సాక్షి, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ)లో 2020–21 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు శనివారం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేడ్‌టెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదవిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు 85 శాతం, స్థానికేతరులకు 15 శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment