ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలో ఆహారం వికటించి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు.
120 మంది విద్యార్థులకు అస్వస్థత
భైంసా : బాసర ట్రిపుల్ ఐటీ మెస్‌లో విషాహారం తిని 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ట్రిపుల్ ఐటీలో 3 వేల మంది విద్యార్థుల కోసం మెస్ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఈ మెస్‌లో భోజనాలు చేసిన విద్యార్థులు కడుపునొప్పి బారినపడ్డారు. వీరంతా ఆదివారం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం ఇదే మెస్‌లో భోజనం చేసిన విద్యార్థులూ అనారోగ్యం పాలయ్యారు. మొత్తంగా అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 120 వరకు చేరింది. వీరిలో కొంతమంది నిజామాబాద్ ఆస్పత్రిలోనూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.