మృతుల కుటుంబాలకు మంత్రులు పరామర్శ | harish rao, indrakaran reddy visits Bhainsa area hospital | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు మంత్రులు పరామర్శ

Published Sun, May 15 2016 1:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

harish rao, indrakaran reddy visits Bhainsa area hospital

భైంసా : ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి  ఆదివారం పరామర్శించారు. ఆటోను కంకరతో వెళుతున్న లారీ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలో 14 మంది మరణించగా... భైంసా ఏరియా ఆస్పత్రిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రులు భైంసా ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. బాధిత కటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రులు ప్రకటించారు. మృతులందరూ మహారాష్ట్రకు చెందిన కూలీలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement