వికటించిన పెళ్లి భోజనం | Over 500 people are sick with wedding meal | Sakshi
Sakshi News home page

వికటించిన పెళ్లి భోజనం

Feb 20 2019 2:59 AM | Updated on Feb 20 2019 2:59 AM

Over 500 people are sick with wedding meal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భైంసా (నిర్మల్‌): భైంసాలో సోమవారం రాత్రి పెళ్లి భోజనం వికటించి 500 మం దికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన వివాహ వేడుకకు హాజరయ్యారు. భోజనాలు చేసిన గంటలోపే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో భైంసాలోని ఏరియా ఆసుపత్రికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అర్ధరాత్రి 12.30 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 500కుపైగా పెళ్లికి హాజరైన వారు ఆసుపత్రి పడకల్లో కనిపించారు.

ఆసుపత్రి ఆవరణ, అత్యవసర విభాగం, పురుషుల వార్డు, స్త్రీల వార్డు ఇలా ఎటుచూసినా అస్వస్థతకు లోనైన వారే కనిపించారు. ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు పిల్లలను ఉంచి వైద్య చికిత్స అందించారు. ఒక్కో కుటుంబంలో నలుగురు, ఐదుగురు అస్వస్థతకు లోనయ్యారు. భైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కాశీనాథ్‌ వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెల్లవారే వరకు వైద్య సేవలు అందించారు. ఉదయం వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివాహ భోజనంలోని పాయసంతోనే అస్వస్థతకు లోనైనట్లు పలువురు ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement