
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. దీంతో అప్పటికప్పుడే చిన్నారి చికిత్స కోసం సీఎం జగన్ రూ.1 కోటి మంజూరు చేశారు.
చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఖరీదైన ఇంజక్షన్‌లతో పాటు నెలకు రూ.10వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో చికిత్స అందుకుంటూ చిన్నారి హనీ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. అయితే ఈ రోజు హనీ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపగా, సీఎం చిన్నారిని ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment