![BASARA IIIT Student Deepika Killed Self Case Details - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/13/photo1.jpg.webp?itok=pHBV-_z9)
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్ వ్యవహారంలో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది. ఇవాళ్టి పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు ధృవీకరించకపోగా.. దీపిక మృతిపై పారదర్శకంగా విచారణ జరపాలని పోలీసులను విద్యార్థులకు కోరుతున్నారు.
ఆర్జీయూకేటీ పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక.. A3 బ్లాక్‌లోని బాత్‌రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న దీపికను భైంసా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. అంతకు ముందు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ముగ్గురు మాస్ కాపీయింగ్‌కు పాల్పడగా.. అందులో దీపిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిబార్ భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్. వార్షిక పరీక్షల అనంతరం బాత్రూంకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్ధలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం బైంసా ఏరియాసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ఇదీ చదవండి: శిరీష కేసుపై నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment