వాషింగ్టన్: ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో ముఖ్యమైనదే. అందుకే ఎన్నికల్లో ఓటు వేయడానికి రాలేని వారికి సుదూర ప్రాంతాలలో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎలక్షన్. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
From the International Space Station: I voted today
— NASA Astronauts (@NASA_Astronauts) October 22, 2020
— Kate Rubins pic.twitter.com/DRdjwSzXwy
నవంబర్ 3వ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆమె అప్పుడే తన ఓటు వేశారు. ఓటింగ్ జరిగే రోజున తాను స్పేస్ ఉంటానని అందుకే ఓటు వేసినట్లు రూబిన్స్ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోను నాసా ట్విట్టర్ ద్వార షేర్ చేసింది. అంతరిక్ష కేంద్రం నుంచి నేను ఈ రోజు ఓటు వేశాను అని రూబిన్స్ ఆ ట్వీట్‌లో పేర్కొంది. ఈ నెల 14వ తేదీన అంతరిక్షంలోకి ప్రవేశించిన రూబిన్స్ ఆరు నెలల పాటు అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తన ఓటు హక్కును వినియోగించుకుంది. అయితే అంతరిక్షం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని నాసా 1997 నుంచి నాసా కల్పించింది. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వీరందరూ ఫెడరల్ పోస్ట్ కార్డు ఆప్లికేషన్ ద్వారా అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1997లో మొదటిసారి డేవిడ్ వోల్ఫ్ అనే వ్యోమగామి అంతరిక్షం నుంచి ఓటును వేశారు.
Comments
Please login to add a commentAdd a comment