
పేదరికం అడ్డుపడుతుంది
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ట్రిపుల్‌ఐటీలు ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, కడపజిల్లాలోని ఇడుపులపాయ, న్యూజీవీడులో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరిపెడకు చెందిన ఆకాష్ 2015–16 బాసరలోని ట్రిపుల్‌ఐటీలో ఈసీఈలో చేరాడు. అమెరికా అంతరిక్షా పరిశోధన సంస్థ 2017లో నిర్వహించిన విహన్ కాంటెస్ట్‌లో బాసర విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలలో ట్రిపుల్ ఐటీవిద్యార్థులు రూపోందించిన స్పేస్‌కాంటెస్ట్‌లో చంద్రునివద్ద మానవుని మనుగడకోసం ఉపయోగించే వనరులపై రిసెర్చ్‌చేసి ప్రతిభ కనబరిచి అందరిమన్ననలను పొందారు. అందులో మరిపెడకు చెందిన ఆకాష్ ఉండడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణం. ఈ ఏడాడి మొత్తం 30దేశాల నుంచి 1500ల ప్రాజెక్ట్‌లు పోటీలో ఉన్నాయి.
ఆర్జీయూకేటీ(రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక శాస్త్రీయ సాంకేతిక విశ్వవిధ్యాలయం) పరిదిలో వెళ్లిన విద్యార్థులలో మరిపెడకు చెందిన ఆకాష్ ఉన్నాడు. మే 25నుంచి 29వరకు అమెరికాలో అంతర్జాతీయ నాసా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సుమారు రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు ఖర్చు అవుతుంది. విద్యార్థికి వెళ్లాలని ఉన్నా స్థోమతలేకపోవడంతో తమ పిల్లవాడిని ఎలా పంపించాలని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఎవరైన దాతలు సహకరిస్తే తమ కుమారుడి లక్ష్యం నెరవేరుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.