భైంసా(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు ఈసారి పాలిసెట్ అర్హతతో సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 2న ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 వరకు గడువు ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీ కింద ఈ నెల 14 వరకు సడలింపు ఇచ్చారు. దీంతో 20,178 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 19,253 సాధారణ దరఖాస్తులు కాగా, గ్లోబల్ కేటగిరీలో 925 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 18న జాబితా విడుదల చేయనుంది. గతేడాది 1,500 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి వెయ్యి సీట్లకే పరిమితం చేస్తుందా.. లేదంటే 1,500 సీట్లు కేటాయిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. త్వరలో విద్యార్థుల జాబితా ప్రకటిస్తామని ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment