
కేప్ కనావెరల్: అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా అమెరికా నాసా తన స్పేస్‌వాక్ కార్యక్రమాన్ని వాయిదావేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు సమీపంగా వేగంగా పరిభ్రమిస్తున్న శకలాలు స్పేస్‌వాక్ సమయంలో వ్యోమగాముల సూట్‌కు తూట్లు పెట్టే ప్రమాదముందని స్పేస్‌వాక్‌ను ఆపేశారు. ఐఎస్‌ఎస్‌కూ నష్టం వాటిల్లవచ్చని భావించారు. ఐఎస్‌ఎస్ బయటి యాంటీనాను మార్చేందుకు వ్యోమగాములు సిద్ధమయ్యారు. అయితే, సోమవారం రాత్రి ఒక శకలం ఐఎస్‌ఎస్‌కు దగ్గరగా దూసుకెళ్లవచ్చని అంచనాకొచ్చారు. దీంతో యాంటీనా పునరుద్ధరణ కార్యక్రమం ఆగింది. నవంబర్ 15న తన పాత కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా క్షిపణి సాయంతో పేల్చేసింది. దాంతో 1,700 పెద్ద, వేలాది సూక్ష్మ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. స్పేస్‌వాక్‌కు ఆటంకం కల్గించింది ఈ శకలాలా? కాదా? అనేది నిర్ధారణ కాలేదని నాసా అధికారులు చెప్పారు.