ఈ ఆస్పత్రిలో స్వీపరే డాక్టర్! | Sweeper turns as doctor in Sarvajana hospital, even doctors available | Sakshi
Sakshi News home page

ఈ ఆస్పత్రిలో స్వీపరే డాక్టర్!

Published Fri, Jan 29 2016 3:41 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

ఈ ఆస్పత్రిలో స్వీపరే డాక్టర్!

ఈ ఆస్పత్రిలో స్వీపరే డాక్టర్!

- సర్వజనాస్పత్రిలో వైద్య సేవల తీరిది
 
అనంతపురం: ఈ నెల 27వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం నార్పలలో జరిగిన ఘర్షణలో ఈరమ్మ (50) తలకు తీవ్రగాయమైంది.  దీంతో అదే రోజు కుటుంబీకులు ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఎంఎస్-2 వార్డులో అడ్మిట్ చేశారు. అడ్మిషన్‌లో ఉన్నప్పటి నుంచి ఆమెకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఈరమ్మ తలకు కట్టు కట్టాల్సి ఉంది. అయితే డ్యూటీ డాక్టర్ మనోహర్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లగా, హౌస్‌సర్జన్ శ్వేత ఇతర రోగులకు వైద్య పరీక్షలు నిర్విహించే పనిలో నిమగ్నమయ్యూరు.
 
 నర్సింగ్ విద్యార్థినులు ఉన్నా, తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. చివరకు పారిశుద్ధ్య పనులు చేయాల్సిన స్వీపర్ తన పని వదిలేసి ఇదిగో ఇలా కట్టుకట్టేసింది.  చాలా వార్డుల్లో స్వీపర్లు పరిశుభ్రతను గాలికొదిలేసి రోగులకు వైద్యం చేసేస్తున్నారు. ఇలా చేసినందుకు రోగుల నుంచి ఎంతో కొంత మొత్తం తీసుకుంటున్నారు.                
 - అనంతపురం మెడికల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement