Health treatment
-
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
మెడి టిప్: స్పాండిలోసిస్ పెరగకుండా జాగ్రత్తలివి..
మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి.. రాపిడికి గురైనప్పుడు వెన్నుపూసల నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్’ అంటారు. ఈ నొప్పి తగ్గడానికీ.. అలాగే ముందు నుంచే స్పాండిలోసిస్ నివారణకూ పాటించాల్సిన జాగ్రత్తలివి.. బరువైన వస్తువులు.. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం వంటి పనులు చేయకూడదు. తలపైన బరువులు (మూటలు, గంపలు వంటి అతి బరువైనవి) పెట్టుకోకూడదు. పడుకునే సమయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్ ఉండేలా జాగ్రత్తపడాలి. తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ ఉంటుంది. సమస్య రెండో దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గనివారు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఇవి చదవండి: చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త! -
సీఎం జగన్‌ను కలిసిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. దీంతో అప్పటికప్పుడే చిన్నారి చికిత్స కోసం సీఎం జగన్ రూ.1 కోటి మంజూరు చేశారు. చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఖరీదైన ఇంజక్షన్లతో పాటు నెలకు రూ.10వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో చికిత్స అందుకుంటూ చిన్నారి హనీ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. అయితే ఈ రోజు హనీ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపగా, సీఎం చిన్నారిని ఆశీర్వదించారు. చదవండి: (‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’) -
‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’
సాక్షి అమలాపురం: ‘మాట తప్పరు.. మడమ తిప్పరు’ అనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన చిన్నారి కొప్పాడి హనీ కాలేయానికి గాకర్స్ వ్యాధి సోకి బాధపడుతోంది. అరుదైన ఈ వ్యాధికి రూ.కోటి ఖరీదైన వైద్యం అందించేందుకు సీఎం హామీ ఇచ్చారు. దానిని అమలు చేసి చూపించారు. అక్కడితో ఆగలేదు.. ఆ పాప ఆలనాపాలనా కోసం నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్‌లో తొలి ఇంజెక్షన్ హానీకి ప్రతి 15 రోజులకు ఒకసారి రూ.74 వేలు విలువ చేసే సెరిజైమ్ ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు తెప్పించారు. మరో రూ.40 లక్షలతో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, అమలాపురం మునిసిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి స్థానిక ఏరియా ఆస్పత్రిలో తొలి ఇంజెక్షన్ అందజేశారు. ప్లకార్డు చూసి... స్పందించిన సీఎం గత ఏడాది జూలై 26న గోదావరి వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలో పర్యటించారు. బాధితులను పరామర్శించి గంటిపెదపూడిలోని హెలీప్యాడ్ వద్దకు తిరిగి వెళుతున్న సీఎం జగన్‌కు ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అని ప్లకార్డు పట్టుకుని హనీ తల్లిదండ్రులు కనిపించారు. వారిని తన వద్దకు పిలిపించుకున్న సీఎం వైఎస్ జగన్ హనీకి వచి్చన కష్టం వివరాలు తెలుసుకుని పాప వైద్యానికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. నెలవారీ రూ.పది వేల పింఛన్ రూ.కోటి విలువైన వైద్యానికి అంగీకరించడమే కాదు... హనీ ఆలనాపాలనా చూసేందుకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ అందేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జనవరి నెల నుంచి ఆ బాలికకు పింఛన్ అందిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కలెక్టర్ శుక్లా తొలి పింఛన్‌ను హనీ కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం జగన్ ఆదేశాలతో హనీకి అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉచితంగా విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. -
మొలల నివారణా అదే... ప్రాథమిక చికిత్సా అదే!!
తాజా ఆకుకూరలతో పాటు ఆహార ధాన్యాల్లో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అవే మొలలకు నివారణగానూ, తొలి (ప్రాథమిక) చికిత్సగానూ ఉపయోగపడతాయని వైద్యులు, ఆహారనిపుణులు పేర్కొంటున్నారు. మలద్వారం వద్ద రక్తనాళాలు బుడిపెల్లాగా ఉబ్బి, అక్కడేదో ఉన్నట్లుగానూ, ఒక్కోసారి స్పర్శకు తెలుస్తుండటాన్ని మొలలుగా చెబుతారు. ఈ సమస్యను మూలశంక అని కూడా అంటుంటారు. ఒక్కసారిగా ఒరుసుకుపోవడంతో కొందరిలో రక్తస్రావం కావడం, బట్టలకు అంటుకుని నలుగురిలో ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. మరికొందరిలో మలద్వారం వద్ద దురద, నొప్పితో బాధిస్తుంటాయి. మూలశంక సమస్య తొలిదశల్లోనే ఉన్నవారు... ముదురాకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆయా సీజన్లలో దొరికే తాజాపండ్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పాలిష్ చేయని ధాన్యాలు, చిరుధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగటం, ద్రవాహారాలు తీసుకోవడం చేయాలి. దీనికి తోడు దేహ కదలికలకు తోడ్పడే వ్యాయామాలూ చేయాలి. చదవండి: (Knee pain: మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..) ఈ అంశాలన్నీ కలగలసి మలాన్ని సాఫ్ట్‌గా చేస్తాయి. దాంతో మలద్వారం వద్ద ఎలాంటి ఆటంకమూ లేకుండా మృదువుగా విసర్జితమవుతుంది. ఈ అంశమే మొలలు రానివారికి ఓ నివారణగానూ, అప్పటికే మొలలు ఉన్నవారికి ప్రాథమిక చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్)లాగా చేస్తుంది. మొలల్లో గ్రేడ్లు ఉంటాయి. వాటి తీవ్రత ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు కొన్ని అడ్వాన్స్డ్ చికిత్సలతో పాటు, శస్త్రచికిత్స వరకూ అవసరం పడవచ్చు. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా ఉండాలంటే... మొలల సమస్యను కేవలం కేవలం డయటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, వ్యాయామాలతోనే నివారించవచ్చు. -
కర్నూలు జిల్లాలో వింత వైద్యం
-
‘వైద్యానికి’ చెయ్యాలి చికిత్స
విశ్లేషణ మన వైద్య సేవల వ్యవస్థ పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్నది. కాబట్టి ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థ పట్ల దృఢంగా వ్యవహరించా ల్సిన సమయం ఇదే. దీనికితోడు ప్రభుత్వరంగ వైద్య సేవలను మెరుగుపరచాలి. ఢిల్లీలోని ఒక ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయడంపై చాలా గగ్గోలు రేగుతోంది. హరి యాణా ప్రభుత్వం కూడా ఒక ఆసుపత్రి నిర్మాణం కోసం ఇచ్చిన భూమి లీజును రద్దు చేసింది. దీనిపై కూడా కొంత అలజడి రేగినా, అది ఢిల్లీలో దానికంటే తక్కువే. ఏది ఏమైనా రెండు ప్రభుత్వాలూ రెండు పెద్ద ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నాయి. ఒకటి ఒక నవజాత శిశువు బతికే ఉన్నా, చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చింది. మరొ కటి ఒక డెంగ్యూ రోగి చికిత్సకు ఊహింపశక్యం కానంత పెద్ద సంఖ్యలో సిరంజ్‌లను వాడినట్టు చూపడం సహా భారీగా బిల్లులను వడ్డించింది. ఢిల్లీ ఆసుపత్రి లైసెన్స్‌ను ఉపసంహరించడాన్ని అక్కడి ఇన్‌పేషంట్లను గాలికి వది లేయడం అన్నట్టు చూస్తున్నారు. కానీ అలా జరగలేదు. అందరు ఇన్పేషెంట్లనూ డిశ్చార్జ్ చేసేవరకు చికిత్స అందించడాన్ని అనుమతించారు. హరియాణా ప్రభుత్వం తీసుకున్న చర్య పర్యవసానం కూడా ఇంచుమించు అలాంటిదే. ప్రభుత్వం తీసుకున్నది సరైన రీతిలో తీసు కున్న చర్యేనా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఉదా హరణకు, ఢిల్లీ విషయంలో మొత్తంగా ఆ కార్పొరేట్ సంస్థపైన చర్య తీసుకోవడం కంటే ఆ ఘటనతో ప్రమేయం ఉన్నవారిపైన చర్య తీసుకోల్సిందంటూ అందుకు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు. ఇక్కడితో ఈ కథ ముగిసిపోతుందని అనుకోవడా నికి లేదు. న్యాయమూర్తులు ఏం తీర్పు చెబుతారో తెలి యదు. కానీ భారీ అసుపత్రులు, ప్రత్యేకించి ఆసుప త్రుల నెట్వర్క్ ఉన్న సంస్థలు తమకు మచ్చ రావడాన్ని భరించలేవు. చచ్చే వరకు అన్నట్టు కడదాగా పోరాడ తాయి. నా వాదన సరళమైనదే. పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్న ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థతో దృఢంగా వ్యవహరించాల్సిన సమ యం ఇదే. వాటికి అలవాటుగా మారిన తప్పుడు పద్ధ తులకు బాధ్యత వహించకుండా వాటిని తప్పించుకు పోనివ్వకూడదు. ఇటీవలి కాలంలో ఆసుపత్రులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయనీ. గుండె, ఎముకలకు సంబంధించిన ఇంప్లాంట్ ఉపరకరణాల నుంచి సిరం జ్ల వరకు దాదాపు అన్నిటి నుంచి భారీగా లాభాలు చేసుకుంటున్నాయని తెలిసిందే. ఇన్పేషెంట్ను ఇలా చూసి వెళ్లినందుకు డాక్టర్ చార్జీలు సహా దాదాపుగా మన ఊహకందే ప్రతిదానికీ వసూలు చేసే అధిక చార్జీలకు ఈ లాభాలు అదనం. బెడ్లు ఖాళీగా ఉండకూడదని వారాంతానికి ముందు పేషంట్లను డిశ్చార్జ్ చేయ కుండా ఉండటం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే, కేవలం ప్రైవేట్ ఆసుపత్రులపైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం తప్పు. ప్రైవేటు రంగంలో అమల్లో ఉన్న తప్పుడు పద్ధతు లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ప్రజా ధనంతో ఏర్పడిన వైద్య సేవల వ్యవస్థ పేషెంట్లను వారి స్తోమతకు సరితూగని ప్రైవేట్ రంగం వైపు తరిమేస్తుం డగా, ప్రైవేట్ రంగం భారీగా విస్తరించి పోతున్నదో తెలుసుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ నెల 10న నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నిర్ధారణలను ప్రచరించింది. గ్రామీణ కుటుంబాలలో నాలుగింట ఒకటి, పట్టణ కుటుంబాలలో ఐదింట ఒకటి ఆసుపత్రి ఖర్చుల కోసం ‘‘తప్పనిసరై అప్పు చేయాల్సి’’ వస్తోంది. ఉచితంగా లేదా దాదాపు ఉచితంగా సేవలందించే ప్రభుత్వ ఆసు పత్రుల చికిత్సకు సైతం పైన అయ్యే ఖర్చులు భరిం చాల్సి రావడం వల్ల చాలా మంది చితికిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేవారిని కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటారు. వైద్యంపై తలసరి వ్యయం అ«ధి కంగా ఉన్న, మంచి వైద్య సదుపాయాల వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో వైద్య రుణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని వెల్లడి కావడం ఆసక్తికరం. కుటుంబాల ఆర్థిక స్థితిగ తుల్లో కల్లోలాన్ని రేపేది ప్రైవేటు ఆసుపత్రులే కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నడిపేవి కూడా అందుకు ఎలా కారణం అవుతున్నాయో ఇది వివరిస్తుంది. అధ్వాన సదుపాయాలు, అధ్వాన రోగనిర్ధారణ, అధ్వాన చికిత్స, భౌగోళికంగా అందుబాటులో లేకపోడం మన ప్రభుత్వ వైద్య సేవల ప్రధాన లక్షణాలు. పట్టించుకునేవారు ఎవరూ లేరన్నట్టుంది ఇది. ఢిల్లీ, హరియాణా ప్రభుత్వాలు హఠాత్తుగా ఇలా విరుచుకు పడటం పట్ల అసంతృప్తి ఉండొచ్చునేమో గానీ, మిగతా పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య వ్యవస్థల నుంచి కూడా అదే స్థాయి నిబద్ధతను, సమర్థతను ఎవరు డిమాండు చేస్తారు? అనేదే అసలు సమస్య. ఢిల్లీ ప్రభుత్వం అంద రికీ అందుబాటులో ఉండే మంచి వైద్య సదుపాయాల వ్యవస్థను మొహల్లా (బస్తీ) క్లినిక్‌లను ఏర్పాటు చేసి నట్టు తెలుస్తోంది. కానీ మీడియా వాటిని పెద్దగా వెలుగులోకి తేలేదు. ఢిల్లీ ప్రభుత్వం, ముందు తమ సొంత వ్యవస్థను సక్రమంగా నడిపాకే ఇతరులను కూడా అలా చేయాలని కోరాలనే సరైన వైఖరిని చేపట్టినట్టు అనిపి స్తోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేశ్ విజాపుర్కర్ -
ఇద్దరూ వాగ్దాన కర్ణులే!
కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లను, మంచినీళ్లని నమ్మారే కానీ ప్రభుత్వ బడులలో అయ్యవార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యమందేట్లు చూస్తామని గాని కోతలు కొయ్య లేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది. తొంభై తొమ్మిది ఒక తమాషా సంఖ్య. వంద సంఖ్య పూర్ణత్వాన్ని ధ్వనింపచేస్తుంది. 99లో ఒక రాజసం ఉంది. దీనికి ఒక్కటి కలిస్తే చాలు- వంద, వెయ్యి, పదివేలు, లక్ష అయిపోవడానికి. కొన్ని సార్లు ఈ తమాషా సంఖ్య భలే ఉపయోగపడుతుంది. వాహనంలో వంద లేదా అంతకు మించి ప్రయాణికులను ఎక్కించరాదు అనే నిబంధన ఉంటే, తొంభై తొమ్మిదితో సరిపెడతారు. మొత్తం సొమ్ము లక్ష రూపాయలైతే విధిగా చెక్కు ద్వారా చెల్లించాలని రూలు ఉంటుంది. అప్పుడు, ఐదు తొమ్ముదుల లక్కీ నెంబర్‌తో చెక్కు రాసి రూల్‌ని గౌరవిస్తారు. ఒకానొక సన్నివేశంలో సుయోధనుడు, ‘‘... నూర్గురు సహోదరులకు అగ్రజుండనై’’ అంటూ వాపోతాడు. నిజానికి రాజరాజుకి సహోదరులు తొంభైతొమ్మిది మందే! వత్సల సహోదరి. మరీ కచ్చితంగా పోకుండా రౌండ్‌ఫిగర్ చెప్పి బాధపడ్డాడు. ‘‘తొంభైతొమ్మిదిపాళ్లు అవుతుంది’’ అంటే అయిపోతుందనే అర్థం. కాకపోతే ఆ ఒక్కపాలు దేవుడిమీద భారం వేస్తారు. వచ్చాడు, దిగాడు, సాధించాడన్నట్టుగా కేసీఆర్ కోటలో పాగా వేశారు. కోటమీద జండా ఎగరేశారు. అందరం ఇక్కడికి వలస వచ్చిన వాళ్లమే! ఏం భయపడొద్దు. మిమ్మల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటానని ఆంధ్రోళ్లకి అభయం ఇచ్చారు. పరమ శివుణ్ని కడుపులో పెట్టుకున్న గజాసురుడు గుర్తుకు వచ్చాడు. ఎన్నికల్లో వాగ్దా నాలు అందరూ చేస్తారు. ఎవరో ఒక్కరివే పేలాల్లా పేల్తాయ్. ఓట్లుగా రాల్తాయ్. కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు పంట గడి చేరడానికి ఊతమి చ్చింది. మంచినీళ్లని నమ్మారు. అంతేగాని నగ రంలో వీధి కుక్కల బెడ దను తొలగిస్తామని కాని, ప్రభుత్వ బడులలో అయ్య వార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యం అందేట్లు చూస్తా మని గాని లేనిపోని కోతలు కొయ్యలేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది. తెలుగుదేశం తొలి అంకెతో సరిపెట్టుకుని భంగపడింది. దేశాన్ని పాలిస్తున్న కమలం గుప్పెడు కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభలు, సమావేశాలు, అధిక ప్రసంగాలు, రోడ్‌షోలు చేసినా బూడిదలో పన్నీరుగా, అడవి గాచిన వెన్నెలగా మిగిలాయి. ముప్పవరపు ముప్పతిప్పలు పడ్డా- నొప్పులు రొప్పులు తప్ప చేర్పుకూర్పుల నేర్పుని జనం చప్పరించారు. చంద్రబాబు యువరాజుని రంగంలోకి దింపారు. ఇంకేముంది సొంత భజన కత్తులు ‘‘చినబాబు అరంగేట్రం! ప్రమోదంగా ప్రసంగం! వాక్కులు వడగళ్లు! పలుకులు పకోడీలు!’’ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. తీరా ఫలితాలు వచ్చాక’’ ఐరన్ లెగ్’’ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. బాబుకి అంత సీన్ లేదంటున్నారు. తెలుగు సీఎంలిద్దరికీ వాగ్దాన కర్ణులుగా మంచిపేరుంది. రాజకీయాల్లో ఎవరు ఓటర్లని నమ్మించి బుట్టలో వేశారన్నదే ముఖ్యం. ఆవు మాట నమ్మి పులి దాన్ని వదిలేసిందని తెలిసిన ఓ ఎద్దు అలాగే నమ్మించబోయింది. పులి అడవి దద్దరిల్లేలా గాండ్రించి, నిన్ను వదల.. నేన్నీకు గాడిదలా కనిపిస్తున్నా కదూ.. దూడకి పాలిచ్చి వస్తానంటే నమ్మేంత దద్దమ్మలా ఉన్నానా...’ అంటూ పంజా విసిరింది. అందుకని ఎజెండా కథలు వినసొంపుగా ఉండాలి. ఆసక్తికరంగా చెప్పగలగాలి. అప్పుడు తొంభై తొమ్మిది పాళ్లు విజయం వరిస్తుంది. లేకపోతే ఒక్కటితో ఆగిపోతుంది. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
ఈ ఆస్పత్రిలో స్వీపరే డాక్టర్!
- సర్వజనాస్పత్రిలో వైద్య సేవల తీరిది అనంతపురం: ఈ నెల 27వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం నార్పలలో జరిగిన ఘర్షణలో ఈరమ్మ (50) తలకు తీవ్రగాయమైంది. దీంతో అదే రోజు కుటుంబీకులు ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఎంఎస్-2 వార్డులో అడ్మిట్ చేశారు. అడ్మిషన్లో ఉన్నప్పటి నుంచి ఆమెకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఈరమ్మ తలకు కట్టు కట్టాల్సి ఉంది. అయితే డ్యూటీ డాక్టర్ మనోహర్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లగా, హౌస్‌సర్జన్ శ్వేత ఇతర రోగులకు వైద్య పరీక్షలు నిర్విహించే పనిలో నిమగ్నమయ్యూరు. నర్సింగ్ విద్యార్థినులు ఉన్నా, తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. చివరకు పారిశుద్ధ్య పనులు చేయాల్సిన స్వీపర్ తన పని వదిలేసి ఇదిగో ఇలా కట్టుకట్టేసింది. చాలా వార్డుల్లో స్వీపర్లు పరిశుభ్రతను గాలికొదిలేసి రోగులకు వైద్యం చేసేస్తున్నారు. ఇలా చేసినందుకు రోగుల నుంచి ఎంతో కొంత మొత్తం తీసుకుంటున్నారు. - అనంతపురం మెడికల్ -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత
120 మంది విద్యార్థులకు అస్వస్థత భైంసా : బాసర ట్రిపుల్ ఐటీ మెస్‌లో విషాహారం తిని 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ట్రిపుల్ ఐటీలో 3 వేల మంది విద్యార్థుల కోసం మెస్ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఈ మెస్‌లో భోజనాలు చేసిన విద్యార్థులు కడుపునొప్పి బారినపడ్డారు. వీరంతా ఆదివారం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం ఇదే మెస్‌లో భోజనం చేసిన విద్యార్థులూ అనారోగ్యం పాలయ్యారు. మొత్తంగా అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 120 వరకు చేరింది. వీరిలో కొంతమంది నిజామాబాద్ ఆస్పత్రిలోనూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
ఇక ఒక రోగానికి ఒకే రకమైన చికిత్స
డాక్టర్‌ను బట్టి రోగానికి చికిత్స మారకూడదు మార్గదర్శకాలపై 32 మంది వైద్యులతో కమిటీ సాక్షి, హైదరాబాద్: చిన్న రోగమైనా సరే.. ఇద్దరు వైద్యులు చేసే చికిత్స మధ్య చాలా తేడా ఉంటోంది. చిన్నదైనా, పెద్దదైనా ఒకే రకమైన జబ్బుకు ఒక వైద్యుడు అందించే చికిత్సకు, మరొకరు చేసే చికిత్సకు మధ్య పొంతన ఉండదు. పైగా.. మారుతున్న పరిస్థితులతో కొత్త రకాల జబ్బులు అనేకం పుట్టుకొస్తున్నాయి. వైద్యులు అందిస్తున్న వైద్యానికి ఎలాంటి ప్రామాణికతా ఉండటం లేదు. రకరకాల చికిత్సల కారణంగా రోగికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఒకే రకమైన జబ్బుకు ఏ ఆస్పత్రిలోనైనా, డాక్టరెవరైనా ఒకే రకమైన వైద్యం అందించడం, ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఏకరీతి వైద్యం లక్ష్యంగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది. దీనిపై అధ్యయనానికి వివిధ ప్రభుత్వ ఆస్పత్రులు, నిమ్స్‌కు చెందిన 32 మంది వైద్య నిపుణులతో ఇటీవల ఓ కమిటీని నియమించింది. అధ్యయనాన్ని పర్యవేక్షించడానికి డీఎంఈ (అకడెమిక్) డాక్టర్ వెంకటేష్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రీనివాస్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌లు సభ్యులుగా కమిటీని కూడా నియమించారు. నిపుణుల కమిటీ రెండు నెలల్లో అధ్యయనం చేసి, మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి, బోధనాసుపత్రి వరకూ మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర దోమకాటు వల్ల వచ్చే జబ్బులతో పాటు జీవనశైలి కారణంగా వచ్చే గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి పలు రకాల జబ్బులకు అందించే వైద్య పద్ధతులపై అధ్యయనం చేసి ఒకే రకమైన చికిత్సలను ప్రవేశపెట్టనున్నారు. 2008లో ఒకసారి కేవలం బోధనాసుపత్రుల్లో ఏకతరహా వైద్య చికిత్సలపై మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పుడు పీహెచ్సీ నుంచి బోధనాసుపత్రుల వరకూ అధ్యయనం చేస్తున్నారు. సుమారు 200 జబ్బులపై అధ్యయనం చేసి, వాటికి ఎలాంటి చికిత్స అందించాలో విధివిధానాలను రూపొందించనున్నారు. దీనికోసం ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడుల్లో అనుసరిస్తున్న పద్ధతులనూ పరిశీలించారు. అన్నీ అధ్యయనం చేశాక 400 పేజీల బుక్‌లెట్‌ను తయారు చేసి అన్ని ప్రభుత్వాస్పత్రులకు అందజేస్తారు. ఇందులో ఉన్న మార్గదర్శకాలను అనుసరించే చికిత్స చేయాల్సి ఉంటుంది. -
ఉద్యోగుల వైద్యానికి రూ.400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు నగదు రహిత వైద్యం అందించేందుకు హెల్త్‌కార్డుల పథకం కింద ఏటా రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 8.60 లక్షల మంది ఉద్యోగులు, 5.40 లక్షల మంది పెన్షన్‌దారులతో కలిపి 14 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 70 లక్షల మందికి దీపావళి కానుకగా ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉద్యోగుల నగదు రహిత వైద్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆరోగ్య కార్డులను అందజేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈమేరకు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిలతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 1,885 చికిత్సలు పథకంలో ఉన్నాయని, వీటికి అదనంగా మరిన్ని చికిత్సలను చేర్చుతామని సీఎం తెలిపారు. చికిత్సకయ్యే వ్యయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు చెల్లిస్తారన్నారు. ప్రస్తుతం పథకం అమలు బాధ్యతలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అప్పగించామని, భవిష్యత్‌లో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికి రూ.2 లక్షలు చికిత్స పరిమితి ఉందని, అయితే ఎన్నిసార్లైనా వైద్య సేవలు పొందడానికి అర్హత కల్పించామని, చికిత్సకయ్యే పరిమితి దాటినా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆస్పత్రులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఏడాది పాటు డాక్టర్ కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగికీ ఏడాదికొకసారి మాస్టర్ హెల్త్ చెకప్ సౌకర్యం ఉంటుందన్నారు. పథకం అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు.