
సాక్షి, హైదరాబాద్: బహిరంగ సభలకు అడ్డురాని కరోనా గణతంత్ర వేడుకలకు అడ్డొచ్చిందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.
భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న గౌరవం ఇదేనా అని నిలదీశారు. రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పిన నాడే ఆయన దేశద్రోహి అని అర్ధమవుతుందన్నారు. గవర్నర్‌తో పడకుంటే గణతంత్ర వేడుకలను ఆపేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment