‘వైద్యానికి’ చెయ్యాలి చికిత్స | Treatement for health care | Sakshi
Sakshi News home page

‘వైద్యానికి’ చెయ్యాలి చికిత్స

Published Tue, Dec 12 2017 12:56 AM | Last Updated on Tue, Dec 12 2017 12:56 AM

Treatement for health care - Sakshi

విశ్లేషణ
మన వైద్య సేవల వ్యవస్థ పెద్ద ఎత్తున కార్పొరేట్‌ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్నది. కాబట్టి ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థ పట్ల దృఢంగా వ్యవహరించా ల్సిన సమయం ఇదే. దీనికితోడు ప్రభుత్వరంగ వైద్య సేవలను మెరుగుపరచాలి.

ఢిల్లీలోని ఒక ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయడంపై చాలా గగ్గోలు రేగుతోంది. హరి యాణా ప్రభుత్వం కూడా ఒక ఆసుపత్రి నిర్మాణం కోసం ఇచ్చిన భూమి లీజును రద్దు చేసింది. దీనిపై కూడా కొంత అలజడి రేగినా, అది ఢిల్లీలో దానికంటే తక్కువే. ఏది ఏమైనా రెండు ప్రభుత్వాలూ రెండు పెద్ద ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నాయి. ఒకటి ఒక నవజాత శిశువు బతికే ఉన్నా, చనిపోయినట్టు సర్టిఫికెట్‌ ఇచ్చింది. మరొ కటి ఒక డెంగ్యూ రోగి చికిత్సకు ఊహింపశక్యం కానంత పెద్ద సంఖ్యలో సిరంజ్‌లను వాడినట్టు చూపడం సహా భారీగా బిల్లులను వడ్డించింది. ఢిల్లీ ఆసుపత్రి లైసెన్స్‌ను ఉపసంహరించడాన్ని అక్కడి ఇన్‌పేషంట్లను గాలికి వది లేయడం అన్నట్టు చూస్తున్నారు. కానీ అలా జరగలేదు. అందరు ఇన్‌పేషెంట్లనూ డిశ్చార్జ్‌ చేసేవరకు చికిత్స అందించడాన్ని అనుమతించారు. హరియాణా ప్రభుత్వం తీసుకున్న చర్య పర్యవసానం కూడా ఇంచుమించు అలాంటిదే. ప్రభుత్వం తీసుకున్నది సరైన రీతిలో తీసు కున్న చర్యేనా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఉదా హరణకు, ఢిల్లీ విషయంలో మొత్తంగా ఆ కార్పొరేట్‌ సంస్థపైన చర్య తీసుకోవడం కంటే ఆ ఘటనతో ప్రమేయం ఉన్నవారిపైన చర్య తీసుకోల్సిందంటూ అందుకు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు.

ఇక్కడితో ఈ కథ ముగిసిపోతుందని అనుకోవడా నికి లేదు. న్యాయమూర్తులు ఏం  తీర్పు చెబుతారో తెలి యదు. కానీ భారీ అసుపత్రులు, ప్రత్యేకించి ఆసుప త్రుల నెట్‌వర్క్‌ ఉన్న సంస్థలు తమకు మచ్చ రావడాన్ని భరించలేవు. చచ్చే వరకు అన్నట్టు కడదాగా పోరాడ తాయి. నా వాదన సరళమైనదే. పెద్ద ఎత్తున కార్పొరేట్‌ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్న ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థతో దృఢంగా వ్యవహరించాల్సిన సమ యం ఇదే. వాటికి అలవాటుగా మారిన తప్పుడు పద్ధ తులకు బాధ్యత వహించకుండా వాటిని తప్పించుకు పోనివ్వకూడదు. ఇటీవలి కాలంలో ఆసుపత్రులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయనీ. గుండె, ఎముకలకు సంబంధించిన ఇంప్లాంట్‌ ఉపరకరణాల నుంచి సిరం జ్‌ల వరకు దాదాపు అన్నిటి నుంచి భారీగా లాభాలు చేసుకుంటున్నాయని తెలిసిందే. ఇన్‌పేషెంట్‌ను ఇలా చూసి వెళ్లినందుకు డాక్టర్‌ చార్జీలు సహా దాదాపుగా మన ఊహకందే ప్రతిదానికీ వసూలు చేసే అధిక చార్జీలకు ఈ లాభాలు అదనం. బెడ్‌లు ఖాళీగా ఉండకూడదని వారాంతానికి ముందు పేషంట్లను డిశ్చార్జ్‌ చేయ కుండా ఉండటం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే, కేవలం ప్రైవేట్‌ ఆసుపత్రులపైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం తప్పు.

ప్రైవేటు రంగంలో అమల్లో ఉన్న తప్పుడు పద్ధతు లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ప్రజా ధనంతో ఏర్పడిన వైద్య సేవల వ్యవస్థ పేషెంట్లను వారి స్తోమతకు సరితూగని ప్రైవేట్‌ రంగం వైపు తరిమేస్తుం డగా, ప్రైవేట్‌ రంగం భారీగా విస్తరించి పోతున్నదో తెలుసుకోవాలి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ  నెల 10న నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నిర్ధారణలను ప్రచరించింది. గ్రామీణ కుటుంబాలలో నాలుగింట ఒకటి, పట్టణ కుటుంబాలలో ఐదింట ఒకటి ఆసుపత్రి ఖర్చుల కోసం  ‘‘తప్పనిసరై అప్పు చేయాల్సి’’ వస్తోంది. ఉచితంగా లేదా దాదాపు ఉచితంగా సేవలందించే ప్రభుత్వ ఆసు పత్రుల చికిత్సకు సైతం పైన అయ్యే ఖర్చులు భరిం చాల్సి రావడం వల్ల చాలా మంది చితికిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేవారిని కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటారు. వైద్యంపై తలసరి వ్యయం అ«ధి కంగా ఉన్న, మంచి వైద్య సదుపాయాల వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో వైద్య రుణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని వెల్లడి కావడం ఆసక్తికరం. కుటుంబాల ఆర్థిక స్థితిగ తుల్లో కల్లోలాన్ని రేపేది ప్రైవేటు ఆసుపత్రులే కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నడిపేవి కూడా అందుకు ఎలా కారణం అవుతున్నాయో ఇది వివరిస్తుంది. అధ్వాన సదుపాయాలు, అధ్వాన రోగనిర్ధారణ, అధ్వాన చికిత్స, భౌగోళికంగా అందుబాటులో లేకపోడం మన ప్రభుత్వ వైద్య సేవల ప్రధాన లక్షణాలు. పట్టించుకునేవారు ఎవరూ లేరన్నట్టుంది ఇది.

ఢిల్లీ, హరియాణా ప్రభుత్వాలు హఠాత్తుగా ఇలా విరుచుకు పడటం పట్ల అసంతృప్తి ఉండొచ్చునేమో గానీ, మిగతా పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య వ్యవస్థల నుంచి కూడా అదే స్థాయి నిబద్ధతను, సమర్థతను ఎవరు డిమాండు చేస్తారు? అనేదే అసలు సమస్య. ఢిల్లీ ప్రభుత్వం అంద రికీ అందుబాటులో ఉండే మంచి వైద్య సదుపాయాల వ్యవస్థను మొహల్లా (బస్తీ) క్లినిక్‌లను ఏర్పాటు చేసి నట్టు తెలుస్తోంది. కానీ మీడియా వాటిని పెద్దగా వెలుగులోకి తేలేదు. ఢిల్లీ ప్రభుత్వం, ముందు తమ సొంత వ్యవస్థను సక్రమంగా నడిపాకే ఇతరులను కూడా అలా చేయాలని కోరాలనే సరైన వైఖరిని చేపట్టినట్టు అనిపి స్తోంది.


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com
మహేశ్‌ విజాపుర్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement