t ministers
-
మృతుల కుటుంబాలకు మంత్రులు పరామర్శ
భైంసా : ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆటోను కంకరతో వెళుతున్న లారీ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలో 14 మంది మరణించగా... భైంసా ఏరియా ఆస్పత్రిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రులు భైంసా ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. బాధిత కటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రులు ప్రకటించారు. మృతులందరూ మహారాష్ట్రకు చెందిన కూలీలు. -
రెండేళ్లయినా బెరుకేనా?
కొందరు అమాత్యుల పనితీరుపై సీఎం అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ‘‘మంత్రులుగా బాధ్యతలు తీసుకుని రెండేళ్లు కావొస్తోంది. అయినా బెరుకుగానే ఉంటున్నారు. శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారు. కొందరికి కనీసం బడ్జెట్ ఎలా రూపొందించుకోవాలో కూడా తెలియడంలేదు’’ అని సీఎం కేసీఆర్ కొంద రు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం కొన్ని రాజకీయాంశాలు మాట్లాడినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం దక్కడంతో పలువురు మంత్రులు సీఎంకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం కోసం మంత్రులు గల్లీగల్లీ తిరిగారు. ఇప్పుడు ఒక్కసారే మాయం కావొద్దు. హైదరాబాద్ కార్యక్రమాల్లో కనిపించండి’’ అని అన్నారు. హైదరాబాద్‌కు అన్ని శాఖలతో సం బంధం ఉంటుంది కాబట్టి మంత్రులు నిత్యం ఇక్కడ కనిపించాలన్నట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన పాత, కొత్త కేడర్లతో మంత్రులు విధిగా సంబంధాలు కలిగి ఉండాలని, వారిని పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. గ్రేటర్ ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ తెలిసిందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు టీఆర్ఎస్వే కావాలని నిర్దేశించినట్లు సమాచారం. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా మంత్రులు వారంపాటు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సారథ్య బాధ్యతలు మోసిన మంత్రి కేటీఆర్‌కు మంత్రివర్గ సహచరులంతా అభినందనలు తెలిపారు. -
టే-మంత్రులకు బంపర్ ఆఫర్
-
ఏపీఎన్జీవోలు మిలీనియం మార్చ్ అవసరం లేదు: గీతారెడ్డి
తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం వల్లే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతమైందని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం కరీంనగర్ విచ్చేసిన ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సభ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. గాయపడిని కానిస్టేబుల్‌ను టి.మంత్రులు పరామర్శిస్తామని తెలిపారు. అయితే నిజాం కాలేజీలో పోలీసుల లాఠీచార్జీ ఘటన బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి ఉన్నారని గీతారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలో తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతుందని తెలిపారు. ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేవ్ సభ విజయవంతమైందని సంబర పడుతూ మరో సభ పెట్టాలని చూడటం సరైన చర్య కాదని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకుంటే ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ నేపథ్యంలో గీతారెడ్డిపై విధంగా స్పందించారు.