జనవరి 26వ తేదీ.. మనకు ప్రత్యేకమైన రోజు. భారతదేశం గర్వించదగ్గ రోజు. 1950వ సంవత్సరం జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చిన రోజు. దీన్ని పురస్కరించుకునే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మనకు 74వ గణతంత్ర దినోత్సవం. అనేక మార్పులు చేర్పులు తర్వాత అప్పటి మన నాయకులు జనవరి 26వ తేదీన రాజ్యాంగంలోని హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, రాజ్యాంగం హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవటానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ మార్పులు జరిగి, 1950, జనవరి 26వ తేదీ అధికారికంగా అమల్లోకి తెచ్చారు. ఫలితంగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.
ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం అంతా దీన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీ స్నేహితులు, బంధువులకు క్రింద ఉన్న గణతంత్ర దినోత్సవ కోట్స్ తో విషెస్ చెప్పండి.
మాతృభూమి కోసం.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. వందనం.. అభివందనం.. పాదాభివందనం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం.. భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ.. జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!! అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఎందరో వీరుల త్యాగఫలం.. మన నేటి స్వేచ్ఛకే మూలబలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి తల వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
'గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం.. దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
'ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మన సమరయోధులను స్మరించుకుందాం.. మన వారసత్వాన్ని కాపాడుకుందాం.. మన దేశాన్ని చూసి గర్వపడదాం..' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
మన దేశ శ్రేయస్సు కోసం మనం చేయగలిగినదంతా చేస్తామని మన భారతమాతకి ప్రతిజ్ఞ చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
గెలవాలనే మన కోరికకు ఆజ్యం పోద్దాం, మన దేశంలోని ప్రతి భాగాన్ని శక్తివంతం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను మరియు నా దేశ సంస్కృతిని గౌరవిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశం యొక్క కీర్తిలో సంతోషించండి మరియు సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
బ్రిటిషర్ల దాశ్య సంకెళ్లను వదిలించుకొని భారతదేశం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న చారిత్రక రోజు. మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
భారతదేశం గొప్ప దేశం. శాంతియుత దేశం. భారతీయతను చాటి చెబుదాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మనం భారతీయులం. మొదటి నుంచీ... చివరి వరకూ - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
గణతంత్రం వల్ల కలిగే ఆశ ఏంటి... ఒక దేశం, ఒక భాష, ఒక జాతీయ జెండా - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మనం శాంతిని నమ్ముతాం. శాంతియుత అభివృద్ధి మనకోసం మాత్రమే కాదు... ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసమూ - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ దేశ సేవలో నేను మరణిస్తే, అది నాకు గర్వకారణమే. నా రక్తంలోని ప్రతి చుక్కా దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి. దేశాన్ని మరింత బలంగా, చురుగ్గా మార్చాలి - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్ చాట్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో షేర్ చేస్తూ... మీ స్నేహితులు, బంధువులకు విషెస్ చెప్పండి.
Comments
Please login to add a commentAdd a comment