polyset applications
-
119 మార్కులకు టాప్ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, నాన్– ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్) ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ పాలిసెట్–20 23)లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణుల య్యారు. బాలురు, బాలికలు కలిపి మొత్తం మీద 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్ ఆడిటోరియంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఫలితాలను విడుదల చేశారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు సత్తా చాటారు. బాలురు 78.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హులైన వారికి జూన్ 14 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మిత్తల్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరో నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయని చెప్పారు. 119తో టాప్ ర్యాంక్ ఈనెల 17న నిర్వహించిన పాలిసెట్‌కు 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంపీసీ విభాగంలో 80,358, ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సురభి శరణ్య 120 మార్కులకు 119 మార్కు లు సాధించి ఎంపీసీ విభాగంలో స్టేట్ మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అదే జిల్లాకు చెందిన షేక్ సిద్ధిక్ సైతం 119 మార్కులు సాధించి రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, మెదక్ జిల్లాకు చెందిన జి.ప్రియాంశ్కుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.ప్రణీత్, సూర్యాపేటకు చెందిన కె.శశివర్ధన్లు 118 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్ 116 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోగా, సూర్యాపేట జిల్లా విద్యార్థి మిర్యాల అక్షయతార 116 మార్కులతో రెండు, సూర్యాపేట జిల్లాకే చెందిన కె.శశివర్ధన్ 116 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. శశివర్ధన్ ఎంపీసీ, ఎంబైపీసీ రెండింటిలోనూ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీల్లోని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. రైతుబిడ్డ.. ఎంబైపీసీలో ఫస్ట్‌ర్యాంకర్ కాటారం: రైతుబిడ్డ పాలిసెట్‌లో మెరిశాడు. ఎంబైపీసీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గంగారానికి చెందిన చీర్ల ఆకాశ్ 120కి 116 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ సాధించాడు. ఆకాశ్ తండ్రి చీర్ల రమేశ్ రైతు కాగా, తల్లి రజిత గృహిణి. ఆకాశ్ 4వ తరగతి వరకు కాటారంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు. ‘మా నాన్న కష్టం చూసేవాడిని. ప్రణాళికాబద్ధంగా చదివాను. అనుకున్న ర్యాంకు సాధించాను. ఏ కోర్సు తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆకాశ్ తెలిపాడు. తొలి విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం, స్లాట్ బుకింగ్: జూన్ 14 నుంచి 18 వరకు ♦ సరి్టఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 16 నుంచి 19 వరకు ♦ వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి 21 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూన్ 21 ♦ సీట్ల కేటాయింపు జూన్ 25 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 25 నుంచి 29 వరకు తుది విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం స్లాట్‌బుకింగ్: జూలై 1 ♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 2 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 1 నుంచి 3 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 3 ♦ సీట్ల కేటాయింపు జూలై 7 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 7 నుంచి 10 వరకు. స్పాట్ అడ్మిషన్లు.. ♦ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన: జూలై 7 ♦ ఫీజు చెల్లింపు జూలై 8, 9 ♦ ర్యాంక్ జనరేషన్ జూలై 10 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 8 నుంచి 11 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 11 ♦ సీట్ల కేటాయింపు జూలై 14 ♦ ఫీజు చెల్లించడం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 14 నుంచి 15 వరకు ♦ కాలేజీల్లో రిపోర్ట్ చేయడం జూలై 15, స్పాట్ అడ్మిషన్లు పూర్తి జూలై 17 -
పాలిటెక్నిక్ కాలేజీల్లో 72.5% సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్–2022 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్‌లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నాటికి లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును నిర్ధారించుకొని కాలేజీలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే సీటు రద్దవుతుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సోమవారం నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం కానుండగా 16వ తేదీ వరకు ఓరియంటేషన్, ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 8 బ్రాంచీల్లో సీట్లన్నీ ఫుల్... పాలిటెక్నిక్ కోర్సుల్లో 8 బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కెమికల్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. టెక్స్టైల్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెటర్లాజికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అతితక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. -
ట్రిపుల్ ఐటీలో 20,178 మంది దరఖాస్తు
భైంసా(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు ఈసారి పాలిసెట్ అర్హతతో సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 2న ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 వరకు గడువు ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీ కింద ఈ నెల 14 వరకు సడలింపు ఇచ్చారు. దీంతో 20,178 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 19,253 సాధారణ దరఖాస్తులు కాగా, గ్లోబల్ కేటగిరీలో 925 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 18న జాబితా విడుదల చేయనుంది. గతేడాది 1,500 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి వెయ్యి సీట్లకే పరిమితం చేస్తుందా.. లేదంటే 1,500 సీట్లు కేటాయిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. త్వరలో విద్యార్థుల జాబితా ప్రకటిస్తామని ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు తెలిపారు. -
ఏడుగురికి 120/120 మార్కులు!
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–2018 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఏడుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులను సాధించి ఒకటో ర్యాం కును సాధించారు. గత నెల 21న జరిగిన పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1,25,063 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1,21,422 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,12,010 మంది (92.21 శాతం) విద్యార్థులు అర్హత సాధించినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన 74,224 మంది బాలురులో 67,499 మంది (90.94 శాతం) అర్హత సాధించారని.. 47,918 మంది బాలికల్లో 44,511 మంది (94.31 శాతం) అర్హత పొందారని ఆయన చెప్పారు. నోటిఫికేషన్లో కాలేజీలు, సీట్ల వివరాలు.. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు నవీన్ మిట్టల్ చెప్పారు. విద్యార్థులకు నోటిఫికేషన్ 3న అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 14 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, జూన్ 1 నుంచి తరగతులను ప్రారంభిస్తామని వివరించారు. ఒకటి, రెండో దశ కౌన్సెలింగ్‌లను ఈలోగా పూర్తిచేస్తామని, స్లైడింగ్ కోసం (సంబంధిత కాలేజీల్లోనే ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి మార్చుకునేందుకు) ప్రత్యేకంగా మరో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల ర్యాంకును బట్టి వారికి సీట్లను కేటాయిస్తామని, అయితే వారు పదో తరగతిలో ఉత్తీర్ణులైతే ఆ సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఇక అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల వివరాలను నోటిఫికేషన్లో వెల్లడిస్తామని వివరించారు. ఈ సారి ముందుగానే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తి చేస్తున్నందునా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు మిగిలే పరిస్థితి ఉండదన్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం 31 జిల్లాల్లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు.. - మే 2న నోటిఫికేషన్ -14 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు -15 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ -15 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు - 23న మొదటి దశ సీట్ల కేటాయింపు - ఆ తరువాత ప్రవేశాలు, 30వ తేదీలోగా రెండో దశ సీట్ల కేటాయింపు -
పాలీసెట్-2016 నోటిఫికేషన్ విడుదల
- రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ - ఏప్రిల్ 21న 268 కేంద్రాల్లో పరీక్ష -1.30 లక్షల దరఖాస్తులు రావచ్చని అంచనా హైదరాబాద్ సిటీ: వివిధ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికై రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి(ఎస్బీటీఈటీ) నిర్వహించే పాలీసెట్-2016 సోమవారం విడుదలైంది. నోటిఫికేషన్ మేరకు మంగళవారం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 268 పరీక్షాకేంద్రాల్లో ఏప్రిల్ 21న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పాలీసెట్-2016 పరీక్ష జరగనుంది. గతేడాది 1.03లక్షల దరఖాస్తులు రాగా, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న పాలిటెక్నిక్ కోర్సుల పట్ల ఈ ఏడాది విస్తృత ప్రచారం చేసినందున 1.30లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలీసెట్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌కు గడువు తేది ఏప్రిల్ 10గా నిర్ణయించారు. గడువు తర్వాత ఫైన్‌తో గానీ, తత్కాల్ పద్ధతిన గానీ దరఖాస్తులు తీసుకునే అవకాశం లేదు. పరీక్ష ముగిశాక రెండు రోజుల్లోగా కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తామని, మే 3న ఫలితాలతో పాటు తుది కీని కూడా వెల్లడిస్తామని ఎస్బీటీఈటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. పాలిటెక్నిక్‌లలో హెల్ప్‌లైన్ కేంద్రాలు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా అన్ని ఏపీ ఆన్లైన్ కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన పాలిటెక్నిక్‌లలో సహాయ(హెల్ప్‌లైన్) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న అభ్యర్థులు తమ ఇంటి నుంచే ఞౌడఛ్ఛ్ట్టిట.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్‌కు సంబంధించిన దరఖాస్తు నమూనా, ఇతర వివరాల బుక్లెట్ కోసం టఛ్ట్ఛ్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు నమూనాలో కోరిన వివరాలను నింపి ఏపీఆన్‌లైన్, పాలిటెక్నిక్‌లలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వాటిని సమర్పించవచ్చు. ఇంకనూ ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు టోల్ ఫ్రీ నెంబరు 1800 599 5577 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 330 కాగా, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు గతంలో ఉన్న దరఖాస్తు ఫీజు రూ.330ను ఈ ఏడాది ప్రప్రథమంగా రూ.165కు తగ్గించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 58,880 సీట్లున్నాయి. ------------------------------ జిల్లాల వారీగా ఎంపిక చేసిన పరీక్షాకేంద్రాలు.. జిల్లా పేరు పరీక్షా కేంద్రాలు కెపాసిటీ(అభ్యర్థులు) ---------------------------------- మహబూబ్‌నగర్ 24 11,740 నల్గొండ 24 12,040 ఖమ్మం 28 15,822 వరంగల్ 37 17,802 అదిలాబాద్ 25 8,830 కరీంనగర్ 40 18,978 నిజామాబాద్ 22 8,250 మెదక్ 20 10,305 రంగారెడ్డి 17 8,400 హైదరాబాద్ 41 20,750 ---------------------------------- మొత్తం 268 1,32,921