Sweeper
-
ఆమె ఆ బ్యాంకులో నాడు స్వీపర్‌గా నేడు మేనేజర్‌గా...
మనకే చాలా కష్టాలు ఉన్నాయనుకుంటాం. పైగా నా వద్ద ఇది అది లేదు అందువల్లే సాధించలేకపోయాను అంటుంటారు. కానీ కొంతమంది ఎలాంటి సాయం లేక చూసుకునే వాళ్లు కూడా లేక అనాథలైనప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లని ఆదర్శంగా తీసుకోకుండా బాధపడుతూ ఉండిపోతాం. ఇక్కడొక మహిళ ఆ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసింది. మళ్లీ అదే బ్యాంకులో మేనేజర్‌గా అత్యన్నత హోదాను పొందింది. అదెలా సాధ్యమైందంటే... వివరాల్లోకెళ్తే....ప్రతీక్ష అనే మహిళ 1964లో పూణేలోని ఒక నిరుపేద తల్లిదండ్రులకు జన్మించింది. ఆమెకు 16 ఏళ్ల వయసులోనే సదాశివ కడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేశారు. దీంతో ఆమె పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేసింది. ఆమె భర్త ఎస్బీఐ బ్యాంకులో బుక్ బైండర్‌గా పనిచేసేవాడు. పెళ్లైన ఏడాదికి ఆ జంటకు ఒక మగబిడ్డ జన్మించాడు. వారు ఒకరోజు వారి బంధువుల గ్రామానికి వెళ్తుండగా సదాశివ ఒక ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆమె 20 ఏళ్లకే వితంతువుగా మారిపోతుంది. పైగా బిడ్డ పోషణ భారం ప్రతీక్షపై పడిపోతుంది. తన భర్త పనిచేసే బ్యాంకు వద్దకు వెళ్లి తనకు సాయం చేయమని వేడుకుంది. దీంతో వారు ఆ బ్యాంకులో ఆమెకు స్వీపర్‌గా ఒక ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు ఆమె ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులను చూసి తాను ఆ స్థాయికి చేరాలనుకుంది. కానీ తాను కనీసం పది వరకు కూడా చదువుకోలేదు కాబట్టి ఎలా ఉద్యోగం సంపాదించగలను అని మదనపడింది. పైగా తన సంపాదన తన బిడ్డ ఆకలి తీర్చడానికి కూడా సరిపోయేది కాదు. ఏం చేయాలో తోచేది కాదు. కానీ ఏదోరకంగా టెన్త్ పాసవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది ప్రతీక్ష. బంధువులు, స్నేహితు సాయంతో పుస్తకాలు కొనుక్కుని చదువుకుని మరీ టెన్త్ పాసైంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలంలే ఇంటర్మీడియెట్ కూడా పాసవ్వాలి. పైగా తాను కాలేజ్‌కి వెళ్తే కొడుకుని చూసుకోవడం కష్టమైపోతుంది. ఎలా అనుకుంటుండగా తనను బ్యాంక్ పరీక్షలు రాయమని ప్రోత్సహిస్తున్న ప్రమోద్ తోండ్‌వాల్కర్‌ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. దీంతో అతను తన ఇంటిని, కొడుకు ఆలనాపాలనను చూసుకోవడంతో ప్రతీక్షకు సగం కష్టం తగ్గినట్లు అనిపిస్తుంది. ఇక ఆమె పగలంతా పనిచేస్తూ రాత్రిళ్లు నైట్ కాలేజ్‌లకి వెళ్తుండేది. అలా ప్రతీక్ష ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాంకు పరీక్షలు రాసి క్లర్క్‌గా తొలి ఉద్యోగాన్ని సంపాదించింది. ఆ తర్వాత 2004లో ట్రైనీ ఆఫీసర్‌గా పదోన్నతి పొంది పలు ఉన్నత పదవులను చేపట్టింది. తదనంతరం ఆమె అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాకు చేరుకుంది. కష్టాల కడలిని ఈది అనుకున్నది సాధించేంత వరకు వదలని ప్రతీక్షలాంటి వాళ్లు ఎంతమందికో ఆదర్శం. ఆమె మరో రెండేళ్లలో రిటైర్ అవునుంది. Widowed at just 20 years of age, Pratiksha Tondwalkar of #Pune got job as Sweeper in #SBI Bank She continued her studies while working & got elevated as clerk,Trainee Oficer, then as MMII, MM III , Scale IV, CGM & is now AGM Sweeper to AGM. #inspiring#RealHero #BharatKeVeer pic.twitter.com/SeaNJTqtk7 — Srikanth Matrubai (@SrikantMatrubai) July 1, 2022 (చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు) -
స్వీపర్‌కు రూ.1.9 కోట్లు ఇచ్చిన మిలియనీర్.. తర్వాత ఏమైందంటే?
లండన్: వీధులు ఊడ్చే వ్యక్తికి ఓ మల్టిమిలియనీర్ ఏకంగా రూ.1.9 కోట్లు ఇచ్చాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తన డబ్బులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. కోర్టులో కేసు గెలిచి తన సొమ్మును తిరిగి తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ నిరుపేద వ్యక్తికి అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు. తిరిగి చెల్లించమనేందుకు గల కారణాలేంటి.. అసలు ఏం జరిగింది? బ్రిటన్‌కు చెందిన జాన్ రాంకిన్ కార్న్ఫోర్త్ అనే వ్యక్తి.. 1979లో ఓ న్యూఇయర్ పార్టీలో సిమోన్ డెనియర్ అనే వ్యక్తిని కలిశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన డెనియర్ వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జాన్ రాంకిన్.. డెనియర్ కలిసి పలు మార్లు మద్యం సేవించేవారు. ఇలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత.. తన తండ్రి మరణానంతరం కొన్ని మిలియన్ల పౌండ్లు పొందారు జాన్ రాంకిన్. అందులోంచి సుమారు 2 లక్షల పౌండ్లను తన నిరుపేద స్నేహితుడైన సిమోన్ డెనియర్కు 2012 నుంచి 2014 మధ్య మూడు దఫాలుగా ఇచ్చారు. డెనియర్ విడాకుల ఖర్చు కోసం 2012లో 26,300 పౌండ్లు, భార్యకు భరణం ఇచ్చేందుకు 2013లో 50వేల పౌండ్లు, ఇంటి రుణం చెల్లించేందుకని 2014లో 1.25 లక్షల పౌండ్లు ఇచ్చారు జాన్ రాంకిన్. తిరిగి చెల్లిస్తాడనుకున్నా.. ఎన్ని రోజులైన తన సొమ్మును తిరిగి చెల్లించకపోవటంతో కోర్టు మెట్లు ఎక్కారు జాన్ రాంకిన్. తన స్నేహితుడు ఆర్థికంగా ఎదిగాక తన సొమ్మును తిరిగి చెల్లిస్తాడని భావించానని చెప్పారు. కానీ అలా జరగలేదన్నారు. 2 లక్షల పౌండ్లు అనేది తనకు అంత పెద్ద సొమ్ము కాదని కోర్టు చెప్పినట్లు జాన్ రాంకిన్ గుర్తు చేసుకున్నారు. కానీ తన స్నేహితుడు తిరిగి ఇస్తాడని నమ్మానని పేర్కొన్నారు. అందుకే కోర్టు సాయం కోరినట్టు తెలిపారు. మరోవైపు.. ఇంటి రుణం తీర్చేందుకని ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు తన స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పాడు డెనియర్. తన మాజీ భార్యకు భరణం ఇచ్చేందుకు తీసుకున్న డబ్బులు రుణంగానే తీసుకున్నానని, వాటిని తిరిగి చెల్లించానని సిటీ కౌంటీ కోర్టులో ఒప్పుకున్నాడు. "వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగించే డెనియర్కు ఆ డబ్బు పెద్ద మొత్తం. ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు" అని డెనియర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి స్టిఫెన్ హెల్‌మ్యాన్.. ఇంటి కోసం ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు సైతం రుణమేనని, తిరిగి చెల్లించాల్సిందేనిని తీర్పు ఇచ్చారు. కానుకగా ఇచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి రుణంతో పాటు దానికి వడ్డీ చెల్లించాలని, అయితే.. విడాకుల కోసం ఇచ్చిన వాటికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
వీపున చంటిబిడ్డ.. వీధులు ఊడుస్తున్న ఓ తల్లి కథ ఇది
వీపున పసిబిడ్డను కట్టుకుని.. బ్రిటిష్ సైన్యంతో వీరోచిత పోరాటం చేసింది వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక్కడో లక్ష్మీ వీపున చంటిబిడ్డను కట్టుకుని ఎర్రటి ఎండలో చెమటలు చిందిస్తూ పని చేస్తోంది. సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటున్న వీడియో, ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లక్ష్మీముఖి.. ఒడిషా మయూర్భంజ్ బర్దిపాడా మున్సిపాలిటీలో పదేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. అక్కడ పని చేస్తుండగానే ఓ దినసరి కూలీకి ఇచ్చి పెళ్లి చేసింది ఆమె కుటుంబం. భర్త పచ్చితాగుబోతు. ఒకరోజు బిడ్డను అమ్మేయాలని ప్రయత్నించాడు. అతని చాచికొట్టి.. బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగానే ఉంటూ.. చంటి బిడ్డను చూసుకుంటోంది. ఇంటి దగ్గర బిడ్డను చూసుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బిడ్డను తనతో పాటే పనులను తెచ్చుకుంది. బిడ్డను వీపున కట్టుకోవడం తనకేం ఇబ్బందిగా అనిపించడం లేదని, తన డ్యూటీ తాను చేస్తున్నట్లు చెప్తోందామె. వ్యక్తిగత కారణాలతో ఆమె బిడ్డను తెచ్చుకుంటోందని, ఆమెకు అవసరమైన సాయం, ఇబ్బందులు ఎదురైతే సపోర్ట్ చేయాలని సిబ్బందికి సూచించినట్లు బర్దిపాడా మున్సిపాలిటీ చైర్మన్ బాదల్ మోహంతి చెప్తున్నారు. బిడ్డను వీపున కట్టుకుని వీధులు ఊడుస్తున్నా ఆ తల్లి కష్టానికి పలువురు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అయినా కడుపున బిడ్డను నవమాసాలు మోసే తల్లికి.. వీపున మోయడం ఓ బరువా?.. అని అంటున్నారు మరికొందరు. #WATCH | Odisha: A lady sweeper, Laxmi cleans the road in Mayurbhanj district with her baby tied to her back. pic.twitter.com/g7rs3YMlFn — ANI (@ANI) May 29, 2022 వీడియో వైరల్: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు!! -
అమ్మ స్వీపర్.. కొడుకు ఎంఎల్ఏ..
అది పంజాబ్‌లోని బటిండా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాల. ఆ బడిలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లలంతా సందడిగా, టీచర్లు బిజీబిజీగా ఉన్నారు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే అక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వ్యక్తి వచ్చారు. అంతా నమస్కారాలు, పూల దండలతో స్వాగతం పలుకుతున్నారు. స్కూలు ఆవరణలో ఒకావిడ తన పనిలో నిమగ్నమై ఉంది. వచ్చిన ప్రముఖుడు ఎవరా అని ఆమె తలెత్తి కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఆమె ఆ ముఖ్య అతిథిని పట్టించుకోకపోవడానికి కారణం.. ఆ వ్యక్తి ఆమె కొడుకే అవ్వడం. సాధారణంగా ఇటువంటి సీన్లు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అక్కడ చూపించే వాటిలో.. పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి కూలిపని చేస్తోన్న తల్లిని దగ్గరకు చేరదీయకపోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. లభ్ సింగ్ ఉగోకే కానీ ఇక్కడ అలా జరగలేదు. తన కొడుకు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తన తల్లి కొన్నేళ్లుగా చేస్తోన్న స్వీపర్ పనిని వదిలేయకుండా కొనసాగిస్తోంది. అందుకు ఆమె కొడుకు కూడా అభ్యంతరం చెప్పకపోవడం తెలపడం విశేషం. ఈ తల్లీ కొడుకులు మరెవరో కాదు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఇటీవల ఎంఎల్ఏగా గెలిచిన లభ్ సింగ్ ఉగోకే, ఆమె తల్లి బల్దేవ్ కౌర్. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొని ఉన్నతస్థాయికి చేరుకున్నాక తమని తాము మరచిపోయి విజయ గర్వంతో ప్రవర్తిస్తుంటారు చాలామంది. కానీ కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తాము ఎక్కడి నుంచి వచ్చామో అది మాత్రం మర్చిపోరు. తమ నిరాడంబరతను కొనసాగిస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బలదేవ్ కౌర్. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ..మిగతా పార్టీలన్నింటిని పక్కకు నెట్టేసి ఆమ్ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బదౌర్ నియోజక వర్గంలో పోటీచేసి పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీని ఓడించి లభ్ సింగ్ ఉగోకే గెలిచాడు. ప్రస్తుతం లభ్ సింగ్ ఉగోకే ఎంఎల్ఏ. అయితే ఇతని తల్లి బల్దేవ్ కౌర్ గత ఇరవైఐదేళ్లుగా స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. కొడుకు ఎంఎల్ఏ అయినప్పటికీ ఆమె మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోలేదు. ఇటీవల తన తల్లి పనిచేస్తోన్న స్కూలుకు ఎంఎల్ఏగా అధికారిక హోదాలో వచ్చారు. అయినా తల్లీకొడుకులు ఇద్దరూ ఆ విషయంలో ఏమాత్రం ఆత్మన్యూనతకు గురి కాలేదు..ఆ విషయాన్ని సంతోషంగానే స్వీకరించారు. దర్శన్ సింగ్, బల్దేవ్ కౌర్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు లభ్ సింగ్. నిరుపేద కుటుంబం కావడంతో రెండు గదులున్న చిన్న పూరిల్లే వారి నివాసం. దర్శన్ సింగ్ కూలిపనిచేస్తే, భర్తకు చేదోడుగా బల్దేవ్ కౌర్ స్కూల్లో స్వీపర్‌గా పనిచేసి పిల్లలిద్దరిని కష్టపడి చదివించారు. చదువుకున్న లభ్‌సింగ్ రాజకీయాలవైపు ఆకర్షితుడై పదేళ్ల క్రితం ఆప్‌లో చేరి చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకుని ఎంఎల్ఏగా ఎదిగారు. కొడుకు ఎంఎల్ఏ అయ్యాడని తల్లి అబ్బుర పడిందే తప్ప స్వీపర్ పనిని వదల్లేదు. అయినా ఇప్పటికీ ఈ కుటుంబం రెండు గదులున్న ఇంట్లోనే ఉండడం, ఎప్పుడో కొనుక్కున్న పాత మోటర్ సైకిల్‌నే వాడడం విశేషం. ‘‘మేము బతికేందుకు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాం. ఇప్పుడు నా కొడుకు ఎంఎల్ఏ అయ్యాడని నేను 25 ఏళ్లుగా చేస్తోన్న పనిని వదులుకోలేను. అతని పని అతనిదే, నా పని నాదే అని సగర్వంగా చెబుతోంది బల్దేవ్ కౌర్. నాకొడుకు ఇదే స్కూల్లో చదువుకున్నాడు. స్కూలో ఉన్నప్పుడు ఇటు స్కూలుకు, అటు గ్రామానికి అనేక పురస్కారాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎంఎల్ఏగా ఎదిగి ఎంతోమందికి మంచి పాలన అందించబోతున్నాడు. మరీ నేను ఎందుకు ఖాళీగా ఉండాలి. నా పనిలో నేను ముందుకు సాగితేనే నాకు ఆనందంగా ఉంటుంది’’ అని కౌర్ చెబుతోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే. -
జీహెచ్ఎంసీలో ఉన్నత స్థాయి అధికారిణిగా స్వీపర్ రజని
-
జీహెచ్ఎంసీ లో ఉన్నత స్థాయి అధికారిణిగా స్వీపర్ రజనీ
-
‘ఆశ’ వదులుకోలేదు: స్వీపర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..
రోజూ ఎన్నో సక్సెస్ స్టోరీలు చూస్తుంటాం. వాటిలో చాలామట్టుకు చిన్నస్థాయి నుంచి పెద్ద విజయాలు అందుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. తమ కష్టపుకథలు మరికొందరిలో స్ఫూర్తి నింపాలనేదే వాళ్ల ఉద్దేశం కూడా. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా గాథ కూడా అలాంటిదే. జైపూర్: ఆశ కందారా.. మూడు రోజుల వరకు జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసిన ఒక స్వీపర్. 2016 నుంచి కాంట్రాక్ట్ సర్వీస్‌లో కొనసాగిన ఆమెకు.. పన్నెండు రోజుల క్రితమే పర్మినెంట్ ఎంప్లాయి లెటర్‌ను చేతిలో పెట్టారు అధికారులు. ఆ సంతోషం మరువక ముందే.. ఏకంగా ఆమె తన లక్క్ష్యం అందుకుంది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్‌లో 728 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో ప్రభుత్వాధికారి హోదాలో ఆమె బాధ్యతల్ని చేపట్టబోతోంది. నిజానికే రెండేళ్ల క్రితమే ఆమె పరీక్షలకు, ఇంటర్వ్యకు హాజరుకాగా.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ చివరికి మంగళవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. घर चलाने के लिए लगाती थीं झाड़ू, लेकिन मेहनत लाई रंग और बनी SDM! सुनिए Asha Kandara के संघर्ष की ये कहानी#AshaKandara #SDM #Story pic.twitter.com/R2jekPkg0I — News Tak (@newstakofficial) July 16, 2021 భర్త వదిలేయడంతో.. 1997లో ఆశ చదువు ఆపేయించి మరీ పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరు పిల్లలు పుట్టాక మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. ఆమెను వదిలేశాడు భర్త. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్తను అదుపులో పెట్టుకోలేకపోయిందంటూ సమాజం మొత్తం ఆశదే తప్పని నిందించింది. కానీ, ఆమె అవేం పట్టించుకోలేదు. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తూనే.. పేరెంట్స్ సహకారంతో చదువును కొనసాగించింది. 2016లో ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్లో టెంపరరీ స్వీపర్ పోస్టులకు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది. మలుపు తిప్పిన సెల్యూట్ ఆశకు ప్రేరణ తన పైఅధికారులే. రోజూ వాళ్ల గదుల్ని, ఆఫీసు పరిసరాల్ని శుభ్రం చేయడం, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వాళ్లు గౌరవం అందుకోవడం ఆమెను ఆకర్షించేవట. ఓరోజు విధుల్లో ఉండగా హఠాత్తుగా పైఅధికారులు ఇన్స్పెక్షన్కు వచ్చారు. అప్పటిదాకా తనతో సరదాగా గడిపిన తోటి ఉద్యోగులు ఒక్కసారిగా నిలబడి వాళ్లకు సెల్యూట్ చేయడంతో, ఆ గౌరవం తనకూ దక్కాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినా ఆమె ఆశను వదులకోలేదు. పిల్లల పోషణ కోసం ఓవైపు 10 గంటలు స్వీపర్‌గా పని చేస్తూనే.. ఆర్ఏఎస్ ఎగ్జామ్‌లకు కష్టపడి ప్రిపేర్ అయ్యింది. చివరికి తన కలను నెరవేర్చుకోవడంతో పాటు త్వరలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది ఆశా కందారా. ‘ఈ విజయం నా కుటుంబానికే అంకితం. నా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడినందుకే ఈ గెలుపు సాధ్యమైంది’ అని సంతోషంగా చెప్తోందామె. మేయర్ కుంతి దియోరా నుంచి అభినందనలు అందుకుంటున్న ఆశ -
పంచాయతీ ప్రెసిడెంట్ అయిన స్వీపర్!
స్వీపర్‌గా పంచాయతీ కార్యాలయ గదుల్ని శుభ్రం చేసిన ఆనందవల్లి చేతులు ఇకపై పంచాయతీ ప్రెసిడెంటుగా శుభ్రమైన పాలనను అందివ్వబోతున్నాయి. పదేళ్లుగా ప్రతిరోజూ పఠాన్‌పురం పంచాయతీలోని ‘ఆ’ బ్లాకును శుభ్రం చేస్తున్నారు అనందవల్లి. స్వీపర్ ఆమె తాత్కాలిక ఉద్యోగి. ఆమె శుభ్రం చేసే బ్లాకులోనే పంచాయతీ ప్రెసిడెంట్ కుర్చీ ఉంటుంది. మంగళవారం ఆమె తన స్వీపర్ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె గురువారం నుంచీ ఆ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబోతున్నారు! అవును. స్వీపర్ ఆనందవల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. అసలిదంతా ఆమె ఊహించని, ఊహించలేని విధంగా జరిగింది. ‘కొంచెం భయంగా ఉంది’ అంటున్న ఆనందవల్లి, ‘కష్టపడి పని చేస్తాను’ అని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఆమె ఆత్మవిశ్వాసం కేరళ, కొల్లం జిల్లాలోని ఆ పఠాన్‌పురం పంచాయతీకి కొత్త వెలుగులు తేబోతున్నదన్న నమ్మకం కలిగిస్తోంది. స్వీపర్ ఏంటి! పంచాయతీ ప్రెసిడెంట్ అవడం ఏంటి! ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకతే ఇది. పఠాన్‌పురం పంచాయతీ.. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించిన సీటు. మొత్తం 13 వార్డులు ఉన్నాయి. వాటిల్లో తలవూరు వార్డు నుంచి ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ అభ్యర్థిగా కాక.. ఎస్సీ, ఎస్టీ జనరల్ ఆభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆనందవల్లి. సీపీఐ (ఎం) పార్టీ సభ్యత్వం ఉండటంతో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అభ్యర్థిగా సీపీఐ(ఎం) ఆమెను తలవూరు వార్డుకు నిలబెట్టింది! పదమూడు సీట్లలో ఎల్డీఎఫ్కు ఏడు సీట్లు, ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌కు (యూడీఎఫ్) ఆరు సీట్లు లభించాయి. మెజారిటీ సీట్లున్న పార్టీలోని వార్డు మెంబరుగా ఆనందవల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆనందవల్లి భర్త మోహనన్ పెయింటర్. ఆయన కూడా సీపీఐ(ఎం) స్థానిక కమిటీ సభ్యుడే. ఇద్దరు పిల్లలు. మిథున్, కార్తీక్. స్కూల్లో చదువుతున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో స్వీపర్‌గా చేరినప్పుడు మొదట ఆనందవల్లి జీతం రెండు వేలు. తర్వాత మూడు వేలు, తర్వాత ఆరు వేలు అయింది. పార్టీ సభ్యుల సహకారంతో ఈ కొత్త బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెబుతున్నారు. (2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు) -
కరోనా భయం ఉన్నా..
-
మేడమ్.. థ్యాంక్యూ: విద్యాబాలన్
ముంబై : కరోనాను అంతం చేసేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారీ వ్యాప్తిని నిరోధించడానికి దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే కుటుంబంతో గడుపుతుంటే కేవలం అత్యవసర సేవల్లో పనిచేసే వారు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. కరోనా తమల్ని కాటేస్తుందని తెలిసినా.. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, బ్యాంకు అధికారులు నిరంతరంగా పనిని కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలోపారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. (ఫ్యాన్ శుభ్రం చేయడానికి స్టూల్ అవసరమా: హీరో ) తాజాగా వీరి సేవలను బాలీవుడ్ నటి విద్యాబాలన్ అభినందించారు. ముంబైలో ఓ మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. తన బాల్యనీ నుంచి ఆమెను చూసిన విద్యా.. ‘మేడమ్ థాంక్యూ.. గాడ్ బ్లెస్ యూ’ అంటూ మహిళకు వినపడేలా అరిచారు. అంతేగాకుండా ఆమె పనిచేస్తుండగా ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘కరోనా భయం ఉన్నా.. మరో పక్క తమ విధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్నీ, మీ కుంటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడు ఆశీర్వదిస్తాడు.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో విద్యా చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అలాగే మరో వీడియోలో విద్యాబాలన్ తన ఫాలోవర్స్‌కు ఇంటి పనులను కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలని కోరారు, తద్వారా పని భారమంతా ఒక వ్యక్తిపై పడకుండా ఉంటుందని సూచించారు. (ఆడపులిలా బాలీవుడ్ భామ) -
కాళ్లు నొస్తే.. బైక్‌తో చెక్కేస్తా!
హిమాయత్‌నగర్: మనకు కాళ్లు నొస్తే ఏం చేస్తాం? కాసేపు ఆగి సేదతీరుతాం. లేకపోతే ఆటోలోనో, బస్సులోనో ఇంటికి వెళ్తాం. కానీ ఈ దొంగ తీరే వేరు. మంచిగా మద్యం తాగి, రోడ్డుపై నాలుగడుగులు వేస్తాడో లేదో కాళ్లు నొస్తున్నాయని కనిపించిన బైక్‌ను తీసుకొని వెళ్లిపోతాడు. నకిలీ తాళంతో బైక్‌లను స్టార్ట్ చేసుకొని వెళ్లే ఇతగాడు... అందులోని పెట్రోల్ అయిపోయేంత వరకు వెళ్లి, అక్కడే దాన్ని వదిలేస్తాడు. ఈ విచిత్ర దొంగ దోమలగూడకు చెందిన పి.నరేందర్. సచివాలయంలో స్వీపర్. ఈ నెల 11న హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్డులోని కులదీప్ వైన్స్ వద్ద మద్యం తాగిన నరేందర్... అనంతరం స్ట్రీట్ నెంబర్–16 వద్ద నకిలీ తాళంతో బైక్‌ను దొంగి లించాడు. మరుసటి రోజే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో బైక్‌ని దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా నిందితుణ్ణి గుర్తించారు. కులదీప్ వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి, అక్కడికి వెంటనే వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. జైలుకెళ్లినా... మద్యానికి బానిసైన నరేందర్ 2009లో మొట్టమొదటిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనం చేశాడు. ఇతడిపై మేడిపల్లి పీఎస్ పరిధిలో 2, ఉప్పల్ పీఎస్‌లో 2, చిక్కడపల్లి పీఎస్‌లో 7, నారాయణగూడ పీఎస్‌లో ఒక్క కేసు చొప్పున మొత్తం 13కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 12సార్లు జైలుకెళ్లినా నరేందర్ తీరు మారలేదు. జైలు నుంచి తిరిగి రాగానే మళ్లీ అదే పనిగా బైక్‌లను దొంగలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నాకేం గుర్తు... నారాయణగూడ పోలీసులు నరేందర్‌ను విచారించగా... బైక్ ఎక్కడ పెట్టింది తనకు గుర్తు లేదని చెప్పాడు. అయితే చిక్కడపల్లి పీఎస్ పరిధిలో దొంగలించిన బైక్ దొరకడంతో నిందితుణ్ణి నారాయణగూడ పోలీసులు చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. చిక్కడపల్లి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పీటీ వారెంట్‌పై నిందితుణ్ణి కస్టడీకి తీసుకొని విచారిస్తారని సమాచారం. -
పోలింగ్ నిర్వహణ అధికారిగా స్వీపర్
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారుల అలసత్వం బయట పడింది. ఓ స్వీపర్, అంధ ఫ్రొఫెసర్లను పోలింగ్ అధికారులుగా నియమించడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఇక స్వీపర్‌ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించడంపై ఆ రాష్ట్ర అధ్యాపకులు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన ఎన్నికల విధుల రోస్టర్‌లో ఈ విషయం వెలుగు చూడటంతో అధ్యాపకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-4 ఉద్యోగుల పర్యవేక్షణలో సీనియర్ అధ్యాపకులమైన తాము ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితని మండిపడ్డారు. ఎన్నికల రోస్టర్‌ను మార్పు చేయాలని తమ సంఘం తరపున కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో సీనియర్ అధికారులు, జూనియర్ అధికారుల కింద పనిచేయవద్దని 2013లో జబల్పూర్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఇప్పుడు స్వీపర్‌ను ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తే సీనియర్ అధ్యాపకులమైన తాము అతని కింద పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన సీనియర్ అంధ ప్రొఫెసర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారిగా తానేలా పనిచేయాలో అర్థం కావడం లేదన్నారు. ఈసీ అధికారులు మాత్రం క్లాస్-3 ఉద్యోగులనే ప్రిసైడింగ్ అధికారులుగా నియమించమని, అలాంటింది స్వీపర్‌ను ఎలా నియమిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పేస్కేల్, పోస్ట్, హోదాను బట్టే పోలింగ్ అధికారులుగా నియమిస్తామని, గెజిటెడ్ అధికారులకే అవకాశం ఉంటుదన్నారు. పోలింగ్ అధికారుల కన్నా ప్రిసైడింగ్ అధికారుల గ్రేడ్, జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. -
స్వీపర్‌కు లక్షన్నర జీతం.. కానీ
రాజ మహేంద్రవరం : స్వీపర్ జీతం లక్షన్నర.. ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ ఛానళ్లలో, ప్రముఖ దిన పత్రికల్లో విపరీతంగా సర్క్యూలేట్ అయిన వార్త. ఏంటి స్వీపర్‌కు లక్షన్నర జీతమా? ఎక్కడబ్బా..? నిజంగా అంత ఉందా? లేదా ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారా? అంటూ చాలా మంది అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అయితే అది నిజమే. రాజమహేంద్రవరం విద్యుత్ శాఖలో పనిచేసే కోల వెంకట రమణమ్మకి ఇంత వేతనం ఇస్తున్నారంట. ఆమె సర్వీసు 40 ఏళ్ల పైబడటంతో, వెంకట రమణమ్మ నెలకు మొత్తం రూ.1,47,722ను జీతంగా ఇంటికి తీసుకెళ్తున్నారట. 40 ఏళ్లు పైబడితే అంత జీతం వస్తుందా? మరి అందరికి రాదే? అనుకుంటున్నారా? అయితే విద్యుత్ శాఖలో పనిచేసే చాలా మంది నాలుగో తరగతి ఉద్యోగులకు లక్షకు పైబడే జీతం ఉందని తెలిసింది. విద్యుత్ శాఖలో చేపట్టిన సంస్కరణలతో కోల వెంకట రమణమ్మకి, ఆమెతో పాటు ఆ శాఖలో ఉద్యోగం చేస్తున్న చాలామందికి వేతనాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. స్వీపర్‌కు ఆ మేర జీతం పెరగడం ఆశ్చర్యమే. స్వీపర్‌కే ఆ రేంజ్లో జీతాలు పెరిగితే, మరి పై స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు ఇంకెంత వేతనం పెరిగి ఉండి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ప్రారంభంలోనే రూ.40వేలు లేదా రూ.50వేలతో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందిన వారికి, సంస్కరణల పేరుతో వేతనం భారీగానే పెరిగి ఉండొచ్చు. పదవి విరమణ సమయానికి వారి వేతనాలు కూడా నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ అంచనాలు మాత్రమే. అంత జీతమొచ్చినా.. ఆ లోటును, బాధను తీర్చలేదుగా! కోల వెంకటరమణమ్మ, ఏమీ చదువుకోలేదు. కేవలం సంతకం పెట్టేంత అక్షరాలు మాత్రమే నేర్చుకుంది. 16 ఏళ్ల వయసులోనే అంటే 1978లో విద్యుత్ శాఖలో రోజువారీ కూలిగా చేరింది. ఆమె చేరిన మూడేళ్లకు అంటే 1981 ఏప్రిల్ 1న రమణమ్మ పర్మినెంట్ ఉద్యోగి అయింది. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలోని పని చేస్తుంది. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. చాలా కాలంగా చేసిన సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో ఉద్యోగానికి పోయి, రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్తుంది. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేశారు. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఆమెకు లక్షకు పైగా జీతం కదా..! ఇంకేం బిందాస్ లైఫ్ అనుకుంటున్నారామో...? అలా అనుకుంటే పొరపాటే. ఆమెకు ఇద్దరు కొడుకులు. భర్త రైల్వేలో పనిచేసేవాడు. ఆయన కాలం చేయడంతో, ఒక కొడుకుకి భర్త ఉద్యోగం వచ్చింది. మరో కొడుకు అనారోగ్యంతోనే బాధపడుతున్నాడు. గుండె జబ్బు, ఫిట్స్‌తో ఎప్పడికప్పుడు కొడుకుకి వైద్యం చేయించడానికే రమణమ్మ జీతం అంతా సరిపోతుంది. ఎంత జీతం వచ్చినా.. రమణమ్మకు భాగస్వామి లేని లోటును, కొడుకు అనారోగ్యం బాధను పూడ్చలేవుగా. -
స్వీపరే దొంగోడు
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో కలకలం సృష్టించిన ‘తుపాకీ బుల్లెట్స్’ మాయం కేసును ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు ఛేదించారు. పోలీసు జాగిలం నిందితున్ని పసిగట్టడడంతో స్వీపరే దొంగోడుగా గుర్తించారు. వివరాల్లోకి వెలితే... నగరంలోని ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆదివారం 15 రౌండ్ల రైఫిల్ బుల్లెట్స్ మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. ఏఆర్ కానిస్టేబుల్ సోమశేఖరనాయుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న స్వీపర్ (హోంగార్డు) పెన్నోబిలేసు తుపాకీ (రైఫిల్) నుంచి 15 రౌండ్ల బుల్లెట్స్ దొంగిలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్వీపర్ తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. కానిస్టేబుల్ సోమశేఖరనాయుడు 303 రైఫిల్‌ను కార్యాలయంలో అప్పగించే సమయంలో తుపాకీ రౌండ్స్ పరిశీలించారు. 15 రౌండ్లు బుల్లెట్లు తక్కువ ఉండడంతో కార్యాలయం అంతా వెతికారు. విషయాన్ని ఏఆర్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ అనుమానితులను గుర్తించారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? రైఫిల్ బుల్లెట్ల చోరీ వెనుక పలు కారణాలున్నట్లు తెలుస్తోంది. తాగుడుకు బానిసైన స్వీపర్ పెన్నోబిలేసును ఏఆర్ అధికారులు, సిబ్బంది చులకనగా మాట్లాడేవారని సమాచారం. ఘటనకు ముందు రోజు అందరి ఎదుట మందలించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో 303 రైఫిల్ బుల్లెట్లు విక్రయించడం ద్వారా కొంత సొమ్ము చేసుకోవచ్చునని స్వీపర్ భావించి దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందని పోలీసువర్గాలు వెల్లడించాయి. నిందితున్ని గుర్తించిన జాగిలం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం అనుమానితులను ఏఆర్ డీఎస్పీ సమక్షంలో టూటౌన్ సీఐ ఆరోహణరావు, ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డిలు విచారించారు. విచారణలో ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు పోలీసుజాగిలాన్ని రప్పించి విచారించారు. జాగిలం నేరుగా బుల్లెట్లు చోరీ చేసిన స్వీపర్ పెన్నోబిలేసు వద్దకు వెళ్లింది. విషయం బయట పడడంతో స్వీపర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఏఆర్ కార్యాలయ ఆవరణలో చెత్తకుప్పలో దాచిపెట్టిన బుల్లెట్లను అధికారులు అప్పగించాడు. స్వీపర్‌పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తుపాకీ నిర్వహణలో బాధ్యతారాహిత్యం కింద కానిస్టేబుల్ సోమశేఖరనాయుడుపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. -
స్వీపర్‌పై చెయ్యి చేసుకున్న ప్రిన్సిపాల్
కర్నూలు : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వీపర్‌పై ప్రిన్సిపాల్ పీవీ హరిబాబు చేయి చేసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాలలో 1994 నుంచి స్వీపర్‌గా మాదం శెట్టి చిన్న వెంకమ్మ విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి కళాశాలలో వేసిన లైట్లు ఎందుకు ఆర్పలేదని ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నట్లు ఆమె తెలిపారు. కళాశాల నుంచి వెళ్లిపోకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించినట్లు ఆమె వాపోయారు. అయితే వెంకమ్మ తమకు మౌఖికంగా ఫిర్యాదు చేశారని, లిఖిత పూర్వకంగా చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఓబులేసు తెలిపారు. ఇదిలా ఉండగా కేసు పెట్టకుండా కొందను వ్యక్తులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. -
స్వీపర్‌కు విద్యుత్ శాఖ ఏఏవో వేధింపులు
సత్తెనపల్లి: స్వీపర్‌పై విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) వేధింపులకు పాల్పడుతున్న వైనంపై బాధితురాలు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ దొరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన లేఖ ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగుల సెల్ఫోన్లలోని వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది. వివరాలు ఇలా... పట్టణంలోని విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తూ రమేష్ నాయక్ మృతి చెందాడు. దీంతో ఆయన భార్యకు పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల ఈఆర్వో కార్యాలయంలో స్వీపర్‌గా ఏడాదిన్నర క్రితం ఉద్యోగమిచ్చారు. కార్యాలయంలో ఏఏవోగా పని చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి ఎనిమిది నెలలుగా తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 2017 నుంచి కార్యాలయం సమయం దాటిన తరువాత ఫోన్ చేస్తూ అభ్యకరంగా మాట్లాడుతున్న చెప్పింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని పేర్కొంది. ఈ నెల 3న సాయంత్రం 4.30 గంటలకు జేఏవో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లినా మరుసటి రోజు వేధింపులకు గురి చేశాడని తెలిపింది. ఏఏవోతో తనకు ప్రాణ హాని ఉంటుందని ఎనిమిది నెలలుగా వేధింపులు భరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఓపిక పట్టలేక ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విచారణ నిమిత్తం ఇద్దరు ఉన్నతాధికారులను నియ మించారు. అధికారులు మంగళవారం సత్తెనపల్లి చేరుకుని ఏఏవో విచారణ చేపట్టారు. తొలుత బాధితురాలిని విచారించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. మరో వైపు స్వీపర్‌తో రాజీ చేసేందుకు కొందరు ఉద్యోగులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. జరిగిందేదో జరిగింది ఇకపై నీ జోలికి రాకుండా చూస్తామని, ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని కోరుతున్నారు. కాగా రాజీ చర్చలు ఫలించలేదు. ఈ వ్యవహారం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. -
ఆలయంలో.. అపచారం
నిర్భయ వంటి చట్టాలు వచ్చినా మహిళల భద్రతకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఎంతో ప్రసిద్ధి చెందిన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఓ మహిళతో ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. అనంతపురం, కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. అక్కడ పనిచేసే మహిళా స్వీపర్‌పై అక్కడే పనిచేసే ఓ ఉద్యోగి ఆలయ ప్రాంగణంలోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వారం రోజుల క్రితం ఆలయంలో పని చేసే స్వీపర్ రామలక్ష్మి (పేరు మార్చాము) రోజూ లాగానే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచిన అనంతరం అద్దె గదుల్లో చెత్త ఊడుస్తోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఆలయ అటెండర్ వెంకటరమణ ఎవరూ లేనిది గమనించి ఆ గదిలోకెళ్లి తలుపునకు గొళ్లెం పెట్టి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ఆమె ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డితో పాటు ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. అక్కడి ఉద్యోగులకు కూడా విషయాన్ని చెప్పింది. కానీ వారి నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో జరిగిన ఘోరాన్ని తన భర్తకు చెప్పి ఆవేదన చెందింది. అన్యాయానికి ఖరీదు కట్టిన టీడీపీ నేత రామలక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని తన భర్తతో కలిసి స్థానికంగా ఓ టీడీపీ నేత వద్దకు వెళ్లి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి కూడా అంతకు ముందే సదరు నేతను కలవడంతో చేసేది లేక అన్యాయానికి వెల కట్టే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ ఇక లాభం లేదని నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీలక్ష్మి వెంటనే స్పందిస్తూ నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో నిందితుడు వెంకటరమణపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 506, 342 కింద కేసు (క్రైం.నెం314/2017) నమోదు చేశారు. సీఐ శ్రీధర్ ఈ కేసును విచారిస్తున్నారు. అటెండర్‌ను సస్పెండ్ చేశాం ఆలయంలో మద్యం సేవించి స్వీపర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆలయ అటెండర్ వెంకటరమణను అధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, ఆలయ సహాయ కమిషనర్ -
ఈ ఆస్పత్రిలో స్వీపరే డాక్టర్!
- సర్వజనాస్పత్రిలో వైద్య సేవల తీరిది అనంతపురం: ఈ నెల 27వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం నార్పలలో జరిగిన ఘర్షణలో ఈరమ్మ (50) తలకు తీవ్రగాయమైంది. దీంతో అదే రోజు కుటుంబీకులు ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఎంఎస్-2 వార్డులో అడ్మిట్ చేశారు. అడ్మిషన్లో ఉన్నప్పటి నుంచి ఆమెకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఈరమ్మ తలకు కట్టు కట్టాల్సి ఉంది. అయితే డ్యూటీ డాక్టర్ మనోహర్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లగా, హౌస్‌సర్జన్ శ్వేత ఇతర రోగులకు వైద్య పరీక్షలు నిర్విహించే పనిలో నిమగ్నమయ్యూరు. నర్సింగ్ విద్యార్థినులు ఉన్నా, తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. చివరకు పారిశుద్ధ్య పనులు చేయాల్సిన స్వీపర్ తన పని వదిలేసి ఇదిగో ఇలా కట్టుకట్టేసింది. చాలా వార్డుల్లో స్వీపర్లు పరిశుభ్రతను గాలికొదిలేసి రోగులకు వైద్యం చేసేస్తున్నారు. ఇలా చేసినందుకు రోగుల నుంచి ఎంతో కొంత మొత్తం తీసుకుంటున్నారు. - అనంతపురం మెడికల్ -
నాడు బంగారు పతకం..నేడు చీపురు
కోల్‌కతా: అతను 1987లో ఆల్ ఇండియా ఇన్విటేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నవాడు. మరిపుడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన ఇద్దరు బిడ్డల్ని చదివించుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. చివరికి హౌరా మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. 'నా సోదరుడు టీబీతో బాధపడుతున్నాడు. అతని చికిత్సకోసం డబ్బుల్లేవు. కనీసం తినడానికి తిండి కూడా లేదు' అని అంటున్న ఈ మాజీ బాక్సర్ మాటలు వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. వివరాల్లోకి వెళితే హౌరాకు చెందిన క్రిష్ణ రౌత్ 15ఏళ్ల వయసులో బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇపుడు 43 ఏళ్ల వయసులో రోజుకు 200 రూపాయల కోసం మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మురికివాడలో పూరిగుడిసెలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి బాక్సింగ్ అంటే ప్రాణం. అందుకే ఇప్పటికీ దాదాపు నలభైయాభై మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. రోజుకు కనీసం రెండు గంటలువారి కోసం కేటాయిస్తాడు. ప్రభుత్వం సాయం అందిస్తే కామన్ వెల్త్ క్రీడల్లోనూ, ఒలింపిక్స్ లోనూ సత్తా చాటుతామంటున్నాడు. మరోవైపు అతని దగ్గర శిక్షణ తీసుకున్న చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించారు. 'నేను బంగారు పతకాన్ని గెలుచుకున్నపుడు చాలామంది చాలా వాగ్దానాలు చేశారు. కానీ ఏవీ అమలుకు నోచుకోలేదు. ఇది నన్ను చాలా బాధించింది. నన్ను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎపుడూ కలవడానికి ప్రయత్నించలేదు. ఎలాకలుస్తాను..వారి చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. కనీసం మేయర్‌ను కూడా నేను కలవలేకపోయాను. తనకు శాశ్వతమైన జీవనభృతి కల్పిస్తే తన పిల్లల్ని బాగా చదివించుకుంటా' అని అంటున్నారు ఈ మాజీ ఛాంపియన్. అయితే ఈ విషయం మీడియాలో బాగా ప్రచారం కావడంతో రెజ్జింగ్ లెజెండ్, ఒలింపిక్స్ పతకాల విజేత సుశీల్ కుమార్ స్పందించారు. తను సీఎం మమతతో మాట్లాడి కృష్ణకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. మమత దీదీకి క్రీడలన్నా, క్రీడాకారులన్నా చాలా అభిమానమని, ఆమె రైల్వే మంత్రిగా ఉన్నపుడు కూడా చాలామందికి సహాయం చేశారని తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
ఒళ్లంతామట్టి.. బతుకంతా వెట్టి
దీనావస్థలో పారిశుద్ధ్య కార్మికులు మురుగు ఎత్తినా మమత చూపని పాలకులు ఏళ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్ కాని కొలువు వైద్యమందదు.. జీతం సరిపోదు హోరువానలోనా, ఎముకలు కొరికే చలిలోనైనా తెల్లవారుజామునే రోడ్డెక్కుతారు. రోడ్లన్నీ మెరిసేలా ఊడ్చేస్తారు. మురుగు ఎత్తి శుభ్రంగా ఉన్న రోడ్లను చూసి మురిసిపోతారు. కానీ మనమధ్యే ఉంటూ మనకి ఇంతా సేవ చేస్తున్న ఈ మట్టిమనుషులకు మాత్రం అన్నీ కష్టాలే.. మెదక్: చెత్తపై కొత్త సమరం పేరిట చేపట్టిన ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమం ఉద్యమంలా విస్తరిస్తోంది. దేశ ప్రధాని మోడి పిలుపుతో క్రికెటర్లు, సినీమా స్టార్లు...కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చేస్తూ...దేశ ప్రజలకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నారు. సీన్ కట్‌చేస్తే.... బురద బుక్కుతూ...బురద కక్కుతూ...మురికిలో మునిగి తేలుతూ...ఒళ్లంతా మట్టిని చేసుకొని...బతుకంతా వెట్టిలో గడుపుతున్న గ్రామీణ పారిశుధ్ధ్య కార్మికుల బతుకులు దీనంగా మారుతున్నాయి. ఇచ్చిందే పైకంగా...వచ్చిందే జీతంగా కనీస సౌకర్యాలకు దూరమై దుర్బర జీవితాలు గడుపుతున్నారు. గ్రామాల్లోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకున్నా...మురికి కాల్వల్లో రోతను ఎత్తిపోసినా...వారి శ్రమను గుర్తించే వారు గానీ, అయ్యోపాపం అనేవారు గానీ లేకుండా పోయారు. మసక చీకట్లో...చీపుళ్లు చేతుల్లో... జనమంతా..మగత నిద్రలో ఉంటే...పారిశుద్ధ్య కార్మికులు మాత్రం తొలి కోడి కూయకముందే మేల్కొంటారు. చిమ్మ చీకట్లో..చీపుళ్లు చేతబట్టి..తట్టా..పార నెత్తినబెట్టుకొని...వీధుల్లోకి అడుగులు వేస్తారు. ఎముకలు కొరికే చలిలో...జోరు వానలో సైతం విధులకు నిర్వర్తిస్తారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు వారంతా మురుగుపూసుకుంటారు. మెదక్ జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలు ఉండగా, 620 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. ప్రతిరోజు గ్రామంలోని వీధులు...మురికి కాల్వలు శుభ్ర పర్చడం వీరి విధి. ఈ క్రమంలో తెల్లవారక ముందే చలికి వణుకుతూ...వర్షానికి తడుస్తూ..ఎండకు ఎండుతూ తమ విధులను నిర్వర్తిస్తుంటారు. మురికి కాల్వల్లోని మురుగును సైతం ఓర్పుతో తొలగిస్తారు. కుక్కలు, పిల్లులు, ఎలుకలు, కాకులు లాంటి ఏ జీవి చనిపోయినా..వీధుల్లో అవి కుళ్లిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నా ముక్కు మూసుకొని తొలగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘స్వచ్ఛ భారత్’’కు అచ్చమైన మూలాలు వీరే. బతుకు భారం..సౌకర్యాలు మృగ్యం గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ 516, 10-12-2013 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు సరిపడ సబ్బులు, కొబ్బరి నూనెను గ్రామ పంచాయతీలు ఇవ్వాలి. దుమ్ము, ధూళి నుంచి రక్షణకోసం ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లౌజ్‌లు అందజేయాలి. కనీసం ఏడాది రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించాలి. రెండు జతలు దుస్తులు, రెండు జతల చెప్పులు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకునే ఈ కష్ట జీవులకు నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా పంచాయతీ నిధులను బట్టి రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరికి ఉద్యోగ భద్రత కూడా లేదు. కొత్త సర్పంచ్‌లు రాగానే అవసరమైతే తమకు ఇష్టంలేని కార్మికులను తొలగిస్తూ...కొత్తవారిని చేర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాలుష్య వాతావరణంలో విధులు నిర్వర్తిస్తూ....అనారోగ్యానికి గురై మృత్యువాత పడ్డ కార్మికులు ఎందరో ఉన్నారు. పాఠశాలల్లోని పార్ట్‌టైం స్వీపర్లది అదే గతి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో పార్ట్ స్వీపర్లు..కాన్టిన్జెంట్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 270 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పాఠశాలను, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ...ఒళ్లంతా దుమ్ము చేసుకుంటున్నారు. 30 ఏళ్ల నుండి సేవలందిస్తున్నా..వారి ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదు. నెలకు వచ్చే జీతం కేవలం రూ.1,623లు మాత్రమే. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ పేస్కేల్ ఇవ్వాలని కనిపించిన వారినల్లా వేడుకుంటున్నా...వారి వేదన అరణ్య రోదనగానే మారుతోంది. -
స్వీపరే స్టాఫ్ నర్సు!
చిన్నపిల్లల విభాగంలో నిద్రపోతున్న స్టాఫ్ నర్సులు అనంతపురం రూరల్: సర్వజనాస్పత్రిలో స్వీపర్లే స్టాఫ్ నర్సుల అవతారం ఎత్తుతున్నారు. రోగులకు సేవలందించాల్సిన స్టాఫ్ నర్సులు నిద్రపోతున్నారు. చిన్నారులకి చేసే వైద్యంలో ఏమాత్రం పొరపాటు జరిగినా వారి ప్రాణాలకే ప్రమాదం. అటువంటి చిన్నపిల్లల విభాగంలో స్వీపర్లు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. బుధవారం చిన్నపిల్లల వార్డులో ఓ స్వీపర్ స్టాఫ్ నర్సుగా పనిచేసింది. వారు చేసే పనితో పాటు రోగులకు సేవలందించింది. శీతాకాలం కావడంతో శ్వాసకోస సంబంధిత వ్యాధులతో చిన్నారులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు. వారికి ప్రతి రోజూ రెండు పూటల నెబులైజేషన్ అందించాలి. ఎవరూ ఆ వార్డులో లేకపోవడంతో కుటుంబీకులే నెబులైజేషన్ను శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది. ఎంతసేపటికీ స్టాఫ్ నర్సు గానీ ఇతర సిబ్బంది గానీ రాకపోవడంతో ఓ మహిళ తన కూతురికి నెబులైజేషన్ అందించేందుకు ప్రయత్నించింది. కానీ ఏవిధంగా ఇవ్వాలో తెలియకపోతే చివరకు ఆ వార్డులో పనిచేస్తున్న స్వీపర్ వచ్చి నెబులైజేన్ అందించింది. నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోందని రోగుల బంధువులు వాపోతున్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించాల్సిన సిబ్బంది మీనామేషాలు లెక్కిస్తున్నారు. నెబులైజేషన్తో ఇన్ఫెక్షన్స్: చిన్నపిల్లల వార్డులో అందిస్తున్న నెబులైజేషన్ను సరిగా శుభ్రం చేయడం లేదు. ఒకరికి పట్టిన వెంటనే మరొకరికి అందిస్తున్నారు. వాస్తవానికి శుభ్రం చేసిన వెంటనే మరొకరికి ఇవ్వాలి. అలా చేయకపోవడంతో ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ అధికంగా ఉంటే ఇతరులకు సోకే ప్రమాదం లేకపోలేదు. స్వీపర్లు శుభ్రం చేయకుండా అలాగే అందిస్తున్నారు. అటుగా వెళ్తున్న వైద్యులు సైతం పట్టించుకోవడం లేదు. దీనిని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. -
పేషంట్‌కు వైద్యం చేసిన స్వీపర్
-
చీపురుపట్టిన జెసి దివాకర్ రెడ్డి
-
చిన్నారులకు వాచ్మెన్ వైద్యం