Republic Day 2023
-
వినియోగంలోకి విస్తరించిన అప్రాన్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో సుమారు రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన అప్రాన్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి ప్రారంభించారు. ఈ అప్రాన్‌లోకి తొలిసారిగా పార్కింగ్ చేసిన హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి ఎయిర్పోర్ట్ అగ్నిమాపక శాఖ వాటర్ క్యానన్ సెల్యూట్ పలికింది. విస్తరించిన కొత్త అప్రాన్‌లో ఆరు ఎయిర్‌బస్ ఎ321 విమానాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. అంతే కాకుండా కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నుంచి ఆరు ఏరో బ్రిడ్జిల ద్వారా నూతన అప్రాన్‌ను అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఏరో బ్రిడ్జిల ద్వారా నేరుగా విమానాల్లోకి రాకపోకలు సాగించవచ్చు. భవిష్యత్ అవసరాల నిమిత్తం విస్తరించిన భారీ అప్రాన్‌ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడం విమానాశ్రయ చరిత్రలో మరో మైలురాయి అని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి బస్ సర్వీస్‌లు... అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ నుంచి విజయవాడ మీదుగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరు వరకు ఆర్టీసీ బస్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు గాను ఈ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం వేళ ఈ బస్ సర్వీస్ నడపనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఈ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
తిరుపతి : ఆలయాల్లో సైతం రిపబ్లిక్ డే వేడుకలు (ఫొటోలు)
-
Delhi: మన ఘన శక్తి.. మహిళా యోధులే సారథులు
న్యూఢిల్లీ: ఆత్మనిర్భరత స్ఫూర్తితో పరిపుష్టమైన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ.. నారీశక్తిని చాటుతూ.. వైవిధ్యమైన, సుసంపన్నమైన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కడుతూ 74వ గణతంత్ర వేడుకలు మువ్వన్నెల జెండాల రెపరెపలతో ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నిర్వహించిన వేడుకల్లో దేశ విదేశీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం సంప్రదాయం ప్రకారం కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాలాపన తర్వాత సైనికులు లాంఛనంగా 21 గన్ సెల్యూట్ సమర్పించారు. రక్షణ రంగంలో స్వావలంబనకు సూచికగా పాతకాలపు విదేశీ 25–పౌండర్‌గన్స్ స్థానంలో ఈసారి స్వదేశీ 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చడం విశేషం. అబ్బురపర్చిన విన్యాసాలు కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కన్నుల పండువగా సాగింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపర్చాయి. మన ఆయుధ పాటవాన్ని, సైనిక శక్తిని తిలకించిన ఆహూతుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మరఠా లైట్ ఇన్ఫాంట్రీ, బిహార్ రెజిమెంట్, గూర్ఖా బ్రిగేడ్ తదితర సేనలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు, రక్షణ సామగ్రిని పరేడ్‌లో ప్రదర్శించారు. అర్జున్, నాగ్ మిస్సైల్ సిస్టమ్, కె–9 వజ్ర యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నావికాదళం నుంచి 9 మంది అగి్నవీరులు తొలిసారిగా పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు యువతులున్నారు. వైమానిక విన్యాసాల్లో ఆధునిక మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకేఐ, రఫేల్ ఫైటర్లు, సి–130 సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానాలతోపాటు సి–17 గ్లోబ్ గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు పాల్గొన్నాయి. నావికా దళానికి చెందిన ఐఎల్–38 యుద్ధ విమానం సైతం తొలిసారిగా పాలుపంచుకుంది. దట్టమైన పొగమంచు వల్ల యుద్ధ విమానాల విన్యాసాలను ప్రజలు పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయారు. 800 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూడా కళ్లు చిట్లించుకొని చూడాల్సి వచి్చంది. వాటిని ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయాస పడ్డారు. 25–పౌండర్ శతఘ్నులకు సెలవు రిపబ్లిక్ డే వేడుకల్లో 21 గన్ సెల్యూట్లో భాగంగా 25–పౌండర్ గన్స్ పేల్చడం దశాబ్దాలుగా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇకపై వీటికి శాశ్వతంగా సెలవు ఇచ్చేసినట్టే. ఈసారి దేశీయంగా తయారు చేసిన 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చారు. ఈ వందనంలో మొత్తం ఏడు శతఘ్నులు పాల్గొన్నాయి. ఒక్కొక్కటి మూడుసార్లు పేల్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో స్వదేశీ శతఘ్నులతో వందనం సమరి్పంచడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2281 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన 25–పౌండర్ గన్స్ 1940 దశకం నాటివి. ఇవి యునైటెడ్ కింగ్డమ్లో తయారయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. 21 గన్ సెల్యూట్‌కు పట్టే సమయం 52 సెకండ్లు. మహిళా యోధులే సారథులు నారీశక్తిని ప్రతిబింబిస్తూ ‘ఆకాశ్’ ఆయుధ వ్యవస్థను లెఫ్టినెంట్ చేతన్ శర్మ నాయకత్వంలో ప్రదర్శించారు. 144 మంది జవాన్లు, నలుగురు అధికారులతో కూడిన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధూరెడ్డి నేతృత్వం వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం(సీఆర్పీఎఫ్) నుంచి పూర్తిగా మహిళా సైనికులతో కూడిన బృందం పరేడ్‌లో పాల్గొంది. ఈ బృందానికి అసిస్టెంట్ కమాండెంట్‌పూనమ్ గుప్తా సారథ్యం వహించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ఆర్మ్డ్ పోలీసు బెటాలియన్‌గా ఈ బృందానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే ఢిల్లీ మహిళా పోలీసుల పైప్ బ్యాండ్ కూడా మొదటిసారిగా గణతంత్ర పరేడ్‌లో భాగస్వామిగా మారింది. ‘ఢిల్లీ పోలీసు సాంగ్’ను వారు ఆలపించారు. పరేడ్ సైడ్‌లైట్స్ ►రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చిన తర్వాత ఇవే తొలి గణతంత్ర వేడుకలు. ►ఈసారి ‘నారీశక్తి’ థీమ్‌తో వేడుకలు జరిగాయి. ►ఈజిప్ట్ సైనిక దళాలు, బ్యాండ్ తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నాయి. ►ప్రధాని మోదీ ధరించిన రంగుల తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ►ముగ్గురు పరమవీర చక్ర గ్రహీతలు, ముగ్గురు అశోక చక్ర అవార్డు గ్రహీతలు పరేడ్‌లో పాల్గొన్నారు. ►బీఎస్ఎఫ్కు చెందిన ఒంటెల దళాన్ని తొలిసారిగా మహిళా సైనికులు నడిపించారు. ►మొత్తం 23 శకటాలను ప్రదర్శించారు. 17 రాష్ట్రాలవి కాగా 6 కేంద్ర శాఖలవి. ►ఢిల్లీ సెంట్రల్ విస్టా, కర్తవ్యపథ్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న ‘శ్రమయోగీల’తోపాటు పాలు, కూరగాయలు విక్రయించుకొనేవారిని, చిరు వ్యాపారులను గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ► 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) శకటంపై చిరుధాన్యాలను ప్రదర్శించారు. కనువిందుగా అలంకరించిన ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. -
దేశంలోనే తెలంగాణ నం.1
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసన మండలి ఆవరణలో గుత్తా, శాసనసభ ఆవరణలో పోచారం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ: స్పీకర్ కులమతాలకు అతీతంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి జరుపు కునే పండుగ గణతంత్ర దినోత్సవమని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాంతియుతంగా తెచ్చిన స్వాతంత్య్ర ఫలాలను పరిపాలన ద్వారా అమలు చేసే విధులు, బాధ్యతలను పవిత్రమైన రాజ్యాంగం తెలియజేసిందన్నారు. తెలంగాణ భవన్లో.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. టీటీడీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అట్లూరి సుబ్బారావు, ఆజ్మీరా రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆప్ కార్యాలయంలో జెండా వందనం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆప్ కోర్ కమిటీ సభ్యురాలు ఇందిరా శోభన్ ఎగురవేశారు. -
పురోగతిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం మనం వేడుకలు జరుపుకోవాల్సి న రోజు మాత్రమే కాదు.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి సాధించిన పురోగతిని ఆత్మపరిశీలన చేసుకునే సమయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వందనం చేశారు. అనంత రం జస్టిస్ భూయాన్ మాట్లాడుతూ ‘రాజ్యాంగం ఆమోదం పొందిన నాటి నుంచి ఎంతో కాలం ప్రయాణించా. మనం సాధించిన లక్ష్యాలను గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం సమానమేనని రాజ్యాంగం చెబుతోంది. ఎక్కడా కులం, మతం, లింగం లాంటి భేదాలు ఉండకూడదు. దేశంలోని ప్రతి పేదవాడికీ న్యాయం అందేలా చూడాలి. పెండింగ్ కేసులను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నామనేది కోర్టుల పనితీరుకు కొలమానం. దీనికి న్యాయవాదులు, రిజిస్ట్రీ సహకారం ఎంతో అవసరం’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు పాల్గొన్నారు. -
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై కవిత ట్వీట్.. రియాక్షన్ ఎలా ఉందంటే?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. గత ఏడాది కూడా వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. కేసీఆర్, మంత్రులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. గురువారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి’’ అంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టిపెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు’’ అంటూ కవిత ట్వీట్ చేశారు. చదవండి: కొందరికి నేను నచ్చకపోవచ్చు.. రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళిసై షాకింగ్ కామెంట్స్ Choosing country’s infrastructure over central vista during pandemic, is what we demanded. Choosing farmers, labourers, unemployed youth over focusing on wealth generation for a few is exactly what we have been fighting for. Thank you for echoing the vision of CM KCR Garu. https://t.co/VCOIHKZkbT — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 26, 2023 -
First Constitution Day: తొలి రాజ్యాంగ దినోత్సవ అరుదైన ఫొటోలు
-
Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!
ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అతి దీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందింది. దీని రచనను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రభుత్వ సంస్థల విధులను గుర్తించేలా నిర్దేశించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులనూ నిర్దేశించింది. రాజ్యాంగమే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేది. అదే ప్రభుత్వం, పౌరుల మధ్య... నమ్మకం, సమన్వయాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం భారత పౌరుని ప్రాథమిక విధుల్లో ఒకటి. అప్పుడే సార్వభౌమ గణతంత్ర సభ్యునిగా, భారతదేశంలోని ప్రతి పౌరుడూ ప్రతిరోజూ వినియోగించుకోవలసిన రాజ్యాంగ హక్కులను పొందుతాడు. ప్రతి పౌరుడి అభివృద్ధి అతని హక్కులు, విధులపై అతనికి ఉన్న అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశ రాజ్యాంగం అయినా దేశ ప్రగతి కోసం మంచి పాలన, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం జరిగిన ఈ 72 సంవత్సరాల పాలనా కాలంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాం. తయారీ రంగంలో 30వ ర్యాంకులో ఉన్నాం. ఇక వివిధ ఆహార ధాన్యాల, తృణధాన్యాల ఉత్పత్తిలో మనం మొదటి 5 స్థానాన్ని ఆక్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం 20 శాతం పేదరికంలోనే ఉన్నాం. 12 శాతం నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. విపరీతమైన ఆదాయ అసమానతలూ ఉన్నాయి. వివిధ ప్రపంచ సూచికలలో మనం ఆందోళనకరమైన స్థానాల్లో ఉన్నాం. ఉదాహరణకు ఉగ్రవాద సూచికలో 8వ స్థానం, అవినీతిలో 28వ ర్యాంక్, హ్యాపీ ఇండెక్స్‌లో 44 ర్యాంక్‌లో ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం – రెండింటి కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు చాలానే ఉన్నా ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే విధానాలు ఉత్తమమైనవే కానీ వాటి అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అధిగమించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు వంటి ఇటీవలి విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన సృష్టించాయి. అయితే ఈ సమస్యలన్నీ తగిన రాజ్యాంగ సవరణలతో పరిష్కరించబడతాయి. సానుకూల ఫలితాలను, సమాజ అభ్యున్నతికి హామీ ఇచ్చే విధానాలను సులభంగా స్థాపించగలిగే విధంగా మన చట్టాలను సవరించడం కొనసాగించాలి. రాజ్యాంగాన్ని సముచితంగా అమలు చేయడానికి రాజకీయ రంగంలో, కార్యనిర్వాహక యంత్రాంగంలో నైతిక విలువలు ఉండాలి. ప్రజలు అవసరమైన చోట ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రతి పౌరుడూ ఇతరుల హక్కులను గౌరవించాలి. చట్టబద్ధంగా, నైతికంగా తన విధులను నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సారాన్ని ఆస్వాదించగలరు. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్) – డాక్టర్ పి.ఎస్. చారి, మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి.. చిరంజీవి ట్వీట్
యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుకుంటూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 'మన భారతీయులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమూల్యమైన స్వాతంత్ర్య బహుమతి కోసం మరియు ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాలలో ఒకటైన మా వ్యవస్థాపక తండ్రులను ప్రేమగా స్మరించుకుంటూ సెల్యూట్ చేస్తున్నాము.మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి' అంటూ చిరు ట్వీట్లో రాసుకొచ్చారు. Fondly Remembering & Saluting our founding fathers for the invaluable gift of independence and for one of the greatest constitutions of the world! 🙏🙏 May our Motherland 🇮🇳 be prosperous forever!! 💐 Happy 74th Republic Day to All of us Indians!! 💐🇮🇳🇮🇳 — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2023 -
ఢిల్లీలో ఘనంగా 74వ రిపబ్లిక్ డే.. అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రత్యేక అతిథి, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా పాల్గొన్నారు. సైనికులు కవాతు నిర్వహించి వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 21 గన్‌సెల్యూట్‌తో త్రివర్ణపతాక ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకల్లో ప్రదర్శించిన 23 శకటాలు దేశంలో భిన్న సంస్కృతిని ప్రతిబింబించాయి. 17 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించారు. ఈ ఈజిప్టు సైనికులు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశనలుమూల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సైనికుల సాహసాలు అబ్బురపరిచాయి. ఆత్మనిర్బర్ భారత్.. ఆత్మనిర్బర్ భారత్ ప్రతిబించేలా ఈసారి వేడుకల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలనే ప్రదర్శించారు. 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ తుపాకులు, ఇటీవలే సైన్యంలో చేరిన ఎల్సీహెచ్ ప్రచండ్, కే-9 వజ్ర హోవిట్జర్, ఎంబీటీ అర్జున్, నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్‌ను ప్రదర్శించారు. పరేడ్ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడంతో గణతంత్ర వేడుకలు ముగిశాయి. 11:20 AM అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన.. కర్తవ్యపథల్ గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతింబింబించేలా ఉన్న ఈ శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. అలాగే గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. The tableau of Andhra Pradesh depicts 'Prabhala Theertham'- a festival of the peasantry during Makara Sankranti, at the Republic Day parade pic.twitter.com/YXPdmuUFET — ANI (@ANI) January 26, 2023 10:30 AM పరేడ్‌లో రాష్ట్రపతి, ప్రధాని.. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా గణతంత్ర పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. 21-గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ గణతంత్ర పరేడ్‌లో ఈజిప్టు సైన్యం కూడా పాల్గొంది. Delhi | President Droupadi Murmu leads the nation in celebrating Republic Day Egypt’s President Abdel Fattah al-Sisi attends the ceremonial event as the chief guest Simultaneously, National Anthem and 21-gun salute presented pic.twitter.com/hi3joxFs57 — ANI (@ANI) January 26, 2023 10:20 AM పరేడ్‌కు రాష్ట్రపతి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాతో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు బయల్దేరారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అక్కడ ఘనంగా నిర్వహించే 74వ గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. Delhi | President Droupadi Murmu and Egyptian President Abdel Fattah El –Sisi depart from the Rashtrapati Bhavan to attend the Republic Day celebrations at Kartavya Path pic.twitter.com/tvhgjnwsC7 — ANI (@ANI) January 26, 2023 10:10 AM అమరులకు మోదీ నివాళులు.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులను స్మరించుకున్నారు. అనతరం కర్తవ్య పథలో గణతంత్ర పరేడ్‌కు హాజరవుతారు. #RepublicDay | PM Modi leads the nation in paying homage to the fallen soldiers at the National War Memorial in Delhi pic.twitter.com/CE9B2CPZmB — ANI (@ANI) January 26, 2023 న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే గణతంత్ర పరేడ్‌కు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభం కానుంది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరవుతున్నారు. ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంటుంది. ఈ సారి నిర్వహించే పరేడ్ ప్రత్యేకంగా ఉండనుంది. సైనిక శక్తిసామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించనున్నారు. వారం రోజుల పాటు జరుగుతున్న గణతంత్ర వేడుకలు జనవరి 23న నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రారంభమయ్యాయి. జనవరి 24, 25 తేదీల్లో 'ఆది శౌర్య- పర్వ్ పరాక్రమ్ కా' ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించారు. -
వెండితెరపై దేశం కోసం పోరాడుతున్న రీల్ గుఢాచారులు
దేశం కోసం కొందరు గూఢచారులు ‘మేరా భారత్ మహాన్’ అంటూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే ఇవి సిల్వర్ స్క్రీన్ గూఢచారుల కథలు. భారత రాజ్యాంగం అమలులోకొచ్చిన రోజు (జనవరి 26)న స్వాతంత్య్రం కోసం ప్రాణాలను లెక్కచేయని సమర యోధులను గుర్తు చేసుకుంటూ... సిల్వర్ స్క్రీన్‌పై దేశం కోసం పోరాడే ఈ రీల్ గూఢచారుల గురించి తెలుసుకుందాం. ఓ రహస్యాన్ని ఛేదించేందుకు ‘డెవిల్’గా గూఢచార్యం చేస్తున్నారు కల్యాణ్ రామ్. నవీన్ మేడారం దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. 1945లో బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేమ, ద్రోహం, మోసం.. ఈ మూడు అంశాలు ఏ విధంగా ఓ గూఢచారి జీవితాన్ని ప్రభావితం చేశాయన్నదే ఈ సినిమా ప్రధానాంశం. మరోవైపు దేశం కోసం అజ్ఞాతంలో ఉండనున్నారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో అజ్ఞాత గూఢచారి పాత్రలో కనిపిస్తారట విజయ్ దేవరకొండ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక 2018లో ‘గూఢచారి’గా కనిపించి సక్సెస్‌ఫుల్‌గా మిషన్‌ను పూర్తి చేసిన అడివి శేష్ మళ్లీ ఓ కొత్త మిషన్‌ను ఆరంభించారు. ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ 2’ (గూఢచారి 2)లో హీరోగా నటిస్తున్నారు. సిరిగినీడి వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు యాక్షన్ ‘ఏజెంట్’గా మారారు అఖిల్. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. దేశం కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. కాగా మంచు పర్వతాల్లో తుపాకులను దాచిపెట్టారు హీరో నిఖిల్. ఎందుకంటే దేశం కోసం గూఢచారిగా మారారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్పై’. దేశానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను కనిపెట్టి, దేశద్రోహులను ఓ స్పై ఏ విధంగా మట్టుపెట్టాడన్నదే ఈ సినిమా అని తెలుస్తోంది. ‘స్పై’ను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా గూడఛారులుగా కనిపించనున్నారు. కోలీవుడ్ లోనూ కొందరు హీరోలు దేశం కోసం సాహసాలు చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంగా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ చేస్తున్నారు కమల్ అండ్ శంకర్. పూర్తి దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో, ఈ కాలంతోపాటు 1920 కాలం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. ఇక దర్శకుడిగా ‘తుపాకీ’, ‘స్పైడర్’ వంటి స్పై మూవీస్‌ను తీసిన ఏఆర్ మురుగదాస్ నిర్మాతగా ప్రస్తుతం ‘1947, ఆగస్టు 16’ అనే సినిమా నిర్మించారు. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎన్ఎస్ పొన్‌కుమార్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే మరో తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన సినిమా ‘బోర్డర్’. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం ఇది. ఎ. వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఇక విష్ణు విశాల్ హీరోగా మను ఆనంద్ దర్శకత్వంలోవచ్చిన ‘ఎఫ్ఐఆర్’ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ఐఆర్ 2’ని ప్రకటించారు విష్ణు విశాల్. కాగా గత ఏడాది విడుదలైన ‘విక్రమ్’ సినిమాలో కమల్‌హాసన్, ‘సర్దార్’లో కార్తీ రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు సీక్వెల్స్ రానున్నాయి. బాలీవుడ్లో అయితే స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్‌కు కొదవే లేదు. ఇప్పటికే ‘టైగర్ జిందా హై’, ‘ఏక్తా టైగర్’ వంటి స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్‌లో నటించిన సల్మాన్ ఖాన్ ఈ ఫ్రాంచైజీలోనే తాజాగా ‘టైగర్ 3’ సినిమా చేస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే స్పై బ్యాక్‌డ్రాప్‌లో సౌత్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు షారుక్ ఖాన్. ఈ ఏడాది జూన్ 2న ‘జవాన్’ విడుదల కానుంది. మరోవైపు కథానాయిక సారా అలీఖాన్ ‘ఆయే వతన్.. మేరే వతన్’ అనే మూవీ చేస్తున్నారు. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఓ కాలేజీ విద్యార్థిని స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలా పాల్గొంది? అన్నదే ఈ సినిమా కథ. అలాగే దేశ విభజన నాటి అంశాల నేపథ్యంలో ‘లాహోర్: 1947’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాతక్’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్లో ఈ సినిమా రూపొందనుంది. ఇక దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రీసెంట్గా స్పై బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా స్పై ఫిల్మ్ ‘పఠాన్’ థియేటర్స్‌లో ఉంది. కాగా ‘వార్’ తర్వాత హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ చేస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్. ఇది కూడా స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ అట. అలాగే హీరో ప్రభాస్‌తో కూడా సిద్ధార్థ్ ఓ స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ చేస్తారని టాక్. ఇక హీరో జాన్ అబ్రహాం కూడా ‘టెహ్రాన్’ అనే స్పై ఫిల్మ్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొన్ని బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. -
ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు..
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుంచి సర్వోన్నత న్యాయస్థానం పౌరులకు కొత్త వెసులుబాటు కల్పించనుంది. షెడ్యూల్డ్ భాషల్లోనూ న్యాయస్థానం తీర్పులను వెలువరిస్తామని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ భాషల్లో తీర్పులను ప్రజలు ఉచితంగా పొందొచ్చు. ‘ ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా 34,000 తీర్పులు పొందొచ్చు. వాటిలో ఇప్పటికే 1,268 తీర్పులు ప్రాంతీయ భాషల్లోనూ ఉన్నాయి. తీర్పుల్లో 1091 హిందీలో, 21 ఒడియాలో, 14 మరాఠీ, 4 అస్సామీ, ఒకటి గారో, 17 కన్నడ, ఒకటి ఖాసీ, 29 మలయాళం, 3 నేపాలీ, 4 పంజాబీ, 52 తమిళం, 28 తెలుగు, 3 ఉర్దూ భాషల్లో ఉన్నాయి.‘ గురువారం నుంచి 13 భాషల్లో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్సైట్, మొబైల్ యాప్, నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ వెబ్సైట్లో జనవరి 26వ తేదీ నుంచి అందుబాటులో వస్తాయి. ఈ ఏడాది జనవరి ఒకటోతేదీదాకా వెలువరిచిన తీర్పులను న్యాయవాదులు, లా విద్యార్థులు, సాధారణ జనం అందరూ వీటిల్లో ఉచితంగా చూసుకోవచ్చు’ అని సీజే చెప్పారు. -
సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బహిరంగ సభలకు అడ్డురాని కరోనా గణతంత్ర వేడుకలకు అడ్డొచ్చిందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న గౌరవం ఇదేనా అని నిలదీశారు. రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పిన నాడే ఆయన దేశద్రోహి అని అర్ధమవుతుందన్నారు. గవర్నర్‌తో పడకుంటే గణతంత్ర వేడుకలను ఆపేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. -
Republic Day: రాజ్‌భవన్‌లోనే వేడుక.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత
రాష్ట్రంలో ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. కానీ వేడుకలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని హైకోర్టు ఆదే శించడంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు బలగాల కవాతు, గవర్నర్ ప్రసంగం, ఇతర కార్యక్రమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే గణతంత్ర వేడుకల నిర్వహణకు సంబంధించి బుధవారం పొద్దంతా ఉత్కంఠ నెలకొంది. దీనిపై నమోదైన పిటిషన్‌ను హైకోర్టు అత్యవసరంగా విచారించి వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం, ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ విమర్శలు చేయడం, ప్రతిగా తామేమీ రాజకీయం చేయడం లేదంటూ మంత్రి తలసాని స్పందించడం చర్చనీయాంశమైంది. చివరికి రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే పోలీసు, వివిధ శాఖల ఉన్నధికారులు రాజ్ భవన్‌కు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే గవర్నర్, సీఎం మధ్య విభేదాల నేపథ్యంలో కేసీఆర్ రాజ్‌భవన్ వేడుకలకు వెళతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినం దేశభక్తిని చాటే ముఖ్యమైన జాతీయ పండుగ. కరోనాను సాకుగా చూపి వేడుకలు నిర్వహించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదు. వేడుకలను అధికారికంగా, ఘనంగా నిర్వహించాలి. ఈ విషయంలో ఈ నెల 19న కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. పరేడ్ నిర్వహించాలి, ప్రజలను కూడా అనుమతించాలి. -హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను అధికారికంగా, ఘనంగా నిర్వహించాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. గణతంత్ర దినం దేశభక్తిని చాటే ముఖ్యమైన జాతీయ పండుగ అని.. కరోనాను సాకుగా చూపి వేడుకలు నిర్వహించడం లేదన్న ప్రభుత్వ వాదన సరికాదని తప్పుబట్టింది. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే పరేడ్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ వేడుకలకు ప్రజలను కూడా అనుమతించాలని సూచించింది. గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. అత్యవసర విచారణలో.. రాష్ట్రంలో ఏటా గణతంత్ర వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారు. గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. భద్రతా దళాల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. గత ఏడాది కరోనా కారణంగా ఈ వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. ఈసారీ అదే విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్ఫూర్తిదాయకమైన గణతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదంటూ హైదరాబాద్‌లోని గౌలిపురాకు చెందిన కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్ కావడంతో లంచ్‌మోషన్‌లో విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీదేవి బుధవారం మధ్యాహ్నం 2.30కు దీనిపై విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున టి.సూర్యకరణ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, కేంద్ర ప్రభుత్వం తరఫున గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపించారు. కరోనా ప్రభావం ఉన్నందున.. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున ఈసారి గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌లోనే జరుపుకోవా లని విజ్ఞప్తి చేశామని.. దీనిపై ఈ నెల 13న రాజ్ భవన్‌కు లేఖ రాశామని ఏజీ కోర్టుకు చెప్పారు. ‘‘రాజ్‌భవన్‌లో నిర్వహించే వేడుకలకు సీఎస్, డీ జీపీ సహా ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ప్రజలకు వెబ్ క్యాస్టింగ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించాం. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను యథాతథంగా అమలు చేయడం లేదు. గత ఏడాది తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని వివరించారు. ప్రభుత్వం సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభు త్వం మార్గదర్శకాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో కార్యక్రమాలు ప్రారంభమయ్యేలోగా రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేడుకలు పూర్తి చేసేలా ఏర్పా టు చేసుకోవాలని కేంద్రం సూచించింది. వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరుల గాథలకు చెప్పడం ద్వారా వారిలో స్ఫూర్తి నింపాలి. స్థానికతకు అద్దంపట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. వందే భారత్ కార్యక్రమం కింద బృంద నృత్యాలను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. దేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ నిర్వహణకు కరోనా ప్రభావం ఉందని చెప్పడం తగదు. ప్రభుత్వ తీరు రాజ్యాంగ విరుద్ధం. ఏటా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, పరేడ్ వందనం స్వీకరించడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని కూడా ప్రభుత్వం బ్రేక్ చేసింది. గొప్ప చరిత్ర, సంప్రదాయాన్ని, సంస్కృతిని, లక్ష్య సాధనను ప్రజలకు ఈ వేడుకలు చాటి చెప్తాయి. గణతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలి..’’ అని కోర్టుకు విన్నవించారు. వేడుకలు నిర్వహించాల్సిందే.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. గణతంత్ర వేడుకలను నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించి కేంద్రం ఈనెల 19న రాష్ట్రాలకు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. కరోనా ప్రభావం ఉందంటున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏయే మార్గదర్శకాలను పాటిస్తుందో ఏజీ తెలియజేయలేదన్నారు. కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు లేఖ రాసినట్టు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా వేడుకలు జరపాలని.. పరేడ్, ఇతర కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించేదీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కరోజే వ్యవధి ఉన్నందున ఈ ఆదేశాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ను ఆదేశించారు. వేడుకలు రాజ్‌భవన్‌లోనే.. సాక్షి, హైదరాబాద్: దేశ 74వ గణతంత్ర వేడుకలు ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే జరుగుతున్నాయి. గత ఏడాది సాదాసీదాగా కార్యక్రమాన్ని ముగించేయగా. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు పరేడ్, ఇతర కార్యక్రమాలు సహా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరి స్తారు. 7 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరి స్తారు. తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం కేసీఆర్, మంత్రులు, అధి కార, విపక్ష పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతిని ధులు, వివిధ రంగాల ప్రముఖులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఇక రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ తమిళిసై ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లను న్నారు. తమిళిసై పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవ ర్నర్గా ఉన్న నేపథ్యంలో.. అక్కడ ఉదయం 9 గంటల సమయంలో జెండాను ఆవిష్కరించనున్నారు. సీఎస్ అత్యవసర సమీక్ష.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు.. కవాతు కూడా..ఘనంగా గణతంత్ర వేడుకలు జరపాలని హైకోర్టు ఆదేశించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి శాంతికుమారి అప్రమత్తమయ్యారు. పోలీసు, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. బీఆర్కే భవన్లో జరిగిన ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రోటోకాల్ సంచాలకుడు అర్విందర్‌సింగ్, మరికొందరు అధికారులు పాల్గొని చర్చించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని, రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత పోలీసు, ఇతర శాఖల అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి పరిశీలించారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో పరేడ్, ఇతర కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. పలువురికి సత్కారం గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురిని గవర్నర్ తమిళిసై సన్మానించనున్నారు. సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయ రచయిత కానుకుంట్ల సుభాష్ చంద్రబోస్, సామాజిక సేవ విభాగంలో భగవాన్ మహవీర్ వికల్ప్ సహాయత సమితి, విద్యా, యువజనాభివృద్ధి విభాగంలో ఎం.బాలలత, పారా అథ్లెటిక్స్ విభాగంలో కుడుముల లోకేశ్వరి, క్రీడల్లో ఆకుల శ్రీజను సత్కరించి మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. సీఎం కేసీఆర్ వస్తారా? రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలను పూర్తిస్థాయి లో నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ హాజ రవుతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మా రింది. ఇప్పటికే సీఎం, గవర్నర్ మధ్య నెలకొన్న విభేదాలతో.. గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రచారంలో ఉంది. గత ఏడాది కూడా వేడుక లను రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. కేసీఆర్, మంత్రులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. -
ఈజిప్ట్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 700 కోట్ల డాలర్లున్న ద్వైపాక్షిక వర్తకాన్ని ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఆహార, ఇంధన, ఎరువులు తదితర రంగాలపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తదితరాలు చర్చకు వచ్చాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, యువత, సమాచార, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక బంధం స్థాయికి పెంపొందించుకోవాలని భేటీలో నిర్ణయించాం. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో శాంతికి, ప్రగతికి బాటలు పరుస్తుంది’’ అని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటంపై ఇరు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. ఇది మానవాళి భద్రతకు అతి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సైబర్ స్పేస్ దుర్వినియోగం చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చేతులు కలపాలని నిర్ణయించాం’’ అన్నారు. కరోనా, యుద్ధంతో దెబ్బ తిన్న ఆహార, ఫార్మా సరఫరాలను బలోపేతం చేయడంపై చర్చించామన్నారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా తెలిపారు. ఇదే తొలిసారి గణతంత్ర ఉత్సవాలకు ఈజిప్టు అధ్యక్షున్ని ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఈజిప్టు సైనిక బృందం కూడా గణతంత్ర పరేడ్‌లో పాల్గొంటోంది. మూడో ఇండియా–ఆఫ్రికా ఫోరం శిఖరాగ్రంలో పాల్గొనేందుకు సిసి 2015లో తొలిసారి భారత్‌లో పర్యటించారు. తర్వాత ఏడాదికే మరోసారి పర్యటించారు. యువతే అతిపెద్ద లబ్ధిదారులు అభివృద్ధి చెందిన భారతదేశంలో యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నారని ప్రధానినరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత సైతం వారిపైనే ఉందన్నారు. గణతంత్ర పరేడ్‌లో పాల్గొననున్న ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటితరానికి ఎన్నెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం సాధిస్తున్న ఘనతల్లోనే ప్రపంచం తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. జాతి లక్ష్యాలు, ఆకాంక్షలతో యువతను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అనుసంధానిస్తున్నాయి. యువత మాట్లాడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 కూటమి గురించి పాఠశాలలు, కళాశాలల్లో చర్చించుకోవాలి’’ అని సూచించారు. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని యువతను కోరారు. -
74th Republic Day: గణతంత్ర పరేడ్‌లో... స్వదేశీ వెలుగులు
74వ గణతంత్ర వేడుకలు స్వదేశీ వెలుగులతో మెరవనున్నాయి. సంప్రదాయ గౌరవ వందనంలో బ్రిటిష్ కాలపు 25–పౌండర్ గన్స్ స్థానంలో స్వదేశీ 105 ఎంఎం తుపాకులు సగర్వంగా గర్జించనున్నాయి. పరేడ్‌లో ప్రదర్శించే ఆయుధాలన్నీ మన దేశంలో తయారైనవే! బ్రిటన్ వలస పాలన నీడల నుంచి బయటపడి పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఆత్మనిర్భర్ భారత్ సత్తాను సగర్వంగా చాటేలా గణతంత్ర వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చైనాతో ఉద్రిక్తతల వేళ మన సాయుధ సత్తాను చాటడానికి కవాతులో మేడిన్ ఇండియా ఆయుధాలను ప్రదర్శించబోతున్నారు. ఇండిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని, ఆకాశ్, నాగ్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్, అర్జున్ యుద్ధ ట్యాంకులు, ప్రచండ హెలికాప్టర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి... బ్రహ్మోస్ ప్రపంచంలో మొట్టమొదటి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం... ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వంద శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అగ్ని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన క్షిపణి. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. 2 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. ప్రచండ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించగలిగే తేలికపాటి హెలికాప్టర్. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) అభివృద్ధి చేసింది. సముద్రమట్టానికి 16,400 అడుగుల ఎత్తులో అలవోకగా టేకాఫ్, ల్యాండింగ్ ప్రత్యేకత. దీనితో రెండు శక్తిమంతమైన ఇంజిన్లు, అత్యంత ఆధునిక సౌకర్యాలుంటాయి. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా కూల్చివేయగలవు. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు. ఆకాశ్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్ తొలి క్షిపణి ఆకాశ్. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. 95% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందుకు పాతికేళ్లు పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. కే–9 వజ్ర స్వీయ చోదక శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం లద్ధాఖ్ సరిహద్దుల్లో మోహరించారు. 155 ఎంఎం కెనాన్ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కి.మీ. దూరం దాకా గుళ్ల వర్షం కురిపించగలదు. దీనికున్న అత్యంత శక్తిమంతమైన ఇంజిన్ గంటకి 67 కి.మీ. వేగంతో పని చేస్తుంది. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. రక్షణ రంగానికి స్వదేశీ హంగులు ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64% స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే గతేడాది 68% నిధులు వినియోగించాయి. ఆర్మీ అత్యధికంగా 72% నిధులను మేడిన్ ఇండియా ఆయుధాలపైనే వెచ్చించింది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2,500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్ సైకిల్ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్ వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది. ముగ్గురు మహిళా సైనికాధికారులు పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది. ఎన్సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో, మేజర్ మహిమ ‘కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు. మహిళా శకటాలు ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది. పశ్చిమ బెంగాల్ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది. కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్ దారుల్లో నడిపించనున్నాయి. కళకళలాడే నృత్యాలు వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు. లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ, స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ చారిత్రక దృశ్యం దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ‘క్యామెల్ కాంటింజెంట్’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు... దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్ కాంటింజెంట్’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్ డే ఉత్సవాల్లో క్యామెల్ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్. విజయ్‌చౌక్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్ మీదుగా క్యామెల్ రైడర్స్ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది. ఉమెన్ రైడర్స్ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ దీన్ని డిజైన్ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్ ఫామ్స్‌ను ఈ డిజైన్ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ. మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్ఎఫ్ క్యామెల్ కాంటింజెంట్ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్ రైడర్స్ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది. మేము సైతం: ఉమెన్ రైడర్స్, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేశారు. -
రిపబ్లిక్ డే రోజు టీమిండియా గెలిచిన ఏకైక వన్డే ఏదో గుర్తుందా..?
గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజు భారత క్రికెట్ జట్టు ఏదైన మ్యాచ్ గెలిచిందా..? గెలిచి ఉంటే.. ఆ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై గెలిచింది..? ఈ వివరాలు 2023 రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని భారత క్రికెట్ అభిమానుల కోసం. వివరాల్లోకి వెళితే.. 2019 న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా భారత జట్టు రిపబ్లిక్ డే రోజున ఓ వన్డే మ్యాచ్ గెలిచింది. చరిత్రలో ఈ రోజున టీమిండియా గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం విశేషం. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. ఆతిధ్య జట్టుపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఒక్క విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజు ఇప్పటివరకు టీమిండియాకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా లభించలేదు. ఈ మ్యాచ్‌కు ముందు 3 సందర్భాల్లో ఇదే రోజున టీమిండియా వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ, విజయం సాధించలేకపోయింది. Another brilliant performance by the Men in Blue. #TeamIndia wrap the second ODI, win by 90 runs. 2-0 🇮🇳🇮🇳 #NZvIND pic.twitter.com/2fTF9uQ5JM — BCCI (@BCCI) January 26, 2019 1985-86 వరల్డ్ సిరీస్‌లో భాగంగా తొలిసారి రిపబ్లిక్ డే రోజున అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత 2000 సంవత్సరంలో ఇదే రోజు, అదే అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆసీస్ చేతిలోనే రెండోసారి కూడా ఓడింది (152 పరుగుల తేడాతో). 2015 సిడ్నీ వేదికగా రిపబ్లిక్ డే రోజున ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. ఇలా.. చరిత్రను తిరగేస్తే, భారత క్రికెట్ జట్టు 2019లో న్యూజిలాండ్‌పై విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజున ఒక్క విజయం కూడా సాధించలేదు. అందుకు ఈ విజయానికి అంత ప్రత్యేకత. ఇక, ఆ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (87), శిఖర్ ధవన్ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో ధోని (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/45), చహల్ (2/52) మాయాజాలం దెబ్బకు 40.2 ఓవర్లలో 234 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డౌగ్ బ్రేస్‌వెల్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
రిపబ్లిక్ డే: ఓటీటీలో చూడాల్సిన దేశభక్తి సినిమాలివే!
రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు స్కూళ్లు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించుకుంటాయి. దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు, పాటలతో ఊరూవాడా హోరెత్తిపోతుంది. మనకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారిని, ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడంతో మనసు ఉప్పొంగుతుంది. ఇక ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏ ఛానల్లో చూసినా దేశభక్తి సినిమాలే! అవును మరి.. గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి సినిమా చూడకపోతే ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి.. వూట్ ► ఖడ్గం ► మేజర్ చంద్రకాంత్ (ప్రైమ్‌లోనూ లభ్యం) అమెజాన్ ప్రైమ్ వీడియో ► భారతీయుడు ► సర్దార్ పాపారాయుడు ► రాజీ ► సర్దార్ ఉద్ధమ్ ► చక్‌దే ఇండియా ► మణికర్ణిక ► షేర్షా హాట్‌స్టార్ ► మంగళ్‌పాండే ► కంచె నెట్‌ఫ్లిక్స్ ► మేజర్ ► లగాన్ ► ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ► స్వేడ్స్ ► రంగ్ దే బసంతి జీ5 ► ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ► సుభాష్ చంద్రబోస్ ఇవే కాకుండా మేజర్ చంద్రకాంత్, సైరా నరసింహారెడ్డి, చిట్టగాంగ్, ఎల్ఓసీ కార్గిల్, మంగళ్ పాండే, బార్డర్, ఇలా మరోన్నో సినిమాలు దేశభక్తి ఆధారంగా తెరకెక్కినవే! ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఓ మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోండి. -
రిపబ్లిక్ డే విషెస్ చెప్పేయండిలా..!
జనవరి 26వ తేదీ.. మనకు ప్రత్యేకమైన రోజు. భారతదేశం గర్వించదగ్గ రోజు. 1950వ సంవత్సరం జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చిన రోజు. దీన్ని పురస్కరించుకునే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మనకు 74వ గణతంత్ర దినోత్సవం. అనేక మార్పులు చేర్పులు తర్వాత అప్పటి మన నాయకులు జనవరి 26వ తేదీన రాజ్యాంగంలోని హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, రాజ్యాంగం హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవటానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ మార్పులు జరిగి, 1950, జనవరి 26వ తేదీ అధికారికంగా అమల్లోకి తెచ్చారు. ఫలితంగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం అంతా దీన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీ స్నేహితులు, బంధువులకు క్రింద ఉన్న గణతంత్ర దినోత్సవ కోట్స్ తో విషెస్ చెప్పండి. మాతృభూమి కోసం.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. వందనం.. అభివందనం.. పాదాభివందనం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం.. భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ.. జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!! అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో వీరుల త్యాగఫలం.. మన నేటి స్వేచ్ఛకే మూలబలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి తల వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 'గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం.. దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. 'ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మన సమరయోధులను స్మరించుకుందాం.. మన వారసత్వాన్ని కాపాడుకుందాం.. మన దేశాన్ని చూసి గర్వపడదాం..' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. మన దేశ శ్రేయస్సు కోసం మనం చేయగలిగినదంతా చేస్తామని మన భారతమాతకి ప్రతిజ్ఞ చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! గెలవాలనే మన కోరికకు ఆజ్యం పోద్దాం, మన దేశంలోని ప్రతి భాగాన్ని శక్తివంతం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను మరియు నా దేశ సంస్కృతిని గౌరవిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం యొక్క కీర్తిలో సంతోషించండి మరియు సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిషర్ల దాశ్య సంకెళ్లను వదిలించుకొని భారతదేశం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న చారిత్రక రోజు. మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారతదేశం గొప్ప దేశం. శాంతియుత దేశం. భారతీయతను చాటి చెబుదాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం భారతీయులం. మొదటి నుంచీ... చివరి వరకూ - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గణతంత్రం వల్ల కలిగే ఆశ ఏంటి... ఒక దేశం, ఒక భాష, ఒక జాతీయ జెండా - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం శాంతిని నమ్ముతాం. శాంతియుత అభివృద్ధి మనకోసం మాత్రమే కాదు... ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసమూ - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశ సేవలో నేను మరణిస్తే, అది నాకు గర్వకారణమే. నా రక్తంలోని ప్రతి చుక్కా దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి. దేశాన్ని మరింత బలంగా, చురుగ్గా మార్చాలి - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో షేర్ చేస్తూ... మీ స్నేహితులు, బంధువులకు విషెస్ చెప్పండి.