరవక వారం పాటు విద్యార్థులు చేసిన పోరాటం బాగుందని కొనియాడారు. తాను విద్యార్థుల ఆందోళనను ప్రతిరోజు చూశానని.. ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులను పిలవకుండా విద్యార్థులే ఎస్జీసీ ఏర్పాటు చేసుకుని, ఉద్యమించడం నచ్చిందని అభినందించారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశం
-
మీ పోరాటం నాకు నచ్చింది.. బాసర ట్రిపుల్ ఐటీలో కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, బాసర(ఆదిలాబాద్): కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టల్ మెస్‌లో భోజనం విషయంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. దీంతో, విద్యార్థుల ఆందోళనలు తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సైతం సృష్టించాయి. గవర్నర్ తమిళిసై సహా పలువురు రాజకీయ నేతలు సైతం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి.. విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్.. సోమవారం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ సందర్భంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ ఆరా తీశారు. విద్యార్థులతో సమావేశమై.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమలోనే వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మీ పోరాటం నాకు నచ్చింది. రాజకీయాలకు తావు లేకుండా ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా పోరాటం చేసి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మెస్ సరిగా లేదన్న విషయం ఇప్పటికే గుర్తించాము. ప్రతీరోజు మంచి ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాము. విద్యార్థులకు త్వరలోనే ల్యాప్‌టాప్‌లు ఇస్తాము. హాస్టల్లో ఉండే కష్టాలు నాకు కూడా తెలుసు. మెస్‌ల్లోనూ, బాత్రూమ్లోనూ ఉండే ఇబ్బందులు నాకూ తెలుసు. నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఇక్కడున్న సమస్యలు తెలుసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మరో రెండు నెలల తర్వాత మళ్లీ ట్రిపుల్ ఐటీకి వస్తాను. ట్రిపుల్ ఐటీలో వసతులను మరింత అభివృద్ధి చేసాము’ అంటూ హామీ ఇచ్చారు. -
బాసరకు మంత్రి కేటీఆర్
నిర్మల్: ఎట్టకేలకు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కలవనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఆర్జీయూకేటీకి రానున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడకు వెళ్లనున్నారు. అక్కడ జోగు రామన్నను పరామర్శించి బాసరకు రానున్నారు. విద్యార్థులతో మాటాముచ్చట.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు ఆర్జీయూకేటీ చేరుకోనున్నారు. ముందుగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత వారితో మాట్లాడనున్నారు. రెండు గంటలు కేటీఆర్‌తోపాటు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి వర్సిటీలో ఉండనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇందుకు సీఎం లేదా మంత్రి కేటీఆర్ తమవద్దకు రావాలని జూన్‌లో విద్యార్థులు వారంపాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడిచ్చిన హామీ మేరకు కేటీఆర్ క్యాంపస్‌కు వస్తున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. -
విద్యార్థుల సమస్యలపై సీఎంకు లేఖ రాస్తా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బాసర ట్రిపుల్ ఐటీతోపాటు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లాలోని బోనకల్ ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. గురుకులంలో 550 మంది విద్యార్థులు ఉండగా, సరిపడా గదులు, పడకలు లేక నేలపైనే పడుకుంటున్నట్లు బాలికలు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల సందర్శన అనంతరం భట్టి ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను స్వయంగా పరిశీలించి విద్యార్థుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావే శాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. బాసర ట్రిపుల్ ఐటీతో పాటు సిద్దిపేట, మహబూబాబాద్, మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులు పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడతానని భట్టి తెలిపారు. -
డిచ్ పల్లి చేరుకున్న విద్యార్థి సురేశ్ మృతదేహం
-
బాసర ట్రిపుల్ ఐటీలో సురేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర/నిర్మల్/డిచ్పల్లి: వరుస ఘటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం మరో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ–1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్పాస్ట్ చేశాడు. అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్ మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్‌కు వచ్చిన సహచరులకు సురేశ్ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సురేశ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి చికిత్స చేశారు... గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్ గో బ్యాక్’అంటూ నినదించారు. పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సురేశ్ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు. తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్‌కు ట్విట్టర్లో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఆçస్పత్రిలో సురేశ్ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గంజాయితో సంబంధం లేదంటూ ఆవేదన రాథోడ్ సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండా. రాథోడ్ గంగారాం, సరోజ దంపతులకు సురేశ్‌తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో సురేశ్ సైతం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో గంజాయి తాగుతున్నారంటూ సురేశ్‌తోపాటు కొందరు విద్యార్థులను వారం క్రితం పిలిపించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వేధింపులతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (డ్యామిట్ కథ అడ్డంతిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి) -
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
-
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల తొలి జాబితా విడుదల
బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాల తొలి జాబితాను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో 1,404 సీట్లకుగాను మెరిట్ జాబితాను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ విడుదల చేశారు. జాబితాను వర్సిటీ అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో తొలిజాబితాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 212 సీట్లు దక్కగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాకు 07 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపికైనవారిలో 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులేనని అధికారులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పాలిసెట్‌లో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేయడంతో 60 శాతం సీట్లు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకే దక్కాయి. కానరాని ఆసిఫాబాద్, నారాయణపేట తొలి జాబితాలో కుమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలకు ఒక్క సీటూ దక్కలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్ జిల్లాకు చోటు లభించకపోవడం గమనార్హం. పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 258 సీట్లు దక్కగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 63 సీట్లు రావడం గమనార్హం. మొదటిదశ కౌన్సెలింగ్ మూడురోజులపాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 28న 1 నుంచి 500 వరకు, 29న 501 నుంచి 1,000 వరకు, 30న 1001 నుంచి 1,404 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటిసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం(140) సీట్లను కేటాయించినట్లు తెలిపారు. తొలి జాబితాలో73 శాతం బాలికలే ఉన్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. -
సమస్యలు నాకు వదిలేయండి..
భైంసా: ‘మీ డిమాండ్లు న్యాయమైనవి. అవన్నీ పరిష్కరించదగ్గవే. సమస్యలను నాకు వదిలేయండి.. చదువుపై దృష్టిపెట్టండి. మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’అని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులకు హామీ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వర్సిటీ సందర్శన కోసం హైదరాబాద్ (కాచిగూడ) నుంచి శనివారం రాత్రి 11:30 గంటలకు రామేశ్వరం–ఓఖా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన గవర్నర్ తమిళిసై.. అర్ధరాత్రి 2:40 గంటలకు నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం వేకువజామున 4 గంటలకు బాసర చేరుకొని తొలుత వర్సిటీ గెస్ట్‌హౌస్‌లో 3 గంటలపాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వర్సిటీకి చేరుకున్నారు. 6 గంటలు వర్సిటీలో.. క్యాంపస్‌లోని పరిసరాలను గవర్నర్ తమిళిసై తొలుత పరిశీలించారు. విద్యార్థుల వసతిగృహాలు, బాత్రూంలలో వసతులను చూశారు. విద్యార్థులతో కలసి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో వండిన వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తర్వాత అధికారులతో భేటీ అయ్యారు. ఆపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు 6 గంటలపాటు వర్సిటీలోనే గడిపారు. మంచి భోజనం, వసతి, మెరుగైన బోధన కోరుతున్నారు.. వర్సిటీ నుంచి తిరుగు ప్రయాణంలో క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఇబ్బందులు న్యాయమైనవేనని.. వారంతా మంచి భోజనం, వసతి, మెరుగైన బోధన కావాలని అడుగుతున్నారని చెప్పారు. అవన్నీ కల్పించడం పెద్ద విషయమేకాదన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడంలేదని.. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదన్నారు. వర్సిటీలో సిబ్బంది కొరత, భద్రతాపరమైన ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. విద్యార్థులకు తన వంతుగా నైతిక స్థైర్యం అందించానని గవర్నర్ తెలిపారు. విద్యార్థులకు తరచూ మెడికల్ చెకప్‌లు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇకపై ఒక్కో సమస్య తీరుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. తెలంగాణ వర్సిటీలో పరిశోధనలు పెరగాలి.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు మరింత పెరగాలని గవర్నర్ తమిళిసై సూచించారు. నూతన ఆవిష్కరణలతోనే జాతీయ స్థాయిలో పేరు వస్తుందని, పరిశోధనలు అత్యున్నత స్థాయిలో ఉంటే తెలంగాణ యూనివర్సిటీని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకుళ్లడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘న్యాక్’ఏ–గ్రేడ్ ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ సందర్శన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎన్ఎస్ఎస్ కేడెట్లు, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎంసీఏ కళాశాలలో విద్యార్థులతో తమిళిసై సమావేశమయ్యారు. అధ్యాపకులు, భవనాల కొరత గురించి విద్యార్థులు చెప్పగా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లైబ్రరీని, బాలికలు, బాలుర వసతిగృహాలను గవర్నర్ పరిశీలించారు. వర్సిటీ అతిథిగృహంలో భోజనం చేశారు. మధ్యాహ్నం 3:28 గంటలకు డిచ్పల్లి రైల్వేస్టేషన్ నుంచి అకోలా–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, గవర్నర్ పర్యటనలో కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. వర్సిటీల సందర్శన తొలిసారి... 2008లో బాసర ట్రిపుల్ ఐటీ ఏర్పాడ్డాక విద్యార్థుల సమస్యలు తెలుసుకొనేందుకు ఒక గవర్నర్ క్యాంపస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న తొలి గవర్నర్ తమిళిసై కావడం విశేషం. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటయ్యాక క్యాంపస్‌కు వచ్చిన తొలి చాన్స్‌లర్ సైతం తమిళిసై సౌందరరాజనే కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి -
బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!
నిర్మల్: సరిగ్గా ఇరవై రోజుల క్రితం బాసర ట్రిపుల్ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్‌లో తిన్న విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన కేంద్రీయ భండార్ మెస్‌లోనే తాజాగా స్నానాల సీన్ బయటకు వచ్చింది. వంటగదిలోనే..: ఇరువైపులా.. విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరు సగా ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా.. వర్సిటీ అధికారుల తీరు మారడంలేదు. ‘‘వర్సిటీని ప్రక్షాళన చేస్తున్నాం. వార్డెన్లు, మెస్ ఇన్చార్జిలను నియమిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం’’ అంటూ ఉన్నతాధికారులు తరచూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు లేదు. ఇలా.. వంటగదిలో స్నానాలు, నాణ్యతలేని ఆహారం య«థావిధిగా కొనసాగుతున్నాయి. అసలు చర్యలేవి..: ఫుడ్‌పాయిజన్ అయి 20 రోజులవుతోంది. ఘటనకు కారణమైన కేంద్రీయ భండార్, ఎస్ఎస్ మెస్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. యథావిధిగా ఆ మెస్ కాంట్రాక్టర్లనే ఇంకా కొనసాగి స్తున్నారు. కేంద్రీయ భండార్ కాంట్రాక్టర్‌కు బడానేతలు, అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
ఇన్చార్జి వీసీ పోస్టు నుంచి తప్పించండి: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ!
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రొఫెసర్ వి.వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. విద్యార్థుల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత ఓవైపు.. అక్కడి ఆందోళనలను గట్టిగా అణచివేయాలని పైనుంచి వచ్చిన ఆదేశాలు మరోవైపు.. ఆయనపై ఒత్తిడి పెంచాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, సీఎంవోలోని ఓ ముఖ్యమైన అధికారికి మొరపెట్టుకున్నట్టు సమాచారం. విద్యార్థుల ఆందోళనలు ఉధృతమై.. బాసర ట్రిపుల్ ఐటీకి కొన్నేళ్లుగా వైస్ చాన్స్‌లర్‌ను నియమించలేదు. అక్కడి తాత్కాలిక ఉద్యోగులు, భోజనాల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని భోజనం పెడుతున్నారని, పురుగుల అన్నం పెట్టినా మాట్లాడే దిక్కులేకుండా పోయిందని నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల ఆహారం కల్తీ అయి విద్యార్థులు అనారోగ్యం పాలవడంతో ఇది మరింత ఉధృతమైంది. గట్టిగా అణచివేయాలనే ఆదేశాలతో.. మరోవైపు గత నెలలో ఇన్చార్జి వీసీగా వెంకటరమణను ప్రభుత్వం నియమించింది. విద్యార్థుల డిమాండ్లను వేగంగా పరిష్కరిస్తానని ఆయన వచ్చిన కొత్తలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆందోళనపై కఠినంగా వ్యవహరించాలని పైనుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే ఆందోళన బాటపట్టిన విద్యార్థులను సస్పెండ్ చేస్తామని వెంకటరమణ హెచ్చరించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదుట తాను దోషిగా నిలబడాల్సి వస్తోందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. మెస్ కాంట్రాక్టు విషయంలోనూ.. బాసర ట్రిపుల్ ఐటీలో 6 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి భోజనాలు అందించేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లున్నారు. వీరిలో ఒక్కరే కీలకమని, మిగతా ఇద్దరూ అతడి బినామీలేనని ఆరోపణలు ఉన్నాయి. భోజనాల పని కోసం మొత్తం 400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా బాసర పరిసర ప్రాంతాలకు చెందిన వారే. మరోవైపు విద్యార్థుల డిమాండ్ మేరకు ప్రస్తుత కాంట్రాక్టర్ ను తొలగించి.. మద్రాసుకు చెందిన మరో కాంట్రాక్టర్‌కు అప్పగించాలని విద్యా శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. సదరు కాంట్రాక్టర్ ప్రస్తుతమున్న స్థానిక సిబ్బంది అందరినీ తొలగించాలని.. తాను వేరే ప్రాంతాల నుంచి సిబ్బందిని తెచ్చుకుంటానని షరతు పెట్టగా.. అధికారులు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే తనకు తెలియకుండానే విద్యా శాఖ ఈ నిర్ణయాలు తీసుకుందని.. స్థానికుల దృష్టిలో మాత్రం తానే తప్పుచేసినవాడిని అవుతున్నానని ఇన్చార్జి వీసీ ఆందోళనకు లోనవుతున్నట్టు తెలిసింది. కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు వచ్చాయి ఇక్కడ స్థానిక రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాస్త కఠినంగా వ్యవహరించాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా అమలు చేయాలనే నిర్ణయించుకున్నాను. బాధ్యతల నుంచి తప్పుకొంటానని ఏమీ కోరలేదు. – ప్రొఫెసర్ వెంకటరమణ, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ -
నియోజకవర్గ సమస్యపై స్పందిస్తే, ఎంపీని అరెస్టు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును అరెస్టు చేయడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సొంత నియోజకవర్గం పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ‘విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లరు, వేరేవాళ్లను వెళ్లనీయరు’అని విమర్శించారు. బాబూరావును ఎందుకు అరెస్టు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దీనావస్థలో కేసీఆర్ ఉన్నారన్నారు. బాబూరావును అరెస్టు చేయొద్దని బీజేపీ కార్యకర్తలు కోరినందుకు వారిపైకి పోలీసు జీపులు ఎక్కిస్తూ చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా మన్మధ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. చాలామంది పోలీసులకు కేసీఆర్ నైజం తెలిసిపోయి నిజాయితీగానే వ్యవహరిస్తున్నారని, కానీ కొంతమంది మాత్రం టీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ బాసర విద్యార్థులు సంయమనంతో ఉన్నారని, ప్రభుత్వం, సీఎం మొద్దునిద్రలో ఉన్నారని తెలిసే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్నారని సంజయ్ అన్నారు. బాబూరావును వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. -
మీరు తెలుసుకోరు, మమ్మల్ని తెలుసుకోనివ్వరా? వాళ్లంతా ఎమ్మెల్సీ సంబంధీకులే
ఆదిలాబాద్ రూరల్/లోకేశ్వరం (ముధోల్): సమస్యలు పరిష్కరించాల్సిందిగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నెల రోజుల నుంచి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు తెలుకోవడం లేదని.. మరో పక్క విద్యార్థులను కలవకుండా తమను అడ్డుకుంటోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఆదివారం ఆయన ఆదిలాబాద్ నుంచి బాసరకు బయల్దేరగా, లోకేశ్వరం మండలం అర్లి వంతెన వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎంపీని స్టేషన్‌కు తరలించకుండా భైంసా మార్గంలో ఆదిలాబాద్‌కు తరలించారు. నా నియోజకవర్గంలో నేను తిరగొద్దా.. పోలీసులు తనను ట్రిపుల్ ఐటీకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని ఎంపీ సోయం బాపూరావు తప్పుబ ట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో తిరగొద్దా’అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీలోని మెస్ కాంట్రాక్టర్లు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యక్తులు కావడంతోనే నాణ్యతలేని సరుకులతో భోజనం వడ్డిస్తున్నా, చివరకు ఫుడ్ పాయిజన్ జరిగినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారని ఎంపీ ఆరోపించారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళన
బాసర/సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం ఆదివారం కూడా తమ నిరసన కొనసాగించారు. విద్యార్థులు శనివారం రాత్రి భోజనం బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం వారు ఫలహారం కూడా చేయలేదు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. అయితే మధ్యాహ్నం తల్లిదండ్రులు, ఎస్జీసీ కమిటీ విన్నపం మేరకు భోజనం చేశామన్నారు. అయితే భోజనం చేసినంత మాత్రాన ఆందోళన విరమించినట్టు కాదని ఈ1, ఈ2 విద్యార్థులు ఒక వీడియోను విడుదల చేశారు. ఫుడ్‌పాయిజన్ జరిగిన మెస్‌ల కాంట్రాక్టు రద్దు చేయడంతోపాటు మెస్‌ల నిర్వహణ నుంచి ప్రస్తుతం ఉన్న వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ట్రిపుల్ ఐటీలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థులకు అవసరమయ్యే 3 వేల లాప్‌టాప్‌లకు రూ.9 కోట్లు కావాల్సి ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా, అవసరమైతే బర్తరఫ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు వారి సమస్యలను డైరెక్టర్ సతీశ్‌కుమార్ దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సమయం ఇస్తామని తెలిపారు. కాగా, విద్యార్థులతో రాతరి పొద్దుపోయాక డైరెక్టర్ సతీశ్ చర్చించారు. విద్యార్థుల సమస్యలను సోమవారం నుంచి పరిష్కరిస్తామని, విద్యార్థులు యధావిధిగా తరగతులకు హాజరవుతారని ప్రకటించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం లేఖ రాశారు. -
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.. మంత్రి సబితా ఇంటివద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే బాసర విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సబితా ఇంటి ముట్టడికి ప్రయత్నించిన పేరెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మంత్రి ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ. తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, పిల్లల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినట్లు వెల్లడించారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థుల హెచ్చరించారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. మంత్రి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. -
అయ్యో!.. అదుపుతప్పి నడిరోడ్డుపై పడిపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి నిరసనల బాటపట్టారు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా ఆందోళన చేపట్టిన విద్యార్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సంఘీభావం ప్రకటించారు. అయితే బైంసాలో పోలీసులు అడ్డుకుంటారని భావించిన రమాదేవి వారికి చిక్కకుండా ఉండేందుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో హడావుడిగా వెళ్తుండగా నడిరోడ్డుపై ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఆమెను పైకి లేపగా.. పెద్దగా గాయాలేవి తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్ -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్
Basara IIIT.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా ట్రిపుల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బీజేపీ నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల కిత్రం బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టడంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని పట్టబట్టారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. బాసర IIITలో మళ్లీ విద్యార్థుల ఆందోళన. ఫుడ్ పాయిజన్ అయిన మెస్ పై చర్యలు తీసుకోక పోవడంతో మెస్ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులు. అర్ధరాత్రి వరకు కొనసాగిన iiit బాసర విద్యార్థుల నిరసన.#iiitbasara@kcvenugopalmp @Allavaru @srinivasiyc @manickamtagore @revanth_anumula @IYCTelangana pic.twitter.com/0Kh4ACHBOP — Arun Valmiki (@Arun_valmiki_) July 31, 2022 ఇది కూడా చదవండి: ‘రామగుండం’లో కొలువుల స్కాం! -
బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
-
ఆ విద్యార్థులు భయపడ్డట్లే అయింది: షర్మిల
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు భయపడ్డట్టే అయిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ తిండి తింటే చస్తామని ఆ విద్యార్థులు ఎంత మొత్తుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సరైన తిండి పెట్టండంటూ విద్యార్థులు దీక్షలు చేపట్టినా ప్రభుత్వానికి పట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నందు వల్లే ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి చెందాడని షర్మిల ఆరోపించారు. విద్యార్థులకు కలుషిత అన్నం పెట్టి మరో చావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమయ్యారంటూ ధ్వజమెత్తారు. మాట ఇచ్చిన నెలలోపే కలుషిత ఆహారానికి వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఇంకెంత మందిని బలి తీసుకుంటారు దొరా? అని ప్రశ్నించారు. కనీసం ఇప్పుడైనా మీ ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా? అని నిలదీశారు. చదువుకునే పిల్లలకు సరైన తిండిపెట్టని సర్కార్ ఉంటే ఎంత! ఊడితే ఎంతంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. -
రూ.7.45కే రుచీ, శుచీ ఎలా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విద్యాశాఖ జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలు తలనొప్పిగా మారాయని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యతకు స్కూల్ హెచ్ఎంలనే బాధ్యులను చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు తనిఖీ సమయంలో సరైన లెక్క చెప్పకపోయినా హెచ్‌ఎంలపైనే చర్య తీసుకుంటామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హెచ్‌ఎంల్లో మరింత కంగారు మొదలైంది. మార్కెట్లో నిత్యావసరాలు మండిపోతుంటే, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటితే నిబంధనల ప్రకారం నాణ్యత ఎలా సాధ్యమనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భోజనం ఎంత మందికి పెట్టామనే వివరాలను అధికారులకు పంపాలని కోరడం పెద్ద తలనొప్పి అని చెబుతున్నారు. దీనివల్ల బోధన పర్యవేక్షణ దెబ్బతింటుందని వాపోతున్నారు. ప్రతిబంధకంగా నిబంధనలు ►రాష్ట్రవ్యాప్తంగా 24 వేల బడుల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.7.45 మాత్రమే ఇస్తారు. స్థానిక మహిళా సంఘాలకు స్కూల్ నుంచి బియ్యం మాత్రమే ఇస్తారు. మిగతావన్నీ వాళ్ళే కొని తెచ్చుకోవాలి. ►దీనికి రూ.7.45 ఏమేర సరిపోతాయని మహిళా సంఘాలు అంటున్నాయి. అదీగాక వారానికి మూడు గుడ్లు ఇవ్వాలి. అలాంటప్పుడు కూరలు, ఇతర వంట సామగ్రి ఎలా సమకూర్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పప్పులు, నూనెలు ఏ రోజుకారోజు పెరిగిపోతుంటే, ఆ మొత్తంతో ఎలా సర్దుకోవాలని నిలదీస్తున్నారు. ►తక్కువ ఖర్చుతో తెచ్చే కూరల్లో కొన్ని చెడిపోయి ఉంటే వాటికి తమను ఎలా బాధ్యులను చేస్తారని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. ►ప్రతి రోజూ మెనూ వివరాలను స్కూల్ గోడపై రాయాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఈ వివరాలు సరిగా లేకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటారు. ఈ మెనూ రాయాలంటే సమయం వృథా అవుతుందని హెచ్ఎంలు అంటున్నారు. ►పాఠశాల విద్యా కమిటీ, విద్యార్థులతో కూడిన కమిటీ సమక్షంలోనూ బియ్యం తూకం వేసి వంట చేసే వారికివ్వాలనే షరతు పెట్టారు. ఈ లెక్కలన్నీ రిజిష్టర్‌లో పక్కాగా పేర్కొనాలి. వంట పాత్రలు శుభ్రంగా లేకపోయినా, విద్యార్థులు భోజనం చేసే ప్లేట్లు అపరిశుభ్రంగా కన్పించినా దానికీ స్కూల్ హెచ్‌ఎందే బాధ్యతని నిబంధనల్లో పేర్కొన్నారు. తనిఖీ అధికారులు దీన్ని అడ్డంపెట్టుకుని తమను వేధించే అవకాశముంటుందని హెచ్ఎంలు చెబుతున్నారు. ►ప్రతినెలా 10వ తేదీలోగా వంట ఏజెన్సీకి చెల్లింపులు చేయాలి. నెలలు గడుస్తున్నా బిల్లులే రానప్పుడు చెల్లింపులు ఎలా చేయాలని హెచ్ఎంలు అంటున్నారు. వాస్తవానికి దూరంగా రూల్స్: పి.రాజా భానుచంద్ర ప్రకాశ్, గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధ్యాహ్న భోజనానికి అయ్యే వాస్తవ ఖర్చును అధికారులు గుర్తించాలి. మార్కెట్లో సరుకుల రేట్లు మండిపోతున్నాయి. ఇచ్చే మొత్తంలో వీటిని కొనడం సాధ్యం కావడం లేదని వంట చేసే మహిళా సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటికీ హెచ్ఎంలనే బాధ్యులను చేస్తే ఎలా? బోధన వ్యవహారాలు చూసుకునే బాధ్యతల కన్నా, భోజన జమా ఖర్చు వివరాలు రాయడానికే ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల బోధనలో నాణ్యత తగ్గదా? -
కుళ్లిన గుడ్లు.. పాడైన కూరగాయలు.. మాకు పెడుతున్న భోజనం నాసిరకం
నిర్మల్/బాసర: కుళ్లిన గుడ్లు, పాడైన కూరగాయలు, కాలం చెల్లిన నూనెలు, వస్తుసామగ్రి వాడుతూ మెస్‌ల నిర్వాహకులు తమకు నాసిరకం భోజనం అందిస్తున్నారని బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు ఆరోపించారు. ఇలాంటి భోజనం అందిస్తున్నందుకే వందలాది మందికి ఫుడ్ పాయిజన్ జరిగిందంటూ విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. నాసిరకం వస్తుసామగ్రిని చూపుతూ శనివారం స్థానిక అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో శుక్రవారం రాత్రే నిజామాబాద్ ఆస్పత్రికి చేరుకున్న ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ వెంకటరమణ శనివారం క్యాంపస్‌కు రావడంతో తమకు ఎలాంటి తిండి పెడుతున్నారో చూడండి అంటూ సగం పగిలిన పప్పు, శుభ్రంగా లేని సామగ్రి, నాసిరకం వంటనూనెలు, కాలంచెల్లిన ఇతర వస్తువులను వెంకటరమణతోపాటు ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్‌కు చూపించారు. ఏప్రిల్‌లో ఎస్ఎస్ కేటరర్స్లో కాలంచెల్లిన శనగపిండి, ఉప్మారవ్వ, గోధుమ పిండి ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వేల మంది విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్ గవర్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు ఓ లేఖను అందించారు. మెస్‌లు, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొనే దాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో డైరెక్టర్ సతీశ్‌కుమార్ రెండు మెస్‌లపై కేసులు పెట్టినట్లు పత్రాలను చూపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. ►మెస్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. ►రాజకీయ ప్రభావం లేకుండా మెస్ టెండర్లు ఉండాలి. ►ఐఐటీ, నిట్‌లలో కనీసం పదేళ్లు అనుభవం ఉన్నవారినే టెండర్లకు అనుమతించాలి. ►ఘటనకు కారకులైన సంబంధిత అధికారులను తొలగించాలి. ►మాపై ప్రభావం చూపే ప్రతి విషయంలోనూ మా అభిప్రాయం తీసుకోవాలి. ►గత నెల చేపట్టిన ఆందోళన సందర్భంగా ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లన్నింటినీ తక్షణమే నెరవేర్చాలి. హెల్ప్‌లైన్ కేంద్రం, హెల్త్ క్యాంపులు పెడతాం ►ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెల్లడి నిర్మల్ చైన్‌గేట్: ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ తెలిపారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీతో కలసి ఆయన మాట్లాడారు. కొన్ని అజాగ్రత్తల వల్లే విద్యార్థులు అనారోగ్యం పాలైనట్లు తెలిసిందన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. సమర్థులైన ఫ్యాకల్టీని నియమించి సోమవారం నుంచి పాలనాపరమైన మార్పులు చేస్తామన్నారు. ప్రతి హాస్టల్‌కు ఒక వార్డెన్, ఫిర్యాదుల విభాగం, విద్యార్థులకు హెల్ప్‌లైన్ సెంటర్, అమ్మాయిల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని వివరించారు. నెలకోసారి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు. 60 మంది విద్యార్థినులకు పుడ్‌పాయిజన్ అయిందని, 21 మంది విద్యార్థినులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిచ్చార్జి అయ్యారని తెలిపారు. మంత్రి సబితను బర్తరఫ్ చేయాలి ►బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను శనివారం వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఫుడ్‌పాయిజన్ ఘటనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బాధ్యురాలిని చేస్తూ ఆమెను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మరణిస్తే కానీ సీఎం ట్రిపుల్ ఐటీని సందర్శించరా అని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులు కాదని, వాటిల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారికి నాణ్యమైన ఆహారం కూడా అందించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్కు సంబంధించిన కాంట్రాక్టర్ కావడంతోనే మెస్ నిర్వాహకుడు విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడుతున్నాడని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మండిపడ్డారు. -
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
-
బాసర ట్రిపుల్ ఐటీలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ బాధితులు
-
నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
-
బాసర ట్రిపుల్ ఐటీలో.. ఫుడ్ పాయిజన్
బాసర/నిజామాబాద్ నాగారం/సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. యూనివర్సిటీలోని పీయూసీ–1, పీయూసీ–2 మెస్‌లలో మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్ రైస్ వడ్డించారు. దీనిని తిన్న ఈ–1, ఈ–2, పీ–2 విద్యార్థులకు కడుపునొప్పి రావడంతోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు బాధిత విద్యార్థులకు క్యాంపస్‌లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో చికిత్స అందించారు. కాగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న కొంత మందిని అంబులెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ట్రిపుల్ ఐటీ చేరుకుని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు. మరో పక్క ఫుడ్ పాయిజన్ గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 17 మంది, నవీపేటలోని ప్రైవేటు నర్సింగ్ హోంలో మరో 12 మంది విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. వీరిలో జిల్లాలో కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. కోమలి, హరిత అనే విద్యార్థినుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు ఆరా బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్, వైద్యాధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలు పంపాలని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం దిగ్భ్రాంతిని కలిగించిందని ట్విట్టర్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారానికి బాధ్యులనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. -
‘కమిటి’మెంట్‌తో.. కలిసికట్టుగా..
నిర్మల్/బాసర: వారంతా వయసులో చిన్నవాళ్లు.. సాధారణ కుటుంబాల నుంచే వచ్చినవాళ్లు.. చదువుకునేచోట ఇబ్బందులతో ఆవేదన చెందారు.. సమస్యలను పరిష్కరించాలంటూ వరుసపెట్టి విజ్ఞప్తులు చేసుకున్నారు.. ఎక్కడా స్పందన లేకపోవడంతో నిరసన బాట పట్టారు. అడ్డగోలు నినాదాల్లేవు.. ఉద్రేక నిరసన ప్రదర్శనలు లేవు. ఓపికగా, ఓ పద్ధతిగా, వీసమెత్తు హింస లేకుండా ఆందోళన చేశారు. రాత్రీపగలు, ఎండావానను లెక్క చేయకుండా బైఠాయించారు. పక్కా ప్రణాళికతో, అందరి మద్దతు కూడగట్టుకునేలా వ్యవహరించి.. కోరుకున్నది సాధించారు. ఇదీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సాధించిన ఘనత. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆరు నెలల ముందు నుంచే.. ఈ నెల 14న బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్) విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన ప్రారంభించారు. ఎంతకూ వెనక్కి తగ్గకుండా కొనసాగించి విజయం సాధించారు. ఈ పోరాటం వెనుక ఆరు నెలల శ్రమ ఉంది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను ఎలాగైనా పరిష్కరించు కోవాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ముందే నేరుగా ఉద్యమానికి దిగకుండా.. అందరికీ తమ సమస్యలను చెప్పాలని నిర్ణయించుకున్నారు. క్యాంపస్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడంతో మొద లుపెట్టి.. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి వీసీ, ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి, విద్యాశాఖ మంత్రి దాకా విజ్ఞప్తులు చేశారు. ఎలాంటి స్పందన రాకపో వడంతో చివరి అస్త్రంగా ఆందోళన బాట పట్టారు. ఎలా చేయచ్చో తెలుసుకుని.. తమ ఆందోళన ఎలా ఉండాలి? ఎలా ఉద్యమం చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది? నిరసన తెలిపే హక్కు (రైట్ టు ప్రొటెస్ట్) కింద ఏం చేయొచ్చు, ఏం చేయవద్దన్న అంశాలపై విద్యార్థులు అధ్య యనం చేశారు. ఆర్జీయూకేటీ చట్టం ఏం చెబుతోం దన్నదీ పరిశీలించారు. ఆందోళన సమయంలో సంయమనంతో ఎలా ముందుకు సాగాలనేది కూడా నోట్స్‌గా రాసుకున్నారు. క్రియాశీలకంగా ఉండేవారితో ‘స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ)’ ఏర్పాటు చేసుకున్నారు. వర్సిటీలోని మొత్తం 7 బ్రాంచ్లకుగాను ఒక్కో బ్రాంచ్‌కు ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని చొప్పున 14 మందిని ఎం పిక చేసుకున్నారు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులను, 20 మంది కోర్‌కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కమిటీకి అనుసం ధానంగా క్రియాశీలకంగా వ్యవహరించేందుకు టెక్నికల్ సపోర్ట్ టీమ్, విద్యార్థులను పోగు చేసే టీమ్, స్పైటీమ్.. ఇలా 12 కమిటీలను ఎన్నుకుని, ఎవరేం చేయాలో నిర్ణయించుకున్నారు. వీటిలో జూనియర్ విద్యార్థులనూ భాగస్వాములను చేశారు. ప్రతీది ప్రణాళికతోనే.. సీనియర్, జూనియర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యమం ఎందుకు చేస్తున్నామనేది వివరించారు. ఆందోళన ఎక్కడ చేయాలి? వరుసలో ఎలా, ఎవరెవరు కూర్చోవాలి? భోజన సమయంలో బ్యాచ్‌ల వారీగా ఎలా వెళ్లిరావాలనేది పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. దీనితోనే ఎర్రటి ఎండ మండినా, భారీ వర్షం ముంచెత్తినా ఒక్కరూ కదలలేదు. 24 గంటల దీక్షలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మాయిలు కూడా ఆరు బయటే నిద్రించారు. జిల్లా కలెక్టర్ వచ్చి నాలుగు గంటల పాటు బతిమాలినా లోపలికి వెళ్లలేదు. అంతా గమనిస్తూ.. విద్యార్థులు తమ ఆందోళన ఎక్కడా అదుపు తప్పకుండా, ఎవరూ తమను ప్రభావితం చేయకుండా పక్కాగా వ్యవహరించారు. వర్సిటీలో ఎక్కడేం జరుగుతోంది? ఎవరెవరు క్యాంపస్‌లోకి వస్తున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాన్ని 40 మందితో కూడిన స్పైకమిటీ గమనిస్తూ ఉండేది. రేవంత్‌రెడ్డి వర్సిటీ గోడదూకి వస్తున్న విషయం కూడా పోలీసుల కంటే విద్యార్థులకే ముందు తెలుసు. తమ మధ్య ఉంటూ ఆరా తీసేందుకు పోలీసులు ఎలా ప్రవరిస్తున్నారో కూడా గమనించగలిగారు. ఇక తమ పోరాటాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసేలా చేయడానికి పబ్లిసిటీ కమిటీ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అప్డేట్ చేస్తూ వచ్చింది. చివరి అస్త్రంగానే ఆందోళన మాది కొత్తగూడెం. నాన్న చనిపోవడంతో అమ్మ కష్టపడి చదివించింది. నాకు నాన్నే స్ఫూర్తి. ట్రిపుల్ఈ మూడో సంవత్సరం చదువుతున్నా. ఎంతగా విజ్ఞప్తి చేసినా వర్సిటీ సమస్యలు తీరకపోవడంతో చివరి అస్త్రంగానే ఆందోళనకు సిద్ధమయ్యాం. అందరం సమష్టిగా సాధించుకున్నాం. – మాదేశ్ సుంకరి, ఎస్జీసీ అధ్యక్షుడు సమష్టి విజయం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వెనకడుగు వేయకుండా విద్యార్థులమంతా సమష్టిగా సాధించిన విజయమిది. హుజూరాబాద్ నుంచి వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నా. ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులందరి భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆందోళన చేశాం. – లావణ్య గున్నేటి, ఎస్జీసీ ఉపాధ్యక్షురాలు శాంతియుతంగా పోరాడి.. మాది వరంగల్. సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నా. ఎవరికీ ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పోరాడాలనుకున్నాం. అలాగే చేసి సాధించుకున్నాం. – సాయిచరణ్, ఎస్జీసీ ప్రధాన కార్యదర్శి -
బాసర ట్రిబుల్ ఐటీలో ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్న తరగతులు
-
మంత్రి సబిత హామీతో ఆగిన ఆందోళన
నిర్మల్/ బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. అర్ధరాత్రి దాకా చర్చలు.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువీడకుండా ఆందోళన చేస్తుండటంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి వెళ్లారు. ఇప్పటికే నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు రెండుసార్లు విద్యార్థులతో చర్చించి విఫలమయ్యారు. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బాసర చేరుకున్నారు. ఆమెతోపాటు ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ రాహుల్ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆర్జీయూకేటీ కొత్త డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ తదితరులు క్యాంపస్‌కు వచ్చారు. తొలుత దాదాపు యాభై మంది విద్యార్థులతో అధికారులు చర్చించాక.. రాత్రి 10.25 గంటల సమయంలో మంత్రి సబిత వారితో మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా నెలరోజుల్లో డిమాండ్లన్నింటినీ తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా.. ‘సంబంధిత మంత్రిని స్వయంగా చెప్తున్నా.. ఇంకా ఎలాంటి హామీ కావాలి’ అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళన విరమించాలా, కొనసాగించాలా అన్నదానిపై చర్చించుకున్న విద్యార్థులు.. అనంతరం క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పరిష్కరిస్తారని మంత్రిపై, అధికారులపై నమ్మకం ఉందని.. ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. పట్టుదలగా ఆందోళన.. ఆర్జీయూకేటీ విద్యార్థులు ఏడు రోజులుగా పట్టుదలతో ఆందోళన కొనసాగించారు. ఆదివారం రోజంతా ఎండలో, రాత్రంతా చలిలో ఆరు బయటే నిద్రించి నిరసన తెలిపారు. సోమవారం వేకువజామునే మేల్కొని అంతా కలిసి యోగా చేశారు. తర్వాత ఆర్జీయూకేటీ ప్రాంగణంలోనే రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ట్విట్టర్, యూట్యూబ్‌లే.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారు సమస్యలను చెప్పుకుందామంటే పోలీసులు మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించలేదు. కనీసం ప్రధాన ద్వారం దరిదాపుల్లోకీ రానివ్వలేదు. విద్యార్థుల్లో నుంచి ఒకరిద్దరు తమకు తెలిసిన పాత్రికేయులకు సమాచారమిస్తేనే తప్ప.. క్యాంపస్‌లో లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ట్రిపుల్ఐటీ విద్యార్థులు.. ట్విట్టర్, యూట్యూబ్‌లను అనుసంధానకర్తలుగా మార్చుకున్నారు. వాటి ద్వారానే క్యాంపస్‌లో జరుగుతున్న పోరును ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. క్యాంపస్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఓ విద్యార్థి గీసిన చిత్రం, మరికొందరు విద్యార్థులు తయారు చేసిన పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. క్యాంపస్‌లోకి వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం ట్రిపుల్ ఐటీ ప్రధానద్వారం వద్ద పోలీసులు అడ్డుకుంటుండటంతో.. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, బీజేవైఎం నాయకులు సోమవారం వేకువజామున నాలుగు గంటలకు వెనుక భాగంలో గోడదూకి క్యాంపస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. కాగా.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ప్రభుత్వం, మంత్రులు విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల డిమాండ్లివీ.. ఆర్జీయూకేటీ విద్యార్థి పాలక మండలి సభ్యులు సోమవారం తమ డిమాండ్లపై యూట్యూబ్ లైవ్ ద్వారా స్పష్టత ఇచ్చారు. ► ప్రభుత్వం వెంటనే చాన్సలర్‌ను నియమించాలని, సెర్చ్ కమిటీ వేసి వైస్ చాన్సలర్‌నూ ఎంపిక చేయాలని, ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియమించాలని కోరారు. ► విద్యార్థుల అవసరాల కోసం కేటాయించే 312 గ్రాంట్లు 2019 నుంచీ రావడం లేదని.. వీటిని ఇవ్వడంతోపాటు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కోరారు. బడ్జెట్ లేనందునే తమకు ల్యాప్‌టాప్, యూనిఫాం, స్పోర్ట్స్‌వేర్, బెడ్లు ఇవ్వడం లేదని చెప్పారు. ► ఎనిమిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులు 17 మందేనని.. మిగతా 170 మంది కాంట్రాక్టు వాళ్లు ఉన్నారని, వెంటనే సరిపడా అధ్యాపకులను నియమించాలన్నారు. ► క్యాంపస్‌లో కేవలం ఇద్దరు మాత్రమే పీఈటీలు ఉన్నారని, విద్యార్థినులకు ప్రత్యేకంగా మహిళ పీఈటీని నియమించాలని కోరారు. ► 24 గంటల పాటు లైబ్రరీ, షాపింగ్ కాంప్లెక్స్లతోపాటు మంచి క్యాంటిన్ కావాలని కోరారు. ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ తదితర సమస్యలు, హాస్టల్ గదుల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు
-
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల న్యాయమైన సమస్యలపై ‘‘నిరో చక్రవర్తి’’ గా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని లేఖలో దుయ్యబట్టారు. బాసర ట్రిపుల్ విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే ఆమోదించి వాటిని పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. చదవండి: హైదరాబాద్ ప్రజలకు ఊపిరి ఆడట్లే.. కారణాలివే! ‘‘జాతీయపార్టీ ఏర్పాటుపై, పొలిటికల్ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి మీకు సమయం ఉంటుంది, కానీ గత 6 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం కేసీఆర్‌కు సమయం చిక్కదు. కేటీఆర్ విదేశీ పర్యటనకు, కేసీఆర్ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారు గానీ, ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధుల కేటాయించడానికి మాత్రం నిధులుండవు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల డిమాండ్లను సిల్లీ డిమాండ్లుగా పేర్కొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని’’ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్ గేమ్ ఆడటం మానుకోవాలి. గోబల్స్‌కు వారసులైన రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో సమస్య పరిష్కారమైందని తప్పుడు ప్రచారం చేయడం రాష్ట్రప్రభుత్వం దివాళ కోరుతనానికి నిదర్శనం. మంత్రులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. బాసర ట్రిపుల్ ఐటి సమస్యలపై అన్ని విద్యార్థిసంఘాలతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని’’ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. -
బాసరలో జాగ‘రణం’
నిర్మల్/బాసర: ఎండా వాన, పగలూరాత్రి.. అనే తేడా లేకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆరో రోజైన ఆదివారం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద 24 గంటలపాటు రాత్రీపగలూ బైఠాయింపు చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ రాత్రి 11 గంటల తర్వాత క్యాంపస్‌కు వచ్చారు. కొత్త డైరెక్టర్ సతీశ్‌కుమార్‌తో కలిసి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లకు ఒప్పుకుంటుందని, ఏమేం అవసరమో పైనుంచి అడిగారని వివరించారు. సోమవారం తరగతులకు హాజరుకావాలని, హామీలు అమలు చేసేలా మంగళవారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి తొలుత విద్యార్థులు నో చెప్పినా.. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత కూడా ఇదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాగా.. ఆదివారం ఉదయం హైదరాబాద్, నిజామాబాద్‌లకు చెందిన ఏబీవీపీ నాయకులు వర్సిటీవైపు దూసుకురాగా, పోలీసులు అడ్డుకుని లాక్కెళ్లారు. వివిధ జిల్లాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనలు చేపట్టారు. ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థులు 24 గంటల దీక్షకు సిద్ధమయ్యారు. శాంతియుత పద్ధతుల్లో రోజుకో తీరులో నిరసనలు చేపడుతున్నారు. యోగా వారోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం కాసేపు యోగా, ధ్యానం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వినాలంటూ.. ‘సారూ.. దిగిరారె.. చూడరె మా ఆవేదనలను..’అంటూ ఓ పాటను రూపొందించి ట్విట్టర్లో పెట్టారు. పోలీసులు మీడియాను అనుమతించకపోవడంతో విద్యార్థులు ట్విట్టర్, యూట్యూబ్‌ల ద్వారా తమ ఆందోళన వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ఆర్జీయూకేటీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పంపించేస్తున్నారని.. ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు తాము నిరవధిక ఆందోళన చేస్తుంటే.. అధికారులు మాత్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు. కొంతమంది పీయూసీ–1, 2(ఇంటర్ తరహా) విద్యార్థులను అవుట్‌పాసులు లేకున్నా, వారి తల్లిదండ్రులు రాకున్నా పంపించేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు తమ పోరును ఆపలేవని స్పష్టం చేశారు. ఆందోళనలో యథాతథంగా బీ–1, 2, 3, 4 విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. దూసుకొచ్చిన ఏబీవీపీ విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ఒక్కసారిగా వర్సిటీ వైపు దూసుకువచ్చారు. ముందస్తుగానే ఏబీవీపీ వర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో పరిషత్ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనూహ్యంగా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు ఒక్కసారిగా ప్రధాన ద్వారం వైపు చొచ్చుకువచ్చారు. ఈ పరిణామంతో పోలీసులు వారిని అడ్డుకొని వాహనాల్లో తరలించారు. -
భారీ వర్షంలోనూ తగ్గేదే లే అంటున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత
-
జాగరణకు సిద్దమవుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆందోళనల్లో భాగంగా ఆదివారం ట్రిపుల్ ఐటీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్ ఐటీలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఓ మహిళా కార్యకర్తను ఈడ్చుకెళ్లినట్టు సమాచారం. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, అక్రమ అరెస్టులపై ఏబీవీపీ నాయకులు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన -
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు విఫలం
-
చర్చలు సఫలం.. కాదు విఫలం
నిర్మల్/బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఐదోరోజుకు చేరింది. సమస్య పరిష్కారంపై అధికార వర్గాలు, విద్యార్థుల నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. శనివారం ట్రిపుల్ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. వర్సిటీలోని సాక్ భవనంలో శనివారం విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న మంత్రి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులందరూ సోమవారం నుంచి తరగతులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 12 డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరారని, అయితే రేపటిలోగా కేటీఆర్ లెటర్ అందేలా చూస్తామన్నారు. మరోపక్క.. శనివారం నాటి చర్చలు విఫలమయ్యాయని, తమ ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని విద్యార్థులు మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. ఏవోను తొలగిస్తూ ఉత్తర్వులు కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీ ఏవోగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావును తొలగించి బాధ్యతలను నూతన డైరెక్టర్ సతీశ్‌కుమార్‌కు అప్పగించినట్లు వర్సిటీ వీసీ రాహుల్ బొజ్జా శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళనల వ్యవహారంలో బాధ్యతాయుతంగా పనిచేయకపోవడంతో రాజేశ్వరరావును విధుల నుంచి తొలగించారనే ఆరోపణలున్నాయి. మోదీజీ మీరైనా స్పందించండి.. ‘నాలుగు రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లకు సమాధానం ఇవ్వట్లేదు. మీరైనా స్పందించండని కోరుతున్నాం..’ అంటూ బాసర విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర విద్యాశాఖ మంత్రితోపాటు సీఎంవో, కేటీఆర్, సబితారెడ్డికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అమ్మలా బాధేస్తోంది: సబితారెడ్డి విద్యార్థులు ఆందోళన విరమించాలంటూ మంత్రి సబితాఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ఓ లేఖను పంపించారు. ‘కోవిడ్‌తో సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉంటే.. మంత్రిగానే కాకుండా ఓ అమ్మలా బాధేస్తోంది, ఇప్పటికైనా ఆందోళన విరమించాలి’ అని కోరారు. ట్రిపుల్ ఐటీ.. ఉద్యమంలో ‘క్రియేటివిటి’ ఐదోరోజైన శనివారం విద్యార్థులు వినూత్నంగా ఆందోళన కొనసాగించారు. అందరూ పుస్తకాలు పట్టుకుని వచ్చారు. తమ సమస్యల్ని ఆర్ట్స్, బ్యానర్స్, డూడుల్స్, మీమ్స్, కవితలు, పాటల రూపంలో ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కట్టించేలా కళను ప్రదర్శించారు. వాటిని తమ ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ చానళ్ల ద్వారా సోషల్‌మీడియాలో ఉంచారు. రోజంతా ఎర్రటి ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినా విద్యార్థులు దీక్షను కొనసాగించారు. ఐదురోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన సాగిస్తున్న విద్యార్థుల్లో పలువురు నీరసిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. -
దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. డిమాండ్లు ఫలించేనా ??
-
Basara IIIT: పట్టు వదలని విద్యార్థులు.. కొలిక్కిరాని చర్చలు
సాక్షి, నిర్మల్: బాసర ఐఐఐటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు చర్చలు జరిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టూడెంట్ ఆక్టివిటి సెంటర్లో వెయ్యి మంది విద్యార్థులతో ఈ సమావేశం నిర్వహించారు. విద్యార్ధులతో తమ డిమాండ్లపై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ భేటీలో మంత్రితో పాటు కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ఐఐఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. విద్యార్థుల 12 డిమాండ్లలో 60శాతం నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం తమ బాధ్యతని పేర్కొన్నారు. అయితే సమస్యల పరిష్కారానికి పట్టుబడుతున్న విద్యార్థులు రెగ్యులర్ అధ్యాపకులు, వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. కానీ వీసీ నియామకం ఇప్పట్లో కుదరదని అధికారులు చెప్పారు. దీంతో మంత్రి, అధికారులు హామీపై స్పష్టత లేదని విద్యార్థులు చెబుతున్నారు. కాగా 12 డిమాండ్ల పరిష్కారం కోసం ఐఐటీ విద్యార్థులు గత అయిదు రోజుల నుంచి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సానుకూలంగా ఉన్నారు: మంత్రి సబితా అదే విధంగా ఆందోళన విరమించాలని బాసర ఐఐఐటీ విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించాలని, విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ‘విద్యార్థులు ఎండలో ఎండుతున్నారు. వానలో తడుస్తున్నారు. వారిని చూస్తుంటే బాధేస్తోంది. కోవిడ్ కారణంగా సమస్యలు పరిష్కరించడం జాప్యమైంది. మీ సమస్యలను తక్కువగా చూపే ఉద్దేశం లేదు. ట్రిపుల్ ఐటికి డైరెక్టర్‌గా సతీష్ కుమార్‌ను నియమించింది. మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్నత విద్యశాఖ వైస్ చైర్మన్ వెంకటరమణను పంపింది. సమస్యలను పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. అందోళన విరమించండి’ అంటూ పిలుపునిచ్చారు. అయిదోరోజు ఆందోళనలు మరోవైపు రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ఐటీ అయిదు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ ట్రిపుల్ఐటీ విద్యార్థులు అయిదో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ప్రధాన ద్వారం వద్దనే రోజంతా బైఠాయించి, మౌనదీక్ష కొనసాగించారు. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ రావాలంటూ ప్లకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు విద్యార్థులుగా వచ్చి ఆందోళనను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. -
Basara IIIT: మూడోరోజూ కొనసాగిన విద్యార్ధుల ఆందోళనలు
నిర్మల్/బాసర: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. తమ డిమాండ్లను నెర వేర్చుకునేదాకా వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. వర్సిటీ ప్రధాన గేటువద్ద ఉదయం 9 గంటలకే బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని మౌనదీక్ష కొన సాగించారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీ డైరెక్టర్‌గా ఓయూ ప్రొఫెసర్ డా.సతీశ్‌కుమార్‌ను నియమించినా ఆందోళన విరమించలేదు. మరోవైపు వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు ఏ ఒక్కరూ వెళ్లడానికి వీల్లేకుండా పోలీసులు బందోబస్తు పెంచారు. మౌనంగా.. దృఢంగా.. గురువారం ఉదయమే విద్యార్థులు ఒక్కొక్కరుగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు వచ్చారు. చేతుల్లో తమ డిమాండ్లు, మంత్రుల వ్యాఖ్యలు ఉన్న ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. రోజంతా మౌనంగానే ఆందోళన సాగించారు. చర్చలు సఫలమయ్యాయని బుధవారం కలెక్టర్ ముషరఫ్ అలీ ప్రకటించినా విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లన్నీ తీరేదాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. మూడంచెల కట్టడి.. ట్రిపుల్ ఐటీ గురువారం బందీఖానాను తలపించింది. పోలీసులు మూడంచెల కట్టడి ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ భద్రతా సిబ్బందినీ మోహరించారు. విద్యార్థులను గేటు దాటనివ్వలేదు. బయట నుంచి ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఇదేం ఘోరం: నారాయణ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వర్సిటీ వద్దకు వచ్చారు. ప్రధాన గేటు వైపు వస్తుండగానే పోలీసులు అరెస్టు చేసి బాసర స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పరిష్కారానికి ప్రయత్నిస్తా మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించక పోవడంతో విద్యార్థులు ట్విట్టర్ ద్వారా ఎప్పటి కప్పుడు సమాచారాన్ని బయటకు వెల్లడిస్తున్నారు. తమ సమ స్యలపై గవర్నర్, సీఎంఓ, కేటీఆర్, ప్రతి పక్ష నేతలను ఉద్దేశించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. కాగా గవర్నర్ తమిళిసై స్పందించారు. విద్యార్థులు వర్షంలోనూ ఆందోళన చేయడం గుర్తించానని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నా రు. మీ సమస్య పరిష్కారానికి సంబం ధిత విభాగాలకు పంపిస్తానని తెలిపారు. డైరెక్టర్‌గా సతీశ్‌కుమార్ బాధ్యతలు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆర్జీయూ కేటీ డైరెక్టర్‌గా డాక్టర్ పెద్దపల్లి సతీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్‌గా ఉన్న సతీశ్‌కుమార్ గురువారం సాయంత్రం బాసర చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఉద్యమంలో విద్యార్థుల పాత్రను మరిచారా? కేసీఆర్ సర్కారుపై ట్విట్టర్లో రాహుల్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు సిల్లీగా ఉన్నాయనడం తెలంగాణ భవిష్యత్ పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న లెక్కలేనితనానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రని సీఎం కేసీఆర్ మరిచిపోయారా’ అని ట్విట్టర్ వేదికగా గురువారం ప్రశ్నించారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. బాసర ట్రిపుల్ ఐటీని బాగుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ట్వీట్లో పేర్కొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్లు ఇవి
-
బాసర ఐఐఐటీ విద్యార్థుల నిరసనపై స్పందించిన మినిస్టర్ కేటీఆర్
-
ఆర్డీవో సాక్షిగా అన్నంలో పురుగులు
బాసర(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ నిర్వహణ తీరు అధ్వానంగా మారింది. విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న కప్ప, నిన్న బొద్దింక కనిపించగా... నేడు సాలెపురుగు వచ్చింది. మూడు రోజులుగా విద్యార్థులకు కలుషిత ఆహారం సర్వ్ అవుతూనే ఉంది. మొదటిరోజు ఆలూ కూర్మతో కప్పను, రెండో రోజు పప్పుసాంబారుతో బొద్దింకలని వడ్డించారు శక్తి మెస్ నిర్వాహకులు. మీడియాలో వరుస కథనాలతో సీరియస్ అయిన సర్కార్... మెస్ నిర్వహణపై కలెక్టర్ విచారణకు ఆదేశించింది. ఆర్డీవో లోకేశ్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష ట్రిపుల్ ఐటీలో సోమవారం పర్యటించి మెస్‌లో భోజనం తీరును పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. ఆర్డీవో పరిశీలన కొనసాగుతున్న సమయంలో సైతం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు రావడం తీవ్ర దుమారం రేపింది. వరుసగా కలుషిత ఆహారాన్నే పెడుతున్నా... క్యాంటీన్ నిర్వహిస్తున్న శక్తి మెస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ‘సి’ గ్రేడ్
బాసర (ముధోల్): నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీ (ఆర్జీయూకేటీ)కి న్యాక్ ‘సి’ గ్రేడ్ గుర్తింపునిచ్చింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కమిటీ బృందం గతేడాది బాసరను సందర్శించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాసంస్థల్లో స్థితిగతులు, మౌలిక వసతులు, బోధన, బోధనేతర అంశాలు, పరిశోధనలు ఇలా ప్రతీ అంశాన్ని పరిశీలించి తదనుగుణంగా న్యాక్ గ్రేడ్లను నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి ‘సి’ గ్రేడ్ ప్రదానం చేస్తూ కమిటీ సర్టిఫికెట్‌ను తన వెబ్సైట్లో పొందుపర్చింది. అధికారుల తీరే కారణమా..? తెలంగాణకే తలమానికమైన బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడతారు. ఎన్నో ఆశలతో వర్సిటీలో అడుగుపెట్టిన వారిని ఈసారి న్యాక్ గ్రేడ్ నిరాశపర్చింది. స్థానిక అధికారుల తీరుతో పాటు న్యాక్ బృందం వర్సిటీలో పర్యటించినప్పుడు వీసీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతోనే సరైన గుర్తింపు దక్కలేదనే విమర్శలున్నాయి. అలాగే కమిటీకి వర్సిటీ అధికారులు వివరించిన తీరు కూడా సరిగా లేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు వర్సిటీ ప్రారంభం నుంచి రెగ్యులర్ వీసీ లేకపోవడం, పరిశోధనలకు పెద్దపీట వేయకపోవడం వంటి విషయాలు బృందాన్ని నిరాశపర్చినట్లు సమాచారం. న్యాక్గ్రేడ్ ఆధారంగానే యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్) నిధుల మంజూరు ఉంటుంది. ఈ గ్రేడ్ ఆధారంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొనడంతో పాటు వర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుంది. వర్సిటీ నుంచి విద్యార్థికి లభించిన సర్టిఫికెట్‌నూ హైప్రొఫైల్‌గా భావిస్తారు. ఈక్రమంలో వర్సిటీకి తక్కువ గ్రేడ్ గుర్తింపు రావడంపై వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. (సూర్యాపేటలో ర్యాగింగ్ రక్కసి; గదిలో బంధించి.. పిడిగుద్దులు గుద్ది) -
ట్రిపుల్ ఐటీలో 20,178 మంది దరఖాస్తు
భైంసా(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు ఈసారి పాలిసెట్ అర్హతతో సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 2న ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 వరకు గడువు ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీ కింద ఈ నెల 14 వరకు సడలింపు ఇచ్చారు. దీంతో 20,178 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 19,253 సాధారణ దరఖాస్తులు కాగా, గ్లోబల్ కేటగిరీలో 925 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 18న జాబితా విడుదల చేయనుంది. గతేడాది 1,500 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి వెయ్యి సీట్లకే పరిమితం చేస్తుందా.. లేదంటే 1,500 సీట్లు కేటాయిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. త్వరలో విద్యార్థుల జాబితా ప్రకటిస్తామని ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు తెలిపారు. -
నేడు ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్
భైంసా (ముధోల్): నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ 2021–22 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేయడంతో తొలిసారిగా ట్రిపుల్ఐటీ సీట్లను పాలిసెట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుని కేటాయించనున్నారు. నోటిఫికేషన్ వివరాలను శనివారం ట్రిపుల్ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు వెల్లడించారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి ఆగస్టు 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 2 నుంచి 12 వరకు ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు 14 వరకు సడలింపు ఇవ్వనున్నారు. 18న సీట్లు లభించిన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 6304893876 అందుబాటులో ఉంచారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫోన్ చేసి వివరా లు తెలుసుకోవచ్చు. ఇతర సాయం కోసం admi ssions@rgukt. ac. inకు మెయిల్ చేయొచ్చు. www. rgukt.ac.in, http://admissions. rgukt. ac. inలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులకు సూచనలు.. విద్యార్థులకు 31–12–2021 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 ఏళ్ల వయసు వరకు సడలింపు ఇచ్చారు. పాలిసెట్ ర్యాంకు, పదో తరగతి జీపీఏ, రిజర్వేషన్లను పాటిస్తూ సీట్లు కేటాయిస్తారు. గ్రామీణ విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలుపుతారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 371/డి ప్రకారం 85 శాతం తెలంగాణ, 15 శాతం ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులతో అన్రిజర్వ్డ్ సీట్లు భర్తీ చేస్తారు. 5 శాతం రాష్ట్రేతర విద్యార్థులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ సంతతి విద్యార్థులు, 2 శాతం ఎన్ఆర్ఐ, విదేశీ విద్యార్థులతో సూపర్ న్యూమరరీ సీట్లు భర్తీ చేస్తారు. ఆన్లైన్లో పొందుపరిచిన ధ్రువపత్రాల కాపీలను ఆర్జీయూకేటీ బాసర చిరునామాకు స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపించాలి. -
ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. ‘వీసీ’ రాలే!
భైంసా(ముధోల్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని యూనివర్సిటీలకు వీసీ (వైస్ చాన్స్‌లర్)లను నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీకి వీసీ నియామకం విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర– ఆర్జీయూకేటీ)కి మాత్రం ఇన్చార్జి వీసీ పాలనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఏళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ఇడుపులపాయ, నూజీవీడు, బాసరలో ఆర్జేయూకేటీ పేరుతో ట్రిపుల్ ఐటీలను అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక చదువుల తల్లి కొలువైన బాసరలోని ట్రిపుల్ ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా కల్పించింది. పాలనపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో ఓయూ వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన కొనసాగిన అనంతరం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్చార్జి వీసీగా రాహుల్ బొజ్జ కొనసాగుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. బాసర ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది రెగ్యులర్ వీసీ నియామకం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆరేళ్ల కోర్సులో భాగంగా ఇక్కడ ఏటా ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 300 మంది వరకు టీచింగ్ స్టాఫ్, వెయ్యి మంది వరకు బోధనేతర సిబ్బంది ఉంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న ఈ వర్సిటీలో ప్రవేశాలకు ఏటా పోటీ విపరీతంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించిన వారంతా ఇన్‌చార్జీలే కావడంతో పూర్తిస్థాయిలో సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. తమ పరిమితులకు లోబడే పని చేస్తున్నారు. ఇది ట్రిపుల్ఐటీ ప్రగతికి అవరోధంగా మారింది. విద్యాలయ ప్రగతికి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అలాగే యూనివర్సిటీ నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్ కౌన్సిలింగ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల పరిధిలోనే ఇన్చార్జీ వీసీలు నిర్ణయాలు అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. విద్యాలయంలో చాలా వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్చార్జి వీసీలంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో ఇక్కడికి ‘విజిటింగ్’కే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర రాజధానిలో కీలకవిధి నిర్వహణలో ఉండేవారికే ఇక్కడ ఇన్చార్జి వీసీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు సైతం పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వీసీ ప్రత్యక్ష పర్యవేక్షణ కరువై పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వీసీ నియామకంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలెన్నో.. ► ఇక్కడ చదివే విద్యార్థులు భోజనం, వసతి, విద్యాబోధన తదితర అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ► కొంతమంది అధికారులు విద్యాలయంలో ఆధిపత్యం చెలయిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ గతంలో పలుమార్లు విద్యార్థులు సైతం ఆందోళన బాటపట్టారు. ► టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌లో ఖాళీలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. చదవండి: మట్టిదిబ్బల కింద మహత్తర శిల్పాలు ఎవరితోనైనా లేచిపో లేదంటే.. వదిన అసభ్యంగా దూషించడంతో.. -
బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్
సాక్షి, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ)లో 2020–21 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు శనివారం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేడ్టెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదవిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు 85 శాతం, స్థానికేతరులకు 15 శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. -
హాట్‌కేకు.. ట్రిపుల్ఐటీ సీటు
జ్యోతినగర్(రామగుండం): ట్రిపుల్ఐటీ అనేది పదోతరగతి పూర్తిచేసిన ప్రతీ విద్యార్థి కల. అందులో సీటు సంపాదిస్తే.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడొచ్చనే ఉద్దేశం. పదోతరగతిలో ప్రతిభ ఆధారంగా 10 జీపీఏ సాధించిన వారికి ట్రిపుల్‌ఐటీలో చోటు దక్కుతుంది. ఈసారి కరోనా ఎఫెక్ట్... ప్రభుత్వ నిర్ణయంతో ఈ సీట్లు హాట్‌కేకులు అవబోతున్నాయి. పదో తరగతిలో అందరినీ పాస్ చేయగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 42,456 మంది విద్యార్థులకు 16,739 మంది 10 జీపీఏ సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా బాసర ట్రిపుల్ఐటీకి ప్రాధాన్యత ఇస్తారు. అందులో 1,500 సీట్లు ఉండగా.. తెలంగాణవ్యాప్తంగా పెద్దమొత్తంలో 10 జీపీఏ సాధించినవారున్నారు. ఈసారి ట్రిపుల్ఐటీ సీటుకు పోటీ ఉండడంతో మూడు దశల్లో ఎంపిక విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి నుంచే కసరత్తు.. ప్రతీ ఏడాదికన్నా ఈసారి ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించడం కష్టంగానే మారబోతోంది. ప్రభుత్వం ‘పది’లో అందరినీ పాస్ చేయగా.. 10 జీపీఏ సాధించిన వారుకూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మూడు ప్రమాణాలు నిర్వచించింది. సీట్ల కేటాయింపును వివిధ దశల్లో పరిశీలించి, మెరుగైన ర్యాంకువచ్చిన వారిని ఎంపిక చేస్తారు. అయినా పోటీ ఉంటే ర్యాండమ్ విధానం అవలంబిస్తారు. ఇంకా ట్రిపుల్ఐటీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరనప్పటికీ.. ఇప్పటినుంచే అధికారులు ప్రక్రియకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. మూడు దశల్లో పరిశీలన... ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందాలంటే వివిధ సామాజిక రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకోవడంతోపాటు పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రధాన్యత ఇస్తారు. రెండోదశలో వివిధ పాఠ్యాంశాల్లో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. మొదటి ప్రాధాన్యత గణితంకు ఇవ్వగా.. సామాన్యశాస్త్రం, ఇంగ్లిష్, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్కులు పరిశీలిస్తారు. ప్రతీదశలోనూ మార్కులు సమానంగా వస్తే.. మరోదశలో విద్యార్థి పుట్టిన తేదీని ప్రమాణంగా తీసుకుంటారు. దీని ఆధారంగా గరిష్ట వయసున్న వారికి ప్రాధాన్యమిస్తారు. ఈ మూడు దశల్లోనూ సమానంగా మార్కులు వచ్చి పోటీ నెలకొంటే చివరగా విద్యార్థి పదో తరగతి హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ర్యాండమ్‌స్కోర్ ద్వారా సీటు కేటాయిస్తారు. ర్యాండమ్ విధానం ఇలా మూడు దశల్లోనూ సీటు కేటాయింపుపై సందిగ్ధత నెలకొన్న క్రమంలో చివరకు ర్యాండమ్ విధానం అమలు చేస్తారు. విద్యార్థి హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా దీన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియ అంతసులువుకాదని, విద్యావ్యవహారాలు ఇంటర్నెట్లో ఉంచే ఒక వెబ్సైట్ ద్వారా సులభపద్ధతిని అందుబాటులో ఉంచిందని పెద్దపల్లి డీఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. https://www.teachersteam.co.in/ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మొదటి ఆఫ్షన్లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ర్యాండమ్ ర్యాంకు లభిస్తుంది. ప్రవేశాలకు పేర్కొన్న ప్రమాణాలు సంతృప్తి పరిచి టై అయిన సమయంలో చివరగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్జీకేయూటీ సైట్లో వివరించారు. -
బాసర ట్రిపుల్‌ఐటీలో అగ్నిప్రమాదం
బాసర (ముథోల్): నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఓ తరగతి గదిలో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు భైంసా నుంచి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో అకడమిక్ బ్లాక్ ఏబీ1లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, 70 చైర్లు, 21 టేబుళ్లు దగ్ధమయ్యాయి. -
బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం
-
అవినీతి తిండి తిందాం రండి!
సాక్షి, హైదరాబాద్ : బాసరలో అక్రమార్కుల బాస... జ్ఞాన సరస్వతి చెంత.. అవినీతి చింత.. టెండర్లు పెంచుకున్నారు. కమీషన్లు పంచుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యా లయంలో(ఆర్జీయూకేటీ– ట్రిపుల్ ఐటీ) అక్రమాల దందా కొనసాగుతోంది. విద్యార్థులకు భోజనం, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. బాసర ట్రిపుల్ ఐటీలో మూడేళ్ల కిందట రోజుకు ఒక్కో విద్యార్థికి పెట్టే భోజనం ఖర్చు రూ.78. అప్పట్లో 6 వేలకుపైగా విద్యార్థులు ఉండేవారు. ట్రిపుల్ఐటీ అధికారులు దానిని కిందటేడాది రూ.69కి తగ్గించి టెండర్లు ఖరారు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2019–20)లో విద్యార్థుల సంఖ్య 7,500కు చేరుకుంది. భోజ నం నిమిత్తం ఒక్కో విద్యార్థికి కనీసంగా రూ. 95 నుంచి రూ.105 చెల్లించేలా ట్రిపుల్ ఐటీ కమిటీ నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచింది. రూ.95 చొప్పున ఖరారు చేసింది. అంటే ఒక్కో విద్యార్థిపై రోజుకు చెల్లించే మొత్తాన్ని పాత రేటు కంటే రూ. 26 అదనంగా పెంచింది. 7,500 మంది విద్యార్థులకు 220 రోజులపాటు పెట్టే భోజనానికి నిర్వహించే క్యాంటీన్ టెండర్లను రూ.15.67 కోట్లకు ఖరారు చేసింది. గతంలో కంటే ఇప్పుడు రూ. 4.29 కోట్లు అదనంగా పెంచేసింది. మార్కెట్లో కాన్ఫిగ రేషన్‌ను బట్టి రూ.39 వేల నుంచి రూ. 43 వేలకు లభించే ల్యాప్‌టాప్‌లను యాన్యువల్ మెయింటెనెన్స్ కలుపుకొని రూ. 51,600 చొప్పున కొనుగోలు చేసి భారీగా కమీ షన్లు పంచు కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రూ.41 వేలకు ఒక ల్యాప్‌టాప్ చొప్పున లెక్కించినా 1,500 ల్యాప్‌టాప్‌లకు రూ. 6.15 కోట్లు అవుతాయి. కానీ వాటినే రూ. 7.74 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడాది, రెండేళ్ల కిందట కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లను బైబ్యాక్ పేరుతో ఒక్కో దానిని రూ. 6 వేలకే, అదికూడా ల్యాప్‌టాప్‌లు సరఫరా చేసిన వ్యక్తులకే అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఏటా 1,000 మంది విద్యార్థుల ల్యాప్‌టాప్‌లకే రూ.5.16 కోట్లు ఖర్చు చేస్తుండగా ఈసారి 1,500 ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారు. ఇటీవలి కాలంలో 1,200 ల్యాప్‌టాప్‌లను రూ. 6 వేలకు ఒకటి చొప్పున అమ్మేసినట్లు ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే రూ. 6.19 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్ లను రూ.కోటికి మించకుండా విక్రయించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఫిర్యాదులు.. బాసర ట్రిపుల్‌ఐటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వాటిపై దృష్టి సారించింది. ట్రిపుల్ఐటీలోని మూడు క్యాంటిన్ల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లలో ఆరు సంస్థలు పాల్గొన్నాయి. అందులో మూడు సంస్థలను డిస్క్వాలిఫై చేసి మరో మూడు సంస్థలకు మాత్రమే రూ.95ల రేటుతో నిర్వహణ పనులను అప్పగిస్తూ ఖరారు చేసింది. -
బాసర ట్రిపుల్‌ఐటీలో అదనంగా 500 సీట్లు
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ ఆరేళ్ల బీటెక్ కోర్సులో అదనంగా మరో 500 సీట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2018–19 విద్యాసంవత్సరంలో ఈ సీట్లలోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా శనివారం తెలిపారు. బాసర క్యాంపస్‌లో 2008–09 విద్యాసంవత్సరంలో 2వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారని, మౌలిక వసతుల కొరత వల్ల 2010లో వెయ్యి సీట్లను తగ్గించినట్టు గుర్తు చేశారు. గడిచిన ఏడేళ్లలో క్యాంపస్ పురోగతి సాధించిందని, ఆధునిక లాబొరేటరీలు, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన బోధనాసిబ్బంది వంటి కారణాలతో ప్రస్తుతం మళ్లీ అదనపు సీట్లను మంజూరు చేశామని పేర్కొన్నారు. -
పేదరికం అడ్డుపడుతుంది
► దాతల కోసం ఎదురుచూపులు మరిపెడ: ఓ నిరుపేద విద్యార్థికి చదువు ఉంది. చదువుకోవాలని ఉంది. శాస్త్రవేత్త కావాలని ఉంది కాని పేదరికం అడ్డుపడుతుంది. దాతలు తమ వంతుగా సహకరిస్తే తన చదువును పూర్తిచేసి దేశానికి ఉపయోగపడేలా ఉండాలనేదే ఆ ఆవిధ్యార్థి లక్ష్యం. వివరాల్లోకి వెళితే మరిపెడ మండల కేంద్రానికి చెందిన బోడ నాగేందర్, శ్రీమతి దంపతులకు ఇద్దరు సంతానం చిన్న కుమారుడైన ఆకాష్ చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉంటూ మొదటి ర్యాంక్‌లు సాధించేవాడు. పదవ తరగతిలో కూడా మంచి ర్యాంక్ సాధించాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ట్రిపుల్‌ఐటీలు ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, కడపజిల్లాలోని ఇడుపులపాయ, న్యూజీవీడులో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరిపెడకు చెందిన ఆకాష్ 2015–16 బాసరలోని ట్రిపుల్‌ఐటీలో ఈసీఈలో చేరాడు. అమెరికా అంతరిక్షా పరిశోధన సంస్థ 2017లో నిర్వహించిన విహన్ కాంటెస్ట్‌లో బాసర విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలలో ట్రిపుల్ ఐటీవిద్యార్థులు రూపోందించిన స్పేస్‌కాంటెస్ట్‌లో చంద్రునివద్ద మానవుని మనుగడకోసం ఉపయోగించే వనరులపై రిసెర్చ్‌చేసి ప్రతిభ కనబరిచి అందరిమన్ననలను పొందారు. అందులో మరిపెడకు చెందిన ఆకాష్ ఉండడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణం. ఈ ఏడాడి మొత్తం 30దేశాల నుంచి 1500ల ప్రాజెక్ట్‌లు పోటీలో ఉన్నాయి. ఆర్జీయూకేటీ(రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక శాస్త్రీయ సాంకేతిక విశ్వవిధ్యాలయం) పరిదిలో వెళ్లిన విద్యార్థులలో మరిపెడకు చెందిన ఆకాష్ ఉన్నాడు. మే 25నుంచి 29వరకు అమెరికాలో అంతర్జాతీయ నాసా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సుమారు రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు ఖర్చు అవుతుంది. విద్యార్థికి వెళ్లాలని ఉన్నా స్థోమతలేకపోవడంతో తమ పిల్లవాడిని ఎలా పంపించాలని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఎవరైన దాతలు సహకరిస్తే తమ కుమారుడి లక్ష్యం నెరవేరుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రసాయనిక శాస్త్రంతో మానవ మనుగడ
పద్మశ్రీ అవార్డు గ్రహీత గోవర్ధన్ మెహతా ట్రిపుల్ ఐటీలో జాతీయ స్థాయి సదస్సు నూతన ఆవిష్కరణపై చర్చలు బాసర : మానవుని మనుగడ రసాయనిక శాస్త్రంతో ముడి పడి ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ మెహతా అన్నారు. శనివారం బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో ‘రసాయనిక, పదార్థ శాస్త్రాల్లో ఇటీవల కాలంలో వస్తున్న పురోగతి’పై జాతీయ స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరానికే కాకుండా విశ్వవ్యాప్తమైన సృష్టి అంతా రసాయనాలతో నిండి ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో నోటి, దంత క్యాన్సర్, ఎయిడ్స్ తదితర ప్రాణాంతక వ్యాధులపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించిన ఔషధాలు, వాటి పనితీరుపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వ్యాధుల నివారణకు తయారు చేయాల్సిన డ్రాగ్ డిజైనింగ్‌లో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పలువురు రసాయనిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నానో మెటీరియల్, సెమీ కండక్టింగ్, పాలిమర్ మెడిసిన్ మందుల తయారీ గోడప్రతుల ద్వారా విద్యార్థులకు వివరించారు. ప్రపంచం మెుత్తాన్ని గడగడలాడించిన ఎబోలా, వ్యాధులకు మందు కనిపెట్టారని తెలిపారు. నానోటెక్నాలజీ ద్వారా ఆభరణాలు, పింగళి వస్తువుల తయారీకి ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్‌ఛాన్స్‌లర్ సత్యనారాయణ మాట్లాడుతూ రసాయనిక, భౌతిక శాస్త్రంలో రీసెర్చ్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో గోవర్ధన్‌మెహతా, ఢిల్లీ సీఎస్ఐఆర్టీ ప్రొఫెసర్ జేఎస్ యాదవ్, కళాశాల వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ మెుక్కలు నాటారు. సదస్సులో బాసర ఐఐఐటీ రయసానిక విభాగ అధిపతి రవివారల, శ్రీపాద్, వివిధ జిల్లాల రసాయనిక శాస్త్ర అధ్యాపకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
ట్రబుల్ ఐటీ..!
పెట్టింది తినాలి.. మెస్‌లపై పర్యవేక్షణ కరువు తక్కువ ధర కూరగాయల వైపే మొగ్గు నూనె, సామగ్రి కల్తీమయం అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు భైంసా: తెలంగాణలో ఏకైక ట్రిపుల్ ఐటీ ట్రబుల్ ఐటీగా మారింది. ఆహ్లాదకర వాతావరణం రుచి, శుచి ఉన్న భోజనం దొరకక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయాలపై దృష్టి సారించకపోవడంతో మెస్ నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఏడు వేల మంది విద్యార్థులుండగా, వారి కోసం మూడు మెస్‌లు ఉన్నాయి. ఒక్కో మెస్‌లో 2 వేల మంది విద్యార్థులు భోజనం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. అ యితే, ఈ మూడు మెస్‌ల్లోనూ నాణ్యమైన భోజనం దొరకడం లేదు. ఈ విషయమై విద్యార్థులు పలుమార్లు ఆందోళనకు దిగినా ఫలితం ఉండడం లేదు. ఆందోళన చేపట్టిన ప్రతిసారి నచ్చజెప్పి పంపిస్తున్నారే తప్ప.. మెస్ నిర్వాహకుల వైఖరి మాత్రం మారడం లేదు. మెస్ ని ర్వాహకుల కనుసన్నల్లోనే అధికారులు వ్యవహరించడమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో రెండోసారి.. బాసర ట్రిపుల్‌ఐటీలో కలుషిత భోజనం చేసి విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలు అనేకం. ఈ విద్యాసంవత్సరంలో ఆగస్టు 16న 150 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా, 100మందికిపైగా అస్వస్థతకు లోనయ్యారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మెస్‌లో భోజనాలు చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, తలతిప్పడం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. నీరు దుర్వాసన వస్తున్నా.. మెస్‌లో కంపుకొట్టినా విద్యార్థులు భరించాలే తప్ప సరిచేసే అవకాశమే లేకుండాపోయింది. తక్కువ ధరవైపే మొగ్గు... ట్రిపుల్ ఐటీ మెస్ నిర్వాహకులు సరుకుల కోసం దగ్గరగా ఉన్న సంతలను ఎంచుకుంటున్నారు. మెనూతో సంబంధం లేకుండా తక్కువ ధరకు దొరికే కూరగాయలను కొనుగోలు చేసి నిల్వ చేసి ఉంచుతున్నారు. వాటినే వండి వార్చుతున్నారు. మాంసాహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడంలేదు. తక్కువ ధరకు లభించే చికెన్, కోడిగుడ్లను తీసుకొస్తున్నారు. మెస్‌లపై పర్యవేక్షణ కరువు కావడంతో నిర్వాహకులు తమకు నచ్చిన.. తక్కువ ధరకు దొరికే నాసి రకం సరుకులతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఏడు వేల మంది విద్యార్థుల కోసం మాంసాహారం తీసుకొస్తుండగా, ఒక్కసారి కూడా పశువైద్యాధికారులు ఇప్పటి వరకు తనిఖీ చేసిన దాఖలాలు లేవు. రోగాల బారిన పడ్డ కోళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వండుతున్నారని విద్యార్థులే బాహాటంగా ఆరోపిస్తున్నారు. చదువుపై ప్రభావం... ట్రిపుల్ఐటీ మెస్‌లలో ప్రతిరోజూ ఒకరిద్దరు విద్యార్థులు అస్వస్థతకు లోనవుతూనే ఉంటా రు. చాలా మంది విద్యార్థులు భోజనాలు చే సేందుకు భయపడుతుంటారు. కొంత మంది భోజనాలు చేశాక నేరుగా ఆసుపత్రికి వెళ్లి మా త్రలను వాడుతుంటారు. మెస్‌లలో సరైన భో జనం లేక అస్వస్థతకు గురైన విద్యార్థులు ప్రతి సారీ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పూర్తిగా కోలుకున్నాకే తల్లిదండ్రులు ట్రిపుల్ఐటీ కళాశాలకు పంపిస్తున్నారు. పది, పదిహేను రోజుల పాటు ఇంటి వద్ద ఉండి వచ్చేసరికి విద్యార్థులు తరగతులను కోల్పోతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు విద్యాపరంగానూ నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. అధికారులు స్పందించి విద్యార్థుల వెతలు తీర్చాల్సిన అవసరం ఉంది. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత
120 మంది విద్యార్థులకు అస్వస్థత భైంసా : బాసర ట్రిపుల్ ఐటీ మెస్‌లో విషాహారం తిని 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ట్రిపుల్ ఐటీలో 3 వేల మంది విద్యార్థుల కోసం మెస్ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఈ మెస్‌లో భోజనాలు చేసిన విద్యార్థులు కడుపునొప్పి బారినపడ్డారు. వీరంతా ఆదివారం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం ఇదే మెస్‌లో భోజనం చేసిన విద్యార్థులూ అనారోగ్యం పాలయ్యారు. మొత్తంగా అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 120 వరకు చేరింది. వీరిలో కొంతమంది నిజామాబాద్ ఆస్పత్రిలోనూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
రక్షణ గాలికి..
బాసర, న్యూస్‌లైన్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. విద్యార్థులకు కనీస రక్షణ లేకపోవడం, రక్షణ సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉండటం, పట్టించుకునే వారు లేకపోవడంతో విద్యార్థులు ఎప్పుడు వెళ్తున్నారో, వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. గత నెల లోనే నాగరాజు అనే విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరువకు ముందే సోమవారం అర్ధరాత్రి రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు తుప్పురా గాంధీ(22) అనే విద్యార్థి కిందపడి మృత్యువాత పడ్డాడు. బండేపల్లి గ్రామానికి చెందిన తుప్పుర గాంధీ బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం గాంధీ, శివకుమార్‌లు కలిసి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని ఓ శుభకార్యానికి ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అనుమతి లేకుండా వెళ్లారు. శుభకార్యం చూసుకుని షాపింగ్ చేసుకుని ఇద్దరు అర్ధరాత్రి ఒంటి గంటకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అజ్మీర్ వేళ్లే రైలులో బాసర వద్ద దిగాలని చూశారు. బాసరలో స్టాప్ లేకపోవడం, స్టేషన్ వద్ద మరమ్మతు చేస్తుండటంతో రైలు వేగం తగ్గింది. రైలు ఆగుతుందనుకుని మొదట శివకుమార్ దూకగా గాయాలు అయ్యాయి. గాంధీ దూకుతుండగా రైలు వేగం పెరగడంతో ప్లాట్ ఫాం, రైలుకు మధ్యలో ఇరుక్కపోయాడు. తలకు తీవ్రగాయాలు కాగా, కాళ్లు, చేతులు విరగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన విద్యార్థి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి సమాచారం చేరవేయడంతో అంబులెన్స్ సంఘటన స్థలానికి వచ్చి గాంధీ మృతదేహాన్ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా యాజమాన్యం అనుమతి తీసుకోవాలి. అటువంటికి విద్యార్థులు అనుమతి లేకుండానే బయటకు వెళ్లారు. రిజిస్టర్లో కూడా వారు బయటకు వెళ్లినట్లు లేదు. కాగా, గాంధీ తల్లిదండ్రులు విజయలక్ష్మి, బస్వరాజు. బసవరాజు రిటైర్డ్ ఆర్మి అధికారి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రక్షణ కరువు.. బాసర సరస్వతీ అమ్మవారి చెంత 2008లో ట్రిపుల్ ఐటీ నెలకొల్పబడింది. వైఎస్సార్ ఉన్న హయాంలో ఏ లోటు లేకుండా విద్యార్థులు నిశ్చింతగా చదువుకున్నారు. ఆయన మరణానంతరం విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. నిధులు విడుదల చేయకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. ప్రస్తుతం 8 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో దాదాపు 150 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ప్రహరీ నిర్మాణం కాకపోవడంతో యాజమాన్యం అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. వారిని పట్టించుకోకపోవడంతో ఎప్పుడు వస్తున్నారో తెలియదు. ఇప్పటివరకు గాంధీ, లక్ష్మన్, నాగరాజు విద్యార్థులు నిండు ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రత ఏర్పరచి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
ట్రిపుల్ ఐటీ ఎదుట టీడీపీ ఎంపీ ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల నష్ట పరిహారం అందజేయాలని స్థానిక ఎంపీ రమేష్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ట్రిపుల్ ఐటీ భవనం ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. నాగరాజు ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలోని పలు ట్రిపుల్ ఐటీలలో ఇటీవల విద్యార్థులు తరచుగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రమేష్ రాథోడ్ చేపట్టిన ఆందోళనలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులు వెంటనే స్పందించి కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే నాగరాజును ఆసుపత్రికి తరలించేందుకు కళాశాల యాజమాన్యం ఆలసత్వం వహించింది. దాంతో నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. -
నిర్లక్ష్యం’ ఖరీదు నిండు ప్రాణం
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కళాశాలలో ఈ-4 చదువుతున్న నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం అందించారు. మరికొందరు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు, సిబ్బంది, అంబులెన్సు అందుబాటులో లేక విద్యార్థులు వెనుదిరిగారు. ఆలస్యంగా స్పందించిన అధికారులు 40 నిమిషాల తర్వాత ఓమిని వ్యానును పంపించారు. వ్యానులో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగరాజును ఆస్పత్రికి తరలించే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది తమకు అధికారులు చెప్పలేదని నిలువరించారు. అధికారుల సమాచారం వచ్చాకే బయటకు తీసుకువెళ్లాలని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు అధికారులు స్పందించడంతో విద్యార్థిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే నాగరాజు ప్రాణాలు వదిలాడు. అధికారుల నిర్లక్ష్యం తమతోపాటు చదువుకునే విద్యార్థి నాగరాజును రక్షించుకోలేక పోయామని అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ట్రిపుల్ ఐటీలో చదివుతున్న ఆరు వేల మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రోడ్డుపైనే ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, సీఎస్‌వో వజీరోద్ధిన్, సెక్యూరిటీ సూపర్వైజర్ స్వామి, సాయినాథ్, శివప్రసాద్‌లను తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని విద్యార్థులు పట్టుబట్టారు. భైంసా డీఎస్పీ గిరిధర్ ట్రిపుల్ ఐటీకి చేరుకుని కళాశాల అధికారులను పిలిపించి విద్యార్థుల డిమాండ్లపై చర్చించారు. కళాశాల అధికారుల దాటవేత ధోరణితో మరోసారి విద్యార్థులు మధ్యాహ్నం రెండోసారి రోడ్డుపై బైఠాయించారు. అధికారులను తొలగించనిది ఆందోళన విరమించమని రాత్రి వరకు కూడా రోడ్డుపైనే బైఠాయించారు. దిగొచ్చిన అధికారులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తుండటం, రాత్రి వరకు కూడా విరమించకపోవడంతో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య బాసరకు వచ్చారు. విద్యార్థుల డిమాండ్లపై వారితో చర్చించారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజొద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పది గంటలపాటు ఆందోళన చేసిన విద్యార్థులు రిజిస్ట్రార్ సోమయ్య నచ్చజెప్పడంతో శాంతించారు. గతంలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా సస్పెండ్ చేసి మళ్లీ కొనసాగించారని విద్యార్థులు పేర్కొన్నారు. సస్పెండ్ అయిన అధికారులు మళ్లీ కొనసాగితే ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని విద్యార్థులు హెచ్చరించారు. సమస్యలతో సహవాసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. నిద్రలేవగానే నీటి కష్టాలతో వారి అవస్థలు మొదలవుతాయి. స్నానాలు చేయకుండానే విద్యార్థులు తరగతి గదులకు వెళ్తున్నారు. ఆడ పిల్లలయితే నీటి కోసం వేకువజామునే నిద్రలేచి బారులు తీరాల్సిన పరిస్థితి. ఇక మెస్‌కు వెళ్తె అక్కడ సరైన భోజన సౌకర్యం ఉండదు. ఈ విషయం తెలిసిన ట్రిపుల్ ఐటీ అధికారులు స్పందించరు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. అంతా తామై వ్యవహరిస్తున్న ఇక్కడి అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులకు విద్యార్థులు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లో కరెంటు సరఫరాలోనూ తీవ్ర అంతరాయం తప్పదు. చీకటి గదుల్లో చదవలేక ఆరు బయట మహారాష్ట్ర ప్రాంతంలోని ఆల్కాహాల్ ఫ్యాక్టరీ దుర్గంధం భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక్కడి వాతావరణంతో విద్యార్థులు అనారోగ్యం భారిన పడుతున్నారు. సౌకర్యాలు లేకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేక పోతున్నారు. ఫలితంగా కళాశాలలో చదివే విద్యార్థులు మనస్తాపానికి గురై ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కళాశాలను ప్రారంభం నుంచి ఇప్పటివరకు నడిపిస్తున్న అధికారులను తప్పిస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం.. - నాగరాజు పింగళి, బాసర ఎస్సై ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాం. ఉద్యోగం రాకపోవడమా, అనారోగ్య కారణమా మరే ఇతర కారణాలు ఉన్నాయో అనే కోణంలోనూ పరిశీలిస్తాం. నాగరాజు ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నాం. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
భైంసా/బాసర, న్యూస్‌లైన్: ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. అతడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా కనగల్ మండలం గౌరరాం గ్రామానికి చెందిన బి.నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకాడు. ఇది గమనించిన విద్యార్థులు ఆవరణలోనే ఉన్న ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. అయితే, ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితోపాటు అంబులెన్సు అందుబాటులోలేదు. ట్రిపుల్ ఐటీ అధికారులూ వెంటనే స్పందించకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. విద్యార్థులు సమాచారం ఇచ్చిన 40 నిమిషాలకు వ్యానును పంపించారు. కానీ, వ్యాను బయటకు వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదంటూ సెక్యూరిటీ సిబ్బంది కొద్దిసేపు నిలువరించారు. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించి నాగరాజు మృతిచెందాడు. విషయం తెలిసిన విద్యార్థులు దాదాపు ఆరు వేల మంది ఉదయం 11 గంటలకు భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. అధికారుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపించారు. వీటితోపాటు తాము అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వాతావరణంలో ఇమడలేకనే నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పారు. బాధ్యులను తొలగిస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు భైంసా డీఎస్పీకి స్పష్టంచేశారు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళన కొనసాగించారు. కాగా, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నాగరాజు మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకువెళ్లారు. ఐదుగురు అధికారుల సస్పెన్షన్ విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తుండటం, రాత్రి వరకు కూడా విరమించకపోవడంతో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య బాసరకు వచ్చారు. విద్యార్థులతో చర్చించి వారి డిమాండ్ మేరకు ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజుద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు శాంతించారు. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా... బొమ్మపాల నాగరాజుకు ఇటీవలే మేనత్త కూతురితో పెళ్లి కుది రింది. ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో నిలిచిపోయింది. ఇదే విషయమై శనివారం రాత్రి 8 గం టల సమయంలో తల్లిదండ్రులు వెంకటయ్య, జయమ్మలతో మాట్లాడాడు. మార్చి 5న లగ్నం పెట్టుకోవాలని నాగరాజు తమతో చెప్పాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలీ చేసుకుంటూ కొడుకును చదివించామని, అతని ఇష్టప్రకారమే పెళ్లి నిశ్చయం చేశామని వారు రోదించారు. ఇంతలోనే కనిపించని లోకాలకు వెళ్లిపోయాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, నాగరాజు మృతిపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి సంఘటన జరిగితే ఆదివారం ఉదయం వరకు చెప్పలేదన్నారు. కళాశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వడంలేదని వారు తెలిపారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
-
సౌకర్యాలు అధ్వానం
బాసర, న్యూస్‌లైన్ : బాసర ట్రీపుల్‌ఐటీలో సౌకర్యాల తీరుపై ఆర్డీవో అరుణశ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆర్డీవో ట్రీపుల్‌ఐటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమా రు రెండు గంటలపాటు ఉండి, ప్రతీ విభాగాన్ని పరిశీ లించారు. మెస్, వైద్యశాల, వంట గదులతోపాటు హాజ రుపట్టికలను తనిఖీ చేశారు. వంటశాలలో కుళ్లిన కూరగాయలు దర్శనమిచ్చారుు. కారంపొడి, పప్పులు తది తర సరుకులు నాసిరకం వాడుతుండడంతో మెస్ నిర్వాహకుడిపై మండిపడ్డారు. విద్యార్థులకు కనిపిం చేలా మెనూ ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం వైద్య శాలను తనిఖీ చేశారు. వైద్యశాలలో ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులుండగా ఒక్కరే విధులకు హాజరయ్యూరు. దీంతో హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిష్టర్లను పరిశీలించారు. హాజరుపట్టికలో ముందే సంతకాలు చేసి ఉండడం, ఒకరి సంతకాలు మరొకరు పెట్టడంపై వైద్యు డు కౌశిక్‌పై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో కనీసం ఫ్రీజ్ సైతం లేకపోవడమేంటని, మందులు ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ నిర్వహణ తీరుపై ఓఎస్డీ నారాయణతో మాట్లాడారు. నిర్వహణ అస్తవ్యస్తం.. ట్రిపుల్ ఐటీ తనిఖీ అనంతరం ఆర్డీవో అరుణశ్రీ విలేకరులతో మాట్లాడారు. సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులున్న ట్రీపుల్ ఐటీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉం దని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తు న్నా విద్యార్థులకు సౌకర్యాల కల్పన, పరిపాలన విషయంలో ట్రీపుల్‌ఐటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మెస్‌లో కుళ్లిన కూరగాయల నిల్వలు ఉన్నాయన్నారు. నిధుల విషయంలో ఆడిట్ లేకపోవడంతో ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వివరాలపై అధికారులు బదులు ఇవ్వలేకపోయూరని తెలిపారు. ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉందని, ఇందులో ఇద్దరు ఉండగా తనిఖీ సమయంలో ఒక్కరే ఉన్నారని చెప్పారు. తనిఖీలో వెలుగుచూసిన విషయూలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందిస్తానని పేర్కొన్నారు. ఆమె వెంట తహశీల్దార్ నరేందర్, ఆర్ఐ, వీఆర్ఏ ఉన్నారు. -
పచ్చధనం పక్కదారి
భైంసా, న్యూస్‌లైన్ : పర్యావరణ పరిరక్షణ కోసం ఇటీవల అధికారులు బాసర ట్రిపుల్ ఐటీకి అనంతపురం జిల్లా నుంచి 200 రాగి, మర్రి మొక్కలు తెప్పించారు. ఒక్కో మొక్కను రూ.250కి కొనుగోలు చేసి, రవాణా చార్జీల కింద ఒక్కో మొక్కకు రూ. 50 వెచ్చించారు. ఇలా 300 మొక్కలకు రూ.60 వేలు ఖర్చు చేశారు. మొక్కలు నాటాకా నల్లమట్టిపై ఎర్రమట్టి వేస్తామంటూ మరో 30 ట్రిప్పులకు మట్టి ఆర్డరు ఇచ్చారు. బాసర నుంచి 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న యంచ గ్రామం నుంచి మట్టిని తెప్పించారు. ఒక్కో ట్రిప్పుకు రూ.3 వేల చొప్పున 30 ట్రిప్పులకు రూ.90 వేల ఖర్చు చేశారు. మొక్కల చుట్టూ ఎర్ర మట్టికి బదులు ఎర్ర మొరం కనిపిస్తోంది. ఎర్ర మట్టిగా చెప్పే ఎర్రమొరంలో అన్ని బండరాళ్లే ఉన్నాయి. ఇలాంటి మొరం గ్రామాల్లో రూ.300 ట్రిప్పు దొరుకుతుంది. ఇలా రూ. 9 వేలకు దొరికే ఎర్ర మొరాన్ని రూ.90 వేలు వెచ్చించి అధికారులు కొనుగోలు చేశారు. ఉచితంగా లభిస్తున్నా.. పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా వన నర్సరీలు ఏర్పాటు చేసింది. అటవీ శాఖ అధికారులు వర్షాలు కురియగానే ఏటా అన్ని రకాల మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తారు. రోడ్లపై మొక్కలు నాటి అటవీ శాఖ అధికారులే నీళ్లు పోస్తారు. మహాత్మాగాంధీ జాతీయ వననర్సరీల్లోనూ ప్రభుత్వం లక్షల మొక్కలను పెంచుతోంది. జిల్లాలోనే ఉచితంగా మొక్కలు దొరికే మార్గం ఉన్నా ట్రిపుల్ ఐటీ అధికారులు డబ్బులు వెచ్చించి అనంతపురం జిల్లా నుంచి కొనుగోలు చేశారు. పైగా అక్కడి నేలలకు మన నేలలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రాంతంలో మన నేల స్వభావాలకు అనుకూలంగా పెరిగే మొక్కలనే వననర్సరీల్లో పెంచుతారు. కానీ అధికారులు మాత్రం అవేవి లెక్కలోకి తీసుకోకుండా రూ.60 వేలు మొక్కలు తెప్పించడానికి వెచ్చించారు. ఇంకా కొన్ని మొక్కలు తెప్పిస్తామని అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి డబ్బులు వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇవే మర్రి, రాగి మొక్కలు ముథోల్ మండలం తరోడ గ్రామంలో వననర్సరీల్లో వీటి ధర అడిగితే రూ.100 లోపు ఉంటుందని చెప్పారు. కాని అధికారులు మాత్రం రూ. 250తో వాటిని కొనుగోలు చేశారు. అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపితే ఆ మొక్కలు కాస్త ఉచితంగా దొరికేవి. పెంచడంపై శ్రద్ధ లేదు.. అనంతపురం నుంచి బాసరకు మొక్కలు తెప్పించిన అధికారులకు పచ్చదనంపై ఎంత పట్టింపో అనుకుంటే పొరపాటే. మొక్కలు తీసుకువచ్చిన అధికారులు అవి నాటిన ఆవరణలో ఎలా ఉన్నాయో కూడా చూడడం లేదు. ఒక పక్కన పశువులు మరో పక్కన గొర్రెలు రోజు ఇక్కడే మేపుతున్నారు. పశువులు నాటిన మొక్కలను తొక్కేస్తున్నాయి. గొర్రెలు మొక్కలకున్న ఆకులను తినేస్తున్నాయి. నాటిన మొక్కల చుట్టూ వర్షపు నీరు చేరింది. ఎర్ర మట్టిగా చెప్పుకునే ఎర్రమొరం కుప్పలు అలాగే పడి ఉన్నాయి. నల్లమట్టిపై ఎర్ర మట్టి వేయకపోవడంతో మొక్క చుట్టూ వర్షపు నీరు చేరి అన్ని వాడిపోతున్నాయి. వాడిపోయిన మొక్కలను పక్కన పారేశారు. నాటాల్సిన మొక్కలను అలాగే వదిలేశారు. ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు మొక్కలను ఎలా పెంచుతారో ఎవరికి అంతుచిక్కడం లేదు. తొందరగా పెరిగేందుకే. .- నారాయణ, ట్రిపుల్ ఐటీ ఓఎస్డీ తొందరగా పెరిగేందుకే ఎత్తుగా ఉన్న మొక్కలను దూరం నుంచి తెప్పించాం. అటవీశాఖ మొక్కలు చిన్నగా ఉంటాయి. అవి తొందరగా పెరగవు. అందుకే అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ నాటించాం. ముందు తీసుకొచ్చిన ఎర్రమట్టి బాగుంది. మళ్లీ తీసుకువచ్చిన ఎర్రమట్టి బాగాలేదని నిలిపివేశాం. మేము ఏమి చేసిన యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకే చేస్తున్నాం.