
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆందోళనల్లో భాగంగా ఆదివారం ట్రిపుల్ ఐటీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్ ఐటీలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో ఏబీవీపీ కార‍్యకర్తలు, పోలీసుల మధ‍్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఓ మహిళా కార్యకర్తను ఈడ్చుకెళ్లినట్టు సమాచారం. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, అక్రమ అరెస్టులపై ఏబీవీపీ నాయకులు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment