సాక్షి, శేరిలింగంపల్లి (హైదరాబాద్): ఆరోగ్యశ్రీలో పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేన్సర్‌కు వైద్య సేవలు అందించాలని, వాటి బిల్లులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ఎథోస్ రేడియోథెరపీ సిస్టమ్‌ను ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...ఎథోస్ రేడియోథెరపీతో ఈ ప్రాంత ప్రజలకు అధునాత టెక్నాలజీతో కూడా వైద్య సేవలు అందడం సంతోషం అన్నారు. కేన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ విభాగంలో 300 బెడ్స్ అదనంగా జతచేశామని వివరించారు.
అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో సామాజికసేవలో భాగంగా పేదలకు కేన్సర్‌కు వైద్యసేవలు అందించి ఆదుకోవాలని సీఓఓ డాక్టర్ ప్రభాకర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, అల్ల వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..
Comments
Please login to add a commentAdd a comment