Bhainsa Area Hospital
-
బాసర: దీపిక కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్ వ్యవహారంలో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది. ఇవాళ్టి పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు ధృవీకరించకపోగా.. దీపిక మృతిపై పారదర్శకంగా విచారణ జరపాలని పోలీసులను విద్యార్థులకు కోరుతున్నారు. ఆర్జీయూకేటీ పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక.. A3 బ్లాక్‌లోని బాత్రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న దీపికను భైంసా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. అంతకు ముందు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ముగ్గురు మాస్ కాపీయింగ్‌కు పాల్పడగా.. అందులో దీపిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిబార్ భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్. వార్షిక పరీక్షల అనంతరం బాత్రూంకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్ధలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం బైంసా ఏరియాసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇదీ చదవండి: శిరీష కేసుపై నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఆదేశాలు -
వికటించిన పెళ్లి భోజనం
భైంసా (నిర్మల్): భైంసాలో సోమవారం రాత్రి పెళ్లి భోజనం వికటించి 500 మం దికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన వివాహ వేడుకకు హాజరయ్యారు. భోజనాలు చేసిన గంటలోపే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో భైంసాలోని ఏరియా ఆసుపత్రికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అర్ధరాత్రి 12.30 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 500కుపైగా పెళ్లికి హాజరైన వారు ఆసుపత్రి పడకల్లో కనిపించారు. ఆసుపత్రి ఆవరణ, అత్యవసర విభాగం, పురుషుల వార్డు, స్త్రీల వార్డు ఇలా ఎటుచూసినా అస్వస్థతకు లోనైన వారే కనిపించారు. ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు పిల్లలను ఉంచి వైద్య చికిత్స అందించారు. ఒక్కో కుటుంబంలో నలుగురు, ఐదుగురు అస్వస్థతకు లోనయ్యారు. భైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెల్లవారే వరకు వైద్య సేవలు అందించారు. ఉదయం వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివాహ భోజనంలోని పాయసంతోనే అస్వస్థతకు లోనైనట్లు పలువురు ఆరోపించారు. -
మృతుల కుటుంబాలకు మంత్రులు పరామర్శ
భైంసా : ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆటోను కంకరతో వెళుతున్న లారీ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలో 14 మంది మరణించగా... భైంసా ఏరియా ఆస్పత్రిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రులు భైంసా ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. బాధిత కటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రులు ప్రకటించారు. మృతులందరూ మహారాష్ట్రకు చెందిన కూలీలు. -
26 వేళ్లతో ఆడ శిశువు జననం
ఆదిలాబాద్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో సోమవారం 26 వేళ్లతో ఆడ శిశువు జన్మించింది. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన అజయ్, శ్రావణి దంపతుల మొదటి సంతానంగా పుట్టిన ఈ శిశువు ఒక్కో చేతికి ఏడు వేళ్ల చొప్పున ఉండగా, కాళ్లకు ఆరు చొప్పున ఉన్నాయి. మొత్తంగా 26 వేళ్లతో చిన్నారి జన్మించింది. శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. - భైంసా రూరల్