
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు భయపడ్డట్టే అయిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ తిండి తింటే చస్తామని ఆ విద్యార్థులు ఎంత మొత్తుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సరైన తిండి పెట్టండంటూ విద్యార్థులు దీక్షలు చేపట్టినా ప్రభుత్వానికి పట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నందు వల్లే ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి చెందాడని షర్మిల ఆరోపించారు.
విద్యార్థులకు కలుషిత అన్నం పెట్టి మరో చావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమయ్యారంటూ ధ్వజమెత్తారు. మాట ఇచ్చిన నెలలోపే కలుషిత ఆహారానికి వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఇంకెంత మందిని బలి తీసుకుంటారు దొరా? అని ప్రశ్నించారు. కనీసం ఇప్పుడైనా మీ ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా? అని నిలదీశారు. చదువుకునే పిల్లలకు సరైన తిండిపెట్టని సర్కార్ ఉంటే ఎంత! ఊడితే ఎంతంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment